ఎవరు నేను ?!!
.
నా శరీరం నక్షత్ర ధూళి,
నా జీవితం ఎన్నో సంభావ్యతల హేళి,
నా ఆలోచన నూతిలో కప్పల కేళి !
.
నాకు ముందు నేను లేను,
నా తరువాత నేను లేను,
నాకు స్పృహ ఉంటే నాకు నేను ఉంటాను,
లేదంటే కేవలం నా చుట్టూ వారికి ఉంటాను !
.
నా ఆలోచనలు ..
నాకు ముందు వచ్చిన వారివి,
వాటి నుంచి నా చుట్టూ ఉన్నవారు నేర్చినవి ,
వారి వల్ల నేను అనుకున్నవి !
.
ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ,
నేను లేనప్పుడు కూడా ఉండేది/ఉంటుంది,
మహా అయితే ఇంకోలా !
.
కాబట్టి నేను అంటే నా ఉనికి మాత్రమే..
నేనంటే నేను మాత్రమే !
.
మీరేమంటారు?