POST : భక్తి చెక్కు చెదరకుండా ఉండాలంటే కంటెంట్ మన కర్థం కాని భాష లో ఉంటే మంచిది. అది అరబిక్ కానీ హీబ్రూ కానీ సంస్కృతం కానీ ఏదయినా పరవా లేదు.
ఋషి పత్నులు నీలాపనింద పొందడం బాగా చిన్నప్పుడు నాకు అర్థమే కాలేదు. పెద్ద వారిని అడిగితే ఎందుకు తిట్లు తిన్నాను కూడా అర్థం కాలేదు అప్పట్లో.
జాంబవతి కి శ్రీ కృష్ణుడు వయసు రీత్యా uncle వయసో తాత వయసు నో కావాలి కదా, ఈ రోజుల్లో అయితే చట్ట విరుద్ధం కూడాను.
సెన్సార్ వాళ్ళు A సర్టిఫికేట్ ఇస్తారేమో. లేక అసలు రిజెక్ట్ చేసి సర్టిఫికేట్ నిరాకరిస్తారో.
వ్రత కథ నీ ఫ్యామిలీ చూడ దగ్గ ఫీచర్ ఫిల్మ్ చెయ్యాలంటే అంత వీజీ కాదని నా అనుమానం.
My Response:
ఇన్ని వందల సంవత్సరాలు పర మత పాలన వల్ల అన్ని మనం వాడి పంధాలోనే చూడటం అలవరుచుకోడం వల్ల ఇలాంటి భ్రాంతులు కలుగుతూ ఉంటాయి.
*
వేదాలు ఉన్నాయి.
అంత ఖాళీ లేదు అనుకున్నవారి కోసం పురాణేతిహాసాలు ఉన్నాయి.
చదివే ఖాళీ లేదు లేదా చదువు మా వృత్తి కాదు అనే వారికోసం అవి కధలుగా వాడుక భాషలో, లిపి ఉంటే రాత లోను లేదంటే జానపదాలు గాను చలామణిలో ఉన్నాయి.
ఈ మొత్తాన్ని వర్ణిస్తూ మన నృత్య గీత వాద్య.. మొదలైన కళలు , అద్భుతమైన గుడులు వాటిమీద మళ్ళీ ఈ వర్ణనలు, ఇక ములనున్న ముసలోళ్ళు మనవలకు చెప్పే జాబిల్లి కధలుగా మన సంస్కృతి నిర్మించబడింది. ఇవన్నీ కనిపించకపోతేనే ఇలా హిబ్రూ అరబ్బీ సంస్కృతం మంత్రాలు ఒకటే అని అద్భుత ఆలోచనలు వస్తాయి.
*
గుళ్ళో మంత్రాలు చదివితే మీకున్న భక్తి వల్ల కలిగిన నమ్మకం వల్ల ప్రసాంతత రావాలి, భక్తి పారవశ్యం రావాలి. అంతే కాని భక్తి రాదు. భక్తి మీరు పెరిగిన వాతవరణం నుంచి వస్తుంది, మీ జీవితంలో పరిస్తితుల ప్రభవం వల్ల వస్తుంది.
*
పక్క మతాల మంత్రాలను మన సంస్కృత మంత్రాలని ఒక్క తాటి ని కట్టి మాట్లడటం మనం అమాయకత్వం. ENGINEER OPEN HEART OPERATION చేసినట్టు తెంపరితనం.
వినాయక చవితి పండగనాడు ఇలాణ్టి అవాకులు చవాకులు పేలే పనికి మాలిన గోనినేని లంటి గ్రూపుల్లోంచి బయటకు వచ్చెయ్యండి. ఇది మీ కాపీ పేస్టు పోస్టు మాత్రమే సొంత పైత్యం కాదు అని నేను అనుకుంటున్నాను.
*
మీరు తిట్లు తిన్నది ఎందుకో ఇప్పటికైనా అర్థమయ్యింది అనుకుంటాను? అంతకధ మొత్తం లో నేర్చుకోవాల్సింది వదిలేసి పత్నుల మీద ఆశక్తి ఎక్కువయ్యింది అని తిట్టి ఉంటారు. రుషి పత్నుల విషయం లో కోపగించి మీరు వేడి పై వండుకుని తినడం మానరుగా? ఆ పచనానికి, మీ అరుగుదలకి మీరు ౠణపడి ఉన్నాను అని గుర్తించగలిగితే అగ్నికి ఒక దణ్ణం పెడతారు.
ఒక ట్రైబల్ రాజుతో 28 రోజులు పోరాడిన శ్రీ కృష్ణుడు తాత వయస్సు అని మీరే పక్కనున్నట్టు నిర్ణయించేసారు. వృఅత కధ యధాతధంగా రేసెర్చు చేసి ఉన్నదున్నట్టు తియ్యండి, మనం చూస్తున్న 80% సినిమాలకన్నా అద్భుతంగా ఉంటుంది.
ఐతే ఒకటి, మీ దృష్టి వక్రించి తప్పుడు ఆలోచనలు చేస్తే చిన్నప్పటిలానే చివాట్లు తప్పవు.