ఉన్నవాళ్ళు కట్టేరు గుళ్ళు
మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి. Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
Monday, December 30, 2024
ఉన్నవాళ్ళు కట్టేరు గుళ్ళు
Monday, December 16, 2024
అల్లు అర్జున్ కి ఇచ్చిన జీతం 300కోట్లు
ఇంటర్నెట్ ప్రకారం
అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్టు?
అరస్టు చెయ్యాలంటే
Monday, December 9, 2024
పిల్లలు - సినిమాలు - రోల్ మోడల్స్
నేను నా చిన్నప్పుడు 4 - 10 వ తరగతి దాకా హాస్టల్లో ఉండి చదువుకున్నా.
మాది మిలటరీ డిస్సిప్లిన్ స్కూల్.
ఫ్రెండ్సే లోకం , క్లాసుమెట్లు, సీనియర్లు , జూనియర్లు , సూపర్ సీనియర్లు ...
ఒక సారి ఎదో కోపం వచ్చి మా సూపర్ సూపర్ సీనియర్స్ ఇంటర్ పిల్లలు ,
వాళ్ళ టీచర్ని దుప్పటి ముసుగు వేసి కొట్టారుట, మా స్కూల్ అంతా విషయం పాకి పోయింది,
వాళ్ళని ఎండలో నుంచోపెట్టి రెండురోజులు చితక్కొట్టారు మా స్కూలు యాజమాన్యం.
చదువుకునే బెచ్చు, అల్లరి బాచ్చు, చిల్లరిగాళ్ల బేచ్చు ఇలా రకరకాల సర్కిళ్లలో
ఆ వార్త రాకరకాలుగా అర్థమయ్యింది.
అల్లరి బాచ్చుకి టీచర్ని కొట్టడం గొప్పగా కనిపించింది.
మేము 10 వ తరగతికి కి వచ్చాక , మా క్లాసువాళ్ళు ,
మా తెలుగు సార్ ని దుప్పటి ముసుగు వేసి కొట్టేసారు, సరదాగా .. అమ్మాయిల చెప్పుకోడానికి గొప్ప కోసం.
మేము గోడలు దూకి సినిమాలకు వెళ్ళేవాళ్ళం గొప్ప కోసం.
ఆ రోజుల్లో సిగరెట్లు కొట్టడం , మందు తాగడం మా హాస్టలులో ఒక హీరోయిజం.
గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంక వాడు వరల్డు ఫెమస్.
పైవన్నీ మిత్రులనుండే అబ్బే 'అవ' లక్షణాలు,
తల్లితండ్రులు పట్టించుకోకపోవడం వల్ల స్థిరపడిపోయే దుర్లక్షణాలు.
చెడు బాగా తొందరగా నచ్చుతుంది, హీరోయిజం లా కనిపిస్తుంది
అందులోను రావణాసురుడిని గొప్పోడనుకుంటున్న ఈ రోజుల్లో
చెడ్డ మిత్రులు, పుష్పా , మట్కా లాంటి సినిమాలు, కొన్ని రకాల పుస్తకాలూ...
బాగా ప్రభావం చూపుతాయి ... నాకు బాగా అనుభవమే.
.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే,
9 వ తరగతి చేదువుతున్న 3 పిల్లలు గురువుని కొట్టారు , ఒకడు కడియం తీసి మరీ కొట్టాడు, ఆయన పోయారు. కేసు నడుస్తోంది.
విపరీత మైన డ్రగ్స్ వాడకం.
హెచ్ ఐ వి రోగుల్లో 35% శాతం 15 - 24 ఏళ్ల వాళ్లే.
గన్స్ , కార్స్ , రేస్, కాల్ గాళ్స్, ఓయో రూమ్స్, ప్రయివేట్ పార్టీస్ .. ఇది నేటి పరిస్థితి.
ఇలాంటి రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలు అన్నీ తెలుసుకుంటారు.
స్వేచ్ఛ పేరుతొ వదిలెయ్యకుండా,
కాస్త మంచి చెడు విచక్షణా జ్ఞానం నేర్పించగలిగితే,
వయో పరిమితిని దాటి సినిమాలు చూపించకుండా ఉంటే,
సెల్లులు , నెట్టు పట్టింపు లేకుండా ఇచ్చెయ్యకుండా ఉంటె,
ప్రతి విషయం గురించి పిల్లలతో స్పష్టంగా మాట్లాడగలిగితే,
అప్పుడు ఇలాంటి పోకడల నుండి వారిని వారే కాపాడుకోగలిగేలా చెయ్యగలం.
మిరే కాదు ,మీ పిల్లల మిత్రులు ఎలాంటి వారో తెలుసుకుంటూ ఉండాలి,
ప్రతి రోజు జరిగే విషయాలు , వాళ్ళ అనుమానాలు తీరుస్తూ ఉండాలి.
రాసి పెట్టుంటే విజేతలు అవుతారు కానీ,
తల్లి తండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు తప్పకుండా గొప్ప మనుషులు అవుతారు !
Monday, December 2, 2024
పిల్లలు - టెక్నాలజీ - AI - వోకిజం
పిల్లలు - టెక్నాలజీ - ఏ అయ్ - వోకిజం
.
* 14 ఏళ్ల పిల్లాడు AI chat App తో ప్రేమలో పడి, దాని వల్ల ఆత్మ హత్య చేసుకున్నాడు.
* నీ వల్ల లోకానికి ఉపయోగం లేదు చచ్చిపో, అని చెప్పిన గూగుల్ జెమిని.
* 10 ఏళ్ల పిల్లాడు గన్ తో 5 గురు తోటి విద్యార్థులను కాల్చి చంపాడు.
* 2 ఏళ్లలో ౩౦ కోట్లు , 32 సర్జరీలు చేయించుకుని -> మొదట బ్రిటిష్ అబ్బాయి నుండి కొరియన్ అబ్బాయిగా , తరువాత కొరియన్ అమ్మాయిగా , తరువాత మళ్ళీ కొత్త అబ్బాయిలా మారిన 30 ఏళ్ల కుర్రాడు.
* అమెరికా లో 72 జెండర్స్. వోకిజం వల్ల ఆడ - మగ మధ్యలో 70 రకాలుగా గందరగోళానికి గురవుతున్న చిన్న పిల్లలు / యువత. వోకిజం ఆధారంగా సినిమాలు .
.
పై మూడు విషయాల్లో అంతర్లీనంగా ఉన్న అసలైన సమస్య ఏమిటో తెలుసా ?
AI కాదు, గన్స్ కాదు, వోకిజం కాదు ... చిన్న/పెద్ద మానసిక రుగ్మతలు, కొన్ని సార్లు ఐడెంటిటీ క్రైసిస్.
చిన్న పిల్లల్లకు మానసిక సమస్యలా? అని అనుమానం వద్దు. వస్తున్నాయి అందరికీ.
పూనకాలు, దెయ్యాలు, గాలి, ధూళి ఇలా రకరకాల మానసిక సమస్యలు బోలెడు మనకు.
ఒకప్పుడు భారత దేశంలో అన్నీ పెద్ద కుటుంబాలే ఉండేవి కాబట్టి చుట్టూ చాలామంది.
తల్లి తండ్రులకు చెప్పుకోలేక పొతే/లేదా వాళ్ళు పని వల్ల దొరకక పోతుంటే,
ముత్తమ్మమ్మ తాత మామ్మ అమ్మమ్మ
పెద్ద నాన్న చిన్నాన్న పెద్దమ్మ చిన్నమ్మ
అత్త మావ అక్క బావ చెల్లి
ఇలా ఇంట్లో చెప్పుకోడానికి చాలా మంది చెప్పుకోడానికి ఉండేవారు !
సగం సమస్యలు చెప్పుకుంటేనే పోతాయి,
మిగతా సమస్యలు డాక్టర్లను సంప్రదించాలి !
.
డాక్టర్ల దెగ్గరకు వెళ్ళక్కరలేనంత చిన్న సమస్యలు, చెప్పుకోడానికి ఎవరూ లేక పెద్ద సమస్యలు అవుతాయి.
ఉద్యోగానికి రోజుకి 8 గంటలు ఎలా కేటాయిస్తారో, అలానే
తల్లి తండ్రి అనే జీవితకాల ఉద్యోగంలో,
పిల్లలతో మాట్లాడటం అనే పనికి కనీసం 1-2 గంటలు కేటాయించాలి.
రిటైరైన తాతలు మామ్మలు సెల్లులు చూసుకుంటూ/లేదా ఆశ్రమంలో ఉంటుంటే,
లేదా వారికే మానసిక సమస్యలు ఉంటె ?
పిల్లలు సెల్లు టీవీ కి అతుక్కుపోతుంటే, వారి పరిస్థితి ఏంటి ?
.
మానసిక సమస్య ఉంది కాబట్టి 14 పిల్లాడు AI తో చెప్పుకున్నాడు
ప్రియురాలిని ఊహించుకున్నాడు, డిప్రషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు ! ప్రేమలా అనిపించిన డిప్రషన్.
వీడియో గేమ్స్ లో చేసింది , సినిమాల్లో చూసింది బాగా నచ్చింది,
బయట చెయ్యాలనుకున్నాడు, చేసేసాడు ! క్రూరత్వంలా బయటపడిన మెంటల్ సమస్య .
వయసు తో పాటు శరీరంలో మార్పులు వస్తాయి,
చెప్పేందుకు పెద్దలు లేరు, ఇంటర్నెట్టే శరణ్యం,
72 రకాల అనుమానాలు పిల్లలకు.
ఆ అవకాశం వాడుకుని,
సంఘ సంస్కర్తలు అయ్యిపోదాం అనుకునే అవకాశవాదులు
తమకు అర్థంకాకపోయినా, వోక్ ఉద్యమాలు తలకెత్తుకుని
పిల్లల్ని బలి పశువులు చెయ్యడం ! ఐడెంటిటీ క్రైసిస్ + చెత్త ఉద్యమాలు.
.
ఏతా వాతా చెప్పేదేంటంటే,
వెబ్ సిరీస్ల బదులు పిల్లల తో సమయం గడపాలి.
ఒంటి కాయ శొంఠి కొమ్ముల్లా ఉండకుండా కాస్త జనాలతో పిల్లల్ని కలవనిస్తే ,
మీడియా & నెట్ అదుపులో ఉంచితే మానవాళికి మంచిది !