Tuesday, January 2, 2024

అన్నపూర్ణి అనే పూర్ణ పాపిష్టి సినిమా

15 కోట్లు పెట్టి తీసి, 5.5 కోట్లు సంపాదించి(7-8 కోట్లు బొక్క), 2.3 రేటింగు ఉన్న ఒక హిట్టు సినిమా గురించి సర్కాస్టిక్ పోస్టు.

*

ఒక వెనుకపడిపోయిన లేడీ సూపర్ స్టార్, తిరిగి ట్రాకులో పడాలంటే, 

మెజారిటీలయినా నోరువిప్పని కొన్ని మూగ మనసుల్ని రెచ్చ గొట్టి సినిమా ఎలా ఆడించాలి, 

ఆ లేడీ 75వ చిత్రం కేడి లా ఆలోచించి కధ ఎలా రాయాలి.?

ఎలా అంటే,


*

బామ్మర్లమ్మాయి, గుళ్ళో ప్రసాదం తయరు చేసే ఆయని కూతురు.

చిన్నప్పటి నుండి వంట బాగా చేస్తుంది, వంటగత్తె కావాలనుకుంటుంది.

నాన్వెజ్ గొడవ ఎందుకు మనకు వద్దు అంటాడు తండ్రి.

అంత వంటలక్క అయిన అమ్మాయి కి క్లారిటీ ఉంటుంది, 

"షెఫ్ఫుల్లో వెజ్జు షెఫ్ఫులూ ఉంటారూ, కేవలం వెజ్ కోర్సులూ ఉంటాయీ" అని చెప్తుంది అని అనుకుంటారు మీరు, 

కాని అలా చెప్పదు, జస్టు బాధ పడి ఊరుకుంటుంది. ఇది ఒక ట్విస్టు.


అప్పుడు కనిపించని దేవుడిలా, FARHAN అనే మితృడు వచ్చి అక్షరాలా 

"ఇన్నాళ్ళూ నీ తల్లి తండ్రుల మాట విని సమయం వృధా చేసుకున్నావు, ఎన్నాళ్ళని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటావు, హొటల్ మేనేజ్ మెంట్ కోర్సుకు అప్లయ్ చెయ్ అంటాడు", వాడి మాట వింటుంది, వాడే వద్దని చెప్పినా. ఇదొక జోకు, ఇక్కడ నవ్వాలి మీరు.

ఆవిడకు వంట కావాలి, ఈయనకు వంటగత్తె కావాలి. 

వాడూ అమ్మాయి కోసం, కోర్సు జాయిన్ అవుతాడు, తరువాత మామూలుగా ఫ్రిడ్జులో చికెన్ పీసుల మధ్య దొరుకుతుందని మీరు అనుకుంటారు, కాని అలా కాదు, ఇది ఇంకొక ట్విస్టు.

అప్పుడూ, ఆ అర బుర్రది, కాదు కాదు అసలు బుర్రలేని, 

చికన్ కొయ్యబోయి కళ్ళు తిరిగిపడుతుంది మన అగ్రహారం అన్నపూరని.

*

మళ్ళీ అదృశ్య దేవుడు ప్రత్యక్షం, ఫర్హాన్ కర్మ గీత,

"కస్టమర్లే దేవుళ్ళూ, అయ్యప్ప మాల వేసుకున్నా మాంసం అమ్మరా?" అంటాడు.

అప్పుడు మన అరకోడి, సారి అగ్రహారం అమ్మాయి "అయ్యో, మాదసలే క్లాసికల్ ఫామిలీ" అంటుంది.

అప్పుడు ఫర్హాన్ ఇలా బోధిస్తాడు,

"అత్ర తత్ర మత్ర, తత్ర మత్ర గత్ర, మచ్చ చస్వమత్ర" కాబట్టి రాముడూ లక్షణ్ భాయ్ Non-Veg తిన్నారూ,

మురుగన్ జంతువుల్ని వేటాడే వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు(మనసులో ఆల్మోస్టు నాన్ వెజ్జు తినే ఉంటాడు),

కన్నప్ప శివుడికి పంది మాంసం పెట్టాడు (అందుకే మాకు పంది పడదు)

కాబట్టి ఏ దేవుడూ VEGETERIAN కాదు, 

SO నువ్వు ఏం తినాలో చెప్పడానికి ఎవరూ సరిపోరు , నువ్వు నీ ఇస్టాన్ని బట్టి తిను" , 

అని రామబాణం వేసి, శివ పినాకం తో ఒక్కటి పీకుతాడు, ఫర్హానావధాని.

దెబ్బకి ఆగ్రహారం అమ్మాయి కళ్ళు కుక్కర్ విసిల్లా తెరుకుంటాయి.

నువ్వు కుక్కవడమే నాకు సంతోషం అంటాడు.

అప్పుడా కుక్కి కోడిని ముక్కలు ముక్కలు చేసి చూపిస్తుంది. అదృశ్య గీత పని చెయ్యకమానుతుందా?

.

తినకుండా వండడం ఎలా?

అందుకని గుడ్డు తినడంతో మొదలయ్, దానమ్మ అమ్మమ్మలను, నడీచేవి,ఈదేవి కూడా లాగించేస్తుంది, మద్యలో కొన్ని తండ్రిగారి ముక్కు మూసుకునే పూజలు మిక్స్ చేసి, మాల వేసుకున్నవాళ్ళని చూపించారు, మసాలా తగలాలిగా.


మసీదులోంచి వచ్చిన ఫర్హాన్ మరియు మన మణిహారం ఒక తౌడు గిన్నె పై మూత అంత ప్లేటులో లో ఫర్హాన్ అమ్మ బీబీ వడ్డించిన బీఫ్ బిర్యాని తింటుంది, మీరిక్కడ నుంచే ఏదో లవ్జిహాద్ మొదలవుతుంది అనుకుంటారు, కాని రంగరాజనుగారికి చికెన్ తింటున్న చిన్నారి కూతురు చిక్కిపోతుంది.

అప్పుడు కర్కోటక బ్రాహ్మణులు రంగరాజను గారిని ప్రసాదం చెయ్యొద్దంటారు.

కట్ చేస్తే కోడిని తిన్న కోమలికి నిలువ బొట్టు శేకర్తో కల్యాణం కుదురుస్తారు.


మళ్ళీ  ఫర్హానుడొస్తాడు (FARHAN alias HERO alias SANGHA SAMSKARTA). 

అగ్రహారం అమ్మాయి నాన్నమ్మ, "ఈ మడి ఆచారం సాంప్రదాయాల వల్ల నేను ఆటక మీద ట్రంకు పెట్టెలా ఉండిపోయా, నువ్వన్నా వెళ్ళి ఐసు పెట్టెలో.. కాదు కాదు, గెలువుపో" అంటుంది. వాళ్ళిద్దరూ (FARHAN & AP) చెన్నై జంపు.

బయటకు వెళ్ళి పిల్ల జంపు విథ్ జిలాని అని చెప్తుంది అభినవ ఆటక మీద ట్రంకు మామ్మ.

అలా శ్రీరంగం నుండి చెన్నై చేరిన అన్నపూర్ణి, పూర్ణంగా కోడిల్ని కుక్కల్నీ ఎలా వండుతుందో, ఎలా ఎదుగుతుందో అన్నదే కధా వస్తువు.

ఫర్హానుడు రంగాచారి ప్రదిక్షణాలు సరిగ్గా చెయ్య్లేదని చెప్పడం హైలైటు, ఇలాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో..సీన్ టు సీన్ చెప్పెయ్యాలి, కాఫీ రైటు సమస్య వచ్చేస్తుంది.

హిందూ సాంప్రదయాలు ట్రాషు అన్న మామ్మ మాటవిని బొట్టు తీసేసి నమాజు చేస్తుంది, బిర్యాని చెయ్యలంటే బేబి హబిబి బిబి అవ్వాలి మరి. 

బాక్ గ్రవుండులో అలా ఇలా అని పాట వస్తుంటే బిర్యానిలో కూసింత ఉమ్మేస్తుందని మీరు అనుకుంటారు, కానీ అలా జరగదు, అగ్రహారం అమ్మాయిలు ఇంకా అలా చీకట్లోనే ఉండి టీవీ చూస్తుంటారు, కోడి తిన్న అగ్రహారం అమ్మాయి కత్తులు నూరి  కాంపిటీషన్ నగ్గేస్తుంది, అదే మరి కధలో మలుపు. 


మీరేమో ఇస్లాం గొప్ప అని తేల్చి చెప్పేస్తారు, సినిమాలో అనుకుంటారు

కాని చివర్లో మాత్రం బిర్యానీకి మతం కులం ఏంటి? బిరియాని ఒక ఎమోషన్ అని అంటుంటే, ముస్లిం అత్తగారు కళ్ళు తుడుచుకుంటుంటే ఆ ఎమోషనల్ సీను బాగా మిగల ముగ్గింది .

అన్నేళ్ళు దేవునికి ప్రసాదం తయారు చేసే మహద్భాగ్యం కలిగిన ఉద్యోగంలో/సేవలో ఉన్నవాడు, మూర్ఖుడిలా తెగ తెంపులు చేసుకు ఉండిపోతాడు అనుకుంటారేమో మీరు, చివరికి వచ్చేటప్పటికి సేవ కాదు కూతురి చికెన్ వంటే ముఖ్యం అనుకుని, ఆధునికునిలా నాగరికునిలా, కన్న కూతురు కళ్ళెదుటే నల్లగుడ్డేసుకుని నమాజు చేసి పోటీలో నగ్గితే ఆనందపడతాడు. అది సినిమా అంటే. 

.

సరే పోని ముస్లిము సంధ్యావందనమో

తురకోడి తిరు నామాలో

క్రిస్టియన్ ప్రసాదం తినడమో చూపిస్తారు అనుకునేరు , 

ఆశ దోస అప్పడం, అదేం కుదర్దు, తూచ్ పో. 

ఇస్లాం మనకు ముద్దు, హిందు వద్దు.



*

ఈట్ డ్రింక్ మాన్ వుమన్ , చెఫ్ఫ్, బరంట్,కుక్ అప్ ఏ స్టోర్మ్ లాంటి సినిమాలు మిక్సీ కొట్టెయ్యడమే, ఇంటర్వెల్ తరువాత రెండోవ భాగం !  

ఇక మిగతాది చూడాలంటే కప్పల కూర చూసినట్టు జుగుప్స కలిగి మానేసా.

నిజం చెప్పలంటే డైరక్టర్ని చెప్పుతో కొట్టే ఉద్యమం మొదలు పెట్టాలనిపిస్తుంది, ఆ బీపీ ఎందుకని మానేసా..

మనకెందుకులే, వెన్నెముకలు సద్దుకుని, మన ఆఫీసు పనులు మనం చూసుకుందాం !


NOTE: I am not against anyone eating NONVEG, its their choice, demeaning Hinduism to promote Islam is what is troubling in the movie. Not that i care for someone feeling bad, Just FYI.

Monday, December 25, 2023

ఆష్టవిధం బ్రాహ్మణ్యం - బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు

శ్రీ గురుభ్యోనమః

బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు


"మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్

అనూచానః తథాభౄణః ఋషికల్పః ఋషిర్మునిః"


బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు దీనినే ఆష్టవిధం బ్రాహ్మణ్యం అంటారు,

1)బ్రాహ్మణోదరేజాతః అనుపనీతః క్రియాశున్యతం, జాతి మాత్రేణ మాత్రః

’మాత్ర’కుడు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, ఉపనయనం జరగనివాడు, సరియైన సమయంలో ఉపనయనం జరగని కారణం చేత సంధ్యావందనాది నిత్య కర్మలను చేయని కారణాన క్రియా శూన్యుడు, కేవలం జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడుగా తెలియబడేవాడు / లేదా పుట్టుకవలన మాత్రమే బ్రాహ్మణుడుగా తెలియబడుతున్నవాడు.


2) సంస్కారేణ సంస్కృతః ద్విజముచ్యతే - పైన తెలిపిన బ్రాహ్మణుడు ఉపనయన సంస్కారముతో సహా అప్పటి వరకు అన్ని సంస్కారములను శాస్త్రోక్తంగా నిర్వహించి సంస్కరింబడినందున, ఉపనయనానంతరము రెండవజన్మగా సంస్కరింపబడినవాడగుట వలన ద్విజుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు.


3)జన్మ సంస్కార విద్యాభి త్రిభః శ్రోత్రియః - పైన తెలిపిన రెండు విధములైన బ్రాహ్మణత్వమును పొంది వేదవిద్యను (శ్రుతిని చదువుకున్నవాడు) పొందిన తరవాత శ్రోత్రియుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు, ఆతరవాతనే


4)వేదవేదాంగ తత్వజ్ఞః శుద్ధాత్మా, పాపవర్జితః, శ్రేష్ఠః ప్రాజ్ఞ అనూచానః - శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు వేదాలను ఉపాంగాలతో సహా నేర్చుకొని, అందులోని తత్త్వాన్ని తెలుసుకొని, నిర్మలమైన ఆత్మ కలవాడైనందువల్ల పాపములు లేనివాడై, అందరికీ శ్రేష్ఠుడై, ప్రాజ్ఞతను పొందినబ్రాహ్మణుడు అనూచానుడని తెలియబడుతున్నాడు.


5)అనూచానః, యజ్ఞస్వాధ్యాయ యంత్రతః భౄణః - అనూచానుడై, యజ్ఞములను స్వాధ్యాయములను దాటనివాడు భౄణుడని తెలియబడుతున్నాడు


6)మంత్ర మంత్రార్థ విద్, ప్రాజ్ఞః, వానప్రస్థః, తపస్వీ ఋషిః - మంత్రమును తెలుసుకొని, దాని అర్థాన్ని అది ప్రతిపాదించే తత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, ప్రాజ్ఞ్యుడైనవాడు, వాన ప్రస్థాశ్రమమునందుండు వాడు, తపస్సు యందు మక్కువ కలవాడు ఋషి అని తెలియబడుతున్నాడు, వాళ్ళు మంత్ర ద్రష్టలుగా, మంత్రార్థముల ద్రష్టలుగా తెలియబడుతారు.


7.తపసా మానుష్యం అధిక్రాంతం: ఋషులను మామూలు మనుష్యులకన్నా పై స్థాయిలో చూస్తారు, అందుకే దేవతలతో పాటు ఋషులకూ తర్పణలుంటాయి. తపస్సు చేత మనుష్యత్వాన్ని దాటి ఋషిత్వాన్ని పొందుతారు.) ఈ ఋషిలలో మళ్ళీ స్థాయీ బేధాలిలా ఉంటాయి... ఋషి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి.


8)ఆత్మత్వమననాత్ మునిః - ఇవన్నీ దాటి ఆత్మ తత్వమునే మననం చేసే స్థితి కలిగినవాడు ముని అని తెలియబడుతున్నాడు.


ఈవిధంగా "వంశము - జన్మ", "వృత్తము - నడవడిక, చేయవలసిన కర్మలు (కర్మ-గౌణము రెండూ)", "విద్య" ఈ మూడూ ఉన్నవాడు త్రిశుక్లుడను బ్రాహ్మణుడనబడి అ పేర లోకములో గౌరవ మన్ననలను పొందును.



(మూలం స్కాంద పురాణం)

అథ బ్రాహ్మణభేదాంస్త్వమష్టౌ విప్రావధారయ !!

మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్ !

అనూచానస్తథా భ్రూణో ఋషికల్ప ఋషిర్మునిః!!

ఇత్యేతేఽష్టౌ సముద్దిష్టా బ్రాహ్మణాః ప్రథమం శ్రుతౌ !

తేషాం పరః పరః శ్రేష్ఠో విద్యావృత్తవిశేషతః !!

బ్రాహ్మణానాం కులే జాతో జాతిమాత్రో యదా భవేత్ !

అనుపేతక్రియాహీనో మాత్ర ఇత్యభిధీయతే !!

ఏకోద్దేశ్యమతిక్రామ్య వేదస్యాచారవానృజుః !

స బ్రాహ్మణ ఇతి ప్రోక్తో నిభృతః సత్యవాగ్ఘృణీ !!

ఏకాం శాఖాం సంకల్పాం చ షడ్భిరఙ్గైరధీత్య చ !

షట్కర్మనిరతో విప్రః శ్రోత్రియో నామ ధర్మవిత్ !!

వేదవేదాఙ్గతత్వజ్ఞః శుద్ధాత్మాపాపవర్జితః !

శ్రేష్ఠః శ్రోత్రియవాన్ ప్రాజ్ఞః సోఽనూచాన ఇతి స్మృతః !!

అనూచానగుణోపేతో యజ్ఞస్వాధ్యాయయన్త్రితః !

భ్రూణ ఇత్యుచ్యతే శిష్టైః శేషభోజీ జితేన్ద్రియః !!

వైదికం లౌకికం చైవ సర్వజ్ఞానమవాప్య యః !

ఆశ్రమస్థో వశీ నిత్యమృషికల్ప ఇతి స్మృతః !!

ఊర్ధ్వరేతా భవత్యగ్రే నియతాశీ న సంశయీ !

శాపానుగ్రహయోః శక్తః సత్యసన్ధో భవేదృషిః !!

నివృఇత్తః సర్వతత్వజ్ఞః కామక్రోధవివర్జితః !

ధ్యానస్థో నిష్క్రియో దాన్తస్తుల్యమృత్కాఞ్చనో మునిః !!

ఏవమన్వయవిద్యాభ్యాం వృత్తేన చ సముచ్ఛ్రితాః !

త్రిశుక్లా నామ విప్రేన్ద్రాః పూజ్యన్తే సవనాదిషుః !!

(స్కన్దపురాణం, మాహేశ్వర-కుమారికాఖణ్డం - 03-287-298)