Saturday, August 14, 2021

కురుతి (మలయాళం) : బలి - KURUTHI

 కురుతి (మలయాళం) : బలి

మంచి నటుడికి చెడ్డ పాత్రలేమి ఉండవ్. విలనా హీరోనా తేడా ఉండదు. పృథ్విరాజ్ (లాయిక్) గా నటించిన కురుతి, హిందు ముస్లిం గొడవల ఆధారంగా తీసిన సినిమా. నాకు నచ్చింది. పృథ్విరాజ్ వి గతంలో చూసిన సినిమాల ఆధారంగా అతని పాత్ర మీద ఎంత బలం ఉంటుంది అని అనుకున్నానో, అంతకన్నా బాగానే ఉంది.





Spoiler alert:
మనిషి చేసిన తొలి పాపం "పండు" తినడం కాదు, కాబిల్ అసూయ ద్వేషాలతో తన తమ్ముడు హాబిల్ ను చంపడం మనిషి తొలి పాపం అంటాడు.
కాఫిర్ కాఫిర్ అంటూ ఆ ద్వేషం ఒక ముస్లిం నుంచి ఇంకొక ముస్లిం కి పాకుతుందో, ఒక ముస్లిం ముసలతన్ని పొరపాటున చంపి, కనీసం పశ్చత్తాపం పడని ఒక హిందూ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో.. ఇలా చాలా పాత్రదారుల ప్రవర్తనల గురించి సినిమా.
అంతర్లీనంగా, మనిషుల సమస్యలు మతం వల్ల కాదు ఒకరంటే ఒకరికి "ద్వేషం" వల్ల అని చెప్పే ప్రయత్నం.
ఐతే నేను దీనితో ఏకీభవించను. మనుషులు ఒకరినొకరు ఊరికే ద్వేషించుకోరు. హాబిల్ కి దక్కింది తనకి దక్కలేదనికి, కాబిల్కి అసూయ. అల్లా కాబిల్ కి అదికారం ఇచ్చుంటే, హాబిల్ని ప్రేమగా చూసుకునే వాడేమో ? అక్కడ సమస్య అసుయ ద్వేషం కాదు. పవర్. ఫ్రెడ్రిక్ నిషే చెప్పినట్టు, విల్ టు పవర్. అధికారం, శక్తి మనిషి అహం (ఇగో ) సంతృప్తి పరుస్తాయి. అందుకే తిండికి లోటు లేని (ప్రాణం నిలబేట్టుకోడం మొదటి పశు ప్రవృత్తి) ప్రతి ఒక్క జీవి పవర్ కోసం పాకులాడుతుంది. నడిపించేది అదే.
బలవంతుడిని ఎదిరించలేని బలహీనుడు పది మందినీ వెంటేసుకు పోతాడు. సిం హం ఎంత బలంగా ఉన్నా వేట కుక్కలు గుంపు ముందు తోక ముడవాల్సిందే, అది ప్రకృతి.
బలవంతుడి సమస్య నెగ్గడం తో తీరిపోతుంది. బలహీనుడికి నెగ్గిన తరువాత మొదలవుతుంది !
ఎదేమైనా అలోచింప చేసే సినిమా !

Monday, July 5, 2021

అమృతమన్న ఆశే లేదు, హాలాహలమన్న హడలూ లేదు

 అమృతమన్న ఆశే లేదు

హాలాహలమన్న హడలూ లేదు

దేవ దానవుల మధ్య తారతమ్యము పట్టదు

ఉన్న దొకటే ఎల్లలు లేని కరుణ

.

అమృతాన్ని అందరికీ పంచి

హాలాహలన్ని గొంతులో ఉంచి

తండ్రి మనసు తెలిపావు

నీ తత్త్వ మిది శంకరా !

.

సత్తె కాలపోడని పిల్లలనుకుంటారు

భోల శంకరుడని భక్తులనుకుంటారు

నీకు తెలియక కాదు

నీ మనసు మాకు తలియక !



మదిని నిశ్చలముగ వెలుగు 

నీలకంఠా !