తెలియనిదేదో వెతుకుతూ
అదీ ఇదీ చదువుతావు
నిన్ను నువ్వు చదువకుంటే
ఎన్ని చదివి ఏం లాభం ?
మనసు మండపంలో
అడుగుపెట్టకున్న
మసీదులు మందిరాలు
చూపలేవు ఏ సత్యం !
నిత్యం పోరాటమే
మతం కోసం మోక్షం కోసం
అహం పై ఆ యుద్ధం
అరంభించేదెన్నటికో ??
దిక్కులు వెలిగించే
మదిలో వెలుగులు మరిచిపోయి
చిమ్మ చీకటిలో చుక్కలు
అందుకొనాలని పరుగులు తీసేవు
ఇంక చాలు ఆపేద్దాం
ఎక్కడెక్కడని వెతకడం
ఇక్కడే ఉన్న నిన్ను నువ్వు
తెలుసుకునే సంగతేదో చూద్దాం!
ఆయ్యినది తలువకు
రేపటిని బ్రమించకు
అతిగా ఆలోచించకు
ప్రతీదీ పరిక్షించకు
అన్నిటిని సరిచెయ్యాలని చూడకు
కాస్త ఊపిరి తీసుకో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నావ్
కాస్త బతకడం నేర్చుకో !
-బుల్లే షా అనువాదం