ఇది అద్భుతమైన సంవత్సరం,
రాముడికి మళ్ళీ పట్టాభిషేకం అయోధ్య లో,
ఇక ఆయన కొలువు దీరితే రామరాజ్యమే !
ఈ శ్రీరామ నవమి మనకొక అద్భుత అవకాశం దొరికింది
పిండి వంటలకు సరుకులు లేవు
హడావిడి పడటానికి చుట్టాలు రారు
గుళ్ళకు వెళ్ళే సమయం కాదు
పులిహోరా పానకాల ప్రసక్తే లేదు
ఉన్నదల్లా మీరు, మీ కుటుంబం , మీ రాముడూ !
ఈ సారి రాముడికో దణ్ణం మాత్రమే కాదు,
రాముడు రాముడెందుకయ్యాడో తెలుసుకోండి,
సీతా రాముల కళ్యాణం లోక కళ్యాణం ఎందుకయ్యిందో తెలుసుకోండీ
అంత విద్యావంతుడు అయిన రావణుడు చెడ్డ వాడు ఎందుకయ్యాడో అర్థం చేసుకోండి
బోల్లెడు సమయముందికదా ?
పూజ లో ప్రతీక్షణం ఉన్నా, ఆచరణ లోకి అది రాకపోతే
అర్థం కాని రాముడు, వ్యర్ధమైపోయిన జీవుడికి నిదర్శనం అవుతాడు.
మంత్రాలకు చింతకాయలు రాలవు కాని
అర్థం చేసుకుంటే చింతలు తీర్చగలవు !
అంత ఓపిక లేదనుకుంటే మన సిరివెన్నెల గారు రాసిన పాట లో
నాలుగైదు లైన్లు అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి చాలు, ప్రత్యేకించి చివరి మూడూ లిన్లూ.
ఏ మహిమలూ లేక, ఏమాయలూ లేక
నమ్మశక్యం కాని ఏ మర్మమూ లేక !
మనిషిగానే పుట్టి, మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే !!
.
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా
దర్శింప చేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యవరణతరణము
.
అణిమగా మహిమగా
గరిమగా లఘిమగా
ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగా
నీ లోని అష్ట సిద్ధులూ నీకు తన్బట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరుని పై దృష్టి పరుపగా
తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే
మీకు ఒకవేళ ఇంట్లోనే కూర్చోమంటున్నాన్ను అని అర్థం కాకపోతె ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను , వాళ్ళెవరో చేసారు వీళ్ళెవరో చెప్పారు అని వీధుల్లో తిరగద్దు, మీ భక్తి అద్భుతమే కాని కరోనాకు అది తెలియదు, ఇది కలికాలం.
కారోనా తగ్గాలంటే నువ్వే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి
కలి ప్రభావం తగ్గాలంటే నువ్వే కాదు నీ చుట్టూ వారు కూడా రాముడిని అర్థం చేసుకోవాలి !