నిరాశా నిస్పృహలతో
పది వేల అడుగుల పై నుండి
విమానం కిటికీ లోంచి చూస్తోందో పిల్ల !
భూమి మీద నక్షత్ర సమూహాల మధ్య తరలిపోతున్న
ఓక తోక చుక్కలా కనిపించిందా బండి లైటు.
ఆ ఉహకి పాప పెదవులపై ఒక చిరునవ్వు విరిసింది
ఆ ఆనందం చంద్రుని వెన్నెలలో కలిసి అతని పై కురిసింది !!
అతని జేబులో సెల్లు చిన్నగా మోగింది,
మొన్న వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు అనే వార్త మోసుకొచ్చింది!
అతనింకా ఆలోచనలోనే ఉన్నాడు..
మంచి వారికెపుడూ చెడు జరగదని తెలియదతనికి !!
*
(ఫ్లైటు కిటికీ లోంచి చూస్తుంటే, ఒక సర్రియల్ ఫీలింగ్.
పై నుంచి నాకు నయనానందకరంగా వెలుగులు,
ఇళ్ళూ బళ్ళు నాకు చిన్న చిన్న మెరుపులు,
కాని వారెవ్వరికీ నా ఉనికి కానీ,
నేను ఈ సెకను వారిని చూస్తున్నా అని గాని,
మా ఈ మెరుపు పరిచయం కానీ
నా ఆనందం కానీ తెలియదు.. ఆ నిమిషంలో రాసిన చిన్న రాత !)


No comments:
Post a Comment