15 కోట్లు పెట్టి తీసి, 5.5 కోట్లు సంపాదించి(7-8 కోట్లు బొక్క), 2.3 రేటింగు ఉన్న ఒక హిట్టు సినిమా గురించి సర్కాస్టిక్ పోస్టు.
*
ఒక వెనుకపడిపోయిన లేడీ సూపర్ స్టార్, తిరిగి ట్రాకులో పడాలంటే,
మెజారిటీలయినా నోరువిప్పని కొన్ని మూగ మనసుల్ని రెచ్చ గొట్టి సినిమా ఎలా ఆడించాలి,
ఆ లేడీ 75వ చిత్రం కేడి లా ఆలోచించి కధ ఎలా రాయాలి.?
ఎలా అంటే,
*
ఓ బామ్మర్లమ్మాయి, గుళ్ళో ప్రసాదం తయరు చేసే ఆయని కూతురు.
చిన్నప్పటి నుండి వంట బాగా చేస్తుంది, వంటగత్తె కావాలనుకుంటుంది.
నాన్వెజ్ గొడవ ఎందుకు మనకు వద్దు అంటాడు తండ్రి.
అంత వంటలక్క అయిన అమ్మాయి కి క్లారిటీ ఉంటుంది,
"షెఫ్ఫుల్లో వెజ్జు షెఫ్ఫులూ ఉంటారూ, కేవలం వెజ్ కోర్సులూ ఉంటాయీ" అని చెప్తుంది అని అనుకుంటారు మీరు,
కాని అలా చెప్పదు, జస్టు బాధ పడి ఊరుకుంటుంది. ఇది ఒక ట్విస్టు.
అప్పుడు కనిపించని దేవుడిలా, FARHAN అనే మితృడు వచ్చి అక్షరాలా
"ఇన్నాళ్ళూ నీ తల్లి తండ్రుల మాట విని సమయం వృధా చేసుకున్నావు, ఎన్నాళ్ళని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటావు, హొటల్ మేనేజ్ మెంట్ కోర్సుకు అప్లయ్ చెయ్ అంటాడు", వాడి మాట వింటుంది, వాడే వద్దని చెప్పినా. ఇదొక జోకు, ఇక్కడ నవ్వాలి మీరు.
ఆవిడకు వంట కావాలి, ఈయనకు వంటగత్తె కావాలి.
వాడూ అమ్మాయి కోసం, కోర్సు జాయిన్ అవుతాడు, తరువాత మామూలుగా ఫ్రిడ్జులో చికెన్ పీసుల మధ్య దొరుకుతుందని మీరు అనుకుంటారు, కాని అలా కాదు, ఇది ఇంకొక ట్విస్టు.
అప్పుడూ, ఆ అర బుర్రది, కాదు కాదు అసలు బుర్రలేని,
చికన్ కొయ్యబోయి కళ్ళు తిరిగిపడుతుంది మన అగ్రహారం అన్నపూరని.
*
మళ్ళీ అదృశ్య దేవుడు ప్రత్యక్షం, ఫర్హాన్ కర్మ గీత,
"కస్టమర్లే దేవుళ్ళూ, అయ్యప్ప మాల వేసుకున్నా మాంసం అమ్మరా?" అంటాడు.
అప్పుడు మన అరకోడి, సారి అగ్రహారం అమ్మాయి "అయ్యో, మాదసలే క్లాసికల్ ఫామిలీ" అంటుంది.
అప్పుడు ఫర్హాన్ ఇలా బోధిస్తాడు,
"అత్ర తత్ర మత్ర, తత్ర మత్ర గత్ర, మచ్చ చస్వమత్ర" కాబట్టి రాముడూ లక్షణ్ భాయ్ Non-Veg తిన్నారూ,
మురుగన్ జంతువుల్ని వేటాడే వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు(మనసులో ఆల్మోస్టు నాన్ వెజ్జు తినే ఉంటాడు),
కన్నప్ప శివుడికి పంది మాంసం పెట్టాడు (అందుకే మాకు పంది పడదు)
కాబట్టి ఏ దేవుడూ VEGETERIAN కాదు,
SO నువ్వు ఏం తినాలో చెప్పడానికి ఎవరూ సరిపోరు , నువ్వు నీ ఇస్టాన్ని బట్టి తిను" ,
అని రామబాణం వేసి, శివ పినాకం తో ఒక్కటి పీకుతాడు, ఫర్హానావధాని.
దెబ్బకి ఆగ్రహారం అమ్మాయి కళ్ళు కుక్కర్ విసిల్లా తెరుకుంటాయి.
నువ్వు కుక్కవడమే నాకు సంతోషం అంటాడు.
అప్పుడా కుక్కి కోడిని ముక్కలు ముక్కలు చేసి చూపిస్తుంది. అదృశ్య గీత పని చెయ్యకమానుతుందా?
.
తినకుండా వండడం ఎలా?
అందుకని గుడ్డు తినడంతో మొదలయ్, దానమ్మ అమ్మమ్మలను, నడీచేవి,ఈదేవి కూడా లాగించేస్తుంది, మద్యలో కొన్ని తండ్రిగారి ముక్కు మూసుకునే పూజలు మిక్స్ చేసి, మాల వేసుకున్నవాళ్ళని చూపించారు, మసాలా తగలాలిగా.
మసీదులోంచి వచ్చిన ఫర్హాన్ మరియు మన మణిహారం ఒక తౌడు గిన్నె పై మూత అంత ప్లేటులో లో ఫర్హాన్ అమ్మ బీబీ వడ్డించిన బీఫ్ బిర్యాని తింటుంది, మీరిక్కడ నుంచే ఏదో లవ్జిహాద్ మొదలవుతుంది అనుకుంటారు, కాని రంగరాజనుగారికి చికెన్ తింటున్న చిన్నారి కూతురు చిక్కిపోతుంది.
అప్పుడు కర్కోటక బ్రాహ్మణులు రంగరాజను గారిని ప్రసాదం చెయ్యొద్దంటారు.
కట్ చేస్తే కోడిని తిన్న కోమలికి నిలువ బొట్టు శేకర్తో కల్యాణం కుదురుస్తారు.
మళ్ళీ ఫర్హానుడొస్తాడు (FARHAN alias HERO alias SANGHA SAMSKARTA).
అగ్రహారం అమ్మాయి నాన్నమ్మ, "ఈ మడి ఆచారం సాంప్రదాయాల వల్ల నేను ఆటక మీద ట్రంకు పెట్టెలా ఉండిపోయా, నువ్వన్నా వెళ్ళి ఐసు పెట్టెలో.. కాదు కాదు, గెలువుపో" అంటుంది. వాళ్ళిద్దరూ (FARHAN & AP) చెన్నై జంపు.
బయటకు వెళ్ళి పిల్ల జంపు విథ్ జిలాని అని చెప్తుంది అభినవ ఆటక మీద ట్రంకు మామ్మ.
అలా శ్రీరంగం నుండి చెన్నై చేరిన అన్నపూర్ణి, పూర్ణంగా కోడిల్ని కుక్కల్నీ ఎలా వండుతుందో, ఎలా ఎదుగుతుందో అన్నదే కధా వస్తువు.
ఫర్హానుడు రంగాచారి ప్రదిక్షణాలు సరిగ్గా చెయ్య్లేదని చెప్పడం హైలైటు, ఇలాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో..సీన్ టు సీన్ చెప్పెయ్యాలి, కాఫీ రైటు సమస్య వచ్చేస్తుంది.
హిందూ సాంప్రదయాలు ట్రాషు అన్న మామ్మ మాటవిని బొట్టు తీసేసి నమాజు చేస్తుంది, బిర్యాని చెయ్యలంటే బేబి హబిబి బిబి అవ్వాలి మరి.
బాక్ గ్రవుండులో అలా ఇలా అని పాట వస్తుంటే బిర్యానిలో కూసింత ఉమ్మేస్తుందని మీరు అనుకుంటారు, కానీ అలా జరగదు, అగ్రహారం అమ్మాయిలు ఇంకా అలా చీకట్లోనే ఉండి టీవీ చూస్తుంటారు, కోడి తిన్న అగ్రహారం అమ్మాయి కత్తులు నూరి కాంపిటీషన్ నగ్గేస్తుంది, అదే మరి కధలో మలుపు.
మీరేమో ఇస్లాం గొప్ప అని తేల్చి చెప్పేస్తారు, సినిమాలో అనుకుంటారు,
కాని చివర్లో మాత్రం బిర్యానీకి మతం కులం ఏంటి? బిరియాని ఒక ఎమోషన్ అని అంటుంటే, ముస్లిం అత్తగారు కళ్ళు తుడుచుకుంటుంటే ఆ ఎమోషనల్ సీను బాగా మిగల ముగ్గింది .
అన్నేళ్ళు దేవునికి ప్రసాదం తయారు చేసే మహద్భాగ్యం కలిగిన ఉద్యోగంలో/సేవలో ఉన్నవాడు, మూర్ఖుడిలా తెగ తెంపులు చేసుకు ఉండిపోతాడు అనుకుంటారేమో మీరు, చివరికి వచ్చేటప్పటికి సేవ కాదు కూతురి చికెన్ వంటే ముఖ్యం అనుకుని, ఆధునికునిలా నాగరికునిలా, కన్న కూతురు కళ్ళెదుటే నల్లగుడ్డేసుకుని నమాజు చేసి పోటీలో నగ్గితే ఆనందపడతాడు. అది సినిమా అంటే.
.
సరే పోని ముస్లిము సంధ్యావందనమో,
తురకోడి తిరు నామాలో,
క్రిస్టియన్ ప్రసాదం తినడమో చూపిస్తారు అనుకునేరు ,
ఆశ దోస అప్పడం, అదేం కుదర్దు, తూచ్ పో.
ఇస్లాం మనకు ముద్దు, హిందు వద్దు.
*
ఈట్ డ్రింక్ మాన్ వుమన్ , చెఫ్ఫ్, బరంట్,కుక్ అప్ ఏ స్టోర్మ్ లాంటి సినిమాలు మిక్సీ కొట్టెయ్యడమే, ఇంటర్వెల్ తరువాత రెండోవ భాగం !
ఇక మిగతాది చూడాలంటే కప్పల కూర చూసినట్టు జుగుప్స కలిగి మానేసా.
నిజం చెప్పలంటే డైరక్టర్ని చెప్పుతో కొట్టే ఉద్యమం మొదలు పెట్టాలనిపిస్తుంది, ఆ బీపీ ఎందుకని మానేసా..
మనకెందుకులే, వెన్నెముకలు సద్దుకుని, మన ఆఫీసు పనులు మనం చూసుకుందాం !
NOTE: I am not against anyone eating NONVEG, its their choice, demeaning Hinduism to promote Islam is what is troubling in the movie. Not that i care for someone feeling bad, Just FYI.
జై శ్రీ రాం
ReplyDeleteశ్రీ రామ చంద్ర
ReplyDeleteఏంటయ్యా ఇలా....
ఇంకెత కాలం సనాతన ధర్మానికి కాని కాలం .🥹🥹🤦🤦
Yess.chepputho kadu .ilanti vallani desam ninche tarimeyyali
ReplyDelete