Wednesday, November 13, 2013

మా ప్రధమ వార్షిక వివాహ మహోత్సవం !

కార్తీక శుద్ధ ఏకాదశి. ఉత్థాన ఏకాదశి.
చాతుర్మాస్యపు యోగ నిద్ర నుండి శ్రీ హరి మేల్కొనే రోజు.

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భవమ్‌
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్‌..

నాకు ఈ రోజు ఇంకా ప్రత్యేకమైన రోజు
శేషశాయి నిద్ర మేల్కొని
నాల్గునెలలు కన్నులారా తన బిడ్దలను చూసుకోలేదని
వాత్సల్యంతో వీక్షించుచుండగా
శ్రీ హరిని చూసి ఆదిశేషుడు ఆనందంతో ఊగుతుంటే
అతని తోక తగిలి పాల సముద్రపు తుంపర్లు
మాపై తలంబ్రాలుగా పడుతుంటే



'నాతి చరామి ' అని నేను
శ్రీ హరి సాక్షిగా, ఆది శేషు సాక్షిగా
ముక్కోటి దేవతలు, వేదాలు, ఆగ్ని సాక్షిగా
బాస చేసిన రోజు ఇది

అమ్మ అక్క చెల్లి,
అత్త మామలు
బావ, బావమరుదులు
ఆత్మీయ బంధు మిత్రుల అందరి
ఆశిర్వచనముల నడుమ
రమ్యమైన వివాహ సంబరాన
'నేను రమ్య ' ఒక్కటైన రోజు ఇది !
తిధుల ప్రకారం ఇవాళ మా ప్రధమ వార్షిక వివాహ మహోత్సవం !

No comments:

Post a Comment