స్థలమై పొలమై బంగారమై
రుణమై ధనమై ఆస్తై అప్పై అరువై
ధనం ఆడుకుంటుంది, అన్నిటా తానై
వ్యామోహాలకైనా వ్యాపకాలకైనా వ్యసనాలకైనా
ఆశలకైనా దురాశలకైనా
రాజులకైనా రాజకీయాలకైనా...
చక్రం తిప్పే వాళ్ళని చేస్తుందీ
దానిలో తిరిగే వాళ్ళను చేస్తుంది
ఒకడికి కూటి కోసం కోటి విద్యలు నేర్పుతుంది
కోట్లలో పోగై ఇంకొకడిని మూర్ఖుడిని చేస్తుంది
దానాలు చేసే ధర్మాత్ములను చేస్తుంది
దురాశతోనున్న దుర్మార్గులనూ చేస్తుంది
అన్నదమ్ములను వీదికీడ్చి వేర్పాటు చేస్తుంది
మనిషిలో చెడై తను ఆడుకుంటుంది
ధనానికి లొంగని జగతేలేదు
ఏదైనా ఉంటే అది చచ్చే నిముషం దాకా అర్థం కాదు !