Saturday, September 1, 2018

స్నేహ సముద్రంలో కలుద్దాం

సముద్రంలోని నీరు మబ్బులై విడిపోయినట్లు
కాలం అనే కళ్ళెం లేని గుర్రం వెనకాల
అలుపెరుగని పరుగులు తీస్తూ
పెనవేసుకున్న జీవితాలు విడిపోయాయి

పొద్దున్నే పుస్తకాలు పట్టుకుని
అరై ఒరై అనుకుంటూ
చదువులు, స్నేహాలు, ప్రేమలు..
గొడవలు, సినిమాలు, పరీక్షలు
అన్నిట్లోను మనం కలిసున్నాం
కొత్త రెక్కలు రాగానే
స్తిరత్వం వెతుక్కుంటూ చెరో దిక్కుకీ విడిపోయాం
పండగకో, పుట్టిన రోజుకో
ఆనందాలకో, అవసరాలకో పలకరించుకునేంత
దూరం వెళ్ళిపోయాం !

కాలం ఆగదు కాని
దానిని క్షణ కాలం వెనకకు తిప్పగలిగేది
ఏంటో తెలుసా?

జ్ఞాపకం !

మనం కలిసి గడిపిన రోజులు జ్ఞప్తి తెచ్చుకుంటే
మాళ్ళీ ఆ క్షణాలు జీవించినట్టే
అందులో మనం అందరం ఉంటే ఆ రోజులు నిజంగా తిరిగి వచ్చినట్టే

మబ్బులన్ని కలిసి
వర్షమై
కాలువలై
నదులై
మళ్ళీ సముద్రంలో కలిసినట్టు
మనం అందరం మరో సారి స్నేహ సముద్రంలో కలుద్దాం



మళ్ళీ మబ్బులవ్వుతాం అని తెలిసినా
నదులై మళ్ళీ కలుస్తాం అని ఆనందిద్దాం !

Sunday, July 15, 2018

పొదుపు


అతిగా తినడం (అవసరానికి మించి ఏం తిన్నా ఎంత తిన్నా),
తిండి వృధా చెయ్యడం,
కోసి కూర చేసుకునే దానిని కూడా వంకర టింకర ఉండకూడదని సోకుకు పోవడం,
గొప్పలకు పోయి అర్థ రూపాయి తిండికి ఆరురూపాయలు ఖర్చు చెయ్యడం,
ఆర్భాటాలకు పోయి విందులకు లక్షలు కోట్లూ తగలెయ్యడం,
.
.
నీట్ నెస్ పేరుతో అతిగా నీరు వాడటం,
నిర్లక్ష్యంతో నీటిని వృధా చెయ్యటం,
చేసేది ఏసీ లో ఉద్యోగం , వేసేది జీన్సు.. అయినా ఏ రోజు కట్టిన బట్టలు ఆ రోజే,
.
.
లింగు లిటుకు మంటూ ఒక్కడుంటాడు, కారేమో పడవంత ! అవసరమా? నీ కారు ఎవడికి గొప్ప?
అనవసరమేదో అర్థం చేసుకుని మసులు కుంటే మన పిల్లలకి ఇంకాస్త పచ్చని ప్రకృతిని ఇవ్వచ్చు కదా?
.
.
ఇంకా ఇలాంటివి చాలా...
.
.
అవసరం లేకపోయినా నువ్వు ఏదైనా చేస్తున్నావంటే,
నీకు మానవత్వం లేనట్టే,
నీ వల్ల కాదా రేట్లు పెరిగి పోయి, పేదలు తిండి తినలేక, తాగ నీరు లేక బాధ పడుతున్నది?


.
.
అదిగో అక్కడ దేముడి మీద పాలు పోసి వృధా చేసేస్తున్నారు అని యుద్ధం చేసేసి
ఇంటికి వచ్చి సెల్ చూసుకుంటూ పాలు పొంగించేసావంటే నీ యుద్ధానికి అర్థం లేదు
అసలు నీ యుద్ధం నీకే అర్థం కానట్టు !!
.
.
లోకాన్ని పీడిస్తున్న సమస్య 'అతి ' .
పొదుపు లేక పోవటం.
పిల్లాడు మహా అయితే 10 బొమ్మలతో ఆడుకుంటాడు, మనం 100 బొమ్మలు కొంటాం.
పిల్లకి 10 బట్టలు ఉంటే చాలు మనం 100 కొంటాం.
అతి... కాస్త తగ్గించు కోవాలి మనం.
.
.
అప్పుడే లోకం ఇంకాస్త బాగుంటుంది. మానవత్వం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలిచ్చే ముందు, ఈ చిన్న చిన్న విషయాలు ఒక సారి ఆలోచిస్తే సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట సార్ధక మవుతుంది !!!