Sunday, June 27, 2021

Media - బూతు సంభాషణలు, సన్నివేశాలు

 మన సంసృతిని ఆచారాలను నిలబెట్టే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్తవి కనిపెట్టే ప్రయత్నంలో, పాతవాటికి కొత్త రంగులేసి మార్కెట్లో దింపుతుంటారు.

ఉదాహరణకు అప్పట్లో తిరునాళ్ళు ఇప్పుడు షాపింగ్ మాళ్ళు.
మరి పళ్ళు తోముకునే కచిక, ఇప్పుడు కోల్గేట్ చార్కోల్.
.
సినీ / టివీ మధ్యమాలు.. అలా మరుగున పడిపోతున్న ఒక కళని పునరుద్ధరించి, జన ప్రాచుర్యం కల్పించి, సామాజికంగా అధికార కళగా గుర్తింపుతీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
సంగీతం కన్నా, సైన్సు కన్నా ముందు పుట్టింది ఈ కళ.
ఇద్దామనుకున్నా వద్దనుకున్నా, పెద్దల నుంచి పిల్లలకు సంక్రమించే తప్పనిసరి ఆస్తి.
.
పూర్వం నూతుల దెగ్గర, చెరువు గట్ల దెగ్గర, కూడళ్ళలో, కుళాయిల దెగ్గర.. ఇలా ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ ఈ కళ పరిఢవిల్లేది.
.
అదే బూతు కళ.
ఒక రాప్ మ్యూసిక్ ఫైట్ లాగ, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం.
ఎదో చిన్నగా మొదలు పెట్టి, అమ్మలక్కలు , చుట్టాలు, వావివరసలు, కుటుంబాలు , సాంప్రదాయాలు దేశాలను కుడా జ్ఞప్తి చేసుకునే వినూత్న సాధనం.
బూతు ఒక భాష అనుకుంటారేమో, కాదు అది ఒక కళ. భాషా భేదాలు, ఎల్లలు లేని అనంత సాగరం. సర్వ భాషా సమ్మేళనం సార్వజనినం.
.
విదేశి కరణ, ఇంగ్లిష్ చదువుల వల్ల ఒకటి రెండు తరాలు ఈ కళని మర్చిపోయాయి. ఎక్కడో మారుమూల గ్రామాలకు నిమిత్తమయిపోయింది ఈ కళ.
నాటు సరుకు బదులు, ఫారిన్ సరుకు లా కొత్త తరాలు "షిట్" "ఫక్" లకు పరిమిత మయ్యిపోయాయి.
ఇక వీటికి పెద్ద పీట వేసి మూడొ తరగతి పిల్లలు కూడా రోజు ముప్పై సార్లు వీటి జపం చేస్తున్నారు. కాస్త పెద్దవారు చదుకున్నవారు అయితే అప్పుడప్పుడు ఎదో "బుల్షిట్ అనో", "ఎం ఎఫ్" అనో అనుకుంటారు.
ఇక్కడ విజ్ఞులు ఒకటి గుర్తించాలి, భాష ఎదైనా , కాలం ఏదైనా , ఆడవారిని గౌరవించు కోవడమే ఆనవాయితి. మిగతా అన్ని బూతులు ఎదో చిన్నా చితక, అంత లెక్క లేవు.
.


.
ఇటువంటి పరిస్తితిలో, బూతు కళను నిలబేట్టే ప్రయత్నం సినిమాలు చెస్తున్నాయి.
ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఓటిటి గురించి.
ఓటిటి పుణ్యమా అని బూతు కళకు రాజయోగం పట్టింది.
"A picture is worth 1000 words " అనుకుంటున్నారేమో
బూతులు కేవలం సంభషనలకే పరిమితం కాకుండా సన్నివేశాల్లో కూడా చూపిస్తున్నారు.
ఇక యూ ట్యూబులో కొంత మంది మహిళలు కూడా వెబ్ సిరిస్ లో పేరుతో చక్కని సంభాషనలతో మేము నేటి మహిళలము, అబలలు కాదు అని నిరూపించుకుంటున్నారు.
కొన్ని కొత్త ఆవిష్కారాలు కూడా చేసారు.
ఉదా:
చెప్పాల్సింది : హాస్పటల్లో మందువేస్తే , ఇంటికి వచ్చాకా జ్వరం తగ్గింది.
హెడ్డింగు : అక్కడ అలా చేస్తే , ఆమెకు ఇంకెక్కడో ఇది అయ్యింది.
ఇది బూతు మాట్లాడకుండా, మాట్లాడ్డం. యద్భావం అన్నట్టు.
.
బూతు సంభాషణలు, సన్నివేశాలు పరిపక్వత చెందిన సంఘ లో నాగరీకులుగా మనమూ ఆదరిస్తున్నాం/హర్షిస్తున్నాము.
మనతో పాటూ సినిమాలు / సిరిస్ లు చూస్తూ మన పిల్లలూ పరిణితి చెందున్నారు, ఆదర్శ పౌరులుగా తయారు అవుతారు.
- ధన్యవాదాలు , ఇట్లు మీ చాదస్తం

No comments:

Post a Comment