Monday, December 25, 2023

ఆష్టవిధం బ్రాహ్మణ్యం - బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు

శ్రీ గురుభ్యోనమః

బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు


"మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్

అనూచానః తథాభౄణః ఋషికల్పః ఋషిర్మునిః"


బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు దీనినే ఆష్టవిధం బ్రాహ్మణ్యం అంటారు,

1)బ్రాహ్మణోదరేజాతః అనుపనీతః క్రియాశున్యతం, జాతి మాత్రేణ మాత్రః

’మాత్ర’కుడు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, ఉపనయనం జరగనివాడు, సరియైన సమయంలో ఉపనయనం జరగని కారణం చేత సంధ్యావందనాది నిత్య కర్మలను చేయని కారణాన క్రియా శూన్యుడు, కేవలం జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడుగా తెలియబడేవాడు / లేదా పుట్టుకవలన మాత్రమే బ్రాహ్మణుడుగా తెలియబడుతున్నవాడు.


2) సంస్కారేణ సంస్కృతః ద్విజముచ్యతే - పైన తెలిపిన బ్రాహ్మణుడు ఉపనయన సంస్కారముతో సహా అప్పటి వరకు అన్ని సంస్కారములను శాస్త్రోక్తంగా నిర్వహించి సంస్కరింబడినందున, ఉపనయనానంతరము రెండవజన్మగా సంస్కరింపబడినవాడగుట వలన ద్విజుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు.


3)జన్మ సంస్కార విద్యాభి త్రిభః శ్రోత్రియః - పైన తెలిపిన రెండు విధములైన బ్రాహ్మణత్వమును పొంది వేదవిద్యను (శ్రుతిని చదువుకున్నవాడు) పొందిన తరవాత శ్రోత్రియుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు, ఆతరవాతనే


4)వేదవేదాంగ తత్వజ్ఞః శుద్ధాత్మా, పాపవర్జితః, శ్రేష్ఠః ప్రాజ్ఞ అనూచానః - శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు వేదాలను ఉపాంగాలతో సహా నేర్చుకొని, అందులోని తత్త్వాన్ని తెలుసుకొని, నిర్మలమైన ఆత్మ కలవాడైనందువల్ల పాపములు లేనివాడై, అందరికీ శ్రేష్ఠుడై, ప్రాజ్ఞతను పొందినబ్రాహ్మణుడు అనూచానుడని తెలియబడుతున్నాడు.


5)అనూచానః, యజ్ఞస్వాధ్యాయ యంత్రతః భౄణః - అనూచానుడై, యజ్ఞములను స్వాధ్యాయములను దాటనివాడు భౄణుడని తెలియబడుతున్నాడు


6)మంత్ర మంత్రార్థ విద్, ప్రాజ్ఞః, వానప్రస్థః, తపస్వీ ఋషిః - మంత్రమును తెలుసుకొని, దాని అర్థాన్ని అది ప్రతిపాదించే తత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, ప్రాజ్ఞ్యుడైనవాడు, వాన ప్రస్థాశ్రమమునందుండు వాడు, తపస్సు యందు మక్కువ కలవాడు ఋషి అని తెలియబడుతున్నాడు, వాళ్ళు మంత్ర ద్రష్టలుగా, మంత్రార్థముల ద్రష్టలుగా తెలియబడుతారు.


7.తపసా మానుష్యం అధిక్రాంతం: ఋషులను మామూలు మనుష్యులకన్నా పై స్థాయిలో చూస్తారు, అందుకే దేవతలతో పాటు ఋషులకూ తర్పణలుంటాయి. తపస్సు చేత మనుష్యత్వాన్ని దాటి ఋషిత్వాన్ని పొందుతారు.) ఈ ఋషిలలో మళ్ళీ స్థాయీ బేధాలిలా ఉంటాయి... ఋషి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి.


8)ఆత్మత్వమననాత్ మునిః - ఇవన్నీ దాటి ఆత్మ తత్వమునే మననం చేసే స్థితి కలిగినవాడు ముని అని తెలియబడుతున్నాడు.


ఈవిధంగా "వంశము - జన్మ", "వృత్తము - నడవడిక, చేయవలసిన కర్మలు (కర్మ-గౌణము రెండూ)", "విద్య" ఈ మూడూ ఉన్నవాడు త్రిశుక్లుడను బ్రాహ్మణుడనబడి అ పేర లోకములో గౌరవ మన్ననలను పొందును.(మూలం స్కాంద పురాణం)

అథ బ్రాహ్మణభేదాంస్త్వమష్టౌ విప్రావధారయ !!

మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్ !

అనూచానస్తథా భ్రూణో ఋషికల్ప ఋషిర్మునిః!!

ఇత్యేతేఽష్టౌ సముద్దిష్టా బ్రాహ్మణాః ప్రథమం శ్రుతౌ !

తేషాం పరః పరః శ్రేష్ఠో విద్యావృత్తవిశేషతః !!

బ్రాహ్మణానాం కులే జాతో జాతిమాత్రో యదా భవేత్ !

అనుపేతక్రియాహీనో మాత్ర ఇత్యభిధీయతే !!

ఏకోద్దేశ్యమతిక్రామ్య వేదస్యాచారవానృజుః !

స బ్రాహ్మణ ఇతి ప్రోక్తో నిభృతః సత్యవాగ్ఘృణీ !!

ఏకాం శాఖాం సంకల్పాం చ షడ్భిరఙ్గైరధీత్య చ !

షట్కర్మనిరతో విప్రః శ్రోత్రియో నామ ధర్మవిత్ !!

వేదవేదాఙ్గతత్వజ్ఞః శుద్ధాత్మాపాపవర్జితః !

శ్రేష్ఠః శ్రోత్రియవాన్ ప్రాజ్ఞః సోఽనూచాన ఇతి స్మృతః !!

అనూచానగుణోపేతో యజ్ఞస్వాధ్యాయయన్త్రితః !

భ్రూణ ఇత్యుచ్యతే శిష్టైః శేషభోజీ జితేన్ద్రియః !!

వైదికం లౌకికం చైవ సర్వజ్ఞానమవాప్య యః !

ఆశ్రమస్థో వశీ నిత్యమృషికల్ప ఇతి స్మృతః !!

ఊర్ధ్వరేతా భవత్యగ్రే నియతాశీ న సంశయీ !

శాపానుగ్రహయోః శక్తః సత్యసన్ధో భవేదృషిః !!

నివృఇత్తః సర్వతత్వజ్ఞః కామక్రోధవివర్జితః !

ధ్యానస్థో నిష్క్రియో దాన్తస్తుల్యమృత్కాఞ్చనో మునిః !!

ఏవమన్వయవిద్యాభ్యాం వృత్తేన చ సముచ్ఛ్రితాః !

త్రిశుక్లా నామ విప్రేన్ద్రాః పూజ్యన్తే సవనాదిషుః !!

(స్కన్దపురాణం, మాహేశ్వర-కుమారికాఖణ్డం - 03-287-298)

Wednesday, December 20, 2023

రండోయి రండి మన సంఘానికి

 రండోయి రండి మన సంఘానికి -దండలేద్దము దండిగా జననికిమూడు లోకాలలో ముచ్చటైనా తల్లి - వేడుకొన్నోళ్ళ నొళ్లోకి చేర్చే తల్లి

కూడు గుడ్డా బ్రతుకు తెరువు నిచ్చే తల్లి -  తోడు నీడై శుభములిచ్చినాది ||రండోయి రండి||


వీరాధి వీరులను గన్న మనయమ్మరా - ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా

కవులు గాయకులు నిస్వార్ధ నాయకులకే - నెలవైనదీ భూమి అమ్మ అభయమ్ము చే ||రండోయి రండి||


దేశ దేశాల  దీపాలారిపోయినా - దేవతల రాక్షసుల  యుద్ధాలు దొర్లినా

పెను తుఫానులు పెక్కు పెడిబొబ్బలేసినా - మిణుకు మిణుకంటు మన జాతి వెలిగిందిరా 

||రండోయి రండి||


నాది నేనను సోది మరచి పోలేమా - మాది మేమని మనము కలసి రాలేమా

నీతి నియమాల సంకేతాలె సాక్షిగా - గత అనుభవాలతో  ప్రగతి సాధించమా ||రండోయి రండి||

Tuesday, November 28, 2023

ఆవిడకు స్వతంత్రం ఉన్నట్టా లేనట్టా?

ఒక రాణీ గారు

అంతఃపురంలో ఉంటే ఆంతరంగిక రక్షణా దళం కాపలా

కోటలో విహరిస్తే, వారితో పాటు ప్రత్యేక రక్షణా దళం కాపలా

రాజ్యంలో ఊరేగితే , వీరందరితో పాటు సైన్యం కూడా కాపలా

ఆవిడకు స్వతంత్రం ఉన్నట్టా లేనట్టా?

.

పెళ్ళయిన ఆడవారియితే చంపెయ్యండి,

కన్నె పిల్లలు , చిన్న పిల్లలు అయితే

ఎత్తుకు పోయి 10 పెళ్ళంగా నిఖా చేసుకోండీ

సరదా పోతే తలాక్ తలాక్ తలాక్ అని వదిలించేసుకోండీ

అనే మతాలు పుట్టించిన మనుషులు/ వారి పూర్వీకులూ మధ్య

సామాన్యులు అంత సైన్యం రక్షణ పెట్టగలరా?

పై శ్లోకం అర్థం,

ఆదర్శమైన ఇల్లు

గొప్ప సంస్కారం కలిగిన పిల్లలు

అనందకరమైన సంఘం కావాలి అంటే

అందులో స్త్రీ పాత్ర చాలా ముఖ్యం

కాబట్టి తండ్రి ముసలి వాడయితే

మొగుడు, మొగుడూ ముసలి వాడయితే

కొడుకు ఆమెను కంటికి రెప్పలా కాపాడు కోండి

అంతే కానీ "ఆమే రక్షణ బాధ్యత ఆమే చూసుకుంటుందిలే,మనం పారిపోదాం,

అని వదిలెయ్యకండీ. ఆమే నీ కోసం అడవిని ఎదుర్కొనే శక్తి వదులుకుని, ఇంట్లో నీ పిల్లల్ని సాకుతూ, వారిని ప్రయోజకుల్ని చేస్తూ, మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలాచేస్తొంది." అని !

Sunday, November 19, 2023

వేదాలే రాసిచ్చేసాయి, అవని అంతా ఆమేనట అతనేమో ఆకాశం !

 వేదాలే రాసిచ్చేసాయి,

అవని అంతా ఆమేనట

అతనేమో ఆకాశం !

.

పుట్టినా గిట్టినా అంతా ఆమె ఒడికే

ఆకాశానికేం గిట్టింది?

వర్షం కురిపించడం

ఉరుములు ఉరమడమన్న బాధ్యత తప్ప !

.

నాగరికత పేరు చెప్పి

ఆమే చుట్టూ కాపు గా ఉండమని

కాపాడే కోటగా మారమని

*

కుంటి, గుడ్డీ, చెముడూ, మూగా

వెర్రీ, మొర్రీ సమస్య ఏదైనా కాని

ఉద్యోగం పురుష లక్షణమని చెప్పి

సంపాదన కోసం వీధిలోకి పొమ్మనీ

*

యుద్ధాలకు పంపి, సరిహద్దుల్లో నిలిపీ

పోయిన ప్రాణాలకు

వీరుడనీ ధీరుడనీ పదాల కానుకిచ్చీ

*

ఇంట గెలిచి వీధిన గెలవమని

ఇంటా బయటా గెలుపు కోసం పాకులాడమనీ

ఇంట్లో ఇత్తడి చెంబు గొడవనుండి

ఇలపై పడే ఉల్కల సమస్య దాకా అన్నిటికీ

మగవారినే తప్పు పట్టినా


మనిషి తెలివి, మగాడిని

వీధిలో వెలిగే దీపం చేసినా 

బాధ్యత అంతా భుజస్కందాలపై వేసుకుని

ఏమీ సమస్య లేనట్టు

పడక్కుర్చిలో , కాలు మీద కాలు వేసుకుని

రాజసంగా కూర్చునే కేసరులందరికీ

అంతర్జాతీయ మగాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు !


#InternationalMensDay

Friday, November 10, 2023

అబ్బాయి కుటుంబం పాలు అయితే, అమ్మాయి పంచదార

 మనం అవలంబించే వివాహ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది.

పెళ్ళంటే ఎదో అమ్మాయి అత్తారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకనుగుణంగా సర్దుకుపోవడం కాదు.
కాని పెళ్లి అంటే సర్దుకు పోవడమే !అబ్బాయి కుటుంబం పాలు అయితే, అమ్మాయి పంచదార/హార్లిక్స్/బూస్ట్ లాంటిది.
అబ్బాయి వీళ్ళ మధ్య చెంచా 🙂
వీటన్నిటిని కలిపి ఉంచే గ్లాసే ప్రేమ !!
పంచదార కలిసేలా చెయ్యడం చెంచా బాధ్యత.
ఒక సారి కలిసాకా,
పంచదారా మునుపటిలా ఉండదు,
పాలూ మునుపటిలా ఉండవు,
చెంచాకి పనీ ఉండదు 🙂
.
అబ్బాయి తన కొత్త కుటుంబాన్ని (అమ్మాయి)
తన పాత కుటుంబాన్ని (తల్లి తండ్రులు, తోబుట్టువులు, చుట్టాలు) లో
కలిపే బాధ్యత తెలియ కుండానే నెత్తిన వేసుకుంటాడు.
తనని నమ్మి ఒక అమ్మాయి తన ఇంటికి ఒంటరిగా వచ్చిందీ
ఆమె బాధ్యత తనదే అని అని గుర్తించుకోవాలి,
అప్పటిదాకా అల్లరిచిల్లరిగా తిరిగిన వాడు
పెదరాయుడిలా పెద్ద మొగాడు అయ్యిపోవాలి,
తక్కెడ మధ్యన ఇరుసులా,
న్యాయస్థానం లో న్యాయమూర్తిలా మధ్యలో నిలబడాలి,
ఇరు కుటుంబాల ఆశలు, ఆశయాలు, కోరికలు
కోపాలు, తాపాలు అర్థం చేసుకుని
నొప్పినంపక, తానొవ్వక, తప్పించుకోకుండా నేర్పుగా మెలగాలి
ఈ ప్రయత్నంలో అమ్మాయే కాదు
తన కుటుంబం కూడా మారాలి
తానూ పరిపక్వత చెంది పరిపూర్ణ పురుషుడిగా మార్పు చెందాలి !
అవసరమయితే, తాను ఇరు పక్షాలకీ శతృవుగా నటించి అయినా వారిని ఒక్క తాటిపై నడిపించాలి.
.
తాతలనాడు తన్ని నోర్మూయించారు
తండ్రులనాడు తిట్టి నోర్మూయించారు
లాంటి తొప్పాసి మాటలు బుర్రకెక్కించుకోకుండా
ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే
సమస్యలు తీరతాయని గుర్తించాలి
అప్పుడే అటు అమ్మాయి, ఇటు కుటుంబం
వెరసి అబ్బాయి...
అంతా గెలుస్తారు !
.
తన కోసం తపస్సు చేసిన పార్వతే అయినా
లోకువగా చూడలేదు శివుడు
కాలితో తన్నించుకు మరీ శాంతింపచేసాడు !
భర్త అంటే అలానే ఉండాలి !
.
ఇక అమ్మాయి విషయం చెప్పక్కర్లేదు,
చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉన్న
అమ్మ, నాన్నా, తాబుట్టువులూ బంధువులూ అనే కోటను వదిలి
ఒక్కతే, తెలియని కొత్త ఇంటిలో అడుగుపెట్టాలి,
ఆ ఇంటినే తన కొత్త కోట చేసుకోవాలి,
తనను నమ్మి తనను తన ఇంటికి తీసుకువెళ్ళిన
తన భర్తకు అతని కుటుంబం కూడా ముఖ్యమే అని ఆమె గుర్తించాలి,
అబ్బాయిలాగే అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి,
ఒక్క సారిగా సైకాలజిస్టు అయ్యిపోవాలి
అందరి మనసులూ అర్థం చేసేసుకోవాలి
"ఏమిచ్చారు?" "ఏం తెచ్చారు" "మా కాలంలో ఇలా కాదు"
"చిరిగిపోయిన చీర పెట్టారు" "అవమానించారు" "మీ వాళ్ళు అంతే"
"మాది పరువుగల కుటుంబం" ... ఇవన్నీ విన్నా, విననట్టు వదిలేసే
భూదేవంత సహనం,
సన్యాసులకున్నంత సంమ్యమనం (బదులు చెప్పకుండా ఉండడానికి),
దుర్గా దేవికున్నంత ధైర్యం (తన వారిని వదిలి, కొత్తవారిని భరించడానికి) ఉండాలి,
ఒక చెట్టులా ఆ కొత్త వారూ తనవారే అని అనుకోవాలి
అహం (అహం చెడ్డదనుకునేరు, అహం మితి మీరనంత సేపు చాలా అవసరం) తగ్గించుకుని సర్దుకుపోవాలి...
ఇలా చెప్పుకు పోతే ఇదో పెద్ద చిట్టా !
.
మరి ఇరు కుటుంబాలకీ బాధ్యతలేదా?
ఉంది!
అగ్నికి ఆజ్యం పొయ్యకుండా,
తాము ఆదర్శంగా మెలగి వారికి దారి చూపడం !
అడ్డ కత్తెరలో పోకచెక్కలా తమ పిల్లలు నలిగిపోకూడదు అని గుర్తించాలి !
వారికి సలహాలు సూచనలూ మాత్రమే ఇచ్చి
నిర్ణయాలు తీసుకునే బాధ్యత వారికే ఇచ్చి
వారు ఎదిగేలా చెయ్యాలి !
మా పిల్ల కాలు కందిపోతోంది,
మా అబ్బాయి మారిపోయాడు
అని కధలు పడకుండా,
వారికొక కొత్త సమస్య కాకుండా పెద్దరికం నిలబెట్టుకోవాలి.
వందల వేల సంవత్సరాల నుండీ
తరాల మధ్య అంతరాలు ఉండడం సహజం అని గుర్తించాలి,
పాలూ పంచదారా కలిసినప్పుడు
పాల రుచి మారుతుందనీ
పంచదార రూపు మారుతుందనీ,
అది సహజమనీ, గుర్తించాలి.
ఇక బంధువులు, వేడుక చూసినట్టు చూడకుండా
అవసరమైనప్పుడు సాయం చేస్తూ,
అవసరం లేనప్పుడు తప్పించుకుంటూ ఉండాలి !
ఈ మొత్తం ప్రక్రియలో సమస్యలేమైనా వస్తే అవి పెద్దవవకుండా కాపాడేవి ప్రేమ, స్వతంత్రం,కుటుంబ వ్యవస్త పట్ల గౌరవం.
.
మంచి కుటుంబానికి కొలమానం
అందరూ కలసి ఉండడం ఒక్కటే కాదు !
కలసిమెలసి ఉండడం, ప్రేమభిమానాలు, నమ్మకం, స్వతంత్రం, త్యాగం, ఓర్పు సహనం.. ఇవి కూడా కొలమానాలే !
ఏమంటారు??

Sunday, October 15, 2023

Veg Vs Non-Veg Food??!

 కొన్నేళ్ళ క్రితం ఒక పనికిమాలినోడు నన్ను పెళ్ళికి పిలిచాడు. నేను అప్పట్లో థెర్మాకోల్ పై వధూ వరుల పేర్లు చెక్కి అందమైన బొమ్మలు వేసేవాడిని, వాడు నన్ను బతిమాలి మరీ ఒక పెళ్ళి బోర్డు చేయించుకున్నాడు.

భోజనాల దగ్గర ఒక మిత్రుడు వచ్చి, ఒరై ఇక్కడ కేవలం నాన్ వెజ్ ఉంది చూసుకో, ఇప్పుడే ఫలానా MADAM తింటూ అది NONVEG అని తెలిసి వాంతులు చేసుకున్నారు అని వారించాడు.
సదరు పెళ్ళి కొడుకు వచ్చి భోజనం చెయ్ అన్నాడు. నేను వద్దు అన్నాను. వాడు ముక్కలు తీయించేస్తా, ఉత్తి బిరియాని తిను వెజ్జే కదా అన్నాడు. నాకు కోపం వచ్చినా తమాయించున్నా, సర్లే మనం భోజనం చెయ్యాలి అనే మంచి ఉద్దేశం తో అడుగుతున్నాడు అనుకున్నా, తినేవాళ్ళకి తినని వాళ్ళ గురించి అర్థం కాదులే అని కోపం తమాయించుకున్నా.
.
కొన్నాళ్ళ తరువాత వాడి Hybrid Christian 'కులం' వాడే చెప్పినది ఏంటంటే, పెళ్ళి కొడుకు 'నేను పెళ్ళి భోజనం చెయ్యకపోవడం' అవమానం గా ఫీల్ అయ్యాడు, కులం గురించి అనుకున్నాడు. నాతో వెటకారంగా మాట్లాడేవాడు, లాబ్స్ లో నన్ను ఇబ్బంది పెట్టి తక్కువ మార్కులు వేసాడు కూడా (ఇందుకు పనికిమాలినోడు అన్నా).
.
నాకు అప్పుడు అర్థం అయ్యింది ఏంటి అంటే, మనకి తెలిసిన వాళ్ళే కదా, మనని సాయం అడిగారు కదా, మనని అర్థం చేసుకుంటారులే, మన అభిప్రాయాలకు గౌరవం ఇస్తారు లే అనుకుంటే తప్పు, విజ్ఞత అన్నది మనిషి మనిషికి మారిపోతుంది.
అందుకే మనం మొహమాటం లేకుండ మనకు కావాల్సింది చెప్పెయ్యాలి.
.
ఇన్నేళ్ళలో, నేనెప్పుడూ ఎవ్వరినీ నీ కులం/మతం ఏంటి అని అడగలేదు.
భోజనానికి పిలిస్తే మాత్రం, నాకు నాన్ వెజ్ గిన్నేల్లో వండినవి పెట్టొద్దు అని చెప్పేస్తా.
నా గురించి తెలిసిన వారు కాబట్టి ఎవరూ తప్పుగా తీసుకోలేదు.
నేను సౌది వెళ్ళినప్పుడు నా గిన్నెలు, గరిటెలు, బియ్యం, నూడిల్సూ కూడా పట్టుకెళ్ళా. (అక్కడ లులూ మార్కెట్టు చూసాకా ధైర్యం వచ్చింది అనుకోండి. )
వెజ్ అందరూ నా FLATలో తింటే , నాన్ వెజ్ పక్క FLATలో తినేవారు, తప్పేంటి?
.
చైనా లో కప్పలు బొద్దింకలు మిడతలు చెద పురుగులు తింటారు, వాటికి మీకు కలిపి ఒకే వంట పాత్రలు వాడితే మీకు నప్పుతుందా? కంచంలో బతికున్న పాము తిరుగుతుంటే మీరు తినగలరా? ఒక్కొక్కరికీ ఒక్కొక్క LEVEL OF EXPOSURE ఉంటుంది.
మా అమ్మమ్మ తింటుంటే, ఆవిడని ఏడిపించడానికి, మేము "కోడి" అనే వాళ్ళం, అవిడ తినడం ఆపేసేది.
మరి నేను సౌదీలో, పక్కన వాళ్ళు ఒంటె కాలు తింటుంటే, నా కూర ముక్కలు నేను ఎలాంటి ఇబ్బందీ పడకుండా తినేవాడిని.
.
ఒక సారి ఒక మిత్రుడు, సరే నిన్ను పిలిచి,
నాన్వెజ్ చేసిన గిన్నేల్లోనే చేసి
నాన్వెజ్ కంచంలో పెడితే నీకు తెలీదుగా అన్నాడు.
"నిన్ను మా ఇంటికి పిలిచి, మా కుక్క కంచంలో పెడితే, నీకూ తెలీదు గా? అలానే నాకూ తెలీదు" కాని, "నీ కర్మకు నువ్వే పోతావ్" అని చెప్పా.
.
మేమూ చిన్నప్పుడు అవమానాలు పడ్డాం. ఒకడు, ఆడు పప్పుగాడు రా అంటాడు, ఇంకొకడు బెల్టు బాచ్ అంటాడూ, ఇంకొకడు తైర్ సాదం అంటాడు. ఇవి కాస్టిస్తు మాటలంటే.
అల్లా అన్నీ తినడానికి ఇచ్చాడు నువ్వు మాంసం తినను అంటే నిన్ను నీ తల్లి తండ్రులు సరిగ్గా పెంచలేదు అన్నాడు ఒకడు Saudí McD lo. ఇదీ మత పిచ్చి అంటే.
"నాలో కూడా మాంసం ఉంది నన్ను తింటావా?" అని అడిగా వాడిని, దెబ్బకి రెచ్చిపోయి MUTTAVA ki ఫొన్ చేసాడు, నేను అక్కడ నుంచి పారిపోవల్సి వచ్చింది.
.
డిగ్రీ చదివాడు అనో, ఉద్యోగం వచ్చింది అనో "సంస్కారం" ఉంటుందిలే అనుకోవడం తప్పు. కొంతమందికి ఆ కుల మత పిచ్చి పోదు.
"వెజిటేరియన్" అంటే "కాస్టిస్టు" అనుకుంటే తింగరి తనం.
అలా అనే వారే కుల పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు లేదా గొడవలు పెట్టాలనుకునే కమ్యూనిష్టులు.
వాక్స్వతంత్రం, లింగస్వతంత్రం,వీధిలో ముద్దు స్వతంత్రం..
ఇలా అందరికీ అన్ని రకాల స్వతంత్రాలు కావాలి..
వెజిటేరియన్ కి మాత్రం తిండి స్వతంత్రం తప్పు. కాస్టిస్టు.
.
సుధామూర్తి గారు చాలా గొప్ప మనిషి, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు.
ఆవిడని కాస్టిస్తు అన్నారు అంటే వారంత పనికి మాలిన వాళ్ళూ, పైత్యం ప్రకోపించిన వారింకెవరూ ఉండరు !

India that is Bharat

 భరత వర్షే భరత ఖండే అని కనీసం 3500 ఏళ్ళ నుండి సంకల్పం చెప్తున్నాం, బొకాడియా ముగల్సు బ్రిటిషర్సు ఏమని పిలిస్తే మనకేంటి? ఇన్నాళ్ళు ఇండియా అని పిలిచి ఒక్క సారి భారత్ అన్నందుకు బాధ పడిపోతున్నరంటే, అనుమానించాల్సిన విషయమే !

*
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే...
ఉత్తరం యత్ సముద్రస్య
హిమాద్రేశ్చైవ దక్షిణమ్
వర్షం తత్ భారతం నామ
భారతీయాత్రసంతతిః (విష్ణు పురాణము)
సముద్రానికి ఉత్తరంగాను, హిమాలయ పర్వతాలకు దక్షిణంగాను నెలకోని ఉన్న భూభాగమంతటికి భారతదేశమని పేరు. ఇక్కడి వారంతా భారతీయులు.
*
మనం అందరం భారతీయులమే, ఇంగ్లిషులో ఇండియన్సే !
KCR మాటల్లో చెప్పాలంటే, భారతీయులు అని చెప్పుకోడనికి అలోచించే వాళ్ళంతా, మన దేశంలో సెట్లర్స్ !

Article 1 of the Constitution says, “India, that is Bharat, is a Union of States”.
.
Bharat is not a new name, its not replacing, its just identifying the other name. భారత్ కు ఇంకొక పేరు ఇండియా !
Actually, its not other name, as per article 1, BHARAT can be called as India, so actual name is bharat.
India and Bharat, were made official and legal to be used for juridico-political purposes.I.N.D.I.A మొహబ్బత్ కీ దుకాణ్ లో సనాతన్ పె నఫ్రత్ - 2

 తాత, బాబు చాటుగా, గుస గుస లుగా మాట్లడుకున్న విషయం,

మైకు లో చెప్పేసాడు, ఉదయ నిధి గాడు.
ఎందుకంటే ఇప్పుడు తమిళ నాడులో 'డెమోగ్రఫీ' మారిపోయింది, ఇక వోటు భయం లేదు వారికి. కాష్మీర్లో ఇలానే మొదలు అయ్యింది.
నిశీధి (ఉదయ) నిధి గాడు వాగిన వాగుడికి, ఇంటా బయటా ఏదోలా DAMAGE CONTROL చెయ్యాలి కదా?
అందుకని తెల్లోడి తెలివితేటలు వాడుతున్నారు, చదువుకున్న అర్బన్ టెర్రరిస్టులు.
రాత్రి నిధికి సహాయ పడటానికి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాసేస్తున్నారు, వీడియోలు చేసేస్తున్నారు.
సనాతనాన్ని విడగొట్టడం ధ్యేయంగా.
.
వివిధ విధాలుగా మనని విడగొట్టే ప్రయత్నం చేస్తారు/చేస్తున్నారు..
వేదిక్, ఏంటీ వేదిక్ గా
సనాతనులు, హిందువులు గా
హిందూఇజం, హిందుత్వ గా
ద్రవిడులు, ఆర్యులు గా
శైవులు, వైష్ణవులు గా
తమిళ ఇలం, భారత దేశం గా
...
ప్రముఖంగా
బ్రాహ్మణులు, ఇతర కులాలు గా
అగ్ర కులం, ఇతర కులాలి గా
మనై ఒకరి మీదకు ఒకరిని కత్తి దూసుకునేలా చేస్తే,
నిశీధి నిధి గాడు వాగిన వాగుడు వల్ల కలిగిన నష్టం భర్తీ చేసుకోవచ్చని, మనని ఓడించవచ్చని దురాలోచన.
ఇంకేమి కుయుక్తులు ఉన్నాయో తెలీదు వారి అమ్ముల పొదిలో.
Weak LINKS ని బల పరచునే భాద్యత మాత్రం మనదే.
.
శివుడు తమిళ దేవుడంట.
తమిళ సంస్కృతి వేరు మిగతా అందరూ వేరంట. వేదాల్లొ కులం ఉంది, తమిళ సంస్కృతిలో లేదంట (నిజానికి వేదాల్లో లేదు, తమిళ గొప్పగా చెప్పుకునే పుస్తకాల్లో కొంత ఉంది),
ఇక ద్రవిడ-ఆర్య,
హింది-తమిళా ఇలా అన్ని రకాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
జాగ్రత్త వహించండి.
.
ఇకటి అర్థం చేసుకోండి.
ప్రతీ ఇంట్లో ఏవోక సమస్యలు ఉంటాయి.
పక్క పక్కన ఉన్న ఇళ్ళకు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు.
రాష్ట్రాలకు నీటి సమస్యలు ఉన్నాయి.
అయినా మనం అందరం భారతీయులమే. కదా?
అలాగే, హిందువుల్లో చాలా ఆచారాలు వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి.
మనం అందరం అందమైన దండలో పూసల్లాంటి వాళ్ళం. బంగారపు గొలుసులో లంకెల వంటి వాళ్ళం.
ఒక్కొక్క పూసగా,
ఒక్కొక్క లంకెగా,
ఇతరులు మనని విడదీసే అవకాశం వారికి ఇవ్వొద్దు, కలసి ఉంటే కలదు బలం, కలసి ఉంటే కలదు సుఖం.
.
నేను చెప్పింది నమ్మొద్దు, నెట్లో చదివి , సత్యం తెలుసుకోండి !
ఎన్ పి ఉల్లేఖ్, బి జెయమోహన్ వంటి చదువుకున్న దుష్టుల, నూతన వ్యాసాలు చదవండి, మీకే తెలుస్తుంది వారేమి చేస్తున్నారో.
లింకులు కావాలంటే పెర్సనల్ గా మెసేజు పెట్టండి, ఇస్తా !

I.N.D.I.A మొహబ్బత్ కీ దుకాణ్ లో సనాతన్ పె నఫ్రత్ - 1

 కొన్ని రోజుల క్రితం మామన్నన్ అనే సినిమా చూసా.

హీరోకి నటన రాకపోయినా, చెక్క పేడు ఎక్స్ప్రెషన్ మొహం తోనే సినిమా మొత్తం నటించినా, కధ లో హీరో పందులు పెంచుకుంటూనే రాజకీయాల్లో పోటీ చేస్తాడు, అంత ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి పాత్ర ఉన్నందుకు నాకు కధ నచ్చింది. అయితే కధలో విలను కాస్టు సుప్రిమిస్టు, కుక్కలు పెంచుతాడు, కర్కసుడు. హీరో కీ ఏ కాస్టు, మతం చూపించలేదు, నాకు తెలిసినంత వరకు.
*
అయితే ఈ చెక్క పేడు మొహం గాడు మొన్న సనాతన ధర్మం గురించి పైత్యపు వాగుడు వాగాకా, ఆ సినిమాలో వాడి నిజ ఉద్దేశం, మన మీద పెంచుకున్న అక్కసు, జనాల్లో పెంచుతున్న ద్వేషం కనిపిస్తోంది.
*
అధిక సంఖ్యలో ఉన్న వారు
అధికులమన్న మొహమాటంతో కూడిన
దోషులమన్న ఆత్మ న్యూన్యతా భావం వల్ల కలిగిన
తనకు మాలిన ధర్మపు ఆలోచనలతో,
కులాలూ, ఆస్తులూ అనుకుంటూ,
నేను సెక్యులర్ అంటే నేను సెక్యులర్ అనుకుంటూ
కొట్టుకు చస్తూ ఐకమత్యం లేకుండా బతుకుతుంటే,
ఘజ్వా ఏ హింద్, రైస్ బాగ్ అనుకుంటూ వందల సంవత్సరాల నుంచీ సనాతన ధర్మాన్ని ఏమీ చెయ్యలేకపోయిన సదరు అవకాశవాదులు,
వాళ్ళ బాబులు తాతలూ ముత్తాతలూ ఆపై వాళ్ళు మనని నాశనం చేద్దాం అనుకుని ఏమీ పీకలేకపోయిన దాన్ని
మన సాయంతోనే రాజకీయ నాయకులై
మననే మట్టు పెట్టే పధకంలో ఉన్నారు.
సనాతనం డెంగ్యూ మలేరియా కరోనా అంటే, ప్రముఖ రెండు ఎడరివి మానవాళికి కేన్సర్ ఎయిడ్స్ సార్స్ ఎబోలా బ్లాక్ డెథ్.. లాంటివి అని మనం అనలేమా? ఏదైనా మనం, జాగ్రత్త పడాలి.
*
మనం ఇంకా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇలా సనాతనాన్ని మట్టుపెట్టాలనుకునే పిట్ట బుర్ర, పంది మొహం పనికి మాలినోళ్ళు పుడతూనే ఉంటారు, పంది పిల్లల్లా.
*
నూపూర్ శర్మ ఖురాన్లో ఉన్నది చెప్తే, అమెది తప్పు. హిందువులది తప్పు. కోర్టు కల్పించుకుని చివాట్ళు పెడుతుంది, మొట్టికాయలు వేస్తుంది, పేపర్ స్టెట్మెంట్లు ఇస్తుంది.
మా ప్రకాష్ రాజ్ పంచి చింపేసుకుంటాడు, శూర్పణఖలు ముక్కు చెవులు కోసేసుకుంటారు, ఫ్రీ స్పీచ్ అంటూ గొంతు చింపేసుకుంటారు !
క్రిస్టియన్ స్టాలిన్ గాడు, ముస్లిం ఒవైసి గాడు హిందువులను నిర్మూలించాలి అంటే, కూడా, హిందువులదే తప్పు. కోర్టు మౌనం వహిస్తుంది, దిక్కులు చూస్తుంటుంది.
*
పెరియార్ ఉన్నప్పుడు ఎలాంటి చెప్పుడు మాటలు విని, జనాలు ఎలాంటి దాష్టికాలు చేసారో చరిత్ర చదివి తెలుసుకోండి, బద్దకం వదలండి, పర్యవసానాలు తెలుసుకోండి.
కృష్ణుడి లౌక్యం, పరశు రాముడి ధర్మాగ్రహం, రాముడి ధర్మం మనకు ఆదర్శమై మనం కార్యోన్ముఖులు కాకపోతే, నేను సైతం అని పూనుకోకపోతే..
యూదులు పారి పోయినట్టు మనం కూడా పారిపోవాల్సి వస్తుంది..
నేను చెప్పింది నమ్మొద్దు, చరిత్ర చదివి , సత్యం తెలుసుకోండి !

Palestine Vs Israel తప్పు ఎవరిది?

 ఇజ్రాయెల్ ని తప్పు పట్టే వారెవరైనా ఒక సారి ఆలోచించండి,

ఒకడు ఇంకొకడిని ఉద్దేశపూర్వకంగా (అనాలోచితంగా కాదు, పధకం ప్రకారం) ఒక 50 పోట్లు పొడిచాడు. బాధితుడు గెట్టోడు, చావలేదు సరికదా, ఆత్మ రక్షణ కోసం తిరిగి ఓ పోటు పొడిచాడు, దుండగుడి పరిస్తితి విషమం !
తప్పు ఎవరిది?
హమాస్ 5000 రాకెట్లతో దాడి చేసింది, యూదుల మహిళలు పిల్లలలను కూడా వదలకుండా చంపింది. ఇజ్రయెల్ యుద్ధం ప్రకటిస్తే తప్పా? తొక్కి పెట్టి నార తీసెయ్యలి ఒక్కోడికీ.
.
నేను పెట్టిన ఇజ్రాయెల్ మాప్ చూడండి.
22000 స్క్వేర్ కిలోమీటర్లు.అంటే మన జమ్మూ కాష్మీర్లో సగం ఉంటుంది. న్యు జెర్సీ అంత ఉంటుంది.
కోటి మంది కూడా లేరు జనాభా.
చుట్టూ ఉన్నవన్నీ ప్రముఖ శాంతి కపోత మత దేశాలే !
ఆలోచించండి ,
నిత్యం సరిహద్దుల్లో సమస్యలే అంటే,
కోటి మంది జనాభా వ్యయ ప్రయాసలన్నీ సరిహద్దులు పటిష్టం కోసమే అంటే,
మిలటరీ & ఆయుధాల మీదే చాలా వ్యయం చెయ్యాల్సి వస్తుంటే?.
40,000 వేల పై చిలుకు హమాస్ టెర్రరిస్టులు,
వారికి డబ్బు ఆయుధాలు అందించే ఖతార్, టర్కీ.. ఇంకొన్ని శాంతి దేశాలకు
ఎదురు నిలబడి యుద్ధం చెయ్యాలి.
తమ ప్రజలను కాపాడు కోవాలి.
75 ఏళ్ళ నుండి భరిస్తూనే, తమ సరిహద్దులు పటిష్టం చేసుకుని, ధైర్యం గా నిలబడ్డారు.
ఆళ్ళు మగాళ్ళు రా బుజ్జి !

.
హమాస్ లీడర్లు ఖతార్లో కూర్చుని కధ నడిపిస్తుంటారు.
పిరికి పందులు.
సరిహద్దుల్లో ఉండేదంతా హమాస్ దళాలు లేదా అమాయక జనాలు.
అమాయకుల వెనక దాక్కుని దాడి చేస్తూ,
ఇస్రాయల్ ప్రతిఘటిస్తే, చనిపోయిన అమాయకులను/పిల్లలను అంతర్జాతీయ వార్తల్లో చూపిస్తూ,
శాంతి మతాలు ఆడే వికృత 'విక్టిం కార్డ్' ఆట,
అర్థం చేసుకోకపోతే,
ఆ అమాయకులను ఎవరూ కాపాడలేరు.
జాగ్రత్తగా చూస్తే భారత్ పరిస్థితీ ఇలానే ఉంది, బలమైన నాయకులు లేకపోతే, మన పరిస్థితీ అంతే.
.
చెడ్డ వాళ్ళు ప్రతీ మతంలోనూ, ప్రతీ దేశంలోనూ ఉంటారు అలా అని పరిస్తితి అర్థం చేసుకోకుండా నెపం ఇస్రాయెల్ మీద నెట్టడం తప్పు.
.
ఇక్క రామ జన్మభూమి కావాలి,మధుర కావాలి, కాశి కావాలి..తాతలు కొల్లగొట్టి రాసిచ్చారు,
ఆ పై కాష్మీర్ కావాలి..బాలల తాత & జాతి పిత రాసిచ్చారు,
అక్కడ ఇజ్రాయిల్ కావాలి... ఏకంగా దేవుడే రాసిచ్చాడు !
.
మొత్తం భూమి అ శాంతి మతం అయ్యేదాకా వాళ్ళు ఆగరు.
కోట్ల స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఉన్నా, ఆ ముక్క భూమి కోసం మత ప్రతిపాదికన జరుగుతున్న దాడులను మనం ఖండించాలి,
తిప్పి కొట్టాలి,
అది ఇజ్రాయల్ అయినా కాష్మీర్ అయినా.
నేను చెప్పేది నమ్మొద్దు, గూగుల్ చెయ్యండి, చరిత్ర చదవండి.
ఇజ్రాయెల్కే నా మద్దతు. మరి మీరు?
.
పెద్దల పాపం పిల్లలకు శాపం
.
హమాస్ కనీసం 1-2 సంవత్సరాల ముందు నుండే ఈ దాడికి పన్నాగం పన్నింది.
వాళ్ళకి నిజం గానే గాజా ప్రజలమీద ప్రేమ ఉంటే, వారి గురించే యుద్ధం చేస్తూ ఉండుంటే, అక్కడున్న వారి బ్రదర్ హుడ్ని ఖాళీ చేయించేవారు.
అలా చెయ్ లేదు.
పోనీ ఇప్పుడు మేము ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నాం, మీరు పారిపోండి అని చివరి అవకాశం కూడా ఇవ్వలేదు.
పాలస్తినాలో పెద్దలు తీవ్రవాద హమాస్ కు వోటువేసారు. హమాస్ వారినే కాటు వేసారు.
మధ్యలో అభం శుభం తెలియని పిల్లలు బలి అయ్యిపోయారు.
.
ఇజ్రాయెల్ మాత్రం , మేము దాడి చేస్తాం, నేలమట్టం చేసేస్తాం, అమాయకులు గాజా నుండి పారిపొండి అని ముందస్తు హెచ్చరిక చేసారు.
మరి 200 మంది పిల్లలు సరిహద్దుల్లో ఎందుకు ఉన్నారు?
బంకర్లలో ఎందుకు లేరు?
.
మనం ముందుగా అనుకున్నట్టే, ఈ దుర్మార్గులు 200 మంది పిల్లలు ని ఇజ్రాయెలు చంపిది అని వార్తలు గుప్పిస్తున్నారు.
నాకు నమ్మకం ఏంటి అంటే హమాసే పిల్లల్ని స్త్రీలను చంపేసి ఇజ్రయెల్ మీదకు నెట్టేసి ఉంటుంది. వాళ్ళు అంతకు తెగించే మూర్ఖులే !
.
పాములతో సావాసం చేసే వారు, ఏదో రోజు పాము కాటుకి బలి అవుతారు.
హమాస్ ని నిలువరించక బ్రదర్ హుడ్ అని హమాస్ కి చేరువలో ఉన్నందుకు, అమాయక పిల్లలు బలి అయ్యారు.
అలవాటు ప్రకారం విక్టిం కార్డు ప్లే చేస్తున్నారు !
ఆ పారిన అమాయకుల రక్తం మొత్తం హమాస్ కు దన్ను గా నిలుస్తున్న పుస్తకం మరియు ప్రజలదే.
.
నిజం గా అల్లాహ్ ని నమ్మే వారు ,
శాంతి సందేశం నమ్మే వారు,
ఇజ్రాయెలు కన్నా ముందే,
వాళ్ళె వెళ్ళి ఆ హమాస్ ముష్కరులకు బుద్ధి చెప్తారు !