నేను: (బస్సులు లేకపోవడం వల్ల ఆటోకి 300 ఇవ్వాల్సి వస్తున్న బాధతో) సమైక్య ఉద్యమ సెగ ప్రజా నాయకులకు తగలాలి కానీ ప్రజలకు తగలకూడదు, ఈ బస్సుల బంద్ స్కూళ్ళ బంద్ అన్ని సామాన్య జనాలకు కష్టం కానీ డబ్బున్నోడు కార్లో పోతాడు వాడి కొడుకు అంతర్జాతియ స్కూల్లో చదువుతాడు. ఇక నాయకులైతే ఈ పాటికే ముని మనవలకు సరిపడినంత సంపాదించే ఉంటారు లేక పోతే ఒక స్కాం చేస్తారు. ఈ ఉద్యమ విధానం తప్పు కాదా?
ఆటో: 2,3 నెలలు జీతాలు లేక పోతే అప్పుచేసుకుని తింటారు సార్, విడిపోతే మన ముందు 2,3 తరాలు పడిన కష్టం బూడిద పాలవుతుంది సార్, వచ్చే 2,3 తరాలు కష్టాల పాలవుతాయి సార్. మీరు చెప్పినట్లు డబ్బున్నోళ్ళు, నాయకులు గోడమీద పిల్లుల్లా వాళ్ళ అస్తిత్వం కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళకున్న డబ్బుకి హైదరాబాద్లో ఉండిపోగలరు. నష్టపోయేది సామాన్యుడు సార్.
నేను: రాజమండ్రిలో ఆటోకి హైదరాబాద్ విడిపోవడం వల్ల వచ్చే తక్షణ నష్టం ఏంటి?
ఆటో: మా అన్నయ్య హైదరాబాద్లో 30 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఇల్లు గట్ర కొనుక్కున్నాడు, ఇవాళ ఉద్యోగం లేదు, ఇల్లులేదు పొమ్మంటే ఎలా సార్. ఎవడబ్బ సొమ్మని అప్పనంగా దోచిపెడతాం సార్?
నేను: అక్కడేమో అంధ్రా వాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అని బాధపడుతున్నారు?
ఆటో: మా చిన్నతాతగారు హైదరాబాద్లో ఉండేవారు, ఆయన చెప్పేవరు హైదరాబాద్ కథలు,రాళ్ళూ రప్పలూవి పేర్చిన నిజాం, అక్కడ జనాల్ని దోచుకుంది మనం కాదు సార్, వాళ్ళ దొరలు వాళ్ళ నిజాం. తిండి లేక జనాలు ఏడుస్తుంటే నిజాం రోల్స్ రోయస్ కార్లు కొనుక్కున్నాడంట, చదువుకుంటే వీళ్ళకు అడ్డు పడతారని కనీసం చదువుకోనివ్వలేదు, మనకు ఇలాంటి గొడవలేదు కబట్టి మనవాళ్ళు బాగా చదువుకున్నారు. ఇవాళ తెలంగాణాలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు లేవు అంటున్నారు.
నేను: కాని మరి హైదరాబాద్ తెలంగాణా ప్రాంతంలోదేగా? తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని తెలంగాణా వాళ్ళు అనుకుంటున్నారు.
ఆటో: అప్పుడు తెలంగాణా ఆంధ్రా వేరు వేరుగా చూడలేదు కాబట్టే ఇవాళ హైదరాబాద్ అంత గొప్పగా ఉంది. అన్నం పెట్టిన చేతినే కరుస్తున్నారని ఆంధ్రాలో అనుకుంటున్నారు సార్. రాళ్ళు తప్ప ఏమీ లేవు రమ్మంటే జాలిపడి అక్కడ అన్ని పెట్టారు. ఇప్పుడు డబ్బు, ఉద్యోగాలు కనిపించేసరికి వాళ్ళకి ఆశ పుట్టుకు వస్తోంది.
నేను: పేపర్ల కన్నా మీకే ఎక్కువ తెలిసినట్లుందే?
ఆటో: రిక్షాతో మొదలు పెట్టి ఇవాళ ఆటో నడుపుతున్నా సార్, ఊహ తెలిసినప్పటి నుంచి స్టేషన్ నుంచి జనాల్ని తేసుకెల్తూనే ఉన్నా, ఇలాంటివి జనల దెగ్గర తెలుసుకుంటూనే ఉన్నా. అబద్ధాలు చెప్పడానికి నేనేమి ఎదోక పార్టీతో సంబంధం ఉనండే పేపర్ కాదు సార్.
నేను: హుం...
నేను: హైదరాబాద్ వళ్ళకి ఇచ్చేస్తే మనకి ఒక లక్ష కోట్లు డబ్బులు ఇస్తారుగా అభివ్రుద్ధి చేసుకోడానికి?
ఆటో: ఆధార్ కార్డుని బట్టి అందరి అకౌంట్లో వేస్తారా డబ్బులు?? ఊరుకోండి సార్, నాయకులు తినడనికే సరిపోవు ఎన్ని డబ్బులు ఇచ్చినా. అయినా లక్ష కోట్లు ఎక్కడివి ఇస్తారు సార్? మన డబ్బులేగా? ఉత్తినే వచ్చేవి ఎమైనా కొంపముంచేవే సార్.
నేను: సమైక్య ఉద్యమం పేకేజి కోసమే కదా, ఉద్యమ కారుల వెనుక నాయకులు ఉన్నారుగా?
ఆటో: గొడవ పెట్టుకోడఆనికి వచ్చారఆ??
నేను: లేదండీ, ఏడొ పుట్టిన రొజు పార్టి అంతే వచ్చా, హి హి
ఆటో: నాయకులు ఎవ్వరూ లేరు, మేము రానివ్వట్లా. పాకేజి వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. తెలంగాణ కావాలంటే విడిపోనివ్వండి, ఊడిపోయే ముక్కుని పట్టుకు ఎన్నాళ్ళు వేళ్ళాడతాం? హైదరాబాద్ మాత్రం ఉమ్మడి కావాలి.
నేను: అసలు తలుచుకుంటే మొన్న సమైక్య సభనే ఆపేద్దుం అంటున్నారు, ఇంకా రాష్ట్రం రాకుండానే రాళ్ళతో కొట్టారు, రేపు ఇచ్చాకా అసలు రానిస్తారా?
ఆటో: మీరు మాట్లాడేది పాకిస్తాన్లో హైదరాబాద్ గురించి కాదు కదా?
నేను: హి హి. పాకేజి కి ఆశపడి మన వాళ్ళు కూడా తెలంగాణాకి సరే అంటే?
ఆటో: కుట్రతో ఒక రాష్ట్రం ఏర్పడితే, అన్యాయమైపోయి ఇంకోటి ఏర్పడుతుంది. ఇక్కడి జనాలకు అలాంటి పరిస్తితులు వస్తాయ్ అప్పుడు. ఇన్నాళ్ళు తెలంగాణాలో నిరక్షరాస్యత, ఆకలి, గుత్తేదార్ల దాష్టికాలవల్ల సాయుధపోరాటాలు చూసారు, ఇక ఇక్కడ చూస్తారు ! ఇంతకు ముందు వేరు రష్ట్రాలు అడిగిన వాళ్ళెవ్వరూ రాజధాని కావాలని అడగలేదు, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడగలరని నమ్మకం. ఇక్కడ రాజధాని వల్లే విడివాదం పిడివాదం. నిజంగా తెలంగాణ అభిమానం ఉన్నవాడు తెలుగు, తెలంగాణా వేరనుకునేవాడూ.. హైదరాబాద్ ఇవ్వకున్నా విడి తెలంగాణా కావాలంటాడు.అందుకే ఇది కేవలం స్వార్థంతో కూడిన కుతంత్రం, ప్రజలపై రుద్దబడిన ఆలోచన. వాడెవడో తెలంగాణా వస్తే అక్కడి గుత్తేదార్ల భూములన్నీ పేదవాళ్ళకి పంచుతాడుట, ఆ పని ఇది వరకే చేస్తె ఇప్పుడు ఇలాంటి పరిస్తితి వచ్చేదే కాదు. ఇది కేవలం జనాల్ని మోసం చేసే రాజకియం. అప్పుడు కలిపి తప్పు చేసారు, ఇప్పుడు విడగొట్టి అన్యాయం చేస్తున్నారు .
నేను: ఏదైనా జనాల్ని ఇబ్బంది పెట్టే ఉద్యమంలో అన్యాయం కనిపిస్తోంది నాకు.
ఆటో: అవునా? వాయించలేక డప్పు ఒంకర అన్నాడంట ఎనకటికి ఒకడు. క్లాసులో ఎప్పుడూ బాగా చదివేవాడిని బయటకు పంపించేస్తే మనకే అన్ని రేంకులు వస్తాయి అనుకోవడం న్యాయమా? విడి రాష్ట్రం కోరే బదులు, హక్కుల కోసం, అభివ్రుద్ది కోసం, అక్షరాస్యత కోసం పోరాడడం న్యాయం ? మనల్ని పొమ్మనడం అన్యాయం. మా తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పుడూ మేము "ఏం షేషినావ్ ర " అని ఏడిపిస్తాం, వాడు మమ్మల్ని 'ఏటండి " అని ఏడిపిస్తాడు, అంత మాత్రాన కొట్టుకు చావట్లేదుగా మేము? ...
నేను: హుం నిజమే.
" సరైన వాదనలు రెండువైపులా ఉంటాయి, జనాలు గొర్రెల్లా ఎవడొ ఒకడిని నమ్ముకున్నంతకాలం ఇలాగే ఉంటాయి పరిస్తితులు. ఇవాళ ఓటు కొనుక్కున్న వాడు రేపు నిన్ను రేపు అమ్మేస్తాడు. హుం అయినా ప్రతీ రోజు రేపు ఎలా గడుస్తుందో అని భయపడే సామాన్యుడు ఏం చెయ్యగలడు పొట్టకోసం కష్టపడతం తప్ప, ఇలానే ఆటో నడుపుకోడం తప్ప ఎన్ని తెలిసి ఏమి లాభం?" అని చెప్పుదాం అనుకున్నా, మాట పెగలలేదు, అతనిని ఆపడం ఇష్టం లేక...