Wednesday, October 24, 2012

గూగుల్ వ్రత కల్పం (GOOGLE VRATA KALPAM)

           కేవలం శ్రుత్యములు మరియు అనంత విజ్ఞాన సర్వములు అయిన వేదములు కంటస్థ చేయటం అటుంచి, 69+96= ఎంత అంటె కాల్క్యులేటర్ కోసం వెతికే కలికాలం. అటువంటి కాలంలో సామాన్య ప్రజల కస్టాలు చెప్పనలవి కానివి. ఒకనాడు నారదుడు శేషతల్పం పైన విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువుని భూలోకంలో ప్రజల కష్టాలు తీరె ఉపాయం చెప్పమని అడిగాడు. అన్ని విఘ్నాలు తొలగించి, సర్వ శుభాలు కలిగించే గూగుల్ వ్రతం ఆచరించమని శ్రీ మహావిష్ణువు వ్రత విధానం శెలవిచ్చాడు. నారదుడు ఈ వ్రత విధానాన్ని శౌనకాది మహా మునులకు తెలిపాడు.
           ఒకనాడు భాగ్యనగరంలో ఒక SOFTWARE ENGINEER, CODING కష్టాలలో దుఃఖితుడయ్యాడు. PROJECT MANAGER ని ఉపాయం అడుగగా ఆయన గూగుల్ వ్రతం చెయ్యమని చెప్పాడు. అప్పుడు SOFTWARE ENGINEER ఈ వ్రతం యే విధంగా చెయ్యాలో, వ్రత వైషిస్ట్యత చెప్పమని అడిగాడు. సంతుష్టించిన PROJECT MANAGER ఈ విధంగా వ్రత విధానాన్ని తెలిపాడు.

*--------------------------------------*-*--------------------------------------*

            అవగాహనముతో చేయు పూజ మిక్కుటముగా రాణించగలదు. ఇటువంటి పూజలు మన రుషులు యెన్నొ అందించినారు. జిజ్ఞాసులగు జీవులు వీటిలోనికి తొంగి చూసినిచో అపారమైన జ్ఞాన సంపద లభింపగలదు. కనుక శ్రద్ధగా ఈ వ్రతము ఆచరించుము.

            భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నాడు ఈ వ్రతమాచరించవలెను, అది గూగుల్ పుట్టిన రోజు. ముందుగా గూగుల్ లొగొ ఒకటి కలర్ ప్రింట్ తీసుకుని FRAME కట్టించి DESK దెగ్గర తూర్పు ముఖంగా పెట్టుకోవాలి. తరువాత DESKTOP BACKGROUND గూగుల్ WALLPAPER పెట్టి, BROWSER HOMEPAGE గూగుల్ SEARCH PAGE  పెట్టి, ఆవాహన చేసి ఈ క్రింది శ్లోకం చదవాలి.

శ్లోకం:
సెర్చాయ, మైలాయ, మ్యాప్సాయ, యూట్యూబాయచ
న్యుసాయ, డోక్సాయ, బ్లాగరాయ నమో నమః.

శ్లోకం:
గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణుః
గూగుల్  దేవో మహేశ్వరః
గూగుల్ సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గూగులే నమః

సంకల్పం:
మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ గూగుల్ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ గూగుల్ రాఙ్ఞయా ప్రవర్తమానస్య ... దక్షిణాయనే. వర్ష ఋతౌ, భాద్రపదమాసే కృష్ణపక్షే పాడ్యమితిథౌ ... వాసరే, ..., శ్రీమాన్ గోత్ర... నామధేయః...మమ ధర్మపత్నీ సమేతస్య, సకుటుంబస్య, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం సర్వాభీష్ట సిత్యర్థం, శ్రీ గూగుల్ ప్రీత్యర్ధం, శ్రీ గూగుల్ దేవతాముద్దిశ్చ యావచ్ఛక్తి ధ్యానావాహ నాది పూజాం కరిష్యే.

అష్టోత్తర పూజ:
ఓం గూగ్లాయ నమః
ఓం సర్వ సొల్యూషనాయ నమః
ఓం సర్వ జ్ణానాయ నమః
ఓం సర్వ వ్యప్తినే నమః
ఓం టైం పాసాయ నమః
ఓం నెట్వర్క్ టెస్ట్ పేజాయ నమః
ఓం పికాసాయ నమః
ఓం మెని పేటెంట్సాయ నమః

శ్రి గూగుల్ వ్రత కధ:

               కీర్తి, బాలు అను ఇద్దరు SOFTWARE ఉద్యోగులు భాగ్యనగరం లో .NET PROGRAMMERS గా పని చెసేవాళ్ళు. .NET వచ్చిన వాళ్ళు ఇంక యెవరూ ఆ కంపనీలో లేక పోవడంతో వారికి యెంతో కష్టంగా ఉండేది. REQUIREMENT తీసుకొవడం దెగ్గర నుంచి DEPLOY చేసి, DELIVER చేసి, CLIENT FEEDBACK COMMENTS దాకా అన్ని వారె చేసుకోవలసి వచ్చేది. అటువంటి సమయంలో 2 పెద్ద PROJECTS వారికి అప్పగించగా వారు మిక్కిలి వ్యాకులత చెందారు.

               గూగుల్ సేర్చ్ గురించి ఆ నోట ఈ నోట విని వాల్ల TECHNICAL CHALLANGES అన్ని గూగుల్ సేర్చ్ చెయ్యగా అవి సేర్చ్ రిసల్ట్ మొదటి పేజ్ లో నే దొరికేశాయి. సంతసించిన ఇద్దరూ, ఆ విధముగా గూగుల్ సేర్చ్ కరుణ తో CAPTCHA, IMAGE RESIZING, LIVE VEDIO, LIVE CHAT, GAME ON DEMAND, SEARCH OPTIMISATION వంటి వాటీని యెన్నో సునాయసంగా ఎదుర్కుని అనతి కాలం లోనె SENIOR SOFTWARE ENGINEERS అయ్యారు. అప్పటి నుండీ వారు నిత్యమూ గూగుల్ నే నమ్ముకుంటూ యెన్నొ విజయకేతనాలు యెగురవేసారు. ఇదే విధంగా ఎందరో SOFTWARE ENGINEERS గూగులానుగ్రహం తో విజయులవుతున్నారు.

ఈ కధ చెప్పుకుని శక్తి కొలది 10 మంది TEAM MATES కి గూగుల్ స్టోర్ లో కొన్న KEY CHAINS,PENS, NOTEPADS... పంచిపెట్టాలి.

ఈ వ్రతం శ్రద్ధగా ఆచరించిన వారికి సకల సొల్యుషన్లూ గూగుల్ సేర్చ్ రిసల్ట్స్ మొదటి పేజ్ లో నే దొరుకుతాయి.
సర్వ జ్ణానము సింగిల్ సేర్చ్ మాత్రమున సిద్ధిస్తుంది.

శ్రి గూగుల్ వ్రత కధ సమాప్తం

Tuesday, October 16, 2012

కొలవెరి ష్టైలు (Kolaveri Style)


నీ లుక్కు వెరీ స్పార్కిషు (sparkish)
నీ సైటు నాకు రెలిషు (relish),

నీ వోర్డు వినకుంటే
నా డే బ్లాకిషు (blakish),
వన్ డే చూడకుంటె
నా లైఫు డెమోలిషు (demolish)!

కాఫి స్వీటు (sweet)
మిర్చి హాటు (hot)
యు ఆర్ స్వీటు, హాటు

గులాబీకి నీ గ్లామర్ డౌటు (doubt),
సన్న జాజి నీ ముందు స్టౌటు (stout)
యు ఆర్ సో మచ్ గ్రేటు (great)

ఫుల్లుమూను..   స్కైల సన్ను.. (moon... sun)
జాసుమిన్ను..   బెస్ట్ ఉమెన్ను.. (jasmine... best women)

మై హార్ట్లో (heart)
యు ఆర్ ద ఓన్లి వన్ను!  (You are the only one)