Wednesday, September 21, 2016

పెళ్ళం కాని ప్రియురాలు ఎప్పటికైనా పెద్ద తలనొప్పే



ఇదిగో ఇప్పుడే వచ్చేసింది
వడి వడిగా నా వెచ్చని నెచ్చెలి
అమ్మ ఆలి అందరూ మూడో జాము నిద్దర్లో ఉండగా
ఎవ్వరికీ తెలియ కుండా వచ్చి 
నిన్ను చూసి చాలా కాలమయ్యింది అంటూ
చక్కగా హత్తుకుంది
ఎడతెరిపి లేని వర్షంలో చలి కాగమంటూ
కునుకు పట్టనంతలా ఆదరించమంటూ
నీ పై నా ప్రేమ నూటికి నూటొక్క పాళ్ళు 
కావాలంటే ఉష్ణమానిని అడగమంది ;-)
పెళ్ళం కాని ప్రియురాలు ఎప్పటికైనా పెద్ద తలనొప్పే
తుమ్ముల పర్యంత మైనట్లు ప్రతినిముషం అపశకునమే 



కవిత్వానికి సమయం సందర్భం ఉండదు, వెళాపాళా ఉండదు, ఎప్పుడోకప్పుడు అలా వర్షించేస్తుంది, వీలయినంత ఒడిసి పట్టుకోవడమే ! ఇప్పుడే (3:30 AM) 101 జ్వరం వచ్చింది, చలి కూడా, తుమ్ములు, లక్షణాలన్నీ వివరిస్తూ నిద్దర్లోనే ఈ కవిత స్పురించింది, నవ్వించింది, నిద్దర మెళకువ వచ్చేసింది, మెళకువల నిద్ర, మెళుకువల నిద్ర, ఇక చేసేదేముంది, లేచి రాసేసా, మందు వేసుకున్నాక.