Sunday, October 15, 2023

Palestine Vs Israel తప్పు ఎవరిది?

 ఇజ్రాయెల్ ని తప్పు పట్టే వారెవరైనా ఒక సారి ఆలోచించండి,

ఒకడు ఇంకొకడిని ఉద్దేశపూర్వకంగా (అనాలోచితంగా కాదు, పధకం ప్రకారం) ఒక 50 పోట్లు పొడిచాడు. బాధితుడు గెట్టోడు, చావలేదు సరికదా, ఆత్మ రక్షణ కోసం తిరిగి ఓ పోటు పొడిచాడు, దుండగుడి పరిస్తితి విషమం !
తప్పు ఎవరిది?
హమాస్ 5000 రాకెట్లతో దాడి చేసింది, యూదుల మహిళలు పిల్లలలను కూడా వదలకుండా చంపింది. ఇజ్రయెల్ యుద్ధం ప్రకటిస్తే తప్పా? తొక్కి పెట్టి నార తీసెయ్యలి ఒక్కోడికీ.
.
నేను పెట్టిన ఇజ్రాయెల్ మాప్ చూడండి.
22000 స్క్వేర్ కిలోమీటర్లు.అంటే మన జమ్మూ కాష్మీర్లో సగం ఉంటుంది. న్యు జెర్సీ అంత ఉంటుంది.
కోటి మంది కూడా లేరు జనాభా.
చుట్టూ ఉన్నవన్నీ ప్రముఖ శాంతి కపోత మత దేశాలే !
ఆలోచించండి ,
నిత్యం సరిహద్దుల్లో సమస్యలే అంటే,
కోటి మంది జనాభా వ్యయ ప్రయాసలన్నీ సరిహద్దులు పటిష్టం కోసమే అంటే,
మిలటరీ & ఆయుధాల మీదే చాలా వ్యయం చెయ్యాల్సి వస్తుంటే?



.
40,000 వేల పై చిలుకు హమాస్ టెర్రరిస్టులు,
వారికి డబ్బు ఆయుధాలు అందించే ఖతార్, టర్కీ.. ఇంకొన్ని శాంతి దేశాలకు
ఎదురు నిలబడి యుద్ధం చెయ్యాలి.
తమ ప్రజలను కాపాడు కోవాలి.
75 ఏళ్ళ నుండి భరిస్తూనే, తమ సరిహద్దులు పటిష్టం చేసుకుని, ధైర్యం గా నిలబడ్డారు.
ఆళ్ళు మగాళ్ళు రా బుజ్జి !

.
హమాస్ లీడర్లు ఖతార్లో కూర్చుని కధ నడిపిస్తుంటారు.
పిరికి పందులు.
సరిహద్దుల్లో ఉండేదంతా హమాస్ దళాలు లేదా అమాయక జనాలు.
అమాయకుల వెనక దాక్కుని దాడి చేస్తూ,
ఇస్రాయల్ ప్రతిఘటిస్తే, చనిపోయిన అమాయకులను/పిల్లలను అంతర్జాతీయ వార్తల్లో చూపిస్తూ,
శాంతి మతాలు ఆడే వికృత 'విక్టిం కార్డ్' ఆట,
అర్థం చేసుకోకపోతే,
ఆ అమాయకులను ఎవరూ కాపాడలేరు.
జాగ్రత్తగా చూస్తే భారత్ పరిస్థితీ ఇలానే ఉంది, బలమైన నాయకులు లేకపోతే, మన పరిస్థితీ అంతే.
.
చెడ్డ వాళ్ళు ప్రతీ మతంలోనూ, ప్రతీ దేశంలోనూ ఉంటారు అలా అని పరిస్తితి అర్థం చేసుకోకుండా నెపం ఇస్రాయెల్ మీద నెట్టడం తప్పు.
.
ఇక్క రామ జన్మభూమి కావాలి,మధుర కావాలి, కాశి కావాలి..తాతలు కొల్లగొట్టి రాసిచ్చారు,
ఆ పై కాష్మీర్ కావాలి..బాలల తాత & జాతి పిత రాసిచ్చారు,
అక్కడ ఇజ్రాయిల్ కావాలి... ఏకంగా దేవుడే రాసిచ్చాడు !
.
మొత్తం భూమి అ శాంతి మతం అయ్యేదాకా వాళ్ళు ఆగరు.
కోట్ల స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఉన్నా, ఆ ముక్క భూమి కోసం మత ప్రతిపాదికన జరుగుతున్న దాడులను మనం ఖండించాలి,
తిప్పి కొట్టాలి,
అది ఇజ్రాయల్ అయినా కాష్మీర్ అయినా.
నేను చెప్పేది నమ్మొద్దు, గూగుల్ చెయ్యండి, చరిత్ర చదవండి.
ఇజ్రాయెల్కే నా మద్దతు. మరి మీరు?
.
పెద్దల పాపం పిల్లలకు శాపం
.
హమాస్ కనీసం 1-2 సంవత్సరాల ముందు నుండే ఈ దాడికి పన్నాగం పన్నింది.
వాళ్ళకి నిజం గానే గాజా ప్రజలమీద ప్రేమ ఉంటే, వారి గురించే యుద్ధం చేస్తూ ఉండుంటే, అక్కడున్న వారి బ్రదర్ హుడ్ని ఖాళీ చేయించేవారు.
అలా చెయ్ లేదు.
పోనీ ఇప్పుడు మేము ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నాం, మీరు పారిపోండి అని చివరి అవకాశం కూడా ఇవ్వలేదు.
పాలస్తినాలో పెద్దలు తీవ్రవాద హమాస్ కు వోటువేసారు. హమాస్ వారినే కాటు వేసారు.
మధ్యలో అభం శుభం తెలియని పిల్లలు బలి అయ్యిపోయారు.
.
ఇజ్రాయెల్ మాత్రం , మేము దాడి చేస్తాం, నేలమట్టం చేసేస్తాం, అమాయకులు గాజా నుండి పారిపొండి అని ముందస్తు హెచ్చరిక చేసారు.
మరి 200 మంది పిల్లలు సరిహద్దుల్లో ఎందుకు ఉన్నారు?
బంకర్లలో ఎందుకు లేరు?
.
మనం ముందుగా అనుకున్నట్టే, ఈ దుర్మార్గులు 200 మంది పిల్లలు ని ఇజ్రాయెలు చంపిది అని వార్తలు గుప్పిస్తున్నారు.
నాకు నమ్మకం ఏంటి అంటే హమాసే పిల్లల్ని స్త్రీలను చంపేసి ఇజ్రయెల్ మీదకు నెట్టేసి ఉంటుంది. వాళ్ళు అంతకు తెగించే మూర్ఖులే !
.
పాములతో సావాసం చేసే వారు, ఏదో రోజు పాము కాటుకి బలి అవుతారు.
హమాస్ ని నిలువరించక బ్రదర్ హుడ్ అని హమాస్ కి చేరువలో ఉన్నందుకు, అమాయక పిల్లలు బలి అయ్యారు.
అలవాటు ప్రకారం విక్టిం కార్డు ప్లే చేస్తున్నారు !
ఆ పారిన అమాయకుల రక్తం మొత్తం హమాస్ కు దన్ను గా నిలుస్తున్న పుస్తకం మరియు ప్రజలదే.
.
నిజం గా అల్లాహ్ ని నమ్మే వారు ,
శాంతి సందేశం నమ్మే వారు,
ఇజ్రాయెలు కన్నా ముందే,
వాళ్ళె వెళ్ళి ఆ హమాస్ ముష్కరులకు బుద్ధి చెప్తారు !

Saturday, July 1, 2023

ఊరి గాయం - శీర్షిక : ఇంద్రప్రస్థం

 ప్రతిదినం పద/వాక్య కవిత్వ పోటీకి

అంశం : ఊరి గాయం
శీర్షిక : ఇంద్రప్రస్థం
.
ద్రౌపదికి జరిగిన అవమానానికి,
దుర్యోధననుని దురభిమానానికి
దుశ్శాసనుని దుష్కర్మకు,
కర్ణుని దుర్నీతికీ కర్మఫలంగా
కురు వంశ పతనానికి సాక్షి,
ఈ ఇంద్రప్రస్థం !
ధర్మం వైపు నువ్వుంటే, దైవం నీ వెంటే, అని దారి చూపి,
బతకుమార్గాన్ని గీతలు గీసి చూపించిన
శ్రీ కృష్ణుడి పాదాలు మోసిన పట్టణం,
ఈ ఇంద్రప్రస్థం !
ఆనాటి నుండి ఈనాటి దాకా,
ఎంతో మంది వీరులు,
ఎన్నెన్నో గాధలు వీక్షించిన విజయ కేతనమీ రాజ్యం !
*
అంతటి మహోన్నత ఊరికి గాయమయ్యింది
చీర లాగినందుకే కురు వంశాన్ని చెరిపేసిన రోజులనుండి,
చెరచి చంపేస్తే,
చిన్నవాడని చెప్పి
చీరలు కుట్టుకొమ్మని కుట్టు మిషనులు ఇచ్చే
పరిస్థితులు వచ్చినందుకు,
ఊరి గుండెకు గాయమయ్యింది

ఏ నేలపై కృష్ణుడు తిరుగాడాడో
ఏ ఊరి వీరుడు కీచకుడిని వధించాడో
ఆ ఊరి వీధులలో తిప్పుతూ
ఆమెను వికృతంగా వేధించి కడతేర్చారని
ఊరి మనసు ముక్కలై రోధించింది
*
ఒక పిల్లవాడిని పెంచడం, ఒక ఊరి బాధ్యత
ఈ కీచకులను పెంచిన నేరం నాదేనంటూ
మూగ సాక్ష్యంగా మిగిలిపోవడం
తప్ప మరేమి చెయ్యలేని
ఇంద్రుని నగరం కూలబడిపోయింది



ఏ ఇంద్రజిత్తుని జిత్తులు తగిలెనో
ఏ కలి పురుషుని నీడబడెనో
ధర్మం వైపు నిలబడలేని నిస్సహాయతతో
నిర్జీవమైపోయిన నిర్భయ ముందు తలవంచుకుంది
అటువంటి కీచకులను కన్న,
ప్రతి ఊరి గాయానికి ప్రతీకగా !