అరస్టు చెయ్యాలంటే
మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి. Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
Monday, December 16, 2024
అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్టు?
Monday, December 9, 2024
పిల్లలు - సినిమాలు - రోల్ మోడల్స్
నేను నా చిన్నప్పుడు 4 - 10 వ తరగతి దాకా హాస్టల్లో ఉండి చదువుకున్నా.
మాది మిలటరీ డిస్సిప్లిన్ స్కూల్.
ఫ్రెండ్సే లోకం , క్లాసుమెట్లు, సీనియర్లు , జూనియర్లు , సూపర్ సీనియర్లు ...
ఒక సారి ఎదో కోపం వచ్చి మా సూపర్ సూపర్ సీనియర్స్ ఇంటర్ పిల్లలు ,
వాళ్ళ టీచర్ని దుప్పటి ముసుగు వేసి కొట్టారుట, మా స్కూల్ అంతా విషయం పాకి పోయింది,
వాళ్ళని ఎండలో నుంచోపెట్టి రెండురోజులు చితక్కొట్టారు మా స్కూలు యాజమాన్యం.
చదువుకునే బెచ్చు, అల్లరి బాచ్చు, చిల్లరిగాళ్ల బేచ్చు ఇలా రకరకాల సర్కిళ్లలో
ఆ వార్త రాకరకాలుగా అర్థమయ్యింది.
అల్లరి బాచ్చుకి టీచర్ని కొట్టడం గొప్పగా కనిపించింది.
మేము 10 వ తరగతికి కి వచ్చాక , మా క్లాసువాళ్ళు ,
మా తెలుగు సార్ ని దుప్పటి ముసుగు వేసి కొట్టేసారు, సరదాగా .. అమ్మాయిల చెప్పుకోడానికి గొప్ప కోసం.
మేము గోడలు దూకి సినిమాలకు వెళ్ళేవాళ్ళం గొప్ప కోసం.
ఆ రోజుల్లో సిగరెట్లు కొట్టడం , మందు తాగడం మా హాస్టలులో ఒక హీరోయిజం.
గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంక వాడు వరల్డు ఫెమస్.
పైవన్నీ మిత్రులనుండే అబ్బే 'అవ' లక్షణాలు,
తల్లితండ్రులు పట్టించుకోకపోవడం వల్ల స్థిరపడిపోయే దుర్లక్షణాలు.
చెడు బాగా తొందరగా నచ్చుతుంది, హీరోయిజం లా కనిపిస్తుంది
అందులోను రావణాసురుడిని గొప్పోడనుకుంటున్న ఈ రోజుల్లో
చెడ్డ మిత్రులు, పుష్పా , మట్కా లాంటి సినిమాలు, కొన్ని రకాల పుస్తకాలూ...
బాగా ప్రభావం చూపుతాయి ... నాకు బాగా అనుభవమే.
.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే,
9 వ తరగతి చేదువుతున్న 3 పిల్లలు గురువుని కొట్టారు , ఒకడు కడియం తీసి మరీ కొట్టాడు, ఆయన పోయారు. కేసు నడుస్తోంది.
విపరీత మైన డ్రగ్స్ వాడకం.
హెచ్ ఐ వి రోగుల్లో 35% శాతం 15 - 24 ఏళ్ల వాళ్లే.
గన్స్ , కార్స్ , రేస్, కాల్ గాళ్స్, ఓయో రూమ్స్, ప్రయివేట్ పార్టీస్ .. ఇది నేటి పరిస్థితి.
ఇలాంటి రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలు అన్నీ తెలుసుకుంటారు.
స్వేచ్ఛ పేరుతొ వదిలెయ్యకుండా,
కాస్త మంచి చెడు విచక్షణా జ్ఞానం నేర్పించగలిగితే,
వయో పరిమితిని దాటి సినిమాలు చూపించకుండా ఉంటే,
సెల్లులు , నెట్టు పట్టింపు లేకుండా ఇచ్చెయ్యకుండా ఉంటె,
ప్రతి విషయం గురించి పిల్లలతో స్పష్టంగా మాట్లాడగలిగితే,
అప్పుడు ఇలాంటి పోకడల నుండి వారిని వారే కాపాడుకోగలిగేలా చెయ్యగలం.
మిరే కాదు ,మీ పిల్లల మిత్రులు ఎలాంటి వారో తెలుసుకుంటూ ఉండాలి,
ప్రతి రోజు జరిగే విషయాలు , వాళ్ళ అనుమానాలు తీరుస్తూ ఉండాలి.
రాసి పెట్టుంటే విజేతలు అవుతారు కానీ,
తల్లి తండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు తప్పకుండా గొప్ప మనుషులు అవుతారు !