ఉన్నవాళ్ళు కట్టేరు గుళ్ళు
మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి. Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
Monday, December 30, 2024
ఉన్నవాళ్ళు కట్టేరు గుళ్ళు
Monday, December 16, 2024
అల్లు అర్జున్ కి ఇచ్చిన జీతం 300కోట్లు
ఇంటర్నెట్ ప్రకారం
అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్టు?
అరస్టు చెయ్యాలంటే
Monday, December 9, 2024
పిల్లలు - సినిమాలు - రోల్ మోడల్స్
నేను నా చిన్నప్పుడు 4 - 10 వ తరగతి దాకా హాస్టల్లో ఉండి చదువుకున్నా.
మాది మిలటరీ డిస్సిప్లిన్ స్కూల్.
ఫ్రెండ్సే లోకం , క్లాసుమెట్లు, సీనియర్లు , జూనియర్లు , సూపర్ సీనియర్లు ...
ఒక సారి ఎదో కోపం వచ్చి మా సూపర్ సూపర్ సీనియర్స్ ఇంటర్ పిల్లలు ,
వాళ్ళ టీచర్ని దుప్పటి ముసుగు వేసి కొట్టారుట, మా స్కూల్ అంతా విషయం పాకి పోయింది,
వాళ్ళని ఎండలో నుంచోపెట్టి రెండురోజులు చితక్కొట్టారు మా స్కూలు యాజమాన్యం.
చదువుకునే బెచ్చు, అల్లరి బాచ్చు, చిల్లరిగాళ్ల బేచ్చు ఇలా రకరకాల సర్కిళ్లలో
ఆ వార్త రాకరకాలుగా అర్థమయ్యింది.
అల్లరి బాచ్చుకి టీచర్ని కొట్టడం గొప్పగా కనిపించింది.
మేము 10 వ తరగతికి కి వచ్చాక , మా క్లాసువాళ్ళు ,
మా తెలుగు సార్ ని దుప్పటి ముసుగు వేసి కొట్టేసారు, సరదాగా .. అమ్మాయిల చెప్పుకోడానికి గొప్ప కోసం.
మేము గోడలు దూకి సినిమాలకు వెళ్ళేవాళ్ళం గొప్ప కోసం.
ఆ రోజుల్లో సిగరెట్లు కొట్టడం , మందు తాగడం మా హాస్టలులో ఒక హీరోయిజం.
గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంక వాడు వరల్డు ఫెమస్.
పైవన్నీ మిత్రులనుండే అబ్బే 'అవ' లక్షణాలు,
తల్లితండ్రులు పట్టించుకోకపోవడం వల్ల స్థిరపడిపోయే దుర్లక్షణాలు.
చెడు బాగా తొందరగా నచ్చుతుంది, హీరోయిజం లా కనిపిస్తుంది
అందులోను రావణాసురుడిని గొప్పోడనుకుంటున్న ఈ రోజుల్లో
చెడ్డ మిత్రులు, పుష్పా , మట్కా లాంటి సినిమాలు, కొన్ని రకాల పుస్తకాలూ...
బాగా ప్రభావం చూపుతాయి ... నాకు బాగా అనుభవమే.
.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే,
9 వ తరగతి చేదువుతున్న 3 పిల్లలు గురువుని కొట్టారు , ఒకడు కడియం తీసి మరీ కొట్టాడు, ఆయన పోయారు. కేసు నడుస్తోంది.
విపరీత మైన డ్రగ్స్ వాడకం.
హెచ్ ఐ వి రోగుల్లో 35% శాతం 15 - 24 ఏళ్ల వాళ్లే.
గన్స్ , కార్స్ , రేస్, కాల్ గాళ్స్, ఓయో రూమ్స్, ప్రయివేట్ పార్టీస్ .. ఇది నేటి పరిస్థితి.
ఇలాంటి రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలు అన్నీ తెలుసుకుంటారు.
స్వేచ్ఛ పేరుతొ వదిలెయ్యకుండా,
కాస్త మంచి చెడు విచక్షణా జ్ఞానం నేర్పించగలిగితే,
వయో పరిమితిని దాటి సినిమాలు చూపించకుండా ఉంటే,
సెల్లులు , నెట్టు పట్టింపు లేకుండా ఇచ్చెయ్యకుండా ఉంటె,
ప్రతి విషయం గురించి పిల్లలతో స్పష్టంగా మాట్లాడగలిగితే,
అప్పుడు ఇలాంటి పోకడల నుండి వారిని వారే కాపాడుకోగలిగేలా చెయ్యగలం.
మిరే కాదు ,మీ పిల్లల మిత్రులు ఎలాంటి వారో తెలుసుకుంటూ ఉండాలి,
ప్రతి రోజు జరిగే విషయాలు , వాళ్ళ అనుమానాలు తీరుస్తూ ఉండాలి.
రాసి పెట్టుంటే విజేతలు అవుతారు కానీ,
తల్లి తండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు తప్పకుండా గొప్ప మనుషులు అవుతారు !
Monday, December 2, 2024
పిల్లలు - టెక్నాలజీ - AI - వోకిజం
పిల్లలు - టెక్నాలజీ - ఏ అయ్ - వోకిజం
.
* 14 ఏళ్ల పిల్లాడు AI chat App తో ప్రేమలో పడి, దాని వల్ల ఆత్మ హత్య చేసుకున్నాడు.
* నీ వల్ల లోకానికి ఉపయోగం లేదు చచ్చిపో, అని చెప్పిన గూగుల్ జెమిని.
* 10 ఏళ్ల పిల్లాడు గన్ తో 5 గురు తోటి విద్యార్థులను కాల్చి చంపాడు.
* 2 ఏళ్లలో ౩౦ కోట్లు , 32 సర్జరీలు చేయించుకుని -> మొదట బ్రిటిష్ అబ్బాయి నుండి కొరియన్ అబ్బాయిగా , తరువాత కొరియన్ అమ్మాయిగా , తరువాత మళ్ళీ కొత్త అబ్బాయిలా మారిన 30 ఏళ్ల కుర్రాడు.
* అమెరికా లో 72 జెండర్స్. వోకిజం వల్ల ఆడ - మగ మధ్యలో 70 రకాలుగా గందరగోళానికి గురవుతున్న చిన్న పిల్లలు / యువత. వోకిజం ఆధారంగా సినిమాలు .
.
పై మూడు విషయాల్లో అంతర్లీనంగా ఉన్న అసలైన సమస్య ఏమిటో తెలుసా ?
AI కాదు, గన్స్ కాదు, వోకిజం కాదు ... చిన్న/పెద్ద మానసిక రుగ్మతలు, కొన్ని సార్లు ఐడెంటిటీ క్రైసిస్.
చిన్న పిల్లల్లకు మానసిక సమస్యలా? అని అనుమానం వద్దు. వస్తున్నాయి అందరికీ.
పూనకాలు, దెయ్యాలు, గాలి, ధూళి ఇలా రకరకాల మానసిక సమస్యలు బోలెడు మనకు.
ఒకప్పుడు భారత దేశంలో అన్నీ పెద్ద కుటుంబాలే ఉండేవి కాబట్టి చుట్టూ చాలామంది.
తల్లి తండ్రులకు చెప్పుకోలేక పొతే/లేదా వాళ్ళు పని వల్ల దొరకక పోతుంటే,
ముత్తమ్మమ్మ తాత మామ్మ అమ్మమ్మ
పెద్ద నాన్న చిన్నాన్న పెద్దమ్మ చిన్నమ్మ
అత్త మావ అక్క బావ చెల్లి
ఇలా ఇంట్లో చెప్పుకోడానికి చాలా మంది చెప్పుకోడానికి ఉండేవారు !
సగం సమస్యలు చెప్పుకుంటేనే పోతాయి,
మిగతా సమస్యలు డాక్టర్లను సంప్రదించాలి !
.
డాక్టర్ల దెగ్గరకు వెళ్ళక్కరలేనంత చిన్న సమస్యలు, చెప్పుకోడానికి ఎవరూ లేక పెద్ద సమస్యలు అవుతాయి.
ఉద్యోగానికి రోజుకి 8 గంటలు ఎలా కేటాయిస్తారో, అలానే
తల్లి తండ్రి అనే జీవితకాల ఉద్యోగంలో,
పిల్లలతో మాట్లాడటం అనే పనికి కనీసం 1-2 గంటలు కేటాయించాలి.
రిటైరైన తాతలు మామ్మలు సెల్లులు చూసుకుంటూ/లేదా ఆశ్రమంలో ఉంటుంటే,
లేదా వారికే మానసిక సమస్యలు ఉంటె ?
పిల్లలు సెల్లు టీవీ కి అతుక్కుపోతుంటే, వారి పరిస్థితి ఏంటి ?
.
మానసిక సమస్య ఉంది కాబట్టి 14 పిల్లాడు AI తో చెప్పుకున్నాడు
ప్రియురాలిని ఊహించుకున్నాడు, డిప్రషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు ! ప్రేమలా అనిపించిన డిప్రషన్.
వీడియో గేమ్స్ లో చేసింది , సినిమాల్లో చూసింది బాగా నచ్చింది,
బయట చెయ్యాలనుకున్నాడు, చేసేసాడు ! క్రూరత్వంలా బయటపడిన మెంటల్ సమస్య .
వయసు తో పాటు శరీరంలో మార్పులు వస్తాయి,
చెప్పేందుకు పెద్దలు లేరు, ఇంటర్నెట్టే శరణ్యం,
72 రకాల అనుమానాలు పిల్లలకు.
ఆ అవకాశం వాడుకుని,
సంఘ సంస్కర్తలు అయ్యిపోదాం అనుకునే అవకాశవాదులు
తమకు అర్థంకాకపోయినా, వోక్ ఉద్యమాలు తలకెత్తుకుని
పిల్లల్ని బలి పశువులు చెయ్యడం ! ఐడెంటిటీ క్రైసిస్ + చెత్త ఉద్యమాలు.
.
ఏతా వాతా చెప్పేదేంటంటే,
వెబ్ సిరీస్ల బదులు పిల్లల తో సమయం గడపాలి.
ఒంటి కాయ శొంఠి కొమ్ముల్లా ఉండకుండా కాస్త జనాలతో పిల్లల్ని కలవనిస్తే ,
మీడియా & నెట్ అదుపులో ఉంచితే మానవాళికి మంచిది !
Wednesday, October 23, 2024
ఏ మతం ఎలా ఉపయోగపడింది?
దాడికి గురైన ప్రతి ఊరూ నా స్వంత ఊరే
అది ఇజ్రాయెలు అయినా పాలస్తెనా అయినా !
దాడికి గురైన ప్రతివారూ నా స్వంత వారే
అది యూదులయినా ముస్లిమయినా
వారిది మరే మతమయినా !
చని పోయిన ప్రతి బిడ్డా
శోకంలో ఉన్న ప్రతి తల్లీ
విలపించే ప్రతి తండ్రీ
కూలి పోయిన ప్రతి ఇల్లూ
నా సొంత ఇల్లే !
తిరిగిరాని చెల్లెలి కోసం
వేచి ఉన్న ప్రతి అక్కా
భుజంపై తమ్ముడి శవం మోస్తూ
నడిచి వెళ్ళే ప్రతి అన్నా
అంతా నా వాళ్ళే !
ఆకలితో అలమటించే ప్రతి శిశువూ
పోషణ లేక పాలివ్వలేని ప్రతి బాలింత
కన్నీరింకిపోయిన ప్రతి మగాడు
యుద్దానికి బలైపోయిన ప్రతి సైనికుడు
...
పోయినవాళ్ళందరూ మనవాళ్ళే
మనమూ వాళ్ళకు అయిన వాళ్ళమే
మనుషులుగా ఆలోచిస్తే !
ఏ యుద్ధం, ఎప్పుడు ఉపయోగపడింది?
మనమెంత రాక్షసులమో రుజువు చెయ్యడానికి తప్ప?
ఏ జ్ఞానం, ఎంత ఉపయోగపడింది?
మనమింకా మృగాలమని గుర్తుచెయ్యడానికి తప్ప?
ఏ మతం, ఎలా ఉపయోగపడింది?
మన స్వార్ధానికి బలైపోవడానికి తప్ప?
ఏ స్థలం, ఎవరితో ఉండిపోయింది?
పోయాకా శవాన్ని పూడ్చిపెట్టటానికి తప్ప?
.
ఆ కన్నీటి పొరల వెనుక నీకు ఏ మతం కనిపిస్తోంది?
ఆ విషణ్ణ వదనాల వెనుక నీకే ప్రాంతం అనిపిస్తోంది?
ఆ భీకర రోదనల వెనుక నీకే కారణం వినిపిస్తోంది?
ఏ నవజాత శిశువు నీకే అన్యాయం చేసింది?
.
అవసరమా ఈ ఆలోచనా శక్తి మనకు?
అవసరమా ప్రేమించే మనసు మనకు?
అవసరమా ఏ స్వంత్రం మనకు?
అవసరమా అసలీ లోకం మనకు?
ఈ వ్యధలు బాధలూ నాకెందుకులే అనుకుంటున్నావా?
సాటి మనిషికోసం ఒక కన్నీటి బొట్టు రాల్చలేవా?
ఒక్క క్షణం
ఆ తినే తిండి ఆపు
ఆ వినే పాటనాపు
ఆ చేసే పనిని ఆపు
ఆ వేసే వోటు నాపు
కోడి పిల్లై పుట్టినందుకు పలావులో పడినట్టు
మనిషికి పుట్టినందుకు ఆ పసిపిల్లలు
యుద్దానికి బలి కావల్సిందేనా?
వారి విలువా కోడి పిల్లంతేనా?
ఒక్క నిమిషం ఆలోచించు,
అభం శుభం తెలియని ఆ పిల్లల
శోకం నీకు కంట తడి తెప్పించలేదా?
వారిని పావులుగా అడ్డూగోడల్లా వాడుకునే
వారి మీద నీ రక్తం మరగలేదా?
అయితే నీ గురించి నువ్వే ఆలోచించుకో !
.
ఎందుకంటే,
మన గొంతులు వినపడితేనే
ఆ యుద్ధం ఆగుతుంది,
మన చేతులు కలిస్తేనే
మరో ప్రపంచం సాకారమవుతుంది !
Monday, October 7, 2024
నాన్న గారి బీరువా!
Thursday, October 3, 2024
అలక్ నిరంజన్ Alak Niranjan - First draft
అలక్ నిరంజన్ అని అరుచుచు తిరిగెను
భవ భయములు బాపె బైరాగీ
వడి వడి గా వచ్చి ద్వారము ఎడ నిలిచి
భిక్షకై పిలిచెను ఆ జోగి !
చందన తిలకము విభూతి ధరియించిన
కాషాయ ధారీ సుందర సన్యాసి,
అలక్ నిరంజన్ అని అరుచుచు తిరిగెను
భవ భయములు బాపె బైరాగీ !
ఎద ఝల్లుమంది, తనువు పులకరించింది,
అగ్గి ముందు బాసలు మనసు మరిచిపోయింది
నిర్మల ప్రశాంత నయన సాగరంలో
ఉరుము మెరుపుల తుఫాను చెలరేగింది
తడమాడె తలపులకు సిగ్గుతొ
గులాబి రంగులో బుగ్గ ఎరుపెక్కింది !
అలక్ నిరంజన్ అని అరుచుచు తిరిగెను
భవ భయములు బాపె బైరాగీ !
అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ ...
వినిపించే ఆ గొంతు మరలానూ
ఉరుముల మెరుపుల ఆనందం తిరిగొచ్చె
కన్నుల్లో మరలానూ
ఏడడుగులు విడిచేసె
పెళ్ళి నాటి శపదాలు వదిలేసె
వచ్చేటి భిక్షువు గంటల మోతలకే
విచక్షణ విడిపోయే, మనసేమో చెలరేగే
తనువున ప్రేమా గర్చించగనే !
రంగు రంగుల చీరను తీరుగ సరిచేసి
సింగారించుకున్నదామె సొగసుగా
ఆగాగు ఓ యోగి, నీ కళ్ళల్లో ఆ కాంతి
అంతంత మెరుపు ఎటులొచ్చెనో
తళుకుల మణులోలె రవిశశి మించిన
దీప్తితో అవి ఏల ప్రకాశించునో
అలక్ నిరంజన్ అలక్ నిరంజన్
మరుదినము మరలొచ్హే బైరాగీ
చప్పున తెరతీసి గడపను దాటేసి
సొంపుగ చూసెను తనకేసి !
అమ్మా అని పిలిచి ఆమెకు
భిక్ష పాత్ర నందించే ఆ యోగి
పాత్రలో పొర్లాడె ధగ ధగ మెరసిన
పంకజముల పాటి నయనాలు !
*
అమ్మా నిన్ననె పొగిడావు నా కళ్ళ అందానినే
పెకలించి తెచ్చాను పెళ్ళైన నీ మనసు
పెడదారి పట్టించిన ఆ కళ్ళనే
అలక్ నిరంజన్ అలక్ నిరంజన్
వెడలేను ఆ జోగి నిర్మోహుడై
కన్నులను తెరిపించ
తన కన్నులు వదిలేసె
నిర్మలముగా ఆ సన్యాసి
అలక్ నిరంజన్ అలక్ నిరంజన్!
Saturday, June 8, 2024
బిజెపి కి తక్కువ ఓట్లు పడాల్సిందే.
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. బిజెపి కి తక్కువ ఓట్లు పడాల్సిందే.
.
500 - 600 ఏళ్ళు మొఘలుల పరిపాలన, 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలన, మన డి.ఎన్.ఏ మార్చేసిందేమో!
సెకండ్-క్లాస్ సిటిజన్స్ లా బతకడం రుచించినంతగా,
అందరితో సమానంగా అందరూ ఫస్ట్-క్లాస్ సిటిజన్స్ గా బతకడం రుచించట్లా !
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని పెద్దలు చెప్పినట్లు,
సెక్యులర్ అంటే నీతో సమానం గా పక్కోడిని చూడటం అనే కానీ,
నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్ గా బతుకుతూ పక్కోడికి పైన పెట్టమని కాదు !
.
ఇది అర్థంగాని
హిందూ సెక్యులర్ అని చెప్పుకు తిరిగే కట్టప్పలు / నూతిలో కప్పలు
రూపాయికి అమ్ముడుపోయే కాంగి కమ్మీలు
మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయ్యింది ,
రోజులు మారాయి అని గుర్తించలేకపోతున్నాయి !
అసలు , ఈ కట్టప్పల బతుక్కి ఎప్పుడూ ఎవడొకడు పైనుండాలి, అప్పుడే దానికి ఒక అర్థం పర్థం !
ఒక వాట్స్ అప్ వార్త చూస్తే అది నిజామా కాదా,
నిజం గా బీజీపీ అలా చేసిందా, అలా చేస్తుంది అని చెప్పిందా అని
నిర్ధారణ చేసుకునే ఓపికలేదు ! వారికి బానిసత్వం బహు రుచికరం !
.
బిజెపి కి తక్కువ ఓట్లు పడాల్సిందే,
70 ఏళ్ల కాశ్మీర్ సమస్య తీర్చేసారు, ఇప్పుడు టీవీల్లో ఏం గొడవలు చూడకపోతే మాకు పొద్దేలా గడుస్తుంది ?
జనాభా సంఖ్యలో మనం ఇంకా 2వ స్థానంలో ఉన్నాం, చక్కగా 10 మంది పిల్లల్ని కనే వాళ్ళని NRC, CAA అని బయటే ఆపేస్తే ఎప్పటికి మనం మొదటి స్థానం సాధించగలం?
మన పాస్పోర్టుకు విలువ పెరిగింది అంట , ఉపయోగ మేముంది? తాకట్టుపెట్టలేము కదా?
ISROరాకెట్లు , DRDO మిస్సైళ్ళు తయారు చేస్తున్నాయి అంట, సోలార్ విండ్ గ్రీన్ ఎనేర్జి అంట... కొనుక్కుంటే పోయే దానికి ఉరికే ఎందుకీ ఊక దంపుడు పని ? ఉద్యోగుల్ని కష్టపెడుతున్నారు !
పెద్ద దేశాల మధ్య గౌరవం గా, గర్వంగా నిలబెట్టారు మన దేశాన్ని,మాకు కాస్త సిగ్గెక్కువ, అలా అందరి ముందు నిలబెట్టేస్తే ఎలా , అయినా మాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి !
శుభ్రత, విద్య, వైద్యం అభివృద్ధి చెందాయి, టాయిలెట్లు పెరిగిపోయాయి , చెంబెట్టుకు చల్లగాలికి అలా పోవాలంటే కుదరట్లా , మా స్వాతంత్య్రాన్ని హరించారు !
మైనారిటీలు గా మారిన జనాల పరిస్థితి...కాలం చెప్పిన సత్యం,
పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బాంగ్లాదేశ్, కాశ్మీర్,కేరళ, బెంగాల్ చరిత్రలో చూడండి,
మీరెవరు కాలాన్ని ఎదిరించడానికి, సెకండ్ -క్లాస్ సిటిజన్స్ గా ఆ పరిస్థితులు మాకు వస్తాయో లేదో చుడొద్దా ? చరిత్ర ఆవృతమవుతుందో లేదో తెలుసుకోవద్దా ?
ఇది వరకటికన్నా అవినీతి తగ్గింది, ఇప్పుడు ఎవర్నైనా తిట్టాలనిపిస్తే ఎలా ? దీని వల్ల పక్కింటోళ్లతో గొడవలు ఎక్కువ అయ్యిపోతున్నాయి.
మిలటరీకి మరింత బలం చేకూర్చారు, సరిహద్దుల్లో సైనికుల్ని బలి చెయ్యకపోతే, అసలు పక్క దేశాలు భయపడి యుద్ధానికి రాకపోతే, కొత్త ఉద్యోగాలు రావట్లేదు, ఇదెక్కడి న్యాయం ?
మీకు అర్థమవుతోందా ?
.
.
241 సాధించి మోడీ బిజెపి ఘనవిజయం సాధించారు. చరిత్ర తిరగ రాసారు !
నెహ్రు 3 సార్లు PM అయ్యారు అంటారేమో, ఏ గట్టి ప్రతిపక్షం లేకుండా, ఒక్కడే పరిగెత్తేసి ఒక్కడే కప్పు సాధించేసి, డప్పు కొట్టేసుకోవడమేనా ? మొట్ట మొదటిసారి మెజారిటీ వచ్చే PM అయ్యారా ?
రాజీవ్ గాంధీ 414 సాధించారు అంటున్నారు ,
ఇందిరా గాంధీ శవం మీద సాధించిన చిల్లర, ఆ ఘనత. కాదా ? ఆ సాధించిన ఘనత కిరీటంలో మళ్ళీ భోపాలు, బోఫోర్స్, షాబానో, సిక్కు, కాశ్మీరు ఉచకోతలు కలికి తురాయిలు !
మోడీ ప్రభుత్వానికి ముందు,
రబ్బర్ స్టాంపు మన్మోహన్ - సోనియా ప్రభుత్వం 145 / 206 సీట్లతో 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది , అదికూడా రాజీవ్ గాంధీ శవం మీద సాధించినదే !
ఎలాంటి రాజకీయ/వ్యాపార నేపధ్యం లేని మోడీ బీజేపీ ప్రభుత్వం 282 / 303 /240 మెజారిటీ తో 3 సార్లు గెలిచారు, అదీ గెలుపంటే !
.
అయినా
400 అనుకుని 240 మాత్రమే సాధించిన బాధలో మేము ఉన్నాం సరే
99 సీట్లు మాత్రమే సాధించి ,
14 చోట్ల డక్ అవుట్ అయిన కాంగ్రెస్ ఎందుకు ఆనంద పడుతోందో తెలియట్లా !
అసలు రాజీవ్ గాంధీ తరువాత కాంగ్రెస్ పతనం చూడండి 244 -> 145 -> 206 -> 99 -> ?
ఏడిస్తే, వచ్చే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కష్టం అని ఏడుపాపుకుంటున్నారేమో !!
డెమోగ్రఫీ మారిన ప్రతిచోటా,
వాట్సాప్ మెసేజులు నమ్మే అమాయకులు ఉన్న ప్రతిచోటా
ఓటేసే అందుకు బద్ధకం చూపించిన వాజమ్మలు ఉన్న ప్రతిచోటా బిజెపి ఓడింది, చూడండి.
.
ఏదేమైనా మేమంతా మోడీ వెనుకే, బిజెపి సంఘీలమే మేము !