Monday, October 7, 2019

ఆంగ్ల భాషలో వ్రాసేప్పుడు, మాటాడేప్పుడు...

ప్రతీ హిందువు ఆంగ్ల  భాషలో వ్రాసేప్పుడు, మాటాడేప్పుడు, చర్చలు జరిగేప్పుడు   గుర్తుచేసుకోదగినవి.

1 . మన వాళ్ళు  ఆంగ్లములో మాటాడేప్పుడు , వ్రాసేప్పుడు వ్రాసేప్పుడు God  fearing  అని వ్రాస్తుంటారు . మన హిందువులు దేవునికి ఎపుడూ భయపడరు . అండపిండ బ్రహ్మాండ మంతటా కొలువై యున్నాడని మన  సనాతన హైందవం చెబుతుంది. దేవుడనే వారు ప్రత్యేకంగా కొలువుతీరి లేరు . అంతటా  ఉన్నాడు.

2 . ఎవరైనా పరమపదించినపుడు  RIP , rest  in  peace  వంటివి వాడకండి . Om Shanthi(ఓం శాంతి ) అనో, Hariom(హరి  ఓం) అనో, లేదా sadgati praapti(సద్గతి  ప్రాప్తి), kaivalya praapti (కైవల్య ప్రాప్తి)  , jeevanmukti (జీవన్ముక్తి) , vishu padam (విష్ణు పదం) , vaikuntha padam (వైకుంఠపదం), siva padam (శివ పదం), kailsa praapti (కైలాస ప్రాప్తి)  వంటివి మాత్రమే   వ్రాయండి.

3 . మనం మన పురాణేతిహాసాలు గూర్చి చెప్పేప్పుడు వాటిని mythology  అని  అనకండి . రామాయణం,  మహాభారతం, భాగవతం ఇత్యాదులన్నీ ఇతిహాసాలు . రామ, కృష్ణ, అర్జున, సీత,  ద్రౌపది  వంటి వారంతా చారిత్రాత్మక పాత్రలు.  కల్పిత పాత్రలు కారు . కావున mythology అనే పదం వాడటమే ధర్మవిరుద్ధం . Ithihasa అని అనవచ్చును.

4 . విగ్రహారాధన అనేది తప్పు అని ఏ మాత్రం ఎపుడూ చెప్పకండి . ఈ విగ్రహారాధన అనేది ఏదో విధంగా (పవిత్రమైన గుర్తులు అక్షరాలు  ఇలా) ప్రతీ మతములోనూ వుంది ..idol  , statue  వంటి పదాలు వాడకండి . Murthy(మూర్తి ), విగ్రహం వంటి పదాలను యథావిధిగా ఆంగ్లములో  వ్రాయండి. మన దేవాలయంలోని మూర్తులు కేవలం శిలాప్రతిమలు కాదు, కావున అట్టి పదాలు ఉపయోగించకండి .

5 . గణేశుని , హనుమంతుని elephant   god   , monkey  god  వంటివి వాడకండి. అలా వ్రాయడం అనుచితం. Ganesha (గణేశుడు) , Hanuman (హనుమంతుడు) అని యథావిధిగా వ్రాయండి .

6 . మన గుడి గోపురాల గూర్చి వ్రాసేప్పుడు prayer  halls  వంటి పదాలతో వ్రాయకండి . అది మంత్రయుక్తంగా దైవాన్ని ఆవాహన చేసి నిలిపిన చోటు, మరి కొన్ని గుడులు స్వామి వారు స్వయంభువులుగా వెలసిన చోట్లు కాబట్టి అవి Devalayam(దేవాలయమనే) వ్రాయండి

7 . మన పిల్లలకు పుట్టిన రోజులు చేసేనాడు .. కాండిల్స్  వెలిగించి, ఆర్పే పద్ధతులు పాటించకండి . మన హిందూ ధర్మం ప్రకారం దీపాన్ని నోటితో ఊదకూడదు .  నిత్యం మనం అగ్ని ఆరాధన చేయాల్సినవారం కాన .. ఇలా నోటితో  ఊదడం, ఆర్పడం వంటివి చేసి,  అపవిత్రం చేయరాదు .  పుట్టిన రోజు నాడు ఎలా జరుపుకోవాలి అనేది  మనకు మన పెద్దలు సవివరంగా చెప్పియున్నారు. వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి .

8 . ఆంగ్లములో వ్రాసేప్పుడు spirituality , materialistic  వంటి ఆపదలను వాడకండి. మన హైందవ ధర్మములో ఈ సృష్టిలోని ప్రతీ  ఒక్కటీ పవిత్రం అయినదే. ఈ పదాలు కిరస్తానీయులు ద్వారా మన దేశములోని వచ్చాయి. Adhyatmikata(ఆధ్యాత్మికత) , bhakti( భక్తి) , dharmam(ధర్మం), karma( కర్మ)  వంటి పదాలను యథావిధిగానే వ్రాయండి.

9 . భారతీయులకు శాస్త్రవేత్తలు లేరనే అపోహను వదలండి . మన ఋషులు , మునులు మనకు శాస్త్రవేత్తలు. భారతీయ సనాతన ధర్మములో కొన్ని కాలరీత్యా మూఢనమ్మకాలు వచ్చాయేమో గానీ ఆది  నుండీ మన ధర్మములో , ఆచార వ్యవహారాలలో సైన్స్  అనేది మిళితమై యున్నది . ఇది కాదనలేని నిజం .

10 . మనం ఆంగ్లములో వ్రాసేప్పుడు its  sinful , sin  వంటివి వ్రాయకండి. Papam(పాపం) అనే పదాన్ని యథావిధిగా వ్రాయండి. . భారతీయులకు ఉన్నవి రెండే ఒకటి ధర్మమూ , రెండవది అధర్మం. ధర్మాన్ని పాటిస్తే వచ్చేది punyam( పుణ్యం), అధర్మాన్ని పాటించితే కర్మ ఫలితం పాపం.

11 . ఆంగ్లములో ధ్యానం , ప్రాణాయామం గూర్చి వ్రాసేప్పుడు meditation  ,  breathing  exercise  వంటి పదాలను వాడకుండా యథావిధిగా Dhyanam(ధ్యానం), Pranaayama(ప్రాణాయామ) వంటి పదాలనే వాడండి .

హిందువుగా పుట్టినందుకు గర్వించండి . భారతీయతను పాటించండి . నిన్ను, నీ సంస్కృతిని గౌరవించుకున్ననాడే ఇతరులను నీవు హృదయపూర్వకంగా గౌరవించగలవనే సత్యాన్ని మరువకండి . నిన్ను, నీ ఆచారాల సంప్రదాయాలను కించపరచుకుని ఇతరులను గౌరవిస్తాము అనుకోవడం ఆత్మహత్యాసదృశమే

జయహే భారతీ !

No comments:

Post a Comment