Thursday, February 23, 2017

ఇది నా హిందుత్వం, నా గుర్తింపు, నా గర్వ కారణం


నమ్మితే అస్తికత్వం
లేకుంటే నాస్తికత్వం

మూర్తిని ఆరాధిస్తే సాకార బ్రహ్మ పూజ
లేదంటే నిరాకార బ్రహ్మ పూజ

వేదాలను యధాతధంగా నమ్ముతావా? ఆచరణ పద్దతి. సరే
తర్కంతో సంస్కరిస్తావా? మీమాంస/ వేదాంత పద్దతి. సరే
భగవద్గీత ని అనుసరిస్తావా? సరే
ఉపనిషత్తులను అనుసరిస్తావా? సరే
పురాణాలను చదివి ధర్మాన్ని అనుకరిస్తావా? సరే
చదవడమే ఇష్టం లేదా? సరే భక్తి మార్గం లో వెళ్ళు
భక్తి మార్గమే ఇష్టం లేదా? సరే కర్మ సిద్ధాంతం అనుసరించు

దేవుడిని కనుగొనడమే లక్ష్యమా ? సరే సాధువుగా జీవించు
లౌకికమైన ఆనందాలు వదలలేవా? ధర్మాన్ని పాటిస్తూ గౄహస్తుగా తరించు

ప్రకృతే నీకు దైవమా? సరే ఆరాధించు, ఎందెందు వెదకిన అందందే కలడు
గురువే దైవమా సరే? గురు బ్రహ్మా గురుర్ విష్ణుహు గురు సాక్షత్ పర బ్రహ్మ
ద్వైతం నచ్చిందా సరే? లేదంటే అద్వైతం ఉందిగా?

దైవం స్త్రీ అని నమ్ముతావా? ఆది పరాశక్తిని పూజించు
పురుషుడా ? సరే ఈస్వరుడున్నాడుగా
మనుషులందరూ అందరూ సమానం అని తలుస్తావా? వసుదైక కుటుంబం

పండగ లెన్నో ఉన్నాయి సరదాగా గడుపు
గుడికి వెళ్ళడం ఇష్టమా? సరే
ఖాలి లేదా సరే ఒక దణ్ణం పెట్టి నీ ఇష్ట దైవాన్ని తలుచుకుని కర్మ ని అనుసరించు

సర్వే భవంతు సుఖినహ అని నమ్మే ప్రతీ ఒక్కడు హిందువే. సనాతనం ఒక మతం కాదు, ఒక జీవన విధానం. ఇది నా హిందుత్వం, నా గుర్తింపు, నా గర్వ కారణం.

భారత దేశం నా దేశం, హిందుత్వం నా ధర్మం, నా గుర్తింపు
లౌకిక వాదం(సెక్యులర్) నా బాధ్యత, అది నా బలహీనత కాదు
అది నా బలహీనత అనుకుని నువ్వు ప్రవర్తిస్తే
కాదని నిరూపించేలా నేను ప్రవర్తిస్తా
ఏమి చెసినా భరించడానికి
మా ధర్మం పై మాకు నమ్మకం లేక పోలేదు,
మేము వెన్నెముక లేని వాళ్ళం కాదు !