Wednesday, May 13, 2015

శరత్ చంద్రికలలు


శరత్ చంద్రికలలు


కలలు ఆశల వలలు
అరచేతిన మంచు ముత్యాలు
కలలు కన్నుల కళలు
అద్దాన శరత్చంద్రీ కళలు

నిజంగా నిజానివో
మాయమై మళ్ళీ మోహించే
శరత్కాల చంద్రికవో
స్వేచ్చగా విహరించే
చిన్ని రెక్కల పక్షివో
అభినయాల వెల్లువతో
మనసు దోచే కన్నెవో

చంద్ర కళలుండగా
విరిసే కలువలకేమి తక్కువ
కావ్య కన్నెలుండగా
పదాల పొందిక కేమి కొదువ?

కలువ కన్నులుండగా, మళ్ళీ కలువలెందుకు?
శిరుల సిఖలుండగా, మందారాలందుకు !

విరిసె కన్నులన్ని కలువలే...
కురిసే నవ్వులన్నీ మల్లెలే..

ఎన్ని కళలు చూపేనో.. నీ కన్నులు
ఎన్నికలలొ ఆన్ని ఓట్లు వాటికే దాఖలు

చంద్ర కళలకు విరిసి,
సూర్యుని వెలుగులకు సోలిపోయేను కలువలు...
ప్రేయసీ అంతేగా !

Tuesday, April 28, 2015

ఇంక చాలు ఆపేద్దాం ...

తెలియనిదేదో వెతుకుతూ
అదీ ఇదీ చదువుతావు
నిన్ను నువ్వు చదువకుంటే
ఎన్ని చదివి ఏం లాభం ?

మనసు మండపంలో
అడుగుపెట్టకున్న
మసీదులు మందిరాలు
చూపలేవు ఏ సత్యం !

నిత్యం పోరాటమే
మతం కోసం మోక్షం కోసం
అహం పై ఆ యుద్ధం
అరంభించేదెన్నటికో ??

దిక్కులు వెలిగించే
మదిలో వెలుగులు మరిచిపోయి
చిమ్మ చీకటిలో చుక్కలు
అందుకొనాలని పరుగులు తీసేవు

ఇంక చాలు ఆపేద్దాం
ఎక్కడెక్కడని వెతకడం
ఇక్కడే ఉన్న నిన్ను నువ్వు
తెలుసుకునే సంగతేదో చూద్దాం! 

ఆయ్యినది తలువకు
రేపటిని బ్రమించకు
అతిగా ఆలోచించకు
ప్రతీదీ పరిక్షించకు
అన్నిటిని సరిచెయ్యాలని చూడకు
కాస్త ఊపిరి తీసుకో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నావ్
కాస్త బతకడం నేర్చుకో !
-బుల్లే షా అనువాదం