రోజుకు 5000+ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గత కొద్ది రోజులుగా. ఆకలి చావులు & ఆర్థిక మాంద్యం నుండి తప్పించుకోడానికి మనం నిర్భందం సడలింపులు చేసుకుంటున్నాం.
దీని వలన మనం అందరం, ముఖ్యంగా మన పెద్దలు, పిల్లలు, అరోగ్య/వ్యాది నిరోధక శక్తి సమస్యలు ఉన్నవారు దీని బారిన పడతారు, మనం వారిని ప్రమాదం లోకి నెడుతున్నట్టే.
కరోనా కేసులు రోజుకు 10000+ పెరిగే రోజులు వస్తున్నాయి, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దాని ఉధృతిని నిలువరించ వచ్చు.
మనం స్వియ నిర్భందంలో ఉన్నప్పుడు ప్రకృతి ఎంత కోలుకుందో అందరికీ తెలిసిందే, అది కూడా అలానే కొనసాగాలంటే మనం కాస్త శ్రద్ధ వహించాలి. వీటిని అలవాటుగా మార్చుకుంటే మున్ముందు కూడా మంచిదే,
* సాత్విక ఆహారం, అన్ని రంగుల కూరలు పళ్ళు తినండి. సమయానికి నిద్ర, వ్యాయామం, శుభ్రమైన తిండి రోగనిరోదక శక్తి పెంచుతాయి
* పసుపు , తులసి, మిరియాలు, తమలపాకు, అల్లం, సొంటి వంటివి నెమ్మదిగా శాశ్వతంగా మీ రోగ నిరోధక శక్తి ని పెంపొదిస్తాయి
* బయటకు వెళ్ళినప్పుడు మాస్కు/ సానిటైసర్ ఇంకా అవసరమయితే ఒక జత బట్టలు తీసుకు వెళ్ళండి. మీరు ప్రజా రవాణా లేదా చాలా దూరం ప్రయాణించే వారయితే ఆఫీసుకు వెళ్ళాకా శుభ్రపడి దుస్తులు మార్చుకోండి
* ఇంటికి రాగానే, బయటే పాద రక్షలు విడిచే ఏర్పాటు తప్పకుండా చేసుకోండి
* బయటకు వెళ్ళి వచ్చాకా, వీధి వైపు బాత్రూములు, ఇంటి లోపల నుండి కాకుండా బాత్రూములోకి దారి ఉంటే వెళ్ళి ముందు కాళ్ళూ చేతులూ సబ్బుతో కడుక్కోవడం , కుదిరితే స్నానం చెయ్యడం అలవాటు చేసుకోండి
* మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మొక్కల దెగ్గర లేదా కార్ పార్కింగ్ దెగ్గర ఎదైన టప్ ఉన్న చోట, కాళ్ళూ చేతులూ కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి
* మెట్లు ఎక్కండి. కొరియర్లు సెక్యూరిటి దెగ్గర విడిచి పెట్టమనండి
* నమస్కారమే ఇక సంస్కారం
* వీలు అయినంత బయట వస్తువులను తాకవద్దు
* కొన్నాళ్ళు విందులు వినోదాలకు దూరంగా ఉండండి
* ఏ కాస్త అనారోగ్యం కనిపించినా బయట తిరగ వద్దు
* తుమ్ము మూఢ నమ్మకం కాదు, అటుగా వెంటనే వెళ్ళకండి
* మంచి నీళ్ళు ఎక్కువ తాగండి
ప్రకృతి బాగుండాలి అంటే,
* కార్ల వాడకం తగ్గించండి
* అవసరం లేనప్పుడు తిరగడం తగ్గించండి, పెట్రోల్ వృధా చెయ్యొద్దు
* మీరు వృధా చేసే ప్రతి చిన్న తిండి పదార్ధం, రేట్లు పెరగడానికి, పేద వాళ్ళు తినలేకపోవాడానికి కారణం అని గుర్తుంచుకోండి, ఒక పూట కాస్త వెలితిగా తిన్నా ఏమీ పరవాలేదు, ఎక్కువ వండి వృధా కానియ్యొద్దు ఆలోచించండి.
* చల్ది అన్నం వంటికి మంచిది
* మొక్కలు నాటండి
* నీరు తక్కువ వాడండి, బట్టలు రెండు సార్లు వేసుకోవచ్చు, ముక్యంగా ఏసీ లో పని చేసేవారు
* టాయిలట్ క్లీనర్స్, సబ్బులు, బట్టల పౌడర్లు తగినంత మాత్రమే వాడండి. కుదిరితే కుంకుడుకాయ లాంటి ప్రాకృతిక ప్రత్యామ్నయాలు వాడండి
* దోమల కోసం దోమల తెరలు, దోమల బాట్లు వాడండి. ఆలవుట్, కాయిల్స్ వద్దు. పొగలు మనకు మంచివి కాదు.