Sunday, October 28, 2018

పిల్లి-బుట్ట కధ

పిల్లి-బుట్ట కధ:
ఒక ఊరిలో ఓ పెద్దాయన ఉండేవాడు, ఆయన కాశి వెళ్తూ కొడూకులిద్దరికీ నాయన లారా నేను తిరిగి ఎప్పుడూ వస్తానో తెలిదు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు.
తరువాత రోజు పెద్ద కొడుకు పూజకు కూర్చుంటుంటే అతని భార్య వచ్చి చెప్పింది , మావయ్య గారు రోజు పూజకు ముందు వాళ్ళ పెంపుడు పిల్లిని బుట్టలో పెట్టే వారు మీరు అలా చెయ్యడమే ఆచారం అని చెప్పింది.

పెద్ద కొడుకు పిల్లిని బుట్టలో పెట్టి పూజ చేసాడు.

రెండో కొడుకు భార్య ఇది చూసి నొచ్చుకుంది. మావగారి లాగ పుజ చెయ్యాలి అంటే మనకు ఒక పిల్లి కావాలి అని భర్త తో చెప్పింది. చిన్న కోడుకు పూజ కోసం కొత్త పెంపుడు పిల్లి , కొత్త బుట్ట కొనుక్కున్నాడు. అతను కూడా రోజూ పూజకు ముందు పిల్లిని బుట్టలో పెట్టే ఆచారం పాటిస్తూ తండ్రి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.

తండ్రి ఒక 5 ఏళ్ళ తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. పూజకు ముందు పిల్లుల్ని బుట్టలో ఎందుకు పెడుతున్నారు అని కొడుకుల్ని అడిగాడు?
నాన్నగారు మీరు చేసినట్టు తుచా తప్పకుండా చెస్తున్నాం అని కొడుకులు సమాధానం చెప్పారు.
"నాయనలారా ఆ పిల్లికి నేను బాగా అలవాటు రోజు పూజ సమయంలో కూడా ఒళ్ళో కూర్చుని నన్ను ఇబ్బంది పెట్టేది, అందుకని బుట్టలో పెట్టే వాడిని, అది మన ఆచారం ఏమీ కాదు అని చెప్పాడు !!


కధలో తండ్రి తిరిగి వచ్చి ఉండకపోతే ఆ కుటుంబానికి, కులానికి(కుటుంబం వ్రుద్ధి లోకి వస్తే, వారిని చూసి అందరూ మొదలు పెడతారు కదా!) పిల్లి-బుట్ట ఆచారం అయ్యిపోయేది.

మన ఆచారాలు ఇంతే, అప్పటి పరిస్తితులకు అనుగుణంగా, వారి సౌలభ్యం కోసం తయారు చెసుకున్న ప్రత్నామ్నయాలు. ఆలోచించకుండా మూర్ఖంగా పాటించడం వల్ల అవి ఆచారాలయి కూర్చున్నాయి. మనం ఆలోచించాలి ఇంక.


Wednesday, October 17, 2018

బౌద్ధులను హిందువులు చంపేసారా ??!! (Hindus killed Buddhists??)

బౌద్ధుల మీద దాడులకు బౌద్ధ గ్రంథాలు glorify చేసిన దాంట్లో శాస్త్రీయత ఎంత ఉంది అనే దాని మీద నాకున్న పరిమితి నేను అర్థం చేసుకున్న పరిధిలో నా విశ్లేషణ ఇస్తున్నాను. 
ఇది నిజం లేదా ఇదే విధంగా జరిగి ఉంటుంది అని కాదు. 
ఇది కేవలం నా విశ్లేషణ గా చదవండి.

మొదటగా 84000 స్థూపాలు కట్టడం అనేది శ్రీలంక బుద్దిస్ట్ లిటరేచర్ glorify చేసింది. 
అప్పట్లో అది అశోకుడు కాలంలో మనకున్న వసతులతో సాధ్యం అయ్యే పని కాదు. 
అశోకుడి స్థూపాలు ఒక 1000 ఉండి ఉంటాయి అనుకుందాం. 
రెండవది స్థూపాలలో monk ఉండరు. విహారాలు ఆరామాలు లో ఉంటారు. 
కాబట్టి ఈ సంఖ్య ఏ రకంగా చూసిన మేధస్సు కి అందని విషయం. 
దీనిని ఎందుకు glorify చేసుంటారో చూద్దాం.


అశోకుడు మొదటి గొప్ప చక్రవర్తి బుద్ధిజం తీసుకొని వ్యాప్తి చేసిన వాళ్ళలో. కాబట్టి ఆయన పేరు మీద ఈ glorification ప్రారంభం చేశారు. 
కాని నిజంగా అంత శాంతి పాటించాడు అంటే కాదు అంటున్నారు చరిత్ర కారులు. 
క్రిమినల్ ట్రైబ్స్ నీ నిర్ధాక్షిణ్యంగా ఉరిశిక్షలు వేయించారు ఎటువంటి సానుభూతి లేకుండా ఆయన.
ఇక టెక్నికల్ గా historians ఏమి చెప్పారో చూద్దాం. 
Etienne Lamotte అనే చరిత్రకారుడు బౌద్ధం గురించి చాలా విషయాలు చెప్పాడు. 
ఆయన linguistics తెలిసిన వ్యక్తి కూడా. పాళీ, సంస్కృతం లాంటి భాషలు కూడా వచ్చు. 
ఆయన చెప్పిన విషయాల ప్రకారం sunga dynasty నిజానికి బుద్దులని పట్టించుకోలేదు. 
ఇంకో మాట అంటారు సాంచి లో బుద్దిస్ట్ స్థూపం కట్టడానికి సాయం చేశారు అని . 
ఒక్క పుష్యమిత్ర మాత్రం ఏదన్నా చేసున్న కొన్ని నాశనం చేసి ఉండొచ్చు అని అనడం జరిగింది.

అంతే కాకుండా అదే సమయంలో శాతవాహనులు బ్రాహ్మణ మరియు బౌద్ధం ని సమానంగా చూసారు మరియు రెండు మతాలు కలిసి జీవనం సాగించాయి. 
కారణం అప్పటికే బౌద్ధం rituals మరియు బ్రాహ్మణ వాదానికి దగ్గరగా జరిగింది. 
గుప్తుల కాలం వచ్చే సరికి త్రిమూర్తులు వచ్చారు. దశావతారాలు వచ్చాయి మరియు ఆ దశావతారం లో బుద్ధుడు చేరాడు. 
అప్పటికే బుద్ధిజం తగ్గుముఖం పట్టింది ఒక్క eastren states లో తప్ప. 
హర్షుడు గుప్తుల తర్వాత నిలబెట్టడానికి చూసాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 
ఇక్కడ ఎక్కడ బౌద్ధాన్ని తొక్కాల్సిన పని లేదు. ఇక 7 వ శతాబ్దం కూన పాండ్య వంశానిది దక్షిణాన. శైవం వ్యాప్తి ప్ర్రారంభం అయ్యింది. తర్వాత రాజా రాజా చోళుడు రావడంతో వైష్ణవం ప్రారంభం అయ్యింది. ఇక వాళ్ళ రచ్చలో వాళ్ళు ఉన్నారు.

ఇక 1902-1928 వరకు ఉన్న పురావస్తు నిపుణుడు అయినా john marshall అయితే ఖచ్చితంగా ఒక్క విషయం చెప్పారు. Sunga dynasty నాశనం చేశారు అనడానికి circumstantial evidence లేదు అనేసారు. ఇక పుష్యమిత్రుడు విషయానికి వస్తే రాజ్యకాంక్ష విపరీతంగా ఉండటంతో మౌర్యుల చక్రవర్తుల అవశేషాలు ఉండకూడదు అని అన్ని నాశనం చేసాడు వాటిల్లో ముఖ్యం అయినది అశోకుడి శాసనాలు. అవి తర్వాత బ్రిటిష్ తవ్వకాల్లో బయటపడ్డాయి.

ఇక నలంద విశ్వవిద్యాలయం నాశనం అయ్యింది తురుష్కుల దాడుల్లో. దీనికి ఈ రాజులకి సంబంధం లేదు.

ఇక శంకర విజయాలు కి వస్తే , ఆయన బుద్ధిజం ని నాశనం చేసాడు అనే మాట కన్నా ఆయన హిందూ మతాన్ని stabilize చేసాడు అనొచ్చు. ఒక రకంగా హిందూ మతంలో పుట్టిన mass leader.  కొత్త వ్రతాలు, పూజలు ఇలా. కొన్ని స్తోత్రాలు పరిచయం చేసి ప్రజల్లో దేవుడు అయ్యాడు. 
బౌద్ధాన్ని నాశనం చెయ్యడం కన్నా భౌతిక వాద ఆలోచనలను నాశనం చేసాడు. 

అసలు హింసే లేదు అంటే కూడా ఒప్పుకోను. చేశారు కానీ ఈ బౌద్ధ గ్రంధాలు glorify చేసినంత సీన్ అయితే లేదు ఖచ్చితంగా. రాజ్యకాంక్షలో, బౌద్ధం మీద అసూయతో కొన్ని నాశనం చేసి దశాబ్దాల కాలంలో అడ్డొచ్చిన కొన్ని వేలమందిని చంపి ఉండొచ్చు. ఇది హింసే తప్పే. 
కానీ విషయం చెప్పడానికి దాన్ని మనం ఎక్కువ చెయ్యాల్సిన పని లేదు. 
కేవలం విషయం చెబితే చాలు అని నా అభిప్రాయం

చివరిగా ambedkar గారు ఊరికినే ఉంటారా అని అనుకుంటున్నారా ఇలాంటి రచ్చ చేస్తే? 
చీల్చి చెండాడి ఉండేవారు, ఆయన హేతువు ఉన్నంతవరకు ఉన్న బుద్ధ ఫిలాసఫీ తీసుకున్నారు. హింస గురించి చెప్పారు కానీ ఇంత రచ్చ గురించి ఆయన కూడా చెప్పలేదు.
..(to be continued)

Wednesday, October 3, 2018

సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన - Decriminalize Section 497

సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన, భార్య భర్త యొక్క ఆస్తి కాదు అని కోర్టు దానిని కొట్టి పారేసింది.

ఈ చర్య హిందూ వివాహ వ్యవస్తకు వ్యతిరేకం అని చాలా మంది గొగ్గోలు చెస్తున్నారు.
ఈ ఆలోచన తప్పు. హిందూ వివాహ వ్యవస్త, నమ్మకం మీద , ప్రమాణం మీద నిలబడుతుంది కాని కోర్టులకి భయపడి కాదు. ఒక వేళ కోర్టుకి భయపడి కలిసిఉన్నారు అంటే ఆ పెళ్ళికి విలువ లేదు, ఎప్పటికైనా గౌరవం లేని ఆ వివాహం విఛ్ఛిన్నమవుతుంది.



ఇక్కడ కోర్టు వ్యాఖ్య లో మాత్రం తప్పుంది !
భార్య భర్త యొక్క ఆస్తి కాదనడమేమిటి? ఆమే తప్పకుండా భర్త ఆస్తే !
ఆమే కాదు, పిల్లలు, తల్లి తండ్రులు, బంధువులు అందరూ అతని ఆస్తే !
తేరా పాస్ క్యా హై అంటే అమితాబ్ " మేరా పాస్ మా హై అన్నట్టు" అతనికి అందరూ ఆస్తి అందరూ అతని ఆస్తి. వివాహం లో ఉన్నంతవరకు ఇద్దరూ ఒకరింకరు అర్థం చేసుకుని గౌరవ మర్యాదలతో నమ్మకంగా సమంగా బతకాలి.

భార్య భర్త కన్నా తక్కువ కాదు,
** 'అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం '
## కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో' అంటాడు మామగారు.

వధువు తండ్రి వరునితో,
**'నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం,ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
##ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు
 'నాతిచరామి' (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.
ఇక్కడ వధువు చేత చెప్పించరు, ఎందుకో తెలుసా? నమ్మకం ఆమె మీద.

మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షుల ఉద్దేశం. ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.

స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం.

Tuesday, September 25, 2018

75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా...


75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా....
ఇంకా కుల వ్యవస్త పోలేదు
ఇంకా కులాంతర వివాహాలు జరగట్లేదు,
పెద్ద చిన్న అన్న భావాలు తొలిగిపోవట్లేదు,

అంటే...
75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా.. అది పని చెయ్యట్లేదు !!
ఎందుకు పని చేస్తుంది?
ఒక సమస్యకి సమాధానం ఇంకొక సమస్య ఎలా అవుతుంది?



నీ ఇంటి పిల్లని నా ఇంటికి ఇవ్వట్లేదని, నీ ఇంటిని నేను లాగేసుకుటే న్యాయమా?

నువ్వు మారాలి, కులాన్ని వదిలి పెట్టాలి అని నేను నా కులాన్ని అడ్డుపెట్టుకుని నీ ఆస్తి లాగేసుకుంటే ఒప్పుకుంటావా?

అది వారి హక్కు లా భావిస్తారు.
తండ్రికి 50,000 జీతం పెట్టుకుని, కొడుకు రిజర్వేషన్ వాడుకున్నాడు అంటేనే తప్పు. దానికి మళ్ళి నీ చెల్లిని ఇస్తావా ని అతి తెలివి సమాధానం. రిజర్వేషన్ నువ్వు పైకి రావాడానికి, ఎదుటి వాడు మారాలంటే, వాడిని మార్చాలి, నేర్పించాలి అంతే కాని ఆస్తి దొబ్బెయ్యకూడదు.

రిసర్వేషన్ ఇప్పటి కాలానికి సరిపడ సమాధానం కాదు.
ప్రభుత్వం పని చెయ్యలేక... కప్పి పుచ్చుకోడానికి చేస్తున్న పనికి మాలిని పని ఇది.

ప్రభుత్వ పాటశాల లన్నీ అద్భుతంగా పని చేస్తే
మంచి విద్య వైద్యం ఉచితం చేస్తే
ప్రతిభకే పట్టం కడితే
అప్పుడూ కదా దేశం బాగుపడేది ? లేదంటె ఈ విడీయోలో చూపించి నట్టు అనర్హులు (ప్రతిభని బట్టి) అందలం ఎక్కుతారు అర్హులు (ప్రతిభని బట్టి) అట్టడుగున ఉండి పోతారు. దేశానికే నష్టం.

నిజంగా ఈ సమస్య రూపుమాపాలంటే కుల మత భేదం లేకుండా అందరూ బాగా చదువు కోవాలి
మీ తాతలు నేతులు తాగారు, మా తాతలు నూతులు కడిగారు అని 
పాత కధలు వదిలేసి
ఇప్పటి మనం
ఇకపై మన ముందు తరాలు 
ఎలాంటి భేదాలు లేకుండా ఎలా ఉండాలొ , వసుదైక కుటుంబంగా ఎలా మెలగాలో ఆలోచించాలి !

అంతే కాని 
అభివ్రుద్ధి చెయ్యకుండా, 
టివీ లు, డబ్బులు పంచి
పులిహోర, సార పెట్టే వాడీని మనం కులం మతం పేరుతో ఎన్నుకుంటే
ఇలానే ఉంటింది పరిస్తితి ఎప్పటికీ.

నిజమే ఇది 'రిజర్వేషన్ మీద ఏడ్చే' వాడికి చెప్పుతో కొట్టే సమాధానం

Monday, September 24, 2018

సంస్కృత భాషాభిమానం


‘‘మీరు సంస్కృతపండితులు కనుక సంస్కృతం కావాలి అని అంటున్నారు. అంతేకానీ ఈ రోజుల్లో సంస్కృతం ఎందుకు కావాలండీ?‘‘ అని ఒక రాజకీయపార్టీ అభిమాని ఆంధ్రవ్యాసుల వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు 30 ఏళ్ళ క్రితం ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చిన సమాధానం నేటికీ సజీవంగా నిలిచి ఉంది.

‘‘మీరు ఏం చేస్తుంటారు?‘‘ అని ఆయన్ను అడిగితే ఆయన న్యాయవాద వృత్తి చేస్తున్నాను అన్నారు.

‘‘మీకు భారత రాజ్యాంగం కంఠస్థం అయిందా? టైటిల్ పేజీ నుంచీ ఎండ్ పేజీ వరకూ మొత్తం పొల్లు పోకుండా అప్పచెప్పండి.‘‘ అని అడిగారు.

ఆయనకు ఆంధ్రవ్యాసుల వారి ప్రశ్న అర్థం కాలేదు.

ఆంధ్రవ్యాసుల వారే తిరిగి ఇలా అన్నారు.

‘‘ మీరే కాదు డాక్టర్లను కూడా ఇదే ప్రశ్నిస్తున్నాను. రోగాలు, రోగ లక్షణాలు, మందులు ఉన్న మెటీరియా ఆఫ్ మెడికాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలరా? అంత వరకూ ఎందుకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని ఎవరైనా మొదటి నుంచీ చివరి వరకూ అప్పచెపగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ భారతీయ శాస్త్రాలన్నీ భారతీయ పండితులకు కంఠతా వచ్చు. ఇదే భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్నతేడా. భారత దేశంలో డిక్షనరీలు కూడా కంఠతా వచ్చు. అమరకోశం అటువంటిదే. ప్రపంచంలో ఏ భాషకూ లేని ప్రాభవం భారత దేశంలో సంస్కృతానికి ఉంది.

అంత వరకూ ఎందుకు గణిత శాస్ర్తం ఖగోళశాస్ర్తం కలబోసిన ఆర్యభటీయం, సూర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాలన్నీ పండితులకు నోటికి వచ్చు. నేడు గణితంలో పిహెచ్ డి చేసిన వారికి కూడా తమ గణిత సూత్రాలు నోటికి రావు. ఇదే నేటి దౌర్భాగ్యం. విద్యకు అతి ముఖ్యమైంది ధారణ. తమ శాస్త్ర గంథాలు అక్షరం పొల్లు పోకుండా ధారణ లేని వారికి శాస్త్రాలు ఎలా ఒంటపడతాయి? ఈ కారణం చేతనే నేడు వైద్యవృత్తి నుంచీ పాఠశాల ఉపాధ్యాయుడి వరకూ అందరికీ పుస్తకం చూడనిదే ఏ వృత్తి బాధ్యతా నిర్వర్తించలేక పోతున్నారు. పూర్వం వైద్యం, గణితం, నిర్మాణరంగం, కెమిస్ట్రీ, వృక్షశాస్త్రం అన్నీ కూడా కంఠతా వచ్చేవి. నేడు అది లోపించింది. ఇదే విద్యా బోధనలో కూడా ప్రధానమైన అడ్డంకి. ధారణ లేని, ధారణ చేయలేని చదువులు తయారయ్యాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు వచ్చి ఆత్మహత్యలకు హత్యలకు దారితీస్తున్నాయి. చదువు వల్ల మానసిక సమస్యలు రావడం అనేది సంస్కృత శాస్త్రాల వల్ల లేదు. ఎప్పుడైతే మనదైన విద్యావ్యవస్థను నాశనం చేసుకొన్నామో మన పతనం అప్పుడే మొదలైంది.






విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఆధునిక ప్రపంచం విలువ ఇస్తోంది. కానీ భారతీయులు పెరిగే విజ్ఞానాన్ని గుర్తుంచుకోవడానికి ఛందస్సులు ఉపయోగించి శ్లోకాల రూపంలో సమస్త గ్రంథాలు రచించేవారు. దీని వల్ల విజ్ఞానం బుర్రలో ఉండేది. నేడు పుస్తకాల్లో ఉంటోంది. ఏ పుస్తకంలో ఏముందో గుర్తుపెట్టుకొన్నవాడు మేధావి నేడు. గతంలో పుస్తకాలే బుర్రలో పెట్టుకొన్నవాడు మేధావి. ఇదే సంస్కృతభాష లోని మహిమ. నేటి ఆధునిక కాలంలో ప్రధాన లోపం ధారణలేని, ధారణ చేయలేని దౌర్భాగ్యస్థితి.‘‘

దశాబ్దాల క్రితం ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన అంశాన్ని నిరూపించే అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకువస్తున్నాము. దీనికి ఉదాహరణగా భాస్కరాచార్య రచించిన లీలావతి గణితంలోని ఒక సూత్రం దాని ఆధారంగా కొన్ని లెక్కలు పరిశీలిద్దాం.
ఇష్ట కర్మసూత్రం (సప్పోసిషన్) ఇలా చెప్పాడు.

ఉద్దేశకాలావవదిష్టరాశిః శృణోహ్యతోం2శౌ రహితో యుతో వా!
ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాశీర్భవేత్ప్రోక్తమితీష్టకర్మ!!

భావం: నీకు ఇష్టం వచ్చిన సంఖ్య అనుకో, దాన్ని ఇచ్చిన సమస్య ప్రకారం సాధించు. దాన్ని గుణించి భాగాహరించి, వివిధ భిన్నాలతో పెంచి లేదా తగ్గించగా వచ్చిన సారాంశాన్ని, దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది. దీన్నే ఇష్టకర్మ సూత్రం అంటారు.

పై సూత్రం అర్థం కావడానికి ఉదాహరణ కూడా ఇచ్చాడు.

పంచఘ్నః స్వత్రిభాగోనో దశభక్తః సమన్వితః!!
రాశిత్రయంశార్ఘపాదైః స్యాక్తో రాశిద్రవ్యూనసప్తతిః!!

భావం:ఒక సంఖ్యను 5 చేత హెచ్చవేయగా వచ్చిన దానిలో నుంచీ మూడో వంతు తీసి వేయగా వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించి, దానికి మూడో వంతు, సగం వంతు, పావువంతులు కలిపితే రెండు తక్కువగా 70 వచ్చింది. ఇప్పుడు చెప్పు ఆ సంఖ్య ఎంత.

ఈ లెక్క మీరు చేయగలిగితే నేడు ఉన్న అనేక ప్రభుత్వ, రైల్వే, బ్యాంకు ఉద్యాగాల పోటీ పరీక్షల్లో విజేతలు కావడం చాలా తేలిక. ఇది వేద గణితం ద్వారా ఎలా సాధించాలో తెలుసుకుందాం.

ఇక్కడ ఇచ్చిన ఇష్టకర్మ సూత్రం ప్రకారం ఇక్కడ ఇచ్చిన లెక్క సాధించాలంటే ఏదో ఒక సంఖ్య అనుకోండి.

నేను 3 అనుకుంటున్నాను.

1)ఇప్పుడు ఈ 3ను 5 చేత హెచ్చవేస్తున్నాను. = 15
2) దీనిలో నుంచీ మూడో వంతు తీసి వేయమన్నాడు కనుక 15లో మూడో వంతు 5 కనుక తీసివేస్తే = 10 వచ్చింది
3)వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించమన్నాడు. అంటే 10/10 =1 వచ్చింది.
4) దీనికి మూడో వంతు, సగం, పావు వంతులు కూడినది కలపాలి. అంటే (1+ 3 (1/3+1/2+1/4) )చేయాలి. = 17/4 వస్తుంది.
5) ఇప్పుడు సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
68ని 3చేత హెచ్చవేసి 17/4తో భాగాహరించాలి.
(68క్ష్3)/(17/4) = 68క్ష్3 క్ష్4/17 = 48

ఇక్కడ ఇచ్చిన గణిత సమస్యకు సమాధానం 48.

కావాలంటే 3 స్థానంలో 48ని ప్రవేశపెట్టి పైన చెప్పిన సోపానాలు అన్నీంటి ద్వారా 68 వస్తుంది.

ఇది గణిత వేదం అంటే.

ఇక్కడ అతి ముఖ్యమైంది ఏమిటంటే కేవలం గణిత సూత్రమే కాదు. ఉదాహృత గణితసమస్య కూడా శ్లోకం రూపంలో ఉంది. పూర్వం జ్యోతిష పండితులు భగవద్గీత మాదిరిగా ఈ గణిత సూత్రం, ఈ గణిత సమస్య కూడా కంఠతా పట్టి ధారణ చేసేవారు. కనుక జీవితంలో తాము చదువుకున్న చదువు మరిచిపోవడం అంటూ జరిగేది కాదు.

లీలావది అనే బీజ గణితంలో మనోరంజన భాష్య కారులు ఇచ్చిన మంచి రొమాంటిక్ సమస్య ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని పై విధానంలో కనుగొనేందుకు ప్రయత్నించండి.

గణిత సమస్య:

కామిన్యా హారవల్యాః సురతకలహతో మౌక్తికానాం తృటిత్వా
భూమౌ యాతాస్త్రిభాగః శయనతలగతః పంచమాంశో2స్య ద్రష్టః
భాత్తః షష్ఠః సుకేశ్యా గణక దశమకః సంగృహీతః ప్రియేణ
హృష్టం షట్కం చసూత్రే కథయ కతిపథైమౌక్తికైరేష హారః

భావం:

మంచి వయసులో ఉన్న జంట శృంగారంలో ఉండగా ఆమె మెడలోలని ముత్యాల దండ తెగిపోయి భూమి మీద మూడో వంతు ముత్యాలు పడ్డాయి. పక్కమీద ఐదో భాగం పడ్డాయి. ఆరో వంతు ఆమె జుట్టులో చిక్కుకున్నాయి. పడిపోతున్న ముత్యాలలో పదో వంతు జతగాడు పట్టుకొన్నాడు. దండలో ఆరు ముత్యాలు ఇంకా మిగిలాయి. ఇప్పుడు చెప్పండి ఆమె మెడలోని ముత్యాల దండలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి?

ఇక్కడ కూడా ఆరు ముత్యాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముత్యాలు ఎన్నో కనుక్కో మన్నాడు కనుక ఇష్టకర్మ సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు. కనుక దాన్ని ఉపయోగించి కనుక్కుందాం.

1) ముందుగా ఎంతో కొంత అనుకోవాలి కనుక నేను 60 ముత్యాలున్నాయి అనుకుంటున్నాను.
2) వీటిలో మూడో వంతు భూమి మీద పడ్డాయి అంటే నేను అనుకొన్న 60 ముత్యాలలో మూడో వంతు అంటే 20 ముత్యాలు భూమి మీద పడ్డాయి.
3) పక్కమీద ఐదో వంతు పడ్డాయి. 60 లో 5 వంతు అంటే 12 పక్కమీద పడ్డాయి.
4) ఆరోవంతు జుట్టులో చిక్కుకున్నాయి అంటే 60లో 6 వంతు 10 జుట్టులో చిక్కుకొన్నాయి.
5)జతగాడు పదోవంతు పట్టుకొన్నాడు. అంటే 60లో 10 వంతు 6 ముత్యాలు పట్టుకొన్నాడు.
ఇప్పుడు మొత్తం ఎన్ని ముత్యాలు కనుగొన్నాము 20+12+10+6 = 48
సారాంశంగా మిగిలినవి = మనం అనుకొన్న 60 -48 =12
6) ఇప్పుడు ఇష్టకర్మసూత్రం ప్రయోగిద్దాం. సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.

దత్త సంఖ్య =6 ముత్యాలు. మనం అనుకొన్నది 60 ముత్యాలు. సారాంశం =12
సూత్రం ప్రకారం దత్తసంఖ్య క్ష్ ఇష్ట సంఖ్య / సారాంశం = 6క్ష్60/12 = 30 ముత్యాలు.
ఆమె మొత్తం దండలో 30 ముత్యాలున్నాయి. కావాలంటే పైన ఇచ్చిన భిన్నాలతో సరిచూసుకోండి. మీకు ఆమె చేతిలో మిగిలిన 6 ముత్యాలు సమాధానంగా వస్తుంది.

ఇది వేదగణితం.

ఇప్పుడు చెప్పండి. గణితంలో పిహెచ్ డీ చేసిన వాళ్లెవరైనా తమ పాఠ్య గ్రంథాలు, సైద్ధాంతిక గ్రంథాల్లో ఈ మాదిరిగా ఉదాహృత ప్రాబ్లమ్స్ తో పాటు గుర్తుంచుకోగలిగారా?

ఇది కాదా సంస్కృత భారతి దివ్యమైన మహిమ?

మాకు తెలిసి దీన్ని బీజ గణిత శాస్త్రం అంటారు. ఇది భారత జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందింది. మీ మేక మెదళ్లకు, సెక్యులర్ గ్రహణం పట్టిన పైశాచిక బుర్రలకు ఇది తెలియకపోతే తెలుసుకోండి.

అన్నిటికీ మించి ఇంత బాగా భిన్నాలు, భాగాహారాల గురించి చెప్పగలిగిన విద్యావ్యవస్థనేటి రాక్షసగురువులఆంగ్లవిద్యావిధానంలో ఉందా? ఇందులో ఆవగింజలో వెయ్యోవంతుకూడా లేని సమస్యలు సాథిస్తే ప్రభుత్వ తాబేదార్ల ఉద్యోగాలు ఇచ్చే దౌర్భాగ్య విద్యా వ్యవస్థ తయారైంది. నేటి విద్యావ్యవస్థ గొప్పదా? వేదగణితకాలం గొప్పదా తేల్చుకోండి. ఇది ఇప్పటికీ కావాలా వద్దో కూడా తెలుసుకోండి.

(ఆంధ్రవ్యాసుల వారి సంభాషణ ఆధారంగా)

Friday, September 14, 2018

సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం

80 ఏళ్ళు - రమా రమి సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం
అంటే 1000 పున్నములు చూసిన వారు అని అర్థం

1000 పున్నములు అని చెప్పడం ఎందుకు
29,000 వేల రోజు అని చెప్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ

పున్నమి అంటే ఆనందం, జీవితంలో ఉచ్చ స్థితికి చిహ్నం,
అసలు మనిషి జీవితాన్ని ప్రతిబింబించాలంటే చంద్రుడిని మించిన చిహ్నం ఏముంటుంది
అందుకే కదా మనం చంద్రమానం అని ఒక పంచాంగమే తయారు చేసుకున్నాం

1000 పున్నములు చూసిన వారు అంటే
1000 అమావాస్యలు, రమారమి 180 చంద్ర గ్రహణాలు,180 సూర్య గ్రహణాలు కూడా చూసిన వారు అని
కూడా అర్థం.
1000 పున్నాలు జీవితంలో ఆనందాలు అయితే,
అమావాస్యలు గ్రహణాలు జీవితంలో కష్టాలు నష్టాలు
అన్నీ చూసిన వారు అని అర్థం.

80 వసంతాల మా మావయ్యగారు ,
స్థితప్రజ్ఞులు
ఆనంద సార్ధక నామధేయులు
నిత్య ఆనందోద్భాసిత నగుమోము ధరులు



ఆయన సంపూర్ణ ఆయుర్ధాయంతో
ఆరోగ్య ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ...

                               -కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియూ శ్రేయోభిలాషులు !







Saturday, September 1, 2018

స్నేహ సముద్రంలో కలుద్దాం

సముద్రంలోని నీరు మబ్బులై విడిపోయినట్లు
కాలం అనే కళ్ళెం లేని గుర్రం వెనకాల
అలుపెరుగని పరుగులు తీస్తూ
పెనవేసుకున్న జీవితాలు విడిపోయాయి

పొద్దున్నే పుస్తకాలు పట్టుకుని
అరై ఒరై అనుకుంటూ
చదువులు, స్నేహాలు, ప్రేమలు..
గొడవలు, సినిమాలు, పరీక్షలు
అన్నిట్లోను మనం కలిసున్నాం
కొత్త రెక్కలు రాగానే
స్తిరత్వం వెతుక్కుంటూ చెరో దిక్కుకీ విడిపోయాం
పండగకో, పుట్టిన రోజుకో
ఆనందాలకో, అవసరాలకో పలకరించుకునేంత
దూరం వెళ్ళిపోయాం !

కాలం ఆగదు కాని
దానిని క్షణ కాలం వెనకకు తిప్పగలిగేది
ఏంటో తెలుసా?

జ్ఞాపకం !

మనం కలిసి గడిపిన రోజులు జ్ఞప్తి తెచ్చుకుంటే
మాళ్ళీ ఆ క్షణాలు జీవించినట్టే
అందులో మనం అందరం ఉంటే ఆ రోజులు నిజంగా తిరిగి వచ్చినట్టే

మబ్బులన్ని కలిసి
వర్షమై
కాలువలై
నదులై
మళ్ళీ సముద్రంలో కలిసినట్టు
మనం అందరం మరో సారి స్నేహ సముద్రంలో కలుద్దాం



మళ్ళీ మబ్బులవ్వుతాం అని తెలిసినా
నదులై మళ్ళీ కలుస్తాం అని ఆనందిద్దాం !

Sunday, July 15, 2018

పొదుపు


అతిగా తినడం (అవసరానికి మించి ఏం తిన్నా ఎంత తిన్నా),
తిండి వృధా చెయ్యడం,
కోసి కూర చేసుకునే దానిని కూడా వంకర టింకర ఉండకూడదని సోకుకు పోవడం,
గొప్పలకు పోయి అర్థ రూపాయి తిండికి ఆరురూపాయలు ఖర్చు చెయ్యడం,
ఆర్భాటాలకు పోయి విందులకు లక్షలు కోట్లూ తగలెయ్యడం,
.
.
నీట్ నెస్ పేరుతో అతిగా నీరు వాడటం,
నిర్లక్ష్యంతో నీటిని వృధా చెయ్యటం,
చేసేది ఏసీ లో ఉద్యోగం , వేసేది జీన్సు.. అయినా ఏ రోజు కట్టిన బట్టలు ఆ రోజే,
.
.
లింగు లిటుకు మంటూ ఒక్కడుంటాడు, కారేమో పడవంత ! అవసరమా? నీ కారు ఎవడికి గొప్ప?
అనవసరమేదో అర్థం చేసుకుని మసులు కుంటే మన పిల్లలకి ఇంకాస్త పచ్చని ప్రకృతిని ఇవ్వచ్చు కదా?
.
.
ఇంకా ఇలాంటివి చాలా...
.
.
అవసరం లేకపోయినా నువ్వు ఏదైనా చేస్తున్నావంటే,
నీకు మానవత్వం లేనట్టే,
నీ వల్ల కాదా రేట్లు పెరిగి పోయి, పేదలు తిండి తినలేక, తాగ నీరు లేక బాధ పడుతున్నది?


.
.
అదిగో అక్కడ దేముడి మీద పాలు పోసి వృధా చేసేస్తున్నారు అని యుద్ధం చేసేసి
ఇంటికి వచ్చి సెల్ చూసుకుంటూ పాలు పొంగించేసావంటే నీ యుద్ధానికి అర్థం లేదు
అసలు నీ యుద్ధం నీకే అర్థం కానట్టు !!
.
.
లోకాన్ని పీడిస్తున్న సమస్య 'అతి ' .
పొదుపు లేక పోవటం.
పిల్లాడు మహా అయితే 10 బొమ్మలతో ఆడుకుంటాడు, మనం 100 బొమ్మలు కొంటాం.
పిల్లకి 10 బట్టలు ఉంటే చాలు మనం 100 కొంటాం.
అతి... కాస్త తగ్గించు కోవాలి మనం.
.
.
అప్పుడే లోకం ఇంకాస్త బాగుంటుంది. మానవత్వం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలిచ్చే ముందు, ఈ చిన్న చిన్న విషయాలు ఒక సారి ఆలోచిస్తే సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట సార్ధక మవుతుంది !!!

Sunday, May 27, 2018

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. (Humanist version)

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. నాగన్న ఆ గట్టునేమో దేవుళ్ళ దోపిడుంది, మంత్రాల మత్తు ఉంది, స్వర్గాల పిచ్చి ఉందీ, ఈ గట్టునేమో విజ్ణాన విత్తు ఉంది.
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. 
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. 
ఆ దిబ్బనేమో ముల్లాల ఫత్వ ఉంది, 
పోపుల పైత్యముంది, బాబాల బురద ఉందీ, 
ఈ దిబ్బనేమో న్యాయపు కోర్టుంది. 

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. 
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. 
ఆ గడపనేమో కాషాయ సుత్తి ఉంది, 
పచ్చోడి కత్తి ఉంది, తెల్లోడి సొత్తు ఉందీ, 
ఈ గడపనేమో కష్టించె సత్తువుంది. 

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. 
ఆ ఏపునేమో కులాల కంపు ఉంది, 
కాఫిర్ల రక్తముంది, కృసేడ్ల కచ్చ ఉందీ, 
ఈ ఏపునేమో మానవతా వాదముంది. 

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. 
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా…
నాగన్న ఆ గట్టునేమో లేచేటి శవముంది 
చంపేటి దైవముంది, తాగేటి రాయి ఉందీ 
ఈ గట్టునేమో మనిషయ్యే మార్గముంది !!!


Tuesday, May 22, 2018

మీకు తెలియకుండా మీరు ఒక టాక్స్ కడుతున్నారు తెలుసా? You are paying this tax without your knowledge (Telugu version)

మీకు తెలియకుండా మీరు ఒక టాక్స్ కడుతున్నారు తెలుసా?



దాని పేరు KST - కాఫిర్ సర్వీస్ టాక్స్ (లేదా) జిజియా టక్స్ (లేదా) హిందువుగా బతకడానికి టాక్స్.

ఇది మొఘలుల పరిపాలన నుంచీ హిందువులు మాత్రమె కడుతున్నది. అప్పట్లో జిజియా అని చెప్పి తిన్నగా వసూలు చేసేవారు, ఇప్పుడు గుళ్ళలో పడి సిగ్గులేకుండా దోచుకుంటున్నారు ఎండోమెంట్స్ పేరుచెప్పి, గుళ్ళు పగలకొట్టి సంపద ఎతుకేళ్ళిన ఘజిని బాపతు జనాలు.

హిందూవులు ఎక్కువ ఉన్న దేశం లో హిందువుగా ఉండడానికి ఇప్పటికీ పన్ను కడుతున్నారు.

చివరిదాకా చదివే ఓపిక లేనివారి కోసం ముందే చెప్పేస్తున్నా: దేముడి గుడిని కాపాడటానికి దేముడు దిగి వస్తాడు అని ఊరుకోవడం అమాయకత్వం, మనుషులు గుడి కట్టారు మనుషులే దానిని కాపాడుకోవాలి. దేముడు దిగిరావాలంటే రావణాసురుడు వంటి సమ ఉజ్జీ కావాలి. ఇలాంటి బీళ్ళ బచ్చా ముష్కరల ఆట కట్టించాలంటే అందరినీ సంఘటిత పరిచిన ఆది శంకరుల వంటి వారు కావాలి.

నేను కులాన్నీ మతాన్నీ పట్టించుకోను కాని ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే మాత్రం ఊరుకోను. అన్ని కులాలు మతాలు మంట గలిసే దాకా వారి వారి హక్కులు వారికి ఉండవలసిందే.

మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||
అనగానే అర్జునుడికి విశ్వరూప దర్శనం కలిగింది... బావ కాబట్టి !
మనకి అంతటి భాగ్యం లేదు కాబట్టి మనకు తోచిన రీతిలో శక్తి మేరకు గుడిలో విగ్రహాన్ని అందంగా తీర్చి దిద్దుకోవాలని అనుకుంటాం, ఇంట్లో పిల్లలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి ఎంత ప్రేమగా చూసుకుంటామో అంతే ప్రేమగా!

దేముడా నేను ఈ కష్టంలో ఉన్నాను, దేముడా నేను ఆ కష్టంలో ఉన్నాను నన్ను కాపాడు అని రామదాసు అంత కాకున్నా అని ఉన్నదానిలో కాస్త చిల్లర దాచి ముడుపు కట్టి హుండీలో వేస్తారు.

ఇలా వచ్చిన డబ్బులు, నగలు పరిపాలన పేరుతో కాజేస్తే? నువు నమ్ముకున్న దేముడి భక్తులనే ఏమార్చడానికే ఉపయోగిస్తే? అది అధికార దుర్వినియోగం. కర్ణాటకా గుళ్ళలో 2002 సంవత్సరం 72 కోట్లు విరాళంగా వస్తే, 10 కోట్లు తిరిగి గుళ్ళకు ఇచ్చి మిగత 60 కోట్లు మొత్తం హజ్ యాత్రలకు,మసీదులకు, చర్చులకు ఇచ్చేసారు...(మొత్తం).కాఫిర్ ల డబ్బులు హజ్ కు పనికి వస్తాయా? ప్రసాదం ముట్టుకోకూడదు కానీ హుండీ లో డబ్బులు ముట్టుకో వచ్చా? ఇదెక్కడి అన్యాయం.

ఇక బంగారం నగలు విలువైన రాళ్ళు గురించి చెప్పక్కర్లేదు, భక్తులు విసిరే నాణాలు తగిలి వజ్రాలు సైతం పగిలి మాయమయ్యిపోతుంటాయి, లోగుట్టు తిరుమలేసుని ఉత్సవ విగ్రహానికే ఎరుక. మా నూకాలమ్మకు చేయించిన బంగారు కళ్ళు ఎమయ్యాయో అని అడిగితే చెప్పే నాధుడు లేడు మా ఊళ్ళో.

ఎండొమెంట్స్ పరిధిలో ఉన్న ఏ గుడి హుండీలో వేసినా, డబ్బులు ప్రభుత్వానికి టాక్స్ కట్టినట్టే. వారి పరిధిలో లేని చిన్న గుడిలో వేస్తే గుడికి, పూజారికి అది చిల్లర మాత్రమే కాబట్టి ప్రభుత్వానికి అక్కర్లేదు.
ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఏమి చెయ్యలేము, కాని కనీసం గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది అనిపించి ఈ పోస్ట్ పెట్టా. ఇదేదో మత మౌడ్యం అనో, కుల జాడ్యం అనో మీరు ఊహించుకుంటే నేను ఏమి చెప్పలేను, నేను కొన్ని కోట్ల గోవిందుని భక్తుల హక్కుల గురించి మాట్లాడుతున్నా.

ఒక మక్కా ఒక వాటికన్ ఉన్నట్టు హిందువుల కోసం ఒక 4-5 పుణ్య క్షేత్రాలను వదిలివెయ్యలేరా?
కొండ మీద చర్చులు మసీదులు.కాశి విశ్వనాధునికి కూడ కష్టాలు తప్పలేదు, అయోధ్య రాముడిని అరణ్య పర్వం కన్నా ఎక్కువ కష్టపెట్టట్లేదా?

Monday, March 5, 2018

శ్రీదక్షిణామూర్తి


శ్రీదక్షిణామూర్తి


చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురు ర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః



తరతరాలనుండీ ఈశ్లోకం వస్తూంది

గురువు మఱ్ఱిచెట్టుమొదట చిన్ముద్రతో మౌనియై శిష్యపరివేష్టితుడై కూర్చుంటాడు. ప్రతి శివాలయంలోనూ దక్షిణాభిముఖంగా అమర్చిన యీ దక్షిణామూర్తి గురువిగ్రహం దక్షిణదిశ ఉన్న గోడలమీద మనకు కనబడుతూ వుంటుంది. అన్ని మూర్తులకంటె శాంతమూర్తి యితడు భైరవుడు బలే ఉగ్రమూర్తి. సోమస్కందుడు కరుణాపూర్ణుడు

ఈశ్వరుడు జడలువిప్పి తాండవం చేసేటపుడు అవి అన్నీ తాండవవేగంచేత ఒకచుట్ట చుట్టుకొని అటులే సూటిగా నిక్కపొడిచికొని ఒకప్రక్కకు అభిముఖాలై ఉంటవి. ఆనర్తంన యొక్క ఔద్ధత్యం ఎంతదో నటరాజవిగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. కాని మఱ్ఱమ్రానిక్రింద కూచున్న దక్షిణామూర్తి జడలన్నీ కిందికి వేలాడుతూ జటామండలంగా ఉంటై

జటామండలమధ్యంలో ఒక చంద్రకళ. అదియే జ్ఞానకళ. జ్ఞానంనానాటికివృద్ధిచెందే వస్తువు. దానికి చిహ్నమో అనేటటులు మూర్తి తదియనాటి చంద్రుని శిరసున పెట్టుకొని ఉండును. చంద్రవతంసుడై శాంతమూర్తియై వెలయు శ్రీదక్షిణామూర్తి స్వరూపదర్శన మాత్రాన మనకు ఎక్కడలేని శాంతీ తానుగాఅమరి ఊరుకుంటుంది. కోపిష్ఠిని గనుక చూస్తే మనకూ కోపంవస్తుంది. దురాలోచనలను చేసే వాళ్ళతో చేరితే మనకున్నూ దురాలోచనలు కలుగుతవి. మన మనోభావాలు ఎంతవిపరీతంగా ఉన్నాసరే దేవాలయానికి వెళ్లి దక్షిణామూర్తిని చూచీచూడగానే వారు - మనోవేగం మాని కాసేపు శాంతంగా కూచుని మరీవెళ్ళు అని చెప్పక చెప్పినట్లు తోస్తుంది. అక్కడ ప్రశ్నకుగాని ప్రతివచనమునకుగాని అవసరం ఉండదు. మాటా మంతీ లేక మౌనంగా కాష్ఠమౌనంగా శాంతంగా మనమున్నూ చతికిలబడవలసిందే

దక్షిణామూర్తి శిల్పం పరిశీలిస్తే శల్యావశిష్టులయిన నలుగురు ఋషులు సాధారణంగా ఎప్పుడూ ఉంటారు. కాంచీ మండలంలోమాత్రం సప్త ఋషులు ఉంటారు

కృతయుగంలో ఎముకలు మాత్రంఉన్నా ఆయుస్సు ఉంటుందని చెబుతారు. వారు అస్థిగతప్రాణులు. అటు తరువాత యుగం అనగా త్రేతలోవారు మాంసగతప్రాణులు. మాంస మున్నంతవరకూ వారికి ప్రాణ ముంటుంది. ద్వాపరయుగంలో రుధిరగతప్రాణులు. వారికి రుధిరమున్నంతవరకు ప్రాణం ఉంటుంది. యుగంలో అన్నగతప్రాణులు. ఇప్పటివారికి అన్న మున్నంతవరకే ఆయువు

కృతయుగంలో ఎముకలు మిగిలేటంతవరకూ తపస్సు చేసేవారు. కాలంలో భృగువు అనే ఆయన తండ్రి వరుణుడనే ఆయనకడకు వెళ్ళి-పూర్ణమయిన వస్తువేదో దానిని ఎట్లా పొందాలో అనిన్నీ బ్రహ్మమనేదే పరిపూర్ణ వస్తువయితే అది ఎల్లకాలమూ ఎల్ల చోటులాలోపం లేకుండా ఉండాలి. అట్టి పూర్ణవస్తువును నాకు మీరు చూపండి అనిన్నీ అడిగాడు

నీవు వెళ్లి తపస్సుచెయ్. నీ యంతట నీకే తెలుస్తుంది అని వరుణు డన్నాడు

భృగువు తపస్సుకు కూచున్నాడు. తపస్సు చేయగా అతనికి శరీరమే చాలా దొడ్డది, ఎంచేతనంటే అన్నింటినీ తెలిసికొనేదిది. ఇది జ్ఞాత. జ్ఞాయముకంటె జ్ఞానశ్రేష్ఠము, అనగా తెలియబడే దానికంటె తెలిసికొనేది శ్రేష్ఠము, అని అతనికి తొలుత తోచిందట. ఆపళంగా అతడు తండ్రికడకు వెళ్ళి అన్నిటికంటే గొప్పదయిన వస్తువును నేను తెలిసికొన్నాను. అది యీ శరీరమే అని తన తపః ఫలమును చెప్పాడు

ఇది విని వరుణుడు ఇంకా కొంతకాలం తపస్సు చేసి చూడు అని కట్టడి చేశారు
ఇట్లా భృగువు కొంతకాలం తపస్సు చేయడమూ కొంత గ్రహించడమూ తాను గ్రహించినదేమో తండ్రికి చెప్పడమూ మళ్ళా కొంత కాలం తపోనియతీ ఇట్లా అయిదుసారులు జరిగింది. కడపటిసారి మాత్రం భృగువు-మీరు చెప్పిన చందంగా ఇంతకాలం తపస్సు చేశాను కాని ఇప్పుడేదో హృదయంలో ఒకానొక ఆనందంస్ఫురిస్తూంది. ఇది యేమిటి? అని తండ్రినడిగాడు

నీకొక ఆనందం స్ఫురిస్తున్నదని అనుచుంటివే అదే ఆనందమే పూర్ణవస్తువు. నీకు ఇపుడిపుడు అలతి అలతిగా స్ఫురిస్తున్నది. క్రమక్రమముగా అభ్యాసంకొలది నడుమనడుమ తెగిపోకుండా సార్వకాలదేశికముగా ఉండిపోతుంది అని తండ్రి చెప్పాడు. ఇదొక కథ

పూర్ణానందసముద్రంలో ఒక తుంపర ఎపుడో ఒకపుడు మనకు అందుంది. దట్టమయిన నీడలు నిండి తీగలచే పూలచే పండ్లచేనిండిన ఒక చెట్టుక్రింద కూచున్నప్పుడు గాలివేస్తే ఆకులు కదలుతవి. వాని సందులనుండి మిల మిలలాడుతూ సూర్యకిరణాలు ప్రవేశించి నీడలను పారదోలిన పిమ్మట మళ్లా ఆకులు తమతమ చోటులకు చేరంగానే కిరణాలు మళ్లా మాయమైపోతవి. అలాగే మనకు అపుడపుడు సత్త్వం వృద్ధిచెందినపుడు ఆనందం కొంతకొంత గోచరిస్తుంది. కాని నిరవధికానందం మనకు చిక్కదు. చెడ్డకర్మలు చెడ్డబుద్ధులు ఆనందాన్ని దరికి చేరనీయవు. సత్కర్మల సంఖ్య పెరగగా పెరగగా ఆనందసముద్రము కెరటాలు ద్విగుణితోత్సాహంతో దరిదాపులకు వస్తయ్. ఆనందలహరుల తెరగే తెలియని మనం, తుంపరలకే ఆశ్చర్యపడి ఆహా ఎంత ఆనందం! ఎంత ఆశ్చర్యం! అని ఉవిళ్లూరుతాం. తపస్సు చేస్తూచేస్తూ తత్త్వవిచారం చేస్తూవుంటే అప్పసమూ ఆనందమయులమై ఆనందజలధిలోని తరంగాలలో కలసిపోతామని అనుభవజ్ఞులు చెపుతున్నారు

ఇట్లా వేల యేండ్ల తపస్సుచేసి ఎముకల గూడులుగా మారిన ఋషులు శాంత, ఆనంద స్వరూపుని సన్నిధిలో సమావిష్టు లయినారు? సాక్షాదీశ్వరుడే దక్షిణామూర్తియై మఱ్ఱిచెట్టు కింద కూచుని జ్ఞానప్రదానం చేస్తుంటే ఋషులు తమ తపస్సుకు ఫలంగా ఆనందస్వరూపుని సమక్షంలో వచ్చి కూర్చుకున్నారు

ఆహా ఏమి శాంతి! ఏమి ఆనందము! అని అటులే వారును శ్రీ దక్షిణామూర్తి ముందు శాంత స్వరూపులై ఆనందమయులై కూచున్నారు

పొంగిపొరలెత్తే ఆనందానికి చిహ్నం నటరాజు తాండవం. పొంగిపోయే ప్రతి వస్తువూ ఎపుడో ఒకప్పుడు అడగిపోవలసిందేకదా! కట్టెలు మండిమండి కాలికాలి నుసినుసియై యేర్పడిన బూడిదను మళ్ళా నిప్పులో వేస్తే మవుతుంది? బూడిదగానే ఉంటుంది. అలాగే నటరాజులో పొంగే ఆనందం అడగిపోవచ్చు. శ్రీవన్నృసింహస్వామిలో పొంగే కోపం అడగవచ్చు. కాని దక్షిణామూర్తి శాంతి అడగిన శాంతి. వారి ఆనందం అణగిన ఆనందం అటుపిమ్మట దానికిపైని ఏమీ లేదు. అన్నీ ఎచట అంతమయిపోతాయో అదే శాంతి. అట్టి అపారమూర్తిని దర్శనం చేస్తేచాలు. పొంగే ఎలాంగి హృదయమయినా శాంతమయిపోతుంది

చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురు ర్యువా

మఱ్ఱికింద ఎంత చిత్రం. సాధారణంగా గురువులు అనుభవం కలవారుగానూ ముదుసండ్రుగానూ శిష్యులు కుఱ్ఱలుగానూ ఉండటం వాడుక. కాని ఇది ఇచట తలక్రిందు. గురువోప్రాయంలో ఉన్న పదారు పదేడేండ్లవాడు. శిష్యులో ముదుసండ్రలో మూడుకాళ్ళ ముదుసండ్రు. చిత్రమిది ఒకటేకాదు. గురువు శిష్యులకు పాఠాలు చెప్పేటపుడు ఒకొక తత్త్వాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మారుమూలలు శోధించి భేదించి బోధిస్తేకదా విద్య అలవడుతుంది. అని అంటే గురుస్తు మౌనవ్యాఖ్యానం గురువులు మౌనముతోనే వక్కాణిస్తున్నారు. వారి ఉపన్యాసం మౌనమే. ఉత్తరదేశంలో వ్యాఖ్యాన మంటే ఉపన్యాసం, లెక్చర్ అని అర్థం

ఒకే సంస్కృత పదానికి ఒకొక దేశంలో ప్రాంతీయభాషలో ఒకొక అర్థం. ఒకొకచోట సంస్కృత పదాలకే భిన్నార్థం. అరవ నాడులో వృత్తి అంటే జీవన మని అర్థం. మలయాళంలో శుద్ధము అని అర్థం. శుద్ధిలేక ఆచారము లేనివాడెవడయినా ఉంటే చీచీ వాడొక వృత్తి చెడిన శని అని అంటారు. అటులే వ్యాఖ్యానం ఉంటే ఉత్తరదేశాలలో ఉపన్యాసం అని అర్థం. ఔత్తరాహులు వ్యాఖ్యాన్ దేతాహై అని ఉపన్యాసార్థంలో వాడతారు. ఈలాగే ఆదేశాలలో ఉపన్యాసం అని అంటే నవల అని అర్థం ఉపన్యాన్ లిఖతాహై అంటే నవల వ్రాస్తున్నాడని అర్థం. ఇట్లా కొన్ని కొన్ని పదాలు అర్థాంతరంలో వాడతారు

ఇక్కడనో గురువువారిది మౌనవ్యాఖ్య, గురువు శాంతిమౌనాల మూర్తిమత్వం. శాంతి తరువాతా ఘట్టం మౌనమేకదా ! నోరు విప్పితేనే సందేహాలు, ఋషులకు ఎన్నో సందేహాలు. కాని శాంతిస్వరూపుని ముందు సందియాలు తమంత తాముగా నివృత్తాలయిపోయినయో ఒక మాటలేదు ఒక పలుకులేదు ఒకటే శాంతి. ఒకటే ఆనందం. ఇన్నాళ్ళ తపస్సుకు ఈనాడు ఫలితం
మనంకూడా ముదిమి అనేది లేక నిత్య¸ యవనులమై ఉండవచ్చు. ఆలోచన యేమీలేక యేపనీ చేయక శాంతంగా సంతోషంగా ఉంటే నిత్య¸ యవనమే. కాని మనలను ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక కొరత. దానిచేతనే ముదిమికి లోబడటం. నిశ్చలమయిన మనసు కలవారికి ముదిమి దూరదూరంగా ఉంటుంది. ఎన్నో కోరికలను పెంచుకుని మనసును లెక్కలేనన్ని ఆలోచనలతో నింపి వ్యాకులం చేస్తాం. ఇది మన మానసికావస్థ. ఈశ్వరుడు పనీ లేకుండా కదలక స్థాణువై ఉన్మీలితనేత్రుడై మనశ్చాంచల్యరహితుడై సదాయువకుడై దీర్ఘజటాధారియై శాంతుడై ఆనందస్వరూపుడై శిష్యపరివేష్టితుడై సంశయము తొలగించడానికి సమర్థమయిన మౌనవ్యాఖ్య చేస్తూ మఱ్ఱిచెట్టుకింద కూచున్నాడు. దేశకాలాల కతీతుడై పరిపూర్ణమూ మనోజ్ఞమూ ఐనరూపంలో కూచున్న ఈశ్వరుని చేరి తాపసులు చింతలు మదలి ఆనందమయులై నిస్సంశయు లయినారు

కొరతలేని వస్తువే కొరతలు తీర్చడానికి చాలుతుంది
(తైత్తిరీయారణ్యకం పదో ప్రశ్న
మహర్షులు తనకు వేరయిన వస్తువొకటి ఉన్నదనే తలపు కలిగితే చాలు, భయం కోపం ఆశా ఇటువంటివేవో పుట్టుకోవస్తయ్. వేరువస్తువువల్ల కష్టం కలుగుతుందేమో అనే భీతిచేత కోపం ద్వేషం ఇట్టివి కలుగుతయ్. వస్తువుమీద అభిలాష కలిగితే ఆశ ఏర్పడుతుంది. అంతా ఒకటే, రెండు అనేది లేనేలేదని నిశ్చయం కలిగితే రాగంలేదు, ద్వేషంలేదు, ఏమీలేదు. ఒకటిఅనేది సత్యం. రెండు అనేది మాయ

దక్షిణామూర్తి అచలుడై కార్యరహితుడై స్తాణువై ఉన్నా, కార్యాలన్నీ తమంతటతామే జరిగిపోతున్నై. ప్రొద్దుపొడవగానే పిట్టలు గూండ్లువదలి ఎగిరిపోతై. జనమంతా ఎవరిపనులు వారు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఈలాగే లోకంలో వ్యవహారమంతా నడచిపోతుంటుంది. కాని యా యీ పనుల నన్నిటిని సూర్యుడు చేయడంలేదు. సూర్యుడుదయించినదే తరువాయిగా ఆయన సాన్నిధ్యంలో లోకవ్యవహారం సాగిపోతుంది. ఈరీతిగానే గురుసాన్నిధ్యంలో ఉపదేశమేమీ చేయనక్కరలేకుండానే తత్త్వమంతా తేటతెల్లమై పోతుంది. మౌనభాస్కరుని కిరణపుంజముచే శిష్యుల సందేహతిమిరాలు దవుదవులకు తరలిపోతై. కాంచీపురంలో వరదరాజస్వామి కోవెలలో దేవీసన్నిధిలో జటామకుటముతోకూడిన వ్యాసుల చిత్రము ఒకటి ఉన్నది. ఆయన కూరుచున్నటులున్నూ ఆయన కెదురుగా శంకరులు నిలుచున్నటులున్నూ స్తంభంమీద ఒక చెక్కడ మున్నది. చెక్కడములో వ్యాసదేవులు రెండవ వస్తువు నేదో ఒక దానిని చూపుతున్నటు ఉన్నది. మధ్వాచార్యుల విగ్రహం ఉన్న తావులలో ద్వైతమును సూచిస్తూ రెండు వ్రేళ్ళు చూపుతూ ఉన్నటుల శిల్పాలు ఉన్నవి. దక్షిణామూర్తియే చోటున ఉన్నా చిన్ముద్ర లేకుండా ఉండదు

దేవుడు ఉన్నాడా? ఉంటే ఎట్లా వుంటాడు? ఏమి చేస్తూ ఉంటాడు? అనే ప్రశ్నకు బదులో అనేటటులు అర్జునునకు శ్రీకృష్ణభగవాన్లు, నాయనా! ఈశ్వరు డొకడే, అందరయూ డెందాలలో నెలకొని మాయచే నియమిస్తున్ఆనడు అని అన్నారు

ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జున! తిష్ఠతి 
భ్రామయన్ సర్వభూతాని యంత్రాగూఢాని మాయయా 

గీతలలో మరియొక చోట చరాలూ అచరాలూ అన్నీనాలోనే ఉన్నవని అన్నారు. ఇవన్నీ విన్న అర్జునునికి ఉన్న జ్ఞానం కాస్తా ఉడిచిపెట్టుకొనిపోయి లేని సందేహా లెన్నో పుట్టుకొని వచ్చెయ్. ఒక తావుననేమో నే నన్ని వస్తువులలోనూ ప్రతిష్ఠితుడనై వాని నన్నిటినీ ఆడిస్తున్నా నని అంటావు, మరొక తావున అన్ని వస్తువులూ నాలోనే వున్నవని అంటావు. ఇట్లా ఒకదానికీ ఇంకొకదానికీ పొసగని మాటలు చెప్పి ఏమి ప్రయోజనం? నీవు అన్ని వస్తువులకున్నూ ఆధారమవా? లేక అన్ని వస్తువులూ నీకు ఆధారమా? ఏదో ఒకటి నిక్కచ్చిగా చెప్పు! అలా చెపితే నే నొప్పుకుంటాను. అని అర్జునుడు శ్రీకృష్ణుని నిలువరించి అడిగాడు. ఇది దొన్నెకు నేయి ఆధారమా? నేతికి దొన్నె ఆధారమా? అని తర్కించిన కుతార్కికుని తర్కంవలె సందేహంవలె ఉన్నది

ఓహో! నీకు సందేహాలు ఆరంభమయినవే! సరే! నేను చెప్పిన మాటలలో ఒకటీ గ్రహించి రెండవ దానిని వదలివెయ్!- మత్ స్థాన్ని భూతాని నాలో వస్తువున్నూ లేదు ఇపుడు తెలిసిందా
అడిగినపుడల్లా, తలచుకున్నపుడెల్లా, మాటమారిస్తే నే నెట్లా ఒప్పుకుంటా? అని వస్తువులూ నాలో ఉన్న వనిన్నీ వెనువెంటనే నాలో ఏమిన్నీ లేదనిన్నీ చెపితే మాటలో నిజాయినీ ఉన్నట్లు

పోవోయ్! నే వేమీ నన్ను నమ్మక్కరలేదు. నేనేం చెప్పినా అడ్డు ప్రశ్నలువేసి నే నొప్పుకోను, నే నొప్పుకోనని అంటావు. లోగడ చెప్పిన యీ రెండు మాటలూగూడా వద్దు. ఇదిగో కచ్చితమయిన మాట చెపుతున్నా విను!-నాఽహం ప్రకాశః సర్వస్య - నే నందరికీ ప్రకాశించను అని రెండవ మాటకూడా శ్రీకృష్ణుడు రద్దుచేశాడు

ఎందుకు ప్రకాశించవ్? కారణంచేత అందరకూ తెలియబడవ్

యోగమాయ ఆవరించడమువల్ల ఎవరికిబడితే వారికి గోచరించను

నాలో ఏవీ లేవు అని ఒకమారూ, నేనున్నూ వానిలో లేను, అని రెండోమారూ, నేనెవరికిబడితే వారికి గోచరించను అని మూడోమారూ, ఏమిటయ్యా మాటిమాటికీ యీ మాటమార్పిడి. ఇదంతా ఏమిటయ్యా అంటే? అదే యోగమాయ నేను మాయచే ఆవరింపబడేఉన్నాను అని సమాధానమా

నా హం ప్రకాశస్పర్వస్య యోగమాయాసమావృతః
మూఢోఽ యంనాఽభిజానాతి లోకే మామజిమవ్యయమ్

ఇదేమిటి ఉపదేశం? మనకేమీ అర్థంకావడంలేదు అని తోస్తుందికదా

నేనందరకూ, ఎవ్వరికీ కనబడును అని భగవంతుడు చెపితే వేవురుంటే వేవురికిన్నీ కనబడను అని అర్థం నే నందరకు కనబడనంటే వేపురిలో తొమ్మన్నూట తొంబది తొమ్మిదిమందికి కనబడకపోవచ్చును; ఒకనికో కనబడితే కనబడవచ్చును అని అర్థం. భగవంతుడు
నా హం ప్రకాశః సర్వస్య 

అనే చెప్పాడు. మాయచే మోహితుడు కానివానికే ఆయన గోచరిస్తాడు
దార్లో ఒక రెవరో పూలమాల పడవేసి పోయారని అనుకుందాం. పగటిపూజ అది అందరకూ పూమాలలాగానే కనబడ్డది. అందువల్ల దానిచేత ఎవరికిన్నీ బాధగాని వికారంగాని కలుగలేదు. మసక మసక చీకటిలో ఎవడో దానిని తొక్కి పాము పాము అని అరచాడు. మాలగా ఉన్నదీ పాముగా ఉన్నదీ ఒకే వస్తువు. మాల అని తెలియంగానే పాము మాయమయింది. కాని పామని బ్రమసినందులకు ఆధారం మాలే. ప్రపంచంలో నే నున్నాను, నాలో ప్రపంచం ఉన్నది అని అంటే దీనికేమిటి అర్థం? పూలమాలలోనే పామున్నది, పాములోనే పూలమాల ఉన్నది అని అర్థం. గుండె చెదరినవానికి మాల పామయి కూచుంది. అజ్ఞానం పోయి పాము కాదు-మాల అని తెలిసిన వానికి మాల, పామును తనలో ఇమిడ్చికొని మాలగా కనబడుతుంది ప్రపంచమును సత్యమని చూచేవానికి, ప్రపంచాని కాధారమూ భర్తా ఈశ్వరుడు. దృశ్యప్రపంచమును జ్ఞానముచే చూచే వానికి ఈశ్వరుడే సర్వమూ వ్యాపించినట్లు తోస్తుంది

ద్రావిడకవి కంబరు సుందరకాండలో విషయమునే ప్రస్తావించాడు. శ్రీరామచంద్రమూర్తి దర్శనమాత్రానే పంచభూతాత్మకమయిన మాయ తొట్ట తొలగిపోతుందని కంబరు వ్రాశారు. వస్తువు లన్నింటిలోనూ తానే నెలకొని ఉన్నటులు శాంతుడై సుస్థిరుడై అంతా ఒకటే అనే అద్వైతానుభవం చూపిస్తూ చిన్ముద్రతో ఉపదేశం చేసే శ్రీదక్షిణామూర్తి దర్శనమాత్రాన మాయపొర తొలగి ఆనందాద్వైత జ్ఞానసముద్రంలో మనంగూడా కలసిపోతాం.                        

--- “జగద్గురు బోధలునుండి కంచిపరమాచార్యవైభవం