Thursday, December 16, 2021

gitajayanti - భగవద్గీతా

 ఆది శంకరాచార్య విరచిత భజ గోవిందం లోని గీత గొప్పదనాన్ని చెప్పే కొన్ని శ్లోకాలు

.
భగవద్గీతా కించిదధీతా
గంగాజల-లవకణికా పీతా
సకృదపి యేన మురారిసమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా
Who ever has read at-least a little from the Gita, drink just a drop of water from the Ganga, worship Murari just once, will have no altercation with Yama.
.
గేయం గీతా-నామసహస్రం
ధ్యేయం శ్రీపతి-రూపమజస్రమ్ ।
నేయం సజ్జన-సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్
Recite from the Gita, Meditate on Vishnu in your heart, be in the company of noble and the holy. Distribute your wealth in charity to the poor and the needy.
.
నాకు ఎంతో నచ్చే కృష్ణం వందే జగద్గురుం పాట నుండి కృష్ణావతార విశ్వరూపదర్శనం గురించి సిరివెన్నెల గారి పదాల్లో
.
అణిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిగా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా
సస్వరూపమే విశ్వరూపమ్ముగా !
.
నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే
.
వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం



మనో భావాలు

సాంఖ్య యోగః 3

క్లైభ్యం మా స్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే |
క్షుద్రం హ్రదయదౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప ||
.
ఇది శ్రీ కృష్ణుడు అన్ని లక్షల మంది ముందు యుద్ధరంగంలో అంత గొప్ప వాడైన అర్జునుడిని అన్నమాట.
.
ఓ అర్జునా ! నపుంసకుడి వలే పిరికితనమునకు లోనుకావద్దు, నీకిది ఉచితము కాదు, ఈ హృదయ దౌర్బల్యమును వీడి, యుద్ధముచేయుము, అని(ఆ రోజుల్లో నపుంసకులు యుద్ధాల్లో పాల్గొనడం తక్కువ. ఇది గీత లోది నన్ను తిట్టకండి 🙏).
.
అయితే ఇక్కడ అర్జునుడు ఇంత మంది ముందు నన్ను నపుంసకత్వము వదులు అని అంటావా అని మనో భావాలు పాడుచేసేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే, భగవద్గీత సాంఖ్య యోగంతోనే ఆగిపోయేది, మిగతా 15 యోగం లు గాల్లో కలిసిపోయేవి. హృదయ దౌర్బల్యం వదలాలి అన్న విషయం మాత్రం అర్థం చేసుకున్నాడు కబట్టే అర్జునుడి గురించి ఇవాళ కూడా చదువుకుంటున్నాము.
.
అసలు చెప్పిన దానిలో విషయం వదిలేసి, ఎదో ఒక చిన్న విషయం పట్టుకుని దాన్ని చాంతాండంత లాగి, మనో భావాలు దెబ్బతిన్నాయని అవేశ పడిపోయావారెక్కువయ్యారు లోకంలో.


మరీ పిడకల గోడ లాగ అన్నిటిని అంటించేసుకుని, మనోభావాలు దెబ్బతినెయ్యకూడదు, అస్తమాను ఊరుకోపెట్టడం కష్టం 😀

Tuesday, November 30, 2021

సిరివెన్నెల గారు ఇక లేరు | Sirivennela Sitarama sastry Songs

ఆయనను శ్లాఘించ ప్రయత్నించ
ఎన్నని చెప్పి సంతృప్తి పడగలం ?
ఆయనొక ఆకాశం
ఎన్ని నక్షత్రాలు అంటించి అది నింపగలం?
...
సిరివెన్నెల గారు మన వాళ్ళకు తెలుసు ఎదోక రోజు వెళ్ళి కలవాలి, అని అనుకుంటూనే చాలా సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చా.
ఇక ఆయన లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నా.
మాటల పాటల రేడు లేరంటే, మాట్లాడటానికి మాటలే రావట్లేదు !
కార్తీకపర్వ బహుళ ఏకాదశి - 30 Nov2021 🙏
...




"చుట్టుపక్కల చూడరా చిన్నవాడా
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే.."
-- అని నాకు సంఘం పట్ల ఉన్న బాధ్యత గుర్తుచేసినా
.
"నమ్మకు నమ్మకు ఈ రేయిని
వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు"
-- అంటూ అందరు కలిస్తేనే సంఘం, అందరినీనీ కలుపుకుపోవాలని ఉద్భోదించినా
.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
--అని వైరాగ్యం నింపినా
.
"జరుగుతున్నది జగన్నాటకం
అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగా నీ లోని అష్ట సిద్ధులూ నీకు తన్బట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరుని పై దృష్టి పరుపగా
తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే"
-- అని గొప్పగా బతికే దారి చూపినా
.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా"
-- అని నైరాస్యం నుండి పైకి లేపి, నిస్తేజానికి నిప్పంటించి, స్పూర్తి నింపి, పరుగులు పెట్టించినా, ఆయనకే చెల్లింది !!
ఆ పాట ఈ పాట అని లేదు, అన్నీ అద్భుతాలే !!
.
ఆయన ఒక సినీ రచయితగా కాదు,
రూపాయి తీసుకోని వ్యక్తిత్వ మార్గదర్శిగా ఆయన నాకు ఆరాధ్యులు. ఇక ఎం చెయ్యగలం? అశ్రునివాళి అర్పించడం తప్ప !






మెటా వర్స్ : భయపడాలా వద్దా? Facebook Meta verse

 మెటా వర్స్ : భయపడాలా వద్దా?


.

ప్రతీ నెలా జీతం పడగానే ఎదోక పుస్తకం కొనడం నాకు అలవాటు. 2008-2009 సమయంలో నేను ఫేస్బుక్కు లో ఫాంవిల్లీ , మాఫియా వార్స్ అని రెండు గేంస్ ఆడేవాడిని. వాటికి నేను ఎంత అలవాటు పడ్డానంటే, నాకు 4 ఎకౌంటులు ఉండేవి అవి ఆడటానికి. మెళకువగా ఉన్న సమయంలో కనిసం 30-40% ఆడుతూనే ఉండేవాడిని.

.

ఆ ఆటలు ఒక ప్రపంచం. ఫారంవిల్లీ లో మనం వ్యవసాయం చెయ్యాలి. తవ్వి, గింజలు వేసి, నీరుపోసి, మొక్కలు పెరిగేదాకా ఆగాలి. పంట పండాక అమ్మి వచ్చిన డబ్బులతో పొలం కొని మళ్ళీ వ్యవసాయం. అదొక లోకం. డబ్బులు పెట్టి కొని, మొక్కలు త్వరగా పెరిగేలా చెయ్యొచ్చు, పొలాలు కొనొచ్చు, వ్యవసాయ పరికరాలు కొనొచ్చు, ఇది ఒక వ్యసనంలా మారిపోయి డబ్బులు ఖర్చు చేసినవారు కూడా ఉన్నారు.

.

మాఫియా వార్స్ ఇంకొక రకం. గన్స్, బాంబ్స్, కార్స్, చంపడాలు, చావడాలు. ఒక భయంకర ప్రపంచం.

.

కేవలం లాప్టాప్ తెర మీద ఆడే ఒక ఆటే కాని మహా వ్యసనం.  

.

నాకు ఒక 6 నెలల తరువాత కనీసం పేజీ తిప్పని పుస్తకాలు చూస్తే కానీ అర్థం కాలేదు నేను ఫేస్బుక్కుకి ఎంత బానిస నయ్యిపోయానో. మరు క్షణం నేను గేంస్ ఖాతాలు పూర్తిగా మూసివేసాను. అప్పుడు పరిస్థితులు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాయి. ఇప్పటికి నేను, ఆరు నెలలకోసారి కొన్ని రోజుల సామాజిక మాధ్యమాల సన్యాసం చేస్తుంటాను :-) .

.

మెటావర్స్ ఒక యూనివర్స్. అది లాప్టోప్ స్క్రీన్ కాదు. 3డి లోకం. బాహ్య ప్రపంచంలో మనం చెయ్యలేనిదంతా అక్కడ చెయ్యొచ్చు. స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు ఫ్రీ జంప్ చెయ్యొచ్చు, సముద్రపు అట్టడుగుల్లో ఈదులాడోచ్చు, జ్వాలాముఖి పేలినప్పుడు దాని లావాలో దుమికి మళ్ళీ బయటకు రావొచ్చు, ఈఫిల్ టవర్ ఎక్కి ఫొటో దిగొచ్చు.. ఇవన్నీ అతి తక్కువ ఖర్చుతో, గది బయట అడుగు పెట్ట కుండానే చెయ్యొచ్చు.  

ఒకే చోట ఉండి ముద్దుపెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభవం అమెరికాలో ఉన్న ప్రియురాలు , ఇండియాలో ఉన్న ప్రియుడు  మెటావర్స్లో పొందుతారు. ఆ టెక్నాలజి అలాంటిది.

అవకాశాలు అనంతం. ఎందుకంటే మన ప్రభుత్వాలు, మన కట్టుబాట్లు, మన సరిహద్దులు, సైన్సు సూత్రాలు ఇవన్ని వర్తించని ఒక ఎల్లలు లేని లోకం అది.

కొత్త లోకం కదా అక్కడ అందరూ సమానమే అనుకుంటారేమో, అక్కడ కూడా కొన్నుక్కున్న వారికి కొనుక్కున్నంత.

.

కంపెనీ వికలాంగులను అడ్డం పెట్టుకుని, నిజ జీవితంలో వారు చెయ్యలేనివి అక్కడ చెయ్యొచ్చు అన్ని చెప్తున్నారు. 

ఇది కూడా ఫెయిర్ అండ్ లవ్లీ, నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వండనో , నిగ నిగలాడండనో జనాల్ని కించ పరచినట్టు వికలాంగులను ఫేస్బుక్ అవమానపరచి నట్టే, వారిని వాడుకున్నట్టే. మాయా లోకంలో వారిని తిప్పే కన్నా, వారి సాధికారతకు తోడ్పాటు పడే పనులు వేరే చాలా చెయ్యవచ్చు.

.

ఇదంతా నేను మెటావర్స్ గురించి భయపెట్టడానికి చెప్పట్లేదు. పిల్లలు పెద్దలు ఆ మాయా లోకంలో పడి నిజ జివితంలో సమయం వృధా చేసుకోకుండా, జాగ్రత్త పడాలి అంటున్నాను.

అతి సర్వత్ర వర్ఝయేత్ అని పెద్దలు చెప్పారు.

అతి కానంతవరకు, హద్దులు దాటనంత వరకు అన్ని మంచివే.

కొంచెం తాగితే ద్రాక్షరిష్ట మంచిదంటారు, ఎక్కువ తాగితే తాగుబోతు ఎదవని తన్నండంటారు. 

.

ఇక మంచి ఏమిటంటే, చాలా కొత్త ఉద్యోగావకాశాలు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళకి మంచి ఉద్యోగాలు.

సినిమా వాళ్ళకు, కళాకారులకు కొత్తలోకాలు సృజించే అవకాశాలు.

మెటా వర్స్ కోసం ఆడిన్స్ తయారు చేసే కంపెనీలు.,

అక్కడా ఆడ్ ఏజన్సీలు. 

మన కంపానీలు మెటా వర్స్ లో ఆఫీసులు తెరచినా ఆశ్చర్య పడక్కర్లేదు. 

అక్కడ పర్యవేక్షించడం సులభం మరి.  

పెళ్ళిళ్ళు , పేరంటాలు, దైవ దర్శనాలు అన్నీ మెటాలోనే.

దీనిని మనం ఆపలేం. 

దీనికి ముందు ఇంటర్నేట్ లాంటి చాలా వాటిని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యాం. 

మన గత అనుభవాలనుంచి నేర్చిన పాఠాలతో మనం ముందుకు వెళ్ళాలంతే.

కొత్త బంగారు లోకం :-)

Saturday, August 14, 2021

కురుతి (మలయాళం) : బలి - KURUTHI

 కురుతి (మలయాళం) : బలి

మంచి నటుడికి చెడ్డ పాత్రలేమి ఉండవ్. విలనా హీరోనా తేడా ఉండదు. పృథ్విరాజ్ (లాయిక్) గా నటించిన కురుతి, హిందు ముస్లిం గొడవల ఆధారంగా తీసిన సినిమా. నాకు నచ్చింది. పృథ్విరాజ్ వి గతంలో చూసిన సినిమాల ఆధారంగా అతని పాత్ర మీద ఎంత బలం ఉంటుంది అని అనుకున్నానో, అంతకన్నా బాగానే ఉంది.





Spoiler alert:
మనిషి చేసిన తొలి పాపం "పండు" తినడం కాదు, కాబిల్ అసూయ ద్వేషాలతో తన తమ్ముడు హాబిల్ ను చంపడం మనిషి తొలి పాపం అంటాడు.
కాఫిర్ కాఫిర్ అంటూ ఆ ద్వేషం ఒక ముస్లిం నుంచి ఇంకొక ముస్లిం కి పాకుతుందో, ఒక ముస్లిం ముసలతన్ని పొరపాటున చంపి, కనీసం పశ్చత్తాపం పడని ఒక హిందూ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో.. ఇలా చాలా పాత్రదారుల ప్రవర్తనల గురించి సినిమా.
అంతర్లీనంగా, మనిషుల సమస్యలు మతం వల్ల కాదు ఒకరంటే ఒకరికి "ద్వేషం" వల్ల అని చెప్పే ప్రయత్నం.
ఐతే నేను దీనితో ఏకీభవించను. మనుషులు ఒకరినొకరు ఊరికే ద్వేషించుకోరు. హాబిల్ కి దక్కింది తనకి దక్కలేదనికి, కాబిల్కి అసూయ. అల్లా కాబిల్ కి అదికారం ఇచ్చుంటే, హాబిల్ని ప్రేమగా చూసుకునే వాడేమో ? అక్కడ సమస్య అసుయ ద్వేషం కాదు. పవర్. ఫ్రెడ్రిక్ నిషే చెప్పినట్టు, విల్ టు పవర్. అధికారం, శక్తి మనిషి అహం (ఇగో ) సంతృప్తి పరుస్తాయి. అందుకే తిండికి లోటు లేని (ప్రాణం నిలబేట్టుకోడం మొదటి పశు ప్రవృత్తి) ప్రతి ఒక్క జీవి పవర్ కోసం పాకులాడుతుంది. నడిపించేది అదే.
బలవంతుడిని ఎదిరించలేని బలహీనుడు పది మందినీ వెంటేసుకు పోతాడు. సిం హం ఎంత బలంగా ఉన్నా వేట కుక్కలు గుంపు ముందు తోక ముడవాల్సిందే, అది ప్రకృతి.
బలవంతుడి సమస్య నెగ్గడం తో తీరిపోతుంది. బలహీనుడికి నెగ్గిన తరువాత మొదలవుతుంది !
ఎదేమైనా అలోచింప చేసే సినిమా !

Monday, July 5, 2021

అమృతమన్న ఆశే లేదు, హాలాహలమన్న హడలూ లేదు

 అమృతమన్న ఆశే లేదు

హాలాహలమన్న హడలూ లేదు

దేవ దానవుల మధ్య తారతమ్యము పట్టదు

ఉన్న దొకటే ఎల్లలు లేని కరుణ

.

అమృతాన్ని అందరికీ పంచి

హాలాహలన్ని గొంతులో ఉంచి

తండ్రి మనసు తెలిపావు

నీ తత్త్వ మిది శంకరా !

.

సత్తె కాలపోడని పిల్లలనుకుంటారు

భోల శంకరుడని భక్తులనుకుంటారు

నీకు తెలియక కాదు

నీ మనసు మాకు తలియక !



మదిని నిశ్చలముగ వెలుగు 

నీలకంఠా ! 




Sunday, June 27, 2021

Human Vs Dasavatara - మనిషికి , ధర్మానికి & దశావతారాలకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకునే నా ప్రయత్నం

 




మనిషి జంతువుగా ఉన్నపుడు,
మేధస్సు ఉన్నా అది ప్రకృతికి ఆటంకం కలిగించనంతవరకూ అసలు దేవుడు దిగి రావల్సిన అవసరం పడలేదు
ఎప్పుడయితె మనిషి మేధస్సు ప్రక్ర్తికి హాని చెయ్యడం మొదలు పెట్టిందో 
ఎప్పుడయితే మనిషి మేధస్సు మానవాళికే ముప్పు కలికించడం మొదలు పెట్టిందో అప్పుడు దేవుడు ధర్మం నడుస్తున్న పరిస్తితిని బట్టి అవతారాలు ఎత్తడం మొదలు పెట్టాడు.
సమస్య ఎప్పుడయితే బయట నుంచి మనిషి లోకి వచ్చేసిందో, మానవ పక్షపాతి అయిన దేవుడు, శారిరక బలం తో కూడి బలం ఉపయోగించే అవతారాలను వదిలి బుద్ధి బలం తో మనిషిని మార్చి మర్గం చుపించే అవతారాలను ఎత్తాడు.
నాకు ఈవిధంగా అర్థ మయిన విషయాన్ని మీకు సులభంగా చెప్పాలని ఒక బొమ్మలా వేశాను. చూసి నా అభిప్రాయం సరి అయినదో కాదో కింద కామెంట్సులో చెప్పండి !

Media - బూతు సంభాషణలు, సన్నివేశాలు

 మన సంసృతిని ఆచారాలను నిలబెట్టే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్తవి కనిపెట్టే ప్రయత్నంలో, పాతవాటికి కొత్త రంగులేసి మార్కెట్లో దింపుతుంటారు.

ఉదాహరణకు అప్పట్లో తిరునాళ్ళు ఇప్పుడు షాపింగ్ మాళ్ళు.
మరి పళ్ళు తోముకునే కచిక, ఇప్పుడు కోల్గేట్ చార్కోల్.
.
సినీ / టివీ మధ్యమాలు.. అలా మరుగున పడిపోతున్న ఒక కళని పునరుద్ధరించి, జన ప్రాచుర్యం కల్పించి, సామాజికంగా అధికార కళగా గుర్తింపుతీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
సంగీతం కన్నా, సైన్సు కన్నా ముందు పుట్టింది ఈ కళ.
ఇద్దామనుకున్నా వద్దనుకున్నా, పెద్దల నుంచి పిల్లలకు సంక్రమించే తప్పనిసరి ఆస్తి.
.
పూర్వం నూతుల దెగ్గర, చెరువు గట్ల దెగ్గర, కూడళ్ళలో, కుళాయిల దెగ్గర.. ఇలా ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ ఈ కళ పరిఢవిల్లేది.
.
అదే బూతు కళ.
ఒక రాప్ మ్యూసిక్ ఫైట్ లాగ, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం.
ఎదో చిన్నగా మొదలు పెట్టి, అమ్మలక్కలు , చుట్టాలు, వావివరసలు, కుటుంబాలు , సాంప్రదాయాలు దేశాలను కుడా జ్ఞప్తి చేసుకునే వినూత్న సాధనం.
బూతు ఒక భాష అనుకుంటారేమో, కాదు అది ఒక కళ. భాషా భేదాలు, ఎల్లలు లేని అనంత సాగరం. సర్వ భాషా సమ్మేళనం సార్వజనినం.
.
విదేశి కరణ, ఇంగ్లిష్ చదువుల వల్ల ఒకటి రెండు తరాలు ఈ కళని మర్చిపోయాయి. ఎక్కడో మారుమూల గ్రామాలకు నిమిత్తమయిపోయింది ఈ కళ.
నాటు సరుకు బదులు, ఫారిన్ సరుకు లా కొత్త తరాలు "షిట్" "ఫక్" లకు పరిమిత మయ్యిపోయాయి.
ఇక వీటికి పెద్ద పీట వేసి మూడొ తరగతి పిల్లలు కూడా రోజు ముప్పై సార్లు వీటి జపం చేస్తున్నారు. కాస్త పెద్దవారు చదుకున్నవారు అయితే అప్పుడప్పుడు ఎదో "బుల్షిట్ అనో", "ఎం ఎఫ్" అనో అనుకుంటారు.
ఇక్కడ విజ్ఞులు ఒకటి గుర్తించాలి, భాష ఎదైనా , కాలం ఏదైనా , ఆడవారిని గౌరవించు కోవడమే ఆనవాయితి. మిగతా అన్ని బూతులు ఎదో చిన్నా చితక, అంత లెక్క లేవు.
.


.
ఇటువంటి పరిస్తితిలో, బూతు కళను నిలబేట్టే ప్రయత్నం సినిమాలు చెస్తున్నాయి.
ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఓటిటి గురించి.
ఓటిటి పుణ్యమా అని బూతు కళకు రాజయోగం పట్టింది.
"A picture is worth 1000 words " అనుకుంటున్నారేమో
బూతులు కేవలం సంభషనలకే పరిమితం కాకుండా సన్నివేశాల్లో కూడా చూపిస్తున్నారు.
ఇక యూ ట్యూబులో కొంత మంది మహిళలు కూడా వెబ్ సిరిస్ లో పేరుతో చక్కని సంభాషనలతో మేము నేటి మహిళలము, అబలలు కాదు అని నిరూపించుకుంటున్నారు.
కొన్ని కొత్త ఆవిష్కారాలు కూడా చేసారు.
ఉదా:
చెప్పాల్సింది : హాస్పటల్లో మందువేస్తే , ఇంటికి వచ్చాకా జ్వరం తగ్గింది.
హెడ్డింగు : అక్కడ అలా చేస్తే , ఆమెకు ఇంకెక్కడో ఇది అయ్యింది.
ఇది బూతు మాట్లాడకుండా, మాట్లాడ్డం. యద్భావం అన్నట్టు.
.
బూతు సంభాషణలు, సన్నివేశాలు పరిపక్వత చెందిన సంఘ లో నాగరీకులుగా మనమూ ఆదరిస్తున్నాం/హర్షిస్తున్నాము.
మనతో పాటూ సినిమాలు / సిరిస్ లు చూస్తూ మన పిల్లలూ పరిణితి చెందున్నారు, ఆదర్శ పౌరులుగా తయారు అవుతారు.
- ధన్యవాదాలు , ఇట్లు మీ చాదస్తం

Song for an upcoming short film



 1.నవ్వుతొ నను పిలిచీ

కళ్ళతొ పడతోసి

ప్రేమలో నను ముంచీ

మది గెలిచావే !


2. ఉదయపు వెలుగులలో

 సాయం సంధ్యలలో

తరగని నీ తలపే

మార్చేసావే (ఓర్) నను మార్చావే


3. నువ్వొక రాణివై

మదిలో తలపుల్నే

నీ వైపే తిప్పేసి

మనసు నిండావే


4. నువ్వొక సైగచెయ్

అ పైన తారల్నే

భువి పైకే దింపేసి

నీకు కిస్తానే (ఒర్) నీ కోసం మెత్తంగా పానుపేస్తానే


5. నాదైన ఒకె ఒక్క లవరే

నిను చూసినాక్షణమే

నాలోకం నీవాయె

యు ఆర్ మై వన్ అండ్ ఒన్లీ



6: ''


7: మెరిసే జాబిలివే

కురిసే వెన్నెలవే

విరిసే కలువలవే

నను ముంచావె


8: పెదవుల మధురిమతో

పరువపు అంచులలో

ప్రణయపు కౌగిలిలో

సెగ రేపావె


9: గగనం చీకటై

గాలులు చల్లగా

నీ స్పర్శే కాల్చేసే

ఒడిలో ఒదిగావే


10: పరువం పానుపై

శ్వాసలు ఏకమై

నీ వయసే మింగేసే

నన్ను తొలివలపై


11. నాదైన ఒకె ఒక్క లవరే

నిను చూసినాక్షణమే

నాలోకం నీవాయె

యు ఆర్ మై వన్ అండ్ ఒన్లీ


12 ''


------బి గి ఎం ----

13. నితో నేను గడిపిన కాలమే

సరదాల సిరి వానె

ఆ తలపుల నే తడుస్తూ

నిలిచి పోవా లే



14. నువ్వు నేను కలిసిన సమయమే

నూరు ఏళ్ళు నిండాలే

నీ ప్రేమలో నే తేలుతూ

గడచి పోవా లే



15. నాదైన ఒకె ఒక్క లవరే

నిను చూసినాక్షణమే

నాలోకం నీవాయె

యు ఆర్ మై వన్ అండ్ ఒన్లీ

Sunday, January 10, 2021

మనువాద సమాజం ?

 మనవాద సమాజం అన్నారు 

ఎ మనువాద సమాజం ?

ఏ మనువాదాన్ని మీరు ఫాలో అవుతున్నారు ? 


మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయ్ 

అంటే 14 మంది మనువులు 


స్వాయంభువ మన్వంతరము

స్వారోచిష మన్వంతరము

ఉత్తమ మన్వంతరము

తామస మన్వంతరము

రైవత మన్వంతరము

చాక్షుష మన్వంతరము

వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము

సూర్య సావర్ణిక మనవు మన్వంతరము

దక్షసావర్ణి మన్వంతరము

బ్రహ్మసావర్ణి మన్వంతరము

ధర్మసావర్ణి మన్వంతరము

భద్రసావర్ణి మన్వంతరము

దేవసావర్ణి మన్వంతరము

ఇంద్రసావర్ణి మన్వంతరము


ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది.

ఇప్పుడు మనం 28 వ మహాయుగంలో ఉన్నాం


అంటే వైవస్వత  మన్వంతరము కలియుగంలో ఉన్నాం...


కృతయుగంలో "మనువు" రచించిన ధర్మశాస్త్రం ప్రమాణం

త్రేతాయుగంలో "గౌతముడు" రచించిన ధర్మశాస్త్రం

ప్రమాణం

ద్వాపరయుగంలో "శంఖలిఖితుల' రచించిన ధర్మశాస్త్రం

ప్రమాణం

>కలియుగంలో "పరాశరుడు" రచించిన ధర్మశాస్త్రం

ప్రమాణం


ఇప్పుడు ప్రమాణం కానిదీ, వ్యవహారంలోలేనిద ఐన

మను ధర్మ శాస్త్రాన్ని నిరసించడం, మనువాదం,

మనువాదులు అని ఒక వర్ణాన్ని అవహేళన చేయడం,

సనాతన ధర్మం పై ఒక ప్రణాళిక ప్రకారం మ్లేచ్చులు మొదలు

పెట్టిన దాడిని, మరింత ద్వేషం తో, ఆక్రోశం తో ఎడారి మతాలు ఇలా స్వదేశీయులని రెచ్చగొట్టడం

కొనసాగించడం తప్ప ఇతర కారణాలు కనబడవు.


ఇక ఈ ధర్మశాస్త్రాలలో ఏమి ఉంటాయి? రాజ్యాంగంలో

ఏమేమి అంశాలుంటాయో అవీ, వాటితోపాటు

ధర్మపాలనం ఉంటాయి. అలాగే రాజ్యాంగం

అనుమతించిన శిక్షాస్మృతిలో ఉంటాయో

ధర్మగ్రంథాలలోనూ అధర్మం చేసిన వారికి "ప్రాయశ్చిత్తము

లూ, శిక్షలూ, నెరపిన అధర్మం యొక్క తీక్షతని బట్టి రెండూ

ఉంటాయి"


మనుధర్మ శాస్త్రంలో మనిషి పుట్టుకప్పటినుండీ

జరపవలసిన నామకరణం నుండి ఉన్న షోడశ కర్మలు

చెప్పబడ్డాయి. గురువుని ఎలా గౌరవించాలి చెప్పబడింది.

అతిథిని ఎలా పూజించాలో చెప్పబడింది. ప్రభువు ప్రజలని

ఎలా కాపాడాలి, ప్రభువు సేవకులను ఎలా పరీక్షించాలి.

ప్రభువు వాడే వస్తువులను ఎలా జాగ్రత్త పరచాలి,

శత్రువుల బెడదలేకుండా ప్రభువుకొరకు చేసిన ఆహారాన్ని

ఎలా పరీక్షించాలి. వ్యాపారంలో కొలతలు, తూనికలు ఎలా

ఉండాలి వాటిని తరచూ ఎలా పరీక్షించాలి. తండ్రి తాను

సంపాదించిన ద్రవ్యాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు, ఎలా

ఇవ్వవచ్చు. ఆస్తులు పంచుకుంటే అప్పులు పంచుకోవడం

ఇవన్నీ మనుధర్మశాస్త్రంలో చెప్పారు. మన

రాజ్యాంగంలోనూ, రాజ్యాంగానికి అనుగుణంగా

చేయబడిన చట్టాల ద్వారా ఇవేగా మనకి ఇప్పుడు

అందుబాటులో ఉన్న వి


మనువు అందించిన ధర్మ సూత్రాలలోని కొన్ని

ముఖ్య మైనవి


పర స్త్రీ తనకు గౌరవనీయురాలనీ, ఆమెను సోదరిగా

భావించి "సోదరి" అని పిలవాలి. పరస్త్రీ వ్యామోహం

ఆయుక్షీణం ని కలిగిస్తుందనీ మనువు చెప్పాడు. (ఇవి

ఆచరించకనే, దీన్ని చదవద్దని చెప్తే పర స్త్రీతో ఎలా

మెలగాలో తెలియజేయలపోతేనే కదా నిర్భయ ఘటనలు

పునరావృతం అవుతున్నాయి)


కన్యా దానం లో ధనం తీసుకోవడం తప్పని, అలా చేస్తే

సంతానాన్ని అమ్ముకున్నవాడౌతగాడనీ మనువు చెప్పాడు.


ఇంటికి వచ్చిన "అతిథుల కులగోత్రాలను అడగడం -

వాంతి చేసుకున్న అన్నాన్ని పెట్టడంతో సమానం" అని

మనువు చెప్పాడు. (ఇది చాలదా మనువు

మానవత్వవాది అని చెప్పడానికి)


-ఎవరు గురువు, ఎవరు ఉపాధ్యాయుడు, ఎవరు

ఆచార్యుడు. చదువు చెప్పటానికి ఎవరు యోగ్యులు.

మితమైన ఆహారం ఎందుకు తీసుకోవాలి. భోగలాలస

ఎందుకుండకూడదు.


శ్రద్ధ తో పెట్టకపోతే ఎంత శ్రోత్రియుడిచ్చన అన్నమైనా

తినరాదు. చేసిన మంచిపనిని ఇతరులకు చెప్పి

డాంబికానికి పోకూడదు. (ఎక్కడ ఎవరికి

పెద్దపీటవేయాలో, అధర్మం చేస్తే ఎంత శిక్షవేయాలో

విస్పష్టంగా చెప్పబడింది)


> తేనెటీగలు ఏవిధంగా కొద్ది కొద్ది ఆహారం సేకరిస్తాయో

రాజు కూడా ప్రజలను కష్టపెట్టకుండా కొద్ది కొద్ది మాత్రంగానే

పన్నులు తీసుకోవాలి.


దోపిడీ దొంగతనాలకు, ఇళ్ళు తగలబెట్టడం వంటి

నేరాలకు శిక్ష కఠినంగా ఉండాలి.


 పెద్దలైనవారు వచ్చినప్పుడు ఎలా నమస్కరించాలి.

మంత్రులుగా ఎలాంటి వారిని నియమించుకోవాలి. లాంటి

ఎన్నో విషయాలు మనువు చెప్పాడు.


-సదాచారము వల్లనే దీర్ఘాయువు, సంపత్తి, విజ్ఞులైన

సంతానము కలుగుతారని చెప్పాడు. (సంసారులెవరూ

ఎవరూ పరిథులు దాటి, విశృంఖలంగా ప్రవర్తించాలి

కోరుకోరుగా, కుటుంబాన్ని ఆదరంగా పద్ధతిగా ఉంచుకుని

పిల్లలను పద్ధతిగానే పెంచాలని కోరుకుంటారు)


ఐతే అలాంటి గొప్ప విషయాలు చెప్పిన మనుస్మృతిని

అనేక రకాల విమర్శలకూ, కువిమర్శలకూ కూడా గురి చేసి

దానిని కాల్చేయడం వంటి అర్థం పర్థం లేని పని. దాని వెనక

కారణంగా మనుస్మృతిలోని అతి కొన్ని వివాదాస్పద

సూత్రాల వల్ల అని తెలుస్తుంది. వాటిలో కూడా

హెచ్చుశాతం అవగాహనాలోపం వల్లనూ, సంస్కృత భాషా

పరిచయం, పరిణతి తగ్గించడంలో మెకాలేవంటివారు

కృతకృత్యులవడం వల్లనూ, దేశం వదిలిన బౌద్ధులు తిరిగి

ఎరుపురంగు రూపంలో ప్రవేశించి దానికి జీవం పోయడం

వల్లనూ జరిగింది. పునరుక్తి కాదుకానీ, ఎప్పటిదో కాలానికి

సంబంధించిన ధర్మ గ్రంథాన్ని ఈ కాలానికి అన్వయం

చేసుకుని అది మాకు నచ్చలేదు కాబట్టి కాల్చేస్తాం అనడం,రాసినోన్ని నరికేస్తా అనడం 


అలాగే సనాతన ధర్మం లో వర్ణాశ్రమ ధర్మాలు

పాటించేవారిని హేళన చేయడం హేయమైన పని


_ సనాతన ధర్మం.....


Source :- Meghana Mukunda

Saturday, January 2, 2021

హిందూ మతంపై దాడులు

నాలుగు డబ్బులు పోగేసి, ఏదో ఇటుక రాయి తెచ్చి

గోడలు కట్టి సున్నాలేస్తే అయిపోయేవి కాదు మా గుళ్ళు !

యోగుల తపశ్శక్తితో, మహాత్ముల సంకల్పంతో మంత్ర యంత్రాలతో స్థాపించినవి !



రాజకియ లబ్ది కోసమో, మత మౌఢ్యం తోనో , గుళ్ళు పగలకొట్టి, మళ్ళీ అభివృద్ధి చేసేద్దాం అంటే 

అహింస అహింస అని ఊరుకోడానికి , హిందువులు వెన్నులేని వారుకాదు !

వందల సంవత్సరాలు ఇంతకు మించిన కుయుక్తులు పన్నినా, దారుణాలకు ఒడికట్టినా..

మా పూర్వికులు ప్రాణత్యాగం చేసారెతప్ప మారిపోలేదు !

ఎక్కువ చదువుకున్న మా తరం , వారి త్యాగాలు గుర్తు చేసుకుంటే చాలు !


దేవాలయాల సొమ్ముతిని తెగబలిసిన దుర్మార్గులు,

దేవుడి విగ్రహాలు పగలకొట్టి, 

రధాలు కాల్చి ,

ఆస్తి నష్టం కలుగచేస్తుంటే 

ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి కొమ్ముకాసేది కాంగ్రస్ అయినా, జగన్ కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా.. బీజేపీ అయినా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహుని రధ చక్రాలకింద నలిగిపోవల్సిందే !




Friday, January 1, 2021

బంధు మిత్రులందరికీ 2021 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు , ఎరుగనివారికి ఎదుటే ఉన్నాడు

మానవుడై పుట్టి మాధవుడైనాడు , తలచినవారికి తారకనాముడు
.
పిలిచిన పలికే చెలికాడు సైదోడు
కొలువై ఉన్నాడూ కోదండరాముడు
మనతోడుగా నీడగా రఘురాముడు
.
మనసెరిగినవాడు మా దేవుడు, శ్రీరాముడు
మధుర మధుర తర శుభనాముడు, గుణధాముడు
మనసెరిగినవాడు మా దేవుడు, శ్రీరాముడు
.
నూతన సంవత్సరం పెద్ద పెద్ద "రిసల్యూషన్" తీసుకోనక్కరలేదు, రాముడి ని అర్థం చేసుకుంటే, హనుమంతుని అడుగు జాడల్లొ నడిస్తే చాలదా?




బంధు మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు !