Tuesday, May 6, 2025

కొన్ని సమాధాన కవితలు

 

నా పరిష్కారం:
ఎందుకంటే
అవసరమున్నోడికి అహం ఉండొచ్చు
పెట్టేవాడికి స్వార్ధం ఉండొచ్చు
మధ్యలో దేవుడు ఉంటే
ఆకలి అన్నోడి ప్రాణం నిలబెట్టొచ్చు !!
ముద్ద అయినా ముట్టడు మన దేవుడు,
ప్రసాదం అని అంతా అన్నదానం చేసేస్తాడు !

----------------------------------------------------------------

నా పరిష్కారం:
తల ఒక కులం , భుజాలు మరోటి,
అని తలా ఒక కులానికి తన శరీరాన్ని పంచి ఇచ్చిన
'వేద కాల' పరమాత్ముని చెయ్యే
కులం నుండి బయట పడేసే చెయ్యి !
అయన చెప్పిన 'వేద కాలపు' కులాన్ని
అర్థం చేసుకుంటే
ఎంత పెద్ద తలైనా ,
పరమాత్ముని 'కాళ్ళ' మీద పడవలసిందే
అని తెలుసుకుంటే,
చండాలుని కి సాష్టాంగ పడిన అది శంకరుని వలే
సమానత్వం చాటిన రామానుజుని వలే
కలికాలపు కులం నుండి బయట పడే చేయూత అందుతుంది !!
.
సంఘంలో బతకడానికి
మంచి పేరు , ధర్మం ఉంటే సరిపోయినన్నాళ్లు
మనం సరిపెట్టుకు సంతృప్తి చెందినన్నాళ్లు
మనుషుల మధ్య కులమనే తాటాకు దడులు బాగానే ఉన్నాయి !!
సంతృప్తి అనేది మరచి,
అతిగా ఆశపడే మనుషులు ఎక్కువై
అధికారం , ఓటు , నోటు , సుఖం
కనీస అవసరాలైన సంఘం నిర్మించుకుని
ఆ తాటాకు దడులు అంటించే అవకాశం ఇచ్చాము
పొగ చూరింది కులం వల్ల కాదు
కులం కాకపోతే భాష , రాష్ట్రం , దేశం , మతం ..
మనకు దడులు చాలానే ఉన్నాయి !!

----------------------------------------------------------------

భగవద్గీతా ఖురానూ
కాగితం మీదే చదువుకున్నాము.
మరి నువ్వూ నేనూ
ఎందుకు విడిపోతున్నాము
మనం కాగితం కంటే
పలుచనైన వాళ్లమా ..?

నా పరిష్కారం:
కాగితాలదేముంది చింపేస్తే చిరిగిపోతాయి
మనుషుల మనసుల లానే !
.
అందరం అదే పుస్తకం చదివినా
అర్థం ఒక్కొక్కరికీ ఒక్కోలా ...
మరి పుస్తకాలే మారిపోతే ??
.
కాగితంపై అక్షరాల మధ్య విస్ఫోటనం చెందే ఆలోచనలు
ఏ భావాలు ఏ మనిషిలో రేకెత్తిస్తాయో
ఆ భావాల అంత పలుచన మనం,
వాటి మధ్య అంతరాల అంత అఘాదం మన మధ్య,
మార్పు చెందనంత కాల దూరం మనం !


----------------------------------------------------------------


(in progress)




No comments:

Post a Comment