Sunday, March 27, 2022

కుక్కకు కిరిటం కట్టబెడితే కరవడానికి కాళ్ళు కావాలందంట

 కుక్కకు కిరిటం కట్టబెడితే కరవడానికి కాళ్ళు కావాలందంట.

కేరళ కు చెందిన కలాం పాషా ఒక జిల్లా జడ్జి.
ప్రముఖ మోహినీ ఆట్టం నృత్య కళాకారిణి నీనా ప్రసాద్ యొక్క నృత్య ప్రదర్శనను వాడు, "న్యూసన్స్ (గోల)" అని ఆపించేసాడు.
మరి రోజుకు అయిదు సార్లు మైకులో వచ్చే ఆజాన్ అదే కారణం చెప్పి ఆపించగలమా? తలలు తెగిపోవు?.
ఇదే మార్చి నెలలో 700 వందల ఏళ్ళ క్రితం మనకొక గుణ పాఠం నేర్పింది కాలం.
గతం మర్చిపోయిన వారికి భవిష్యత్తు లేదు !
కాలం అవకాశమైతే ఇస్తుంది, మరచి పోయిన పాఠాలు నెమరు వేసుకోడానికి.
నిద్ర మత్తులో జోగుతూ ఉండే వారు తప్పకుండా అస్థిత్వం కోల్పోతారు.
మన బడిలో చరిత్ర పుస్తకాలు చెప్పని పాఠం.
జంబూద్వీప వాసులు తమ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోడానికి చేసిన
త్యాగాల సంగ్రహంలో,
ముస్లిం దండయాత్రల సంపుటిలో,
ఒక పేజీ - మార్చ్ 1323, శ్రీ రంగం, తమిళ నాడులో,
సరిగ్గా 699 సంవత్సరాల క్రితం.
ఘియాసుద్దీన్ తుఘ్లక్ కొడుకు ఉలుఘ్ ఖాన్ (ఏలియాస్ మొహమ్మద్ బిన్ తుఘ్లక్) శ్రీరంగం పై దండయాత్ర చేసాడు. దండయాత్రలు చాలా మంది రాజులు చేసారు కాని అరాచకం అన్నది శాంతి కాముక వర్గ రాజులకే చెల్లింది.
శ్రీ రంగం మీద దండయాత్ర జరగబోతోందన్న విషయం తెలుసుకున్న ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజనాథన్ వడులదేశిక, రంగనాథుని విగ్రహం మరియు నగలు ఊరు దాటించేసారు. వెల్లయి అనే దేవదాసి స్త్రీ వారి దృష్టి మళ్ళించి చివరికి ప్రాణ త్యాగం కూడా చేసింది.దండ యాత్రకు వచ్చిన తుఘ్లక్, 12000 మంది శ్రీ వైష్ణవుల తలలు తీయించాడు.
పన్నిరాయిరం తిరుముడి తిరుట్టిన కలబం అంటే - 12000 వేల తలలు నరికిన దండయాత్ర. అవి యుద్ధానికి వెళ్ళిన సైనికులవి కాడు, గుడిలో పుజకు వెళ్ళిన భక్తులవి. గుడి ని పగల కొట్టాడు. అదే చెత్తో పొయ్ సొల్వేస్వర గుడిని కూడా పగలకొట్టాడు.
మళ్ళీ విజయనగర సామ్రాజ్యం వచ్చాకా శ్రీ రంగం గుడికి పూర్వ వైభవం వచ్చింది.
.
ఇదంతా ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అంటే, కాలం మారినా .. ఉద్దేశాలు అవే ! పద్ధతులు మారాయంతే.
వాళ్ళు కేవలం రాజ్యకాంక్ష లేదా ధనం కోసం దండయాత్ర చెయ్యలేదు.
వాళ్ళకు వారు తప్ప అందరూ తప్పే.
వారికి విగ్రహారాధన, భక్తి పారవశ్యంలో లీనమై దేవుడి పై పాటలు పాడటం, నాట్యం చెయ్యడం లాంటివి తప్పు.
మనకు అవి మన సంస్కృతిలో భాగం. మన కళలు, మన వేదాలు పురాణాలు మన అస్థిత్వం.
ఉత్తర్ ప్రదేష్ లో , బాబర్ అనే వ్యక్తిని జై శ్రీ రాం అన్నందుకు, బీజేపి గెలుపును పొగిడినందుకు గాను చంపేసారు. అది వారి శాంతి.
నేన్య్ సామాన్య ముస్లిముల గురించి మాట్లాడట్లేదు. శంతి పేరు చెప్పి కత్తి దూసి మరీ 1400 వందల సంవత్సరలలో సగం భూమిని మతం మర్చిన వారి గురించి.
ఇప్పుడు యుద్ధాలు వీధుల్లో కాదు, వైజ్ణానికం గా ఆధునికంగా మనుషుల ఆలోచనా విధానాన్ని మారుస్తూ స్వీయపరాధభావంతో కుంగి పోయేలా చెస్తూ వారిని అనుసరించేలా చేస్తున్నాయి ఎడారి మతాలు.
నిజానికి, కుల సమస్య అయిన మత సమస్య అయినా మూల కారణం మనిషి స్వార్థం. ఆ స్వార్థంతో నక్క జిత్తుల ఎత్తుల వలలో పడకుండా, చారిత్రక సత్యాలు తెలుసుకోవడం, సత్యానికి దన్ను గా నిలబడటం మనం కర్తవ్యం.

Saturday, March 26, 2022

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపిస్తారు కొడుకులు

ఆశువుగా మాట్లడమన్నారు 

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపిస్తారు కొడుకులు 

అన్న నానుడి గురించి. 

నా స్పందన..

అవును. చిన్నప్పుడు,

పెట్టిన వెంటనే తినేసి

చెప్పినవన్నీ వినేసి

బుద్ధి మంతులుగా ఉంటే

ఏ సరదాలు, జ్ణాపకాలు లేకుండా

తల్లి తండ్రులు ముసలి వారిపోతారనేమో అని

నాలుగు దెబ్బలు తినడానికే సిద్ధపడి మరీ

అబ్బాయిలు అల్లరి చెయ్యాలని 

రాత రాసాడెమో దేవుడు !


పెద్దవారయ్యాకా, మళ్ళీ చిన్నవారయ్యే పెద్దలు

పండగకో పబ్బానికో కూతురొచ్చి

పిండి వంటలు ప్రేమగా వడ్డిస్తుంటే

ఇలా తిని ఎన్నాళ్ళయ్యిందో అని నసుగుతుంటే

అయ్యో నాన్న షుగరు పెరిగిపోతుంది

అమ్మో అమ్మ బీపీ ఎక్కువైపోతుందీ

అని మనసులో మధన పడుతూ

ఆడ పడుచుల ఆనందాన్ని కాదనలేక

రేపటి నుండి తల్లి తండ్రుల అవస్థను ఊహించలేక

ఇక చాలు అని వారికి నచ్చిన తిండి పెట్టని కొడుకులే

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపించే, 

ఈ కాలపు సగటు కొడుకులు !


కాదనను, ఎక్కడో ఉంటారు ఒకరిద్దరు కర్కోటకపు కొడుకులు, 

అక్కడక్కడా కనిపించే సీరియళ్ళ కోడళ్ళలానే !     -సత్యకీర్తి