వేరే ఎవరైనా అయితే ఫీల్ అవుతారు అని వదిలేద్దును, నీకు నా గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా.
మీ ముందు తరాలవారు కులాలు శ్రుష్టించి అతి పెద్ద పాపం చేసారు అంటున్నాడు, అది బ్రాహ్మలకు ఎలా ఆపాదిస్తాడు? అన్నిటికన్నా ముందు బ్రాహ్మనత్వం పుట్టిందా? తప్పు ! అన్నిటికన్నా చివరన పుట్టింది. అన్నం వండడం, కుండలు చెయ్యడం, ఆకు పసర్ల వైద్యం, ఏది తినాలి ఏది తినకూడదు గుర్తు పెట్టుకోవడం, ఇళ్ళు కట్టుకోవడం ఇలా దైనందన జీవితం లో అన్నీ సమకూతుంటే, ఆ విగ్నానం ఒకరు గుర్తుంచుకోవటం కష్టం అని, గుర్తుంచొకోడానికి కొంతమందిని నియమించారు. నువ్వు కాపు కాయి, నువ్వు వ్యవసాయం చెయ్యి, కుమ్మరి నువ్వు కమ్మరి చెయ్యి, నువ్వు విద్య అభ్యసించు, సంఘం లో జరుగుతున్నవి గమనిస్తూ దిశా నిర్దేశం చేస్తూ, అవసరం అయ్యినప్పుడు నీ విద్యని సరిదిద్దుతూ దానిని పెంచు అని అందరూ ఒప్పుకుంటేనే కులాలు వచ్చాయి. అంతే కాని ఒక రోజు పొద్దున్నే లేచి నేను బ్రాహ్మనుడిని, మీకు కులాలు లేవు కాబట్టి నీది ఆ కులం , నీది ఈ కులం అని, నాది అగ్ర కులం, నీది కడపటి కులం అని అంటే ఊరుకుంటారా? తంతారు.
1. అది ఒక సమిష్టి ఒప్పందం
2. విద్య, అధికారం రెండు మహా శక్తులు. అందుకే మన పెద్దలు రెండు ఒకడి దెగ్గర ఉండకూడదని నిర్ణయించారు.
3. బ్రాహ్మణుడికి విద్య ఇచ్చి రాజ్యాధికారం లేకుండా చేసారు, వేదపఠనం, కుల వృత్తి కదా, విద్య రాని వాడికి పేదరికమే, అందుకే కధల్లో పేద బ్రాహ్మణులెక్కువ. మరి ఇది అన్యాయం కాదా? ఒక్కొక్క కులంలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఉండేవారు, వారు కనిపేట్టినవి విద్యలో చేరేవి. ఇప్పుడు?
మూల సుత్రం అర్థం కాకపోతే అంతా అన్యాయమే.
4. మనిషి చస్తే పూజలు, పుడితే పూజలు అవి బ్రహ్మణుడూ బతకడానికి కాదా అంటున్నాడు.. కాదు, నువ్వు కుండలు అమ్మి సంపాదిస్తావు, వాడు రాజు వాడికి సుంకం వస్తుంది, మరి బ్రాహ్మణుడికి? విద్య నేర్చుకోమని పని చెప్పావు మరి సంపాదన కల్పించవా? లైబ్రేరీన్ కి ఆకలి ఉండదా? పుట్టిన వాడు సుఖం గా ఉండాలని సంఘానికి వాడిని చూపిస్తూ నువ్వు ఇచ్చే పూర్వ కాలపు పార్టీ అది, నువ్వు ఇవ్వకపోయినా నష్టం లేదు. చనిపోయిన వాడిని గుర్తు చేసుకుంటాము అందరం కలిసి అంటే పోయేవాడు ఒక సంత్రుప్తితో పోతాడు, అంతే. పెద్దోళ్ళు పెట్టిన భోజనాలకి మనవలు బాధపడిపోతున్నారు.
5. అవును దేవుడి తో మాట్లాడటం బ్రాహ్మణుడికే వచ్చు, అలా అని మన తాతలే నిర్ణయించారుగా? పోని ఈ కాలం లో వేదం అందరూ నేర్చుకోవచ్చు, అన్ని ఏడ్పులు ఏడ్చి, ఎంతమంది వేదం నెర్చుకుంటున్నారు? అందరూ కలిసి దాని గౌరవాన్ని పోగొట్టి నాశనం చేసేసాం, అంతే.
6. హింస అంటే, కేవలం చదువే వృత్తి, లేకపోతే గౌరవం లేదు, లేకపోతే భోజనం లేదు అనడం, అది కూడా హింసే ! సంఘంలో అన్ని రకాల ఎంటార్టైన్మెంట్స్ ఉన్నా అందరి లా కాకుండా ఎలా ఉంటే బాగ చదువు ఎక్కుతుందో అలాగే ఉండమనడం కూడాహింసే ! అది కూడా యుగ యుగాలుగా ! ఇష్టం వచ్చినట్టు బతికే హక్కుని కాలరాసినట్టే. మనం 1 రోజు ఉండగలమా అంత నిష్టగా? ఒకరి నొకరు నిందించుకుని గౌరవం తగ్గించు కున్నాం అంతే.
7. చెలియలి కట్ట దాటనంత వరకు గోదావరి, దాటితే వరద. కట్టుబాట్లు పెట్టుకున్నారు నడుచుకున్నారు. ఇప్పుడు తప్పు అనుకుంటున్నాం వదిలేశాం అంతే.
8. ఎవరి మీద ఎవరు ఆదిపథ్యం చెలాయించారు? బ్రాహ్మణుడు మహ అయితె మంత్రి అవుతాడు. రాజు కు నచ్చితే ధనవంతుడు లేదంటే కళ్ళు పొడిపించుకున్న వాళ్ళూ, ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు కోకొల్లలు. రోగాలొస్తే దేముడు చూస్తాడులే అని నమ్మే అమాయకులు, ఆ విద్య నేర్చుకొన్నది, పూజలు చేసింది అందర్తి పెద్దల నిర్ణయం వల్ల కాదా? మనది సమ సమాజమే, మనం మర్పులు చేసుకోలేదంతే, 1000 ఏళ్ళుగా పరుల పరిపాలన లో కంఫ్యుస్ అవుతూ బతుకుతున్నాం.
9. 10 సంవత్సరాలు రెసర్వేషన్ ఇచ్చింది సంఘం మొత్తం మారడనికి. ఆంబేడ్కర్ పేరు మార్చింది కూడా ఒక బ్రహ్మణుడే గుర్తుంచుకో.
కుల వ్యవస్త ఇప్పుడు ఒప్పు అని నేను అనట్లేదు, తప్పు మొత్తం బ్రాహ్మణుడి మీదకు నెట్టేసి చేతులు దులిపేసుకోవద్దు అంటున్నా. అందరు కలిసి సువర్ణ భారతాన్ని సృష్టించారు. ఇప్పుడూ అంతా కొట్టుకుని గురువులతో క్షమాపణలు చెప్పించుకుంటున్నాం అంతే సాధించింది.దైవ భక్తి/భయం మనిషిలో స్వార్థం మీద ఆధిపత్యం చెలాయించి నన్నాళ్ళు కుల వ్యవస్త పని చేసింది. ఎప్పుడయితే అందరిలో స్వార్థం పెరిగిందో అప్పుడే అది నాశనం అయ్యింది. బ్రాహ్మణ దూషణ గొప్ప అయ్యిపోయింది. ట్విట్టర్ హెడ్ లైన్ చదివి ఊగిపోయి తల బాదేసుకుని అన్యాయం అంటూ నేల మీద డేకేసే రోజులివి, తెలియనిది తెలుసుకోకపోయినా పర్లేదు తెలిసినట్టు అతి చేసి, ఇష్యూ చేసి పేరు తెచ్చుకునే, ఇలాంటి చవకబారు రచయితలు చలా మంది ఉన్నారు సంఘంలో, దయ చేసి అర్థం చేసుకుని షేర్ చెయ్యండి. అనవసరంగా అన్యాయం జరిగిందంటూ గుండెలు బాదేసుకోకండి. ఎమైనా ఉంటే ఇప్పుడు సంఘాన్ని మార్చడనికి చెయ్యండి అంబేద్కర్లా!