Sunday, July 15, 2018

పొదుపు


అతిగా తినడం (అవసరానికి మించి ఏం తిన్నా ఎంత తిన్నా),
తిండి వృధా చెయ్యడం,
కోసి కూర చేసుకునే దానిని కూడా వంకర టింకర ఉండకూడదని సోకుకు పోవడం,
గొప్పలకు పోయి అర్థ రూపాయి తిండికి ఆరురూపాయలు ఖర్చు చెయ్యడం,
ఆర్భాటాలకు పోయి విందులకు లక్షలు కోట్లూ తగలెయ్యడం,
.
.
నీట్ నెస్ పేరుతో అతిగా నీరు వాడటం,
నిర్లక్ష్యంతో నీటిని వృధా చెయ్యటం,
చేసేది ఏసీ లో ఉద్యోగం , వేసేది జీన్సు.. అయినా ఏ రోజు కట్టిన బట్టలు ఆ రోజే,
.
.
లింగు లిటుకు మంటూ ఒక్కడుంటాడు, కారేమో పడవంత ! అవసరమా? నీ కారు ఎవడికి గొప్ప?
అనవసరమేదో అర్థం చేసుకుని మసులు కుంటే మన పిల్లలకి ఇంకాస్త పచ్చని ప్రకృతిని ఇవ్వచ్చు కదా?
.
.
ఇంకా ఇలాంటివి చాలా...
.
.
అవసరం లేకపోయినా నువ్వు ఏదైనా చేస్తున్నావంటే,
నీకు మానవత్వం లేనట్టే,
నీ వల్ల కాదా రేట్లు పెరిగి పోయి, పేదలు తిండి తినలేక, తాగ నీరు లేక బాధ పడుతున్నది?


.
.
అదిగో అక్కడ దేముడి మీద పాలు పోసి వృధా చేసేస్తున్నారు అని యుద్ధం చేసేసి
ఇంటికి వచ్చి సెల్ చూసుకుంటూ పాలు పొంగించేసావంటే నీ యుద్ధానికి అర్థం లేదు
అసలు నీ యుద్ధం నీకే అర్థం కానట్టు !!
.
.
లోకాన్ని పీడిస్తున్న సమస్య 'అతి ' .
పొదుపు లేక పోవటం.
పిల్లాడు మహా అయితే 10 బొమ్మలతో ఆడుకుంటాడు, మనం 100 బొమ్మలు కొంటాం.
పిల్లకి 10 బట్టలు ఉంటే చాలు మనం 100 కొంటాం.
అతి... కాస్త తగ్గించు కోవాలి మనం.
.
.
అప్పుడే లోకం ఇంకాస్త బాగుంటుంది. మానవత్వం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలిచ్చే ముందు, ఈ చిన్న చిన్న విషయాలు ఒక సారి ఆలోచిస్తే సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట సార్ధక మవుతుంది !!!

Sunday, May 27, 2018

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. (Humanist version)

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. నాగన్న ఆ గట్టునేమో దేవుళ్ళ దోపిడుంది, మంత్రాల మత్తు ఉంది, స్వర్గాల పిచ్చి ఉందీ, ఈ గట్టునేమో విజ్ణాన విత్తు ఉంది.
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. 
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. 
ఆ దిబ్బనేమో ముల్లాల ఫత్వ ఉంది, 
పోపుల పైత్యముంది, బాబాల బురద ఉందీ, 
ఈ దిబ్బనేమో న్యాయపు కోర్టుంది. 

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. 
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. 
ఆ గడపనేమో కాషాయ సుత్తి ఉంది, 
పచ్చోడి కత్తి ఉంది, తెల్లోడి సొత్తు ఉందీ, 
ఈ గడపనేమో కష్టించె సత్తువుంది. 

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. 
ఆ ఏపునేమో కులాల కంపు ఉంది, 
కాఫిర్ల రక్తముంది, కృసేడ్ల కచ్చ ఉందీ, 
ఈ ఏపునేమో మానవతా వాదముంది. 

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. 
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా…
నాగన్న ఆ గట్టునేమో లేచేటి శవముంది 
చంపేటి దైవముంది, తాగేటి రాయి ఉందీ 
ఈ గట్టునేమో మనిషయ్యే మార్గముంది !!!