వార్తలలో చదివాను, ఎలుకల తలలు మార్చారు అని, త్వరలోనే మనిషి తలలు మారుస్తారని !!
సృష్టికే ప్రతి సృష్టి. అద్భుతం.
** కాస్త జాగ్రత్త వహించండి తలలు మార్చే వాళ్ళు చైనా వాళ్ళు,
నకిలి తలలు, జంతువుల తలలు తగిలించెయ్యగలరు !
1. మున్ముందు కేవలం తలలు, కేవలం మొండాలు రోజులు వస్తాయ్ (రాహు కేతువుల్లాగ)
2. ఒక తలకు బోళ్ళెడు మొండాలు, బట్టలకో అవసరాలకో తగ్గట్టు
3. తరువాత పుర్రె లోపల మెదడు మాత్రమే మార్చగలుగుతారు, అంటే మొత్తం శరీరం ఆరోగ్యమయిన భాగాలతో కలిపి తయారు చేసి అందులో రోగి మెదడు పెడతారు
4. ఇంకొన్నాళ్ళ తరువాత మెదడు కూడా మార్చక్కర్లా ... రోగి మెదడుని ఆరోగ్యమయిన శరీరం లో ఉన్న మెదడు లోకి నకలు ('కాపి ') చేస్తారు, అవసరం అయితే కావాల్సిన జ్ఞానం (from computers) అంతా కలిపి ఒక మెదడులో పెడతారు, అంతెందుకు పిల్లలకు పుట్టుకుకతోనే లౌకిక మైన జ్ఞానం 'కాపి ' చేస్తారు.
5. కాబట్టి డబ్బున్నవాడు ఇక చావడు, అలాంటి రోజు వచ్చే దాకా ప్రళయం రాదు. :-)
ఇక్కడ ప్రళయం వస్తుంది అని ఎందుకంటున్నానంటే, మత్సావతారంలో విష్నువు హయగ్రీవుడు అనే అసురుని
బారి నుండి వేదాలను కాపాడాడంట, తరువాత సత్యవ్రతునికి కనిపించి ప్రాణి కోటిని ప్రళయం నుంచి కాపాడాడంట. హయగ్రీవుడు గుర్రం తల మనిషి మొండెం కలవాడు, గుర్రం తల వేగానికి జ్ఞానానికి గుర్తు, కాబట్టి తలలు మార్చే జ్ఞానం వచ్చిన రోజు తరువాత ప్రళయం వచ్చే సూచనలు ఉన్నాయి అనుకుంటున్నా.
ఇక్కడ నేను తలలు మార్చడం తప్పు అనట్లా, అసలు తప్పొప్పులు మాట్లాడట్లా. జరగాలని రాసి పెట్టి ఉంటే మనం దానిని ఆపలేము !
ఇంతకి చెప్పాలనుకున్న విషయం వేరే, పై వన్నిటిని బట్టి ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది..
మనం మన మొండెం కాదు
మన మొహం(పుర్రె/బుర్ర ) కాదు
మనం మన ఆలోచనలు కాదు
మనం మన జీవితం కాదు
మనం కేవలం ఒక చైతన్యం
ఈ నిమిషం ఉండి మరు నిముషం మాయమయ్యే ఒక చైతన్యం.. అంతే !
అందరి లోనూ అదే చైతన్యం
అసలు మనం ఒక్కొక్కళ్ళు ఒక చైతన్యం కాదు, అందరిలోను ఒకటే రకమయిన చైతన్యం
అది అర్థం అర్థం చేసుకున్న రోజున అద్వైతాన్ని అర్థం చేసుకుంటాం
లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటాం !!