Sunday, October 9, 2016

వెలుగు

వెలుగు

రాజు: మన వాళ్ళు మనకు దూరమయితే ఎంత కష్టమో అనిపించింది మీ అమ్మ పోయినప్పుడు నిన్ను చూస్తే. 6 నెలలు నువ్వు ఇంటి బయటకు రాకపోతే అసలు నువ్వు తిరిగి మామూలు మనిషి అవ్వుతావనుకోలేదురా(కోలుకుంటావు అనుకోలేదురా) !
హను: హుం (నిట్టూర్పు)
రాజు: కాని,తను లేదు అన్న ఆలోచన ఇప్పుడు అనుభవిస్తుంటే అనిపిస్తోంది అది కష్టం కాదు, నరకం అని (బాధ గొంతు తో).
దేవి పోయి నెల రోజులయ్యింది, అందరూ అంటున్నారు ఇక తన జ్ఞాపకాలే నా జీవితం అని, నాకేమో ఒక్క జ్ఞాపకం కూడా రావట్లా !!
హను: మనిషిపోతే జ్ఞాపకాలు మిగుల్తాయ్, అసలు తను పోయిందని నీ మనసు ఒప్పుకోవట్లా.. ఇక జ్ఞాపకాలెందుకు వస్తాయ్?
రాజు: (తల ఊపి) ప్రతి నిముషం ఒకటే ఆలోచన, నేను కలలో ఉన్నానేమో, ఇదిగో ఇప్పుడు కలలో ఉలిక్కిపడి నిద్దుర లేచేస్తాలే, పక్కన దేవి ఉంటుంది, నా తల నిమిరి .. పీడ కలా ? నే ఇక్కడే ఉన్నాగా పడుక్కోండి అంటుంది. ఇక అప్పుడు నా జీవితం మామూలు అయ్యిపోతుంది అని. నిద్దురపోతే కల లోంచి మెళకువ వచ్చె నిమిషం దాటిపోతుందేమో అన్న భయంతో నిద్రపోవట్లేదు రా నేను.
పిల్లల్ని చూసుకోలేకపోతున్నా, పొలం పనులు చేసుకోలేకపోతున్నా అందుకే ఆస్తి పిల్లల పేరున రాసేసి వాళ్ళని అత్తమామలకు అప్పజెప్పేసా !
రాజు: నువ్వు పిల్లల్ని చూసుకోలేక కాదు, ఇక బతక లేక , చచ్చి పోదామని అలా చేసావని నాకు తెలుసు !
నీ భార్య దేవి నాకు చెప్పింది, నీ గదిలో ఉరివేసుకోడానికి దాచుకున్న దేవి చీర గురించి కూడా చెప్పింది.
ఇప్పుడు కూడా నీ భార్య నీ పక్కనే ఉంది, నువ్వు నీ బాధతో తనని బంధించేసావు.
హను: హు యేరా , నా నిర్నయం మార్చాలని ప్రయత్నిస్తున్నావా? అయినా ఆ చీర గురించి నీకెలా తెలుసు?
రాజు: అదౄష్టమో , దురదౄష్టమో నాకు ఆత్మలు కనిపిస్తాయ్ ! నా చిన్నప్పటి ఉంచి నేను వాటి తో మాట్లాడుతున్నా !
నువ్వు నమ్మవని నాకు తెలుసు, ఎవరూ నమ్మరని మా అమ్మకు తెలుసు, అందుకే ఎవరికి చెప్పకూడదని చిన్నప్పుడే నా దెగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు ఇక నో బధ చూడ లేక చెప్తున్నా.
నువ్వు ఒక సారి ఆత్మ హత్యకు ప్రయత్నించి, నీ కూతురి మొహం చూసి ఆగిపోయావని తెలుసు. నువ్వెమయి పోతావో అని నీ భార్య ఆత్మ ఖోభిస్తోంది. 
హను: ఇక్కడే ఉందా? నాకు కనిపించదేరా?

రాజు అవును రా నీ పక్కనే ఉంది , నీ గురించి ఏడుస్తోంది, ఇప్పటి కయినా కుదుట పడు పిల్లల్ని బాగ చూసుకో తన ఆత్మ ఆనందిస్తుంది.



....




తప్పు చేసేటోడికి వెలుగంటే భయం. భయపడేటోడికి తప్పొప్పులతో పనిలేదు వెలుతురులో నీడలంటే భయం, చీకటిలో వెలుతురులంటే భయం.
ధైర్యమున్నోడికి వెలుతురులో నీడలు సేద తీరుస్తాయ్, చీకటిలో వెలుగులు దారి చూపిస్తాయ్ !


అసలు దెయ్యాలున్నాయా అని ఒక ప్రశ్న,
నిజంగా దెయ్యాల గురించి అయితే ఒప్పించలేము గాని, ఉన్నాయని అనడానికి నా దెగ్గర ఒక చిన్న వాదన ఉంది.
దెయ్యం అంటే అలౌకిక శక్తి అంటే నిరూపించలేము, కాని దెయ్యం పడుతుంది అనడాన్ని నిరూపించగలం.
ఇప్పుడు హిట్లర్ ఉదంతాన్నే తీసుకోండి, హిట్లర్ బుర్రలో ఒక ఆలోచన ఉంది, దానిని అందరూ అమలు పరిచారు లేదా అమలు పరిచేలా చేసాడు. కూరలో ఉప్పు పై మొగుడూ పెళ్ళాలయినా ఏకాభిప్రాయాం ఉండదు అలాంటిది అంత దారుణ మారణ హోమం అంత మంది చేత చేయించ గలిగాడంటే వారందరిని హిట్లర్ అనే దెయ్యం పట్టినట్టే గా? ఇలా ఆలోచిస్తే దెయ్యాలున్నట్లే.
అయస్కాంత ఆకర్షణకి ఇసుకలో ఇనప రజనంతా ఒకే వైపు తిరిగినట్టు, ఒకడి తీవ్రమయిన మరియు బలమయిన వ్యక్త పరిచే విధానానికి లోబడి జనాలు మారిపోతే వారికి ఆ వ్యకి దెయ్యంగా పట్టి నట్టే !

Coming soon as a short FILM

No comments:

Post a Comment