Saturday, March 18, 2023

వంద ఎర్ర చీమలు, వంద నల్ల చీమలు : ఓ చిన్న పరిశీలన

 వంద ఎర్ర చీమలు, వంద నల్ల చీమలు : ఓ చిన్న పరిశీలన

.

ఓ వంద ఎర్ర చీమలు, ఓ వంద నల్ల చీమలు ఒక గాజు సీసాలో వేసాం అనుకోండీ, అవి అటూ ఇటూ తిరుగుతూ సీసా నుండి బయటకు వెళ్ళే దారి వెతుకుతూ తిరుగుతాయి.

ఇప్పుడు సీసాని బాగా గిలకరించారంకోండి, నల్ల చీమలూ ఎర్ర చీమలూ ఒక దానినొకటి చంపుకోవడం మొదలు పెడతాయి.

వాటికి కలిగిన సమస్యకు కారణం ఏర్ర చీమలని నల్లవి, నల్ల చీమలని ఎర్రవి అనుకుంటాయి.

నిజమైన శతృవు ఎవరిక్కడ?

సీసా ని కుదిపిన కుతంత్రం కాదా నిజ విరోధి?

.

చీమల లాంటి ఆ అమాయకత్వానికి మనుషులూ మినహాయింపు కాదు !

అధికారం కోసం, అడ్డదారులు తొక్కి,

అడ్డమైన వాళ్ళతో చేతులు కలిపి,

డబ్బుకోసం నానా స్కాములూ చేసి,

ఆపై ఈడీ పట్టుకుంటే తెలివిగా..

మహిళా రిజర్వేషన్ బిల్లూ

తెలంగాణా మీద కుట్ర

ప్రజాస్వాం మీద దాడి అని

అసలు నిజాయితీ నిరూపించుకోవడం మానేసి,

చుప్పనాతి కబుర్లు చెప్పి

జనాల్ని రెచ్చ గొడుతుంటే,


అసలు విషయం వదిలేసి,

చెయ్యెత్తిందీ, ముక్కు చీదిందీ అని సోది మాట్లాడుకునే వాళ్ళు, 

వెర్రి గొర్రెలూ, చీమ బుర్రలూ కాక ఇంకేమవుతారు?

.

నువ్వు ఆడా నెను మగా, 

నువ్వు ఆ కులం నేను ఈ కులం,

నీది ఆ దేశం నాది ఈ దేశం,

నువ్వు ఆ మతం నేను ఈ మతం,

నీదా అభిమతం నాది ఈ అభిమతం,

అని వర్గాలు గా విడిపోయీ కొట్టుకు చచ్చే ముందు,

సమస్యకు మూల కారణం తెలుసుకుని ముందుకు పోతే మంచిది.

.

వినదగు నెవ్వరు చెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

కని కల్ల నిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ !



Tuesday, December 20, 2022

ఏడవటానికి ఏమీ దొరకట్లేదని వెక్కి వెక్కి ఏడ్చాడంట ఒకడు

 చీరలు కట్టుకుని స్త్రీలను ఉద్ధరించే పనిలో పడ్డారు కొందరు పురుష పుంగవులు .

రాత్రికి రాత్రి వైరల్ అయ్యిపోయే సంస్కరణలు ఏమి తట్టని బుద్ధి మాంధ్యులు కొంతమంది ఇలాంటివి కనిపెడుతున్నారు.

మీరు నిజంగా చెయ్యాలంటే, ట్రాఫిక్ సిగ్నళ్ళ దెగ్గర డబ్బులు అడుక్కునే స్థితిలో ఉన్న ట్రాన్స్జెండర్లకు సమాన అవకాశాలు కల్పించేలా చెయ్యాలి, వారిపై చిన్న చూపు లేకుండా మీరు సంఘాన్ని మార్చాలి.

అంతే కానీ ఈ చీరలు కట్టుకు తిరగడమేంటిరా తింగర సన్నాసుల్లారా.. చూడలేక కడుపులో దేవేస్తోంది.





పైత్యం ప్రకోపిస్తే ఇలాంటి పనులే చేస్తారు... ఒక్కోడికీ చెంబుడు అల్లం రసం తాగించాలి.

.

ఆడాళ్ళు మగాళ్ళు సమానం అంటే, హక్కుల్లో, గౌరవం లో, అవకాశాల్లో సమానం అని కాని, ఇలా ప్రకృతి విరుద్ధంగా అమ్మాయిలు కండల కాంతారావుల్లా, అబ్బాయిలు కన్యాకుమారిల్లా మరిపొమ్మని కాదు.

.

ఇప్పటికే ప్రకృతికి దూరంగా వచ్చి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నాం..

ఇలాంటివి చేసి బుర్రలు కూడా పాడుచేసుకోవద్దు !