Sunday, March 13, 2016

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే !

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే
అమ్మా, పిల్లలు ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.
నాన్న ఎప్పుడూ తుంటరివాడే,
అమ్మ మాత్రమే తరచూ మంచిదవుతూ ఉంటుంది.పిల్లల దృష్టిలో...
కని పెంచటం అమ్మే అన్నట్టు కనిపిస్తుంది.
నాన్న బాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం అమ్మే అయినా కలలు కనడం నాన్న పనేనని
ఎంతమందికి అర్థమౌతుంది?

పెంచటం అమ్మే అయినా, బాధ్యతెరిగి పెరగటం నాన్న వల్లేనని
కొంతమంది పిల్లలే బోధపడుతుంది.
సేవ చేయడం అమ్మ వంతు.
సరిచేయడం నాన్న వంతు.
అమ్మకు ఎప్పుడూ పిల్లలోని గుణాలే కనబడతాయి.
నాన్నకు మాత్రం పిల్లలోని గుణాలతో పాటు దోషాలు కూడా
కనబడతాయి.

ప్రేమించడం అమ్మ వంతు - దీవించడం నాన్న వంతు.
ఆకలి తీర్చడం అమ్మ వంతయితే, ఆశలు తీర్చడం నాన్న వంతు.
అమ్మ ప్రేమ అనుక్షణం బయటపడుతుంది.
నాన్న దీవెన ప్రతీక్షణం దాగే ఉంటుంది. అమ్మ గుండెలో పిల్లల సుఖానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది.

నాన్న గుండెల్లో పిల్లల క్షేమానికి సంబంధించిన ఆవేదన ఉంటుంది.
అమ్మ ఆరాటాన్ని కన్నీళ్లు చెప్తాయి - నాన్న ఆత్రుతని కళ్లు మాత్రమే చెప్తాయి.
కనిపించే ఆరాటం అమ్మది - కనిపించని పోరాటం నాన్నది.
అమ్మ ఏడ్వటం కనిపిస్తుంది - నాన్న ఎద చెరువవడం కనిపించదు.
అందుకే అమ్మ అమ్మే... నాన్న నాన్నే... ఇద్దరూ దేవుళ్లే!
-ఓ వాట్సప్ మెసేజ్

No comments:

Post a Comment