Sunday, October 28, 2018

పిల్లి-బుట్ట కధ

పిల్లి-బుట్ట కధ:
ఒక ఊరిలో ఓ పెద్దాయన ఉండేవాడు, ఆయన కాశి వెళ్తూ కొడూకులిద్దరికీ నాయన లారా నేను తిరిగి ఎప్పుడూ వస్తానో తెలిదు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు.
తరువాత రోజు పెద్ద కొడుకు పూజకు కూర్చుంటుంటే అతని భార్య వచ్చి చెప్పింది , మావయ్య గారు రోజు పూజకు ముందు వాళ్ళ పెంపుడు పిల్లిని బుట్టలో పెట్టే వారు మీరు అలా చెయ్యడమే ఆచారం అని చెప్పింది.

పెద్ద కొడుకు పిల్లిని బుట్టలో పెట్టి పూజ చేసాడు.

రెండో కొడుకు భార్య ఇది చూసి నొచ్చుకుంది. మావగారి లాగ పుజ చెయ్యాలి అంటే మనకు ఒక పిల్లి కావాలి అని భర్త తో చెప్పింది. చిన్న కోడుకు పూజ కోసం కొత్త పెంపుడు పిల్లి , కొత్త బుట్ట కొనుక్కున్నాడు. అతను కూడా రోజూ పూజకు ముందు పిల్లిని బుట్టలో పెట్టే ఆచారం పాటిస్తూ తండ్రి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.

తండ్రి ఒక 5 ఏళ్ళ తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. పూజకు ముందు పిల్లుల్ని బుట్టలో ఎందుకు పెడుతున్నారు అని కొడుకుల్ని అడిగాడు?
నాన్నగారు మీరు చేసినట్టు తుచా తప్పకుండా చెస్తున్నాం అని కొడుకులు సమాధానం చెప్పారు.
"నాయనలారా ఆ పిల్లికి నేను బాగా అలవాటు రోజు పూజ సమయంలో కూడా ఒళ్ళో కూర్చుని నన్ను ఇబ్బంది పెట్టేది, అందుకని బుట్టలో పెట్టే వాడిని, అది మన ఆచారం ఏమీ కాదు అని చెప్పాడు !!


కధలో తండ్రి తిరిగి వచ్చి ఉండకపోతే ఆ కుటుంబానికి, కులానికి(కుటుంబం వ్రుద్ధి లోకి వస్తే, వారిని చూసి అందరూ మొదలు పెడతారు కదా!) పిల్లి-బుట్ట ఆచారం అయ్యిపోయేది.

మన ఆచారాలు ఇంతే, అప్పటి పరిస్తితులకు అనుగుణంగా, వారి సౌలభ్యం కోసం తయారు చెసుకున్న ప్రత్నామ్నయాలు. ఆలోచించకుండా మూర్ఖంగా పాటించడం వల్ల అవి ఆచారాలయి కూర్చున్నాయి. మనం ఆలోచించాలి ఇంక.


Wednesday, October 17, 2018

బౌద్ధులను హిందువులు చంపేసారా ??!! (Hindus killed Buddhists??)

బౌద్ధుల మీద దాడులకు బౌద్ధ గ్రంథాలు glorify చేసిన దాంట్లో శాస్త్రీయత ఎంత ఉంది అనే దాని మీద నాకున్న పరిమితి నేను అర్థం చేసుకున్న పరిధిలో నా విశ్లేషణ ఇస్తున్నాను. 
ఇది నిజం లేదా ఇదే విధంగా జరిగి ఉంటుంది అని కాదు. 
ఇది కేవలం నా విశ్లేషణ గా చదవండి.

మొదటగా 84000 స్థూపాలు కట్టడం అనేది శ్రీలంక బుద్దిస్ట్ లిటరేచర్ glorify చేసింది. 
అప్పట్లో అది అశోకుడు కాలంలో మనకున్న వసతులతో సాధ్యం అయ్యే పని కాదు. 
అశోకుడి స్థూపాలు ఒక 1000 ఉండి ఉంటాయి అనుకుందాం. 
రెండవది స్థూపాలలో monk ఉండరు. విహారాలు ఆరామాలు లో ఉంటారు. 
కాబట్టి ఈ సంఖ్య ఏ రకంగా చూసిన మేధస్సు కి అందని విషయం. 
దీనిని ఎందుకు glorify చేసుంటారో చూద్దాం.


అశోకుడు మొదటి గొప్ప చక్రవర్తి బుద్ధిజం తీసుకొని వ్యాప్తి చేసిన వాళ్ళలో. కాబట్టి ఆయన పేరు మీద ఈ glorification ప్రారంభం చేశారు. 
కాని నిజంగా అంత శాంతి పాటించాడు అంటే కాదు అంటున్నారు చరిత్ర కారులు. 
క్రిమినల్ ట్రైబ్స్ నీ నిర్ధాక్షిణ్యంగా ఉరిశిక్షలు వేయించారు ఎటువంటి సానుభూతి లేకుండా ఆయన.
ఇక టెక్నికల్ గా historians ఏమి చెప్పారో చూద్దాం. 
Etienne Lamotte అనే చరిత్రకారుడు బౌద్ధం గురించి చాలా విషయాలు చెప్పాడు. 
ఆయన linguistics తెలిసిన వ్యక్తి కూడా. పాళీ, సంస్కృతం లాంటి భాషలు కూడా వచ్చు. 
ఆయన చెప్పిన విషయాల ప్రకారం sunga dynasty నిజానికి బుద్దులని పట్టించుకోలేదు. 
ఇంకో మాట అంటారు సాంచి లో బుద్దిస్ట్ స్థూపం కట్టడానికి సాయం చేశారు అని . 
ఒక్క పుష్యమిత్ర మాత్రం ఏదన్నా చేసున్న కొన్ని నాశనం చేసి ఉండొచ్చు అని అనడం జరిగింది.

అంతే కాకుండా అదే సమయంలో శాతవాహనులు బ్రాహ్మణ మరియు బౌద్ధం ని సమానంగా చూసారు మరియు రెండు మతాలు కలిసి జీవనం సాగించాయి. 
కారణం అప్పటికే బౌద్ధం rituals మరియు బ్రాహ్మణ వాదానికి దగ్గరగా జరిగింది. 
గుప్తుల కాలం వచ్చే సరికి త్రిమూర్తులు వచ్చారు. దశావతారాలు వచ్చాయి మరియు ఆ దశావతారం లో బుద్ధుడు చేరాడు. 
అప్పటికే బుద్ధిజం తగ్గుముఖం పట్టింది ఒక్క eastren states లో తప్ప. 
హర్షుడు గుప్తుల తర్వాత నిలబెట్టడానికి చూసాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 
ఇక్కడ ఎక్కడ బౌద్ధాన్ని తొక్కాల్సిన పని లేదు. ఇక 7 వ శతాబ్దం కూన పాండ్య వంశానిది దక్షిణాన. శైవం వ్యాప్తి ప్ర్రారంభం అయ్యింది. తర్వాత రాజా రాజా చోళుడు రావడంతో వైష్ణవం ప్రారంభం అయ్యింది. ఇక వాళ్ళ రచ్చలో వాళ్ళు ఉన్నారు.

ఇక 1902-1928 వరకు ఉన్న పురావస్తు నిపుణుడు అయినా john marshall అయితే ఖచ్చితంగా ఒక్క విషయం చెప్పారు. Sunga dynasty నాశనం చేశారు అనడానికి circumstantial evidence లేదు అనేసారు. ఇక పుష్యమిత్రుడు విషయానికి వస్తే రాజ్యకాంక్ష విపరీతంగా ఉండటంతో మౌర్యుల చక్రవర్తుల అవశేషాలు ఉండకూడదు అని అన్ని నాశనం చేసాడు వాటిల్లో ముఖ్యం అయినది అశోకుడి శాసనాలు. అవి తర్వాత బ్రిటిష్ తవ్వకాల్లో బయటపడ్డాయి.

ఇక నలంద విశ్వవిద్యాలయం నాశనం అయ్యింది తురుష్కుల దాడుల్లో. దీనికి ఈ రాజులకి సంబంధం లేదు.

ఇక శంకర విజయాలు కి వస్తే , ఆయన బుద్ధిజం ని నాశనం చేసాడు అనే మాట కన్నా ఆయన హిందూ మతాన్ని stabilize చేసాడు అనొచ్చు. ఒక రకంగా హిందూ మతంలో పుట్టిన mass leader.  కొత్త వ్రతాలు, పూజలు ఇలా. కొన్ని స్తోత్రాలు పరిచయం చేసి ప్రజల్లో దేవుడు అయ్యాడు. 
బౌద్ధాన్ని నాశనం చెయ్యడం కన్నా భౌతిక వాద ఆలోచనలను నాశనం చేసాడు. 

అసలు హింసే లేదు అంటే కూడా ఒప్పుకోను. చేశారు కానీ ఈ బౌద్ధ గ్రంధాలు glorify చేసినంత సీన్ అయితే లేదు ఖచ్చితంగా. రాజ్యకాంక్షలో, బౌద్ధం మీద అసూయతో కొన్ని నాశనం చేసి దశాబ్దాల కాలంలో అడ్డొచ్చిన కొన్ని వేలమందిని చంపి ఉండొచ్చు. ఇది హింసే తప్పే. 
కానీ విషయం చెప్పడానికి దాన్ని మనం ఎక్కువ చెయ్యాల్సిన పని లేదు. 
కేవలం విషయం చెబితే చాలు అని నా అభిప్రాయం

చివరిగా ambedkar గారు ఊరికినే ఉంటారా అని అనుకుంటున్నారా ఇలాంటి రచ్చ చేస్తే? 
చీల్చి చెండాడి ఉండేవారు, ఆయన హేతువు ఉన్నంతవరకు ఉన్న బుద్ధ ఫిలాసఫీ తీసుకున్నారు. హింస గురించి చెప్పారు కానీ ఇంత రచ్చ గురించి ఆయన కూడా చెప్పలేదు.
..(to be continued)

Wednesday, October 3, 2018

సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన - Decriminalize Section 497

సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన, భార్య భర్త యొక్క ఆస్తి కాదు అని కోర్టు దానిని కొట్టి పారేసింది.

ఈ చర్య హిందూ వివాహ వ్యవస్తకు వ్యతిరేకం అని చాలా మంది గొగ్గోలు చెస్తున్నారు.
ఈ ఆలోచన తప్పు. హిందూ వివాహ వ్యవస్త, నమ్మకం మీద , ప్రమాణం మీద నిలబడుతుంది కాని కోర్టులకి భయపడి కాదు. ఒక వేళ కోర్టుకి భయపడి కలిసిఉన్నారు అంటే ఆ పెళ్ళికి విలువ లేదు, ఎప్పటికైనా గౌరవం లేని ఆ వివాహం విఛ్ఛిన్నమవుతుంది.



ఇక్కడ కోర్టు వ్యాఖ్య లో మాత్రం తప్పుంది !
భార్య భర్త యొక్క ఆస్తి కాదనడమేమిటి? ఆమే తప్పకుండా భర్త ఆస్తే !
ఆమే కాదు, పిల్లలు, తల్లి తండ్రులు, బంధువులు అందరూ అతని ఆస్తే !
తేరా పాస్ క్యా హై అంటే అమితాబ్ " మేరా పాస్ మా హై అన్నట్టు" అతనికి అందరూ ఆస్తి అందరూ అతని ఆస్తి. వివాహం లో ఉన్నంతవరకు ఇద్దరూ ఒకరింకరు అర్థం చేసుకుని గౌరవ మర్యాదలతో నమ్మకంగా సమంగా బతకాలి.

భార్య భర్త కన్నా తక్కువ కాదు,
** 'అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం '
## కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో' అంటాడు మామగారు.

వధువు తండ్రి వరునితో,
**'నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం,ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
##ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు
 'నాతిచరామి' (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.
ఇక్కడ వధువు చేత చెప్పించరు, ఎందుకో తెలుసా? నమ్మకం ఆమె మీద.

మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షుల ఉద్దేశం. ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.

స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం.