మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి.
Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా.... ఇంకా కుల వ్యవస్త పోలేదు ఇంకా కులాంతర వివాహాలు జరగట్లేదు, పెద్ద చిన్న అన్న భావాలు తొలిగిపోవట్లేదు, అంటే... 75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా.. అది పని చెయ్యట్లేదు !! ఎందుకు పని చేస్తుంది? ఒక సమస్యకి సమాధానం ఇంకొక సమస్య ఎలా అవుతుంది?
నీ ఇంటి పిల్లని నా ఇంటికి ఇవ్వట్లేదని, నీ ఇంటిని నేను లాగేసుకుటే న్యాయమా? నువ్వు మారాలి, కులాన్ని వదిలి పెట్టాలి అని నేను నా కులాన్ని అడ్డుపెట్టుకుని నీ ఆస్తి లాగేసుకుంటే ఒప్పుకుంటావా? అది వారి హక్కు లా భావిస్తారు. తండ్రికి 50,000 జీతం పెట్టుకుని, కొడుకు రిజర్వేషన్ వాడుకున్నాడు అంటేనే తప్పు. దానికి మళ్ళి నీ చెల్లిని ఇస్తావా ని అతి తెలివి సమాధానం. రిజర్వేషన్ నువ్వు పైకి రావాడానికి, ఎదుటి వాడు మారాలంటే, వాడిని మార్చాలి, నేర్పించాలి అంతే కాని ఆస్తి దొబ్బెయ్యకూడదు. రిసర్వేషన్ ఇప్పటి కాలానికి సరిపడ సమాధానం కాదు. ప్రభుత్వం పని చెయ్యలేక... కప్పి పుచ్చుకోడానికి చేస్తున్న పనికి మాలిని పని ఇది. ప్రభుత్వ పాటశాల లన్నీ అద్భుతంగా పని చేస్తే మంచి విద్య వైద్యం ఉచితం చేస్తే ప్రతిభకే పట్టం కడితే అప్పుడూ కదా దేశం బాగుపడేది ? లేదంటె ఈ విడీయోలో చూపించి నట్టు అనర్హులు (ప్రతిభని బట్టి) అందలం ఎక్కుతారు అర్హులు (ప్రతిభని బట్టి) అట్టడుగున ఉండి పోతారు. దేశానికే నష్టం. నిజంగా ఈ సమస్య రూపుమాపాలంటే కుల మత భేదం లేకుండా అందరూ బాగా చదువు కోవాలి మీ తాతలు నేతులు తాగారు, మా తాతలు నూతులు కడిగారు అని పాత కధలు వదిలేసి ఇప్పటి మనం ఇకపై మన ముందు తరాలు ఎలాంటి భేదాలు లేకుండా ఎలా ఉండాలొ , వసుదైక కుటుంబంగా ఎలా మెలగాలో ఆలోచించాలి ! అంతే కాని అభివ్రుద్ధి చెయ్యకుండా, టివీ లు, డబ్బులు పంచి పులిహోర, సార పెట్టే వాడీని మనం కులం మతం పేరుతో ఎన్నుకుంటే ఇలానే ఉంటింది పరిస్తితి ఎప్పటికీ. నిజమే ఇది 'రిజర్వేషన్ మీద ఏడ్చే' వాడికి చెప్పుతో కొట్టే సమాధానం
‘‘మీరు సంస్కృతపండితులు కనుక సంస్కృతం కావాలి అని అంటున్నారు. అంతేకానీ ఈ రోజుల్లో సంస్కృతం ఎందుకు కావాలండీ?‘‘ అని ఒక రాజకీయపార్టీ అభిమాని ఆంధ్రవ్యాసుల వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు 30 ఏళ్ళ క్రితం ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చిన సమాధానం నేటికీ సజీవంగా నిలిచి ఉంది.
‘‘మీరు ఏం చేస్తుంటారు?‘‘ అని ఆయన్ను అడిగితే ఆయన న్యాయవాద వృత్తి చేస్తున్నాను అన్నారు.
‘‘మీకు భారత రాజ్యాంగం కంఠస్థం అయిందా? టైటిల్ పేజీ నుంచీ ఎండ్ పేజీ వరకూ మొత్తం పొల్లు పోకుండా అప్పచెప్పండి.‘‘ అని అడిగారు.
ఆయనకు ఆంధ్రవ్యాసుల వారి ప్రశ్న అర్థం కాలేదు.
ఆంధ్రవ్యాసుల వారే తిరిగి ఇలా అన్నారు.
‘‘ మీరే కాదు డాక్టర్లను కూడా ఇదే ప్రశ్నిస్తున్నాను. రోగాలు, రోగ లక్షణాలు, మందులు ఉన్న మెటీరియా ఆఫ్ మెడికాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలరా? అంత వరకూ ఎందుకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని ఎవరైనా మొదటి నుంచీ చివరి వరకూ అప్పచెపగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ భారతీయ శాస్త్రాలన్నీ భారతీయ పండితులకు కంఠతా వచ్చు. ఇదే భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్నతేడా. భారత దేశంలో డిక్షనరీలు కూడా కంఠతా వచ్చు. అమరకోశం అటువంటిదే. ప్రపంచంలో ఏ భాషకూ లేని ప్రాభవం భారత దేశంలో సంస్కృతానికి ఉంది.
అంత వరకూ ఎందుకు గణిత శాస్ర్తం ఖగోళశాస్ర్తం కలబోసిన ఆర్యభటీయం, సూర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాలన్నీ పండితులకు నోటికి వచ్చు. నేడు గణితంలో పిహెచ్ డి చేసిన వారికి కూడా తమ గణిత సూత్రాలు నోటికి రావు. ఇదే నేటి దౌర్భాగ్యం. విద్యకు అతి ముఖ్యమైంది ధారణ. తమ శాస్త్ర గంథాలు అక్షరం పొల్లు పోకుండా ధారణ లేని వారికి శాస్త్రాలు ఎలా ఒంటపడతాయి? ఈ కారణం చేతనే నేడు వైద్యవృత్తి నుంచీ పాఠశాల ఉపాధ్యాయుడి వరకూ అందరికీ పుస్తకం చూడనిదే ఏ వృత్తి బాధ్యతా నిర్వర్తించలేక పోతున్నారు. పూర్వం వైద్యం, గణితం, నిర్మాణరంగం, కెమిస్ట్రీ, వృక్షశాస్త్రం అన్నీ కూడా కంఠతా వచ్చేవి. నేడు అది లోపించింది. ఇదే విద్యా బోధనలో కూడా ప్రధానమైన అడ్డంకి. ధారణ లేని, ధారణ చేయలేని చదువులు తయారయ్యాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు వచ్చి ఆత్మహత్యలకు హత్యలకు దారితీస్తున్నాయి. చదువు వల్ల మానసిక సమస్యలు రావడం అనేది సంస్కృత శాస్త్రాల వల్ల లేదు. ఎప్పుడైతే మనదైన విద్యావ్యవస్థను నాశనం చేసుకొన్నామో మన పతనం అప్పుడే మొదలైంది.
విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఆధునిక ప్రపంచం విలువ ఇస్తోంది. కానీ భారతీయులు పెరిగే విజ్ఞానాన్ని గుర్తుంచుకోవడానికి ఛందస్సులు ఉపయోగించి శ్లోకాల రూపంలో సమస్త గ్రంథాలు రచించేవారు. దీని వల్ల విజ్ఞానం బుర్రలో ఉండేది. నేడు పుస్తకాల్లో ఉంటోంది. ఏ పుస్తకంలో ఏముందో గుర్తుపెట్టుకొన్నవాడు మేధావి నేడు. గతంలో పుస్తకాలే బుర్రలో పెట్టుకొన్నవాడు మేధావి. ఇదే సంస్కృతభాష లోని మహిమ. నేటి ఆధునిక కాలంలో ప్రధాన లోపం ధారణలేని, ధారణ చేయలేని దౌర్భాగ్యస్థితి.‘‘
దశాబ్దాల క్రితం ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన అంశాన్ని నిరూపించే అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకువస్తున్నాము. దీనికి ఉదాహరణగా భాస్కరాచార్య రచించిన లీలావతి గణితంలోని ఒక సూత్రం దాని ఆధారంగా కొన్ని లెక్కలు పరిశీలిద్దాం.
ఇష్ట కర్మసూత్రం (సప్పోసిషన్) ఇలా చెప్పాడు.
భావం: నీకు ఇష్టం వచ్చిన సంఖ్య అనుకో, దాన్ని ఇచ్చిన సమస్య ప్రకారం సాధించు. దాన్ని గుణించి భాగాహరించి, వివిధ భిన్నాలతో పెంచి లేదా తగ్గించగా వచ్చిన సారాంశాన్ని, దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది. దీన్నే ఇష్టకర్మ సూత్రం అంటారు.
భావం:ఒక సంఖ్యను 5 చేత హెచ్చవేయగా వచ్చిన దానిలో నుంచీ మూడో వంతు తీసి వేయగా వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించి, దానికి మూడో వంతు, సగం వంతు, పావువంతులు కలిపితే రెండు తక్కువగా 70 వచ్చింది. ఇప్పుడు చెప్పు ఆ సంఖ్య ఎంత.
ఈ లెక్క మీరు చేయగలిగితే నేడు ఉన్న అనేక ప్రభుత్వ, రైల్వే, బ్యాంకు ఉద్యాగాల పోటీ పరీక్షల్లో విజేతలు కావడం చాలా తేలిక. ఇది వేద గణితం ద్వారా ఎలా సాధించాలో తెలుసుకుందాం.
ఇక్కడ ఇచ్చిన ఇష్టకర్మ సూత్రం ప్రకారం ఇక్కడ ఇచ్చిన లెక్క సాధించాలంటే ఏదో ఒక సంఖ్య అనుకోండి.
నేను 3 అనుకుంటున్నాను.
1)ఇప్పుడు ఈ 3ను 5 చేత హెచ్చవేస్తున్నాను. = 15
2) దీనిలో నుంచీ మూడో వంతు తీసి వేయమన్నాడు కనుక 15లో మూడో వంతు 5 కనుక తీసివేస్తే = 10 వచ్చింది
3)వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించమన్నాడు. అంటే 10/10 =1 వచ్చింది.
4) దీనికి మూడో వంతు, సగం, పావు వంతులు కూడినది కలపాలి. అంటే (1+ 3 (1/3+1/2+1/4) )చేయాలి. = 17/4 వస్తుంది.
5) ఇప్పుడు సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
68ని 3చేత హెచ్చవేసి 17/4తో భాగాహరించాలి.
(68క్ష్3)/(17/4) = 68క్ష్3 క్ష్4/17 = 48
ఇక్కడ ఇచ్చిన గణిత సమస్యకు సమాధానం 48.
కావాలంటే 3 స్థానంలో 48ని ప్రవేశపెట్టి పైన చెప్పిన సోపానాలు అన్నీంటి ద్వారా 68 వస్తుంది.
ఇది గణిత వేదం అంటే.
ఇక్కడ అతి ముఖ్యమైంది ఏమిటంటే కేవలం గణిత సూత్రమే కాదు. ఉదాహృత గణితసమస్య కూడా శ్లోకం రూపంలో ఉంది. పూర్వం జ్యోతిష పండితులు భగవద్గీత మాదిరిగా ఈ గణిత సూత్రం, ఈ గణిత సమస్య కూడా కంఠతా పట్టి ధారణ చేసేవారు. కనుక జీవితంలో తాము చదువుకున్న చదువు మరిచిపోవడం అంటూ జరిగేది కాదు.
లీలావది అనే బీజ గణితంలో మనోరంజన భాష్య కారులు ఇచ్చిన మంచి రొమాంటిక్ సమస్య ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని పై విధానంలో కనుగొనేందుకు ప్రయత్నించండి.
మంచి వయసులో ఉన్న జంట శృంగారంలో ఉండగా ఆమె మెడలోలని ముత్యాల దండ తెగిపోయి భూమి మీద మూడో వంతు ముత్యాలు పడ్డాయి. పక్కమీద ఐదో భాగం పడ్డాయి. ఆరో వంతు ఆమె జుట్టులో చిక్కుకున్నాయి. పడిపోతున్న ముత్యాలలో పదో వంతు జతగాడు పట్టుకొన్నాడు. దండలో ఆరు ముత్యాలు ఇంకా మిగిలాయి. ఇప్పుడు చెప్పండి ఆమె మెడలోని ముత్యాల దండలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి?
ఇక్కడ కూడా ఆరు ముత్యాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముత్యాలు ఎన్నో కనుక్కో మన్నాడు కనుక ఇష్టకర్మ సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు. కనుక దాన్ని ఉపయోగించి కనుక్కుందాం.
1) ముందుగా ఎంతో కొంత అనుకోవాలి కనుక నేను 60 ముత్యాలున్నాయి అనుకుంటున్నాను.
2) వీటిలో మూడో వంతు భూమి మీద పడ్డాయి అంటే నేను అనుకొన్న 60 ముత్యాలలో మూడో వంతు అంటే 20 ముత్యాలు భూమి మీద పడ్డాయి.
3) పక్కమీద ఐదో వంతు పడ్డాయి. 60 లో 5 వంతు అంటే 12 పక్కమీద పడ్డాయి.
4) ఆరోవంతు జుట్టులో చిక్కుకున్నాయి అంటే 60లో 6 వంతు 10 జుట్టులో చిక్కుకొన్నాయి.
5)జతగాడు పదోవంతు పట్టుకొన్నాడు. అంటే 60లో 10 వంతు 6 ముత్యాలు పట్టుకొన్నాడు.
ఇప్పుడు మొత్తం ఎన్ని ముత్యాలు కనుగొన్నాము 20+12+10+6 = 48
సారాంశంగా మిగిలినవి = మనం అనుకొన్న 60 -48 =12
6) ఇప్పుడు ఇష్టకర్మసూత్రం ప్రయోగిద్దాం. సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
దత్త సంఖ్య =6 ముత్యాలు. మనం అనుకొన్నది 60 ముత్యాలు. సారాంశం =12
సూత్రం ప్రకారం దత్తసంఖ్య క్ష్ ఇష్ట సంఖ్య / సారాంశం = 6క్ష్60/12 = 30 ముత్యాలు.
ఆమె మొత్తం దండలో 30 ముత్యాలున్నాయి. కావాలంటే పైన ఇచ్చిన భిన్నాలతో సరిచూసుకోండి. మీకు ఆమె చేతిలో మిగిలిన 6 ముత్యాలు సమాధానంగా వస్తుంది.
ఇది వేదగణితం.
ఇప్పుడు చెప్పండి. గణితంలో పిహెచ్ డీ చేసిన వాళ్లెవరైనా తమ పాఠ్య గ్రంథాలు, సైద్ధాంతిక గ్రంథాల్లో ఈ మాదిరిగా ఉదాహృత ప్రాబ్లమ్స్ తో పాటు గుర్తుంచుకోగలిగారా?
ఇది కాదా సంస్కృత భారతి దివ్యమైన మహిమ?
మాకు తెలిసి దీన్ని బీజ గణిత శాస్త్రం అంటారు. ఇది భారత జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందింది. మీ మేక మెదళ్లకు, సెక్యులర్ గ్రహణం పట్టిన పైశాచిక బుర్రలకు ఇది తెలియకపోతే తెలుసుకోండి.
అన్నిటికీ మించి ఇంత బాగా భిన్నాలు, భాగాహారాల గురించి చెప్పగలిగిన విద్యావ్యవస్థనేటి రాక్షసగురువులఆంగ్లవిద్యావిధానంలో ఉందా? ఇందులో ఆవగింజలో వెయ్యోవంతుకూడా లేని సమస్యలు సాథిస్తే ప్రభుత్వ తాబేదార్ల ఉద్యోగాలు ఇచ్చే దౌర్భాగ్య విద్యా వ్యవస్థ తయారైంది. నేటి విద్యావ్యవస్థ గొప్పదా? వేదగణితకాలం గొప్పదా తేల్చుకోండి. ఇది ఇప్పటికీ కావాలా వద్దో కూడా తెలుసుకోండి.
80 ఏళ్ళు - రమా రమి సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం
అంటే 1000 పున్నములు చూసిన వారు అని అర్థం
1000 పున్నములు అని చెప్పడం ఎందుకు
29,000 వేల రోజు అని చెప్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ
పున్నమి అంటే ఆనందం, జీవితంలో ఉచ్చ స్థితికి చిహ్నం,
అసలు మనిషి జీవితాన్ని ప్రతిబింబించాలంటే చంద్రుడిని మించిన చిహ్నం ఏముంటుంది
అందుకే కదా మనం చంద్రమానం అని ఒక పంచాంగమే తయారు చేసుకున్నాం
1000 పున్నములు చూసిన వారు అంటే
1000 అమావాస్యలు, రమారమి 180 చంద్ర గ్రహణాలు,180 సూర్య గ్రహణాలు కూడా చూసిన వారు అని
కూడా అర్థం.
1000 పున్నాలు జీవితంలో ఆనందాలు అయితే,
అమావాస్యలు గ్రహణాలు జీవితంలో కష్టాలు నష్టాలు
అన్నీ చూసిన వారు అని అర్థం.
సముద్రంలోని నీరు మబ్బులై విడిపోయినట్లు
కాలం అనే కళ్ళెం లేని గుర్రం వెనకాల
అలుపెరుగని పరుగులు తీస్తూ
పెనవేసుకున్న జీవితాలు విడిపోయాయి
పొద్దున్నే పుస్తకాలు పట్టుకుని
అరై ఒరై అనుకుంటూ
చదువులు, స్నేహాలు, ప్రేమలు..
గొడవలు, సినిమాలు, పరీక్షలు
అన్నిట్లోను మనం కలిసున్నాం
కొత్త రెక్కలు రాగానే
స్తిరత్వం వెతుక్కుంటూ చెరో దిక్కుకీ విడిపోయాం
పండగకో, పుట్టిన రోజుకో
ఆనందాలకో, అవసరాలకో పలకరించుకునేంత
దూరం వెళ్ళిపోయాం !
కాలం ఆగదు కాని
దానిని క్షణ కాలం వెనకకు తిప్పగలిగేది
ఏంటో తెలుసా?
జ్ఞాపకం !
మనం కలిసి గడిపిన రోజులు జ్ఞప్తి తెచ్చుకుంటే
మాళ్ళీ ఆ క్షణాలు జీవించినట్టే
అందులో మనం అందరం ఉంటే ఆ రోజులు నిజంగా తిరిగి వచ్చినట్టే
మబ్బులన్ని కలిసి
వర్షమై
కాలువలై
నదులై
మళ్ళీ సముద్రంలో కలిసినట్టు
మనం అందరం మరో సారి స్నేహ సముద్రంలో కలుద్దాం
మళ్ళీ మబ్బులవ్వుతాం అని తెలిసినా
నదులై మళ్ళీ కలుస్తాం అని ఆనందిద్దాం !