Wednesday, January 31, 2024

Ayodhya Ramalaya Prana Pratishta - Drawing competition

Ayodhya Ramalaya Prana Pratishta - Drawing competition

First prize to JNAPIKA A in Seniors &
First prize to Kartika Volety in Juniors.
.
మొన్న అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అద్దం పేపర్ వారి సారధ్యంలో నిర్వహించిన చిత్ర రామాయణం లో పాల్గొన్న పిల్లలందరికీ అభినందనలు.
.
మీ పిల్లలు వేసిన చిత్రానికి మీరు టేగ్ చేసుకోవలసింది గా , డిజిటల్ సెర్టిఫికెట్లు ఈ పోస్టు నుండి దిగుమతి చేసుకోవలసిందిగా కోరుచున్నాను.
.
6 వ తరగతి కన్నా చిన్న పిల్లల్లో కార్తీక ఓలేటి కి ప్రధమ బహుమతి.
6-10 పిల్లల్లో జ్ఞాపిక A కి ప్రధమ బహుమతి
ఆద్భుతమైన చిత్రం వేసిన జ్ఞాపిక కు & చిలిపి బొమ్మ వేసిన చిన్నారి ఆరోహికి ప్రత్యేక ప్రశంసలు !
.
పాల్గొన్న వారందరికీ,
1. Digital participation certificate
2. Sheros & Srirama karnamrutam books for winners
3. Cash prize for winners


ARTS:Friday, January 19, 2024

మాటలు కరువై నప్పుడు కవనం కోట్టుకొచ్చేస్తుంది !

 

ఆది పురుష్ అన్నతో తీసుంటే,

ఒక్కో సీను ఒక్కో వజ్రంలా ఉండేది,

ఆస్కారొచ్చే ఆస్కారమూ ఉండేది !రాముడు ఎప్పుడు వస్తే అప్పుడే శుభ ముహూర్తం !

 ఒక ఒడుగు ముహూర్తం నిర్ణయించాలి అంటే వటువు, తల్లి, తండ్రి జాతకాలు, వటువు వయస్సు, ఆయనం, తారాబలం, చంద్రబలం, లగ్నం , ప్రత్యక్ తార లాంటి ఎన్నో పరిగణలోకి తీసుకుని చాలా ముహూర్తాలు సరిచూసుకుంటే కాని పెట్టలేరు. పెళ్ళి ముహూర్తమయినా అంతే.

.
తీరా ముహూర్తం పెట్టాకా,
వేదానికి వేదానికి
శాఖకీ శాఖకీ
కుటుంబానికీ కుటుంబానికి
ఆచార వ్యవహారాల్లో ఎన్నో తేడాలు ఉంటాయి !
అవన్నీ సరి చూసుని / సరి చేసుకుని నిర్వహించుకోవాలి కాబట్టే మన పెళ్ళి / ఒడుగు తంతులు అంత పెద్ద విశిష్ఠ కార్యక్రమాలు అయ్యాయి.
.
మరి అలాంటిది,
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో,
కాష్మీరు నుండీ కన్యాకుమారి దాకా ఎన్ని కోట్ల మంది రామ భక్తులు ఉంటారు?
వారందరూ ఎన్ని ప్రాంతాలలో,
ఎన్ని రకాల సాంప్రదాయాలలో ఉంటారు ?
ఎంత మంది ఏ ఉద్దేశంతో ఏం మట్లాడుతూ ఉంటారు?
అందులో పండితులూ పీఠాధిపతులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా
జరపాల్సిన వాళ్ళు కాబట్టి వారిని పక్కన పెడితే,
* రెండు పంచాంగాల్లో ఎందుకు తేడా ఉంది చెప్పలేని వాళ్ళు
* పోనీ తెలుగు పంచాంగం ఆంగ్ల కేలండర్తో ఎలా కలుస్తుందో కూడా తెలియని వాళ్ళు
* అది కూడా వద్దు అసల ఈ రొజు తిథి వారం నక్షత్రం ఏంటో కూడా తెలియని
కొంతమంది సోషల్ మీడీయా వారియర్లు
అటు ముహూర్తం మంచిదే అని పీఠాదిపతులను తిడుతూనో,
మంచిది కాదు అని బీజేపి మోడీ ని తిడుతూనో పోస్టులు పెడుతుంటే
సివిల్ ఇంజినీరు సర్జరీ ఎలా చెయ్యాలో చెప్పినట్టు
హాస్యాస్పదం గా ఉంది.
ఆ ముహూర్తం పండితులూ పీఠాధిపతుల పని,
వారు మాట్లాడుకునో పోట్లాడుకునో ఒక నిర్ణయానికి వస్తారు,
రాముని రాకకు వేచి చూడడమే మన పని !
.

అయినా రాముడు ఎప్పుడు వస్తే అప్పుడే శుభ ముహూర్తం,
ఆయన్ని ఎప్పుడు అందరూ మనసుల్లో నిలుపుతారొ అప్పుడే లోక కల్యాణం !
@followers

కే ఎస్ చిత్ర అసలేమన్నారని ఇంత గొడవ?

 ఆవిడ ఏమన్నారురా పాపం !

22 January రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలో
"శ్రీ రామ జయ రామ జయ జయ రామ" అనమన్నారు.
ఐదు వత్తుల దీపం వెలిగించమన్నారు.
ఆపై "లోక సమస్తా సుఖినో భవంతు అన్నారు" ,
ఇందులో తప్పేముంది?
.
అవిడ తప్పు,
హిందూ స్త్రీ అవ్వడం, దేవుడిని నమ్మడం.
ఎందుకంటే హిందూ అంటే చులకన
ఎవరేమన్నా, ఎవరూ తిరిగి ఏమీ అనరు, ఎదురు తిరగరు
.
అసలు ఆవిడను చూసి ఎలా మాటలు అనగలిగారో
ఆ పనికిమాలిన &్%్%$&్%్&* !!
.
ఒకడేమో అవిడ నైజం బయట పడింది ఆవిడ నైటింగేల్ కాదు అంటాడు
ఇంకొకడు మత పిచ్చి అంటాడు
ఇంకొక New channelల్లో "తారు డబ్బాంబరాలది" అవిడని క్షమించలేరా? అంటుంది. క్షమించాల్సిన తప్పేం చేసింది ఆవిడ?
అంతా సైకో సంతతి !
ఇందుకు కాదా జనాలు హిందూ రాష్ట్రం అంటున్నారు?!!
.
మనం చాలా మంది అదృష్టవంతులం !
మనం సెలబ్రిటీలు కాదు,
మనం ఎవరికీ తెలియము,
లేదంటే,
రామా అంటే రాజకీయం అయ్యిపోతుంది
కృష్ణా అనడానికే కష్టం అయ్యిపోతుంది
ఆంజనేయునికి దణ్ణం అంటే అల్లాని అడగాలి
ఏ పండగ చేసుకోవాలన్నా ప్రభువుకి మొక్కాలి
ఎర్ర జండాలోళ్ళు ఎగిరినా పడాలి
గోగినేనిగాళ్ళ గోలకీ తలొగ్గాలి,ఏమీ సేతురా లింగా ఏమీ సేతు !?!

Sunday, January 14, 2024

రామునికి ఇప్పుడు మనం ఎంత ఘనంగా స్వాగతం చెప్పాలి?

 14 ఏళ్ళ వనవాసం చేసిన రాముని రాకను దీపావళి గా చేసుకున్నారు అయోధ్యవాసులు.

రత్నాలు, తెల్లటి వస్త్రాలు, పేలాలు, చతురంగ బలాలు, నూరు కుంభాలు, బంగారు కొమ్ములున్న ఎద్దులు సిద్ధం చేసి, ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చేసి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడిగి, ధూపం వేసి, ప్రతి ఇంటి మీద హనుమ / రామ పతాకాలు ఎగురవేసి, నాటక, గాన ఇత్యాదులతో పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అని రామాయణం చెప్తోంది.
.
మరి 500 వందల ఏళ్ళు ఒక చిన్న పూరిపాకలో వన వాసం చేసి
22 జనవరిన గుడిలో ప్రతిష్టింపబడుతున్న రామునికి
ఇప్పుడు మనం ఎంత ఘనంగా స్వాగతం చెప్పాలి?
.
శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందన, సేవ, సఖ్య... భక్తి మార్గాల్లో,
.
వేద వేదాంగ ఇతిహాస ఆగమ, కావ్య, అలంకార, నాటక, గాన, కవిత్వ, అవధాన, అశ్వ, గజ, పాకకర్మ, దోహళ, గంధవాద, పాశుపాల, చిత్ర, లోహా, పాషాణ, మృత్, దారు, అంబర, ఇంద్రజాల మహేంద్రజాల ఇత్యాది కళలతో..
.
ఆవాహన, ఆసన, పాద్య, ఆర్ఘ్య, ఆచమనీయ, స్నాన, వస్త్ర, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూల, నమస్కార ,ప్రదక్షిణ షోడశోపచారాలతో..
.
ఆ రోజు ఈ భూమిపై ఉన్న అందరికీ గుర్తుండి పోయేలా
లోకం మొత్తం భారతదేశం నుండి ప్రవహించే భక్తి పారవశ్యంలో
మునిగి తేలేలా.. జరుపుకోవాలి కదా?.
మీరేమి చెద్దామనుకుంటున్నారో ఆలోచించుకున్నారా?

Saturday, January 13, 2024

రామావతారం ఉద్దేశం

 రామావతారం ఉద్దేశం ధర్మాన్ని అర్థంచేసుకుని పాటించమని,

రాముడి పనులు మక్కీ టు మక్కీ దింపెయ్యమని కాదు.
సనాతనం, కృష్ణుడిలా కార్యోన్ముఖులు కమ్మని చెప్తుంది,
8 పెళ్ళిళ్ళు చెసుకొమ్మని కాదు.
హిందూ వివాహ చట్టమే అందుకు ఉదాహరణ.
కృష్ణుడు ఫ్లూటు వాయించాడని, అందరూ ఫ్లూట్లు వాయించుకుంటూ తిరుగుతున్నామా?
.


రాముడు ఎన్వీ తిన్నాడు కబట్టి మీరూ తినమనే వక్రభాష్యానికి వంత పాడకండి తెలగపిండి గారు. Telakapalli Ravi
రాముడు బంగారు లేడి ముసుగులో వచ్చిన మారీచుడీని బాణంతో లేపేసినట్టు,
హిందూ పేరు ముసుగులో సనాతనానికి హాని కలిగించే మీలాంటి వాళ్ళను,
బాణాలేసి లెపెయ్యమని మీరు ప్రోత్సహిస్తారా? లేదు కదా?
అభ్యంతరం ఉంటే కోర్టుకు పొమ్మంటారు కదా?
అలా చెయ్యమని చెప్పేవి మతాలు, సనాతన ధర్మం వెరే.
పుడకల సమయానికైనా, కనీసం ఒక పిడికెడు సనాతనం మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను.
.
ఇక సినిమా సినిమాలా చూడాలి అని చెప్పే మీ మేధస్సు
DA Vinci code
Passion of Christ
విశ్వరూపం (2013 - జరుగుతున్నవి చూపించినా, 8 కట్లు చేస్తే రిలీసు అయ్యింది)
ఈ సినిమాలప్పుడు ఎక్కడ బజ్జుంది?
Jesus Christ Superstar
Last Temptation Of Christ
Lion Of The Desert
ఇవి కూడా సినిమాలేగా, ఇండియా లో బాన్ ఎత్తేద్దామా??
.
గురజాడ వారు అన్ని మతాలు పోవాలి అన్నారు, గాంధి గారు అల్లహ్ అక్బర్ తేరే నాం అన్నరు అని కబుర్లు చెప్తున్నారు, అవి వినడానికే బాగుంటాయి.
ఒకపక్క 57 పైబడి ముస్లిం దేశాలు
రమారమి 50% దాకా ప్రపంచ క్రిస్తియన్ జనాభా
పెట్టుకుని, మాకు మతం లేదు అనడం తింగరి తనం.
పోతే అందరి మతం పోవాలి. ధర్మమే మిగలాలి.
అప్పటి దాకా ఎవరి లాగు వారు జారిపోకుండా పట్టుకుని కూర్చోవల్సిందే.

Saturday, January 6, 2024

బాబ్రీ మసీదు తొలగించి అక్కడ ఏమి కడుతున్నారో చూసారా?

 "బాబ్రీ మసీదు తొలగించి అక్కడ ఏమి కడుతున్నారో చూసారా? మీ మనసుకు బాధ అనిపించట్లేదా? 500 ఏళ్లుగా మనం కూర్చుని ఖురాన్ పఠించిన స్థలం ఈ రోజు మన చేతుల్లో లేదన్న బాధ మీకు లేదా ?"-owaisi

.
శ్రీరామ జన్మస్థలంలో శ్రీరాముడి మహా మందిరం నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో, ముస్లిం సమాజాన్ని హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే కాకుండా ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నాడు మన ఒవైసి. మసీదు నుండీ రూపాయి ఆదాయం లేకపోయినా, ప్రజా ధనం వెచ్చించి వేరొక చోట మసీదు కడుతున్నా అక్కసు వెళ్ళబోస్తున్నాడు.
.
500 వందల ఏళ్ళ మసీదుకే మీకు అంత బాధ వస్తే, వేల ఏల్ల చరిత్ర గలిగిన మా గుళ్ళ కోసం వాటి పై ఉన్న మీ మసీదుల వల్ల మా రక్తం ఎంత మరిగిపోవాలి?
.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః
- గరుడ పురాణం
.
సనాతన ధర్మానుచరులకు మోక్ష దాయకమైన సప్త పురాలు - అయోధ్యా, మథుర, హరిద్వార్, కాంచిపురం, ఉజ్జయిని, ద్వారకా. వీటిని కట్టు దిట్టం చేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణ (భౌతికంగా, ధర్మ పరంగా, వ్యాపార పరంగా.. అన్ని విధాలుగా) జరగకుండా కాపాడుకోవడం మన బాధ్యత.
అయినా కూడా మోహన్ భగత్ , అద్వాని లాంటి వాళ్ళు ఇంక వేరే మసీదుల వైపు చూడొద్దు, కోర్టు పని చెయ్యనివ్వండీ అని హిందూ సమాజానికి పిలుపునిచ్చాకా, ఒవైసి ఎందుకు ముస్లింలను రెచ్చ గొట్టడం? ఇరు వర్గాలు రెచ్చి పోతే మళ్ళీ పాత పరిస్తితులే వస్తాయి, అవసరమా?
.


.
అసలు పాత బస్తీ కి ఒవైసీ వల్ల ఒరిగిందేమిటి? నిరక్షరాస్యత, నిరుపేద జీవితం తప్ప?
కూతుర్లని దుబాయ్ షెకులకు అమ్ముకునే దుర్గతికి కారణం ఒవైసీలే కదా?
వాళ్ళలో తీవర వాదులు అంతగా పెరిగిపోడానికి కారణం ఒవైసీ లాంటి స్వార్ధ పరులు, మౌడ్యులు కాదా?