Saturday, March 26, 2022

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపిస్తారు కొడుకులు

ఆశువుగా మాట్లడమన్నారు 

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపిస్తారు కొడుకులు 

అన్న నానుడి గురించి. 

నా స్పందన..





అవును. చిన్నప్పుడు,

పెట్టిన వెంటనే తినేసి

చెప్పినవన్నీ వినేసి

బుద్ధి మంతులుగా ఉంటే

ఏ సరదాలు, జ్ణాపకాలు లేకుండా

తల్లి తండ్రులు ముసలి వారిపోతారనేమో అని

నాలుగు దెబ్బలు తినడానికే సిద్ధపడి మరీ

అబ్బాయిలు అల్లరి చెయ్యాలని 

రాత రాసాడెమో దేవుడు !


పెద్దవారయ్యాకా, మళ్ళీ చిన్నవారయ్యే పెద్దలు

పండగకో పబ్బానికో కూతురొచ్చి

పిండి వంటలు ప్రేమగా వడ్డిస్తుంటే

ఇలా తిని ఎన్నాళ్ళయ్యిందో అని నసుగుతుంటే

అయ్యో నాన్న షుగరు పెరిగిపోతుంది

అమ్మో అమ్మ బీపీ ఎక్కువైపోతుందీ

అని మనసులో మధన పడుతూ

ఆడ పడుచుల ఆనందాన్ని కాదనలేక

రేపటి నుండి తల్లి తండ్రుల అవస్థను ఊహించలేక

ఇక చాలు అని వారికి నచ్చిన తిండి పెట్టని కొడుకులే

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపించే, 

ఈ కాలపు సగటు కొడుకులు !


కాదనను, ఎక్కడో ఉంటారు ఒకరిద్దరు కర్కోటకపు కొడుకులు, 

అక్కడక్కడా కనిపించే సీరియళ్ళ కోడళ్ళలానే !     -సత్యకీర్తి



No comments:

Post a Comment