మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి. Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
Tuesday, November 30, 2021
సిరివెన్నెల గారు ఇక లేరు | Sirivennela Sitarama sastry Songs
మెటా వర్స్ : భయపడాలా వద్దా? Facebook Meta verse
మెటా వర్స్ : భయపడాలా వద్దా?
.
ప్రతీ నెలా జీతం పడగానే ఎదోక పుస్తకం కొనడం నాకు అలవాటు. 2008-2009 సమయంలో నేను ఫేస్బుక్కు లో ఫాంవిల్లీ , మాఫియా వార్స్ అని రెండు గేంస్ ఆడేవాడిని. వాటికి నేను ఎంత అలవాటు పడ్డానంటే, నాకు 4 ఎకౌంటులు ఉండేవి అవి ఆడటానికి. మెళకువగా ఉన్న సమయంలో కనిసం 30-40% ఆడుతూనే ఉండేవాడిని.
.
ఆ ఆటలు ఒక ప్రపంచం. ఫారంవిల్లీ లో మనం వ్యవసాయం చెయ్యాలి. తవ్వి, గింజలు వేసి, నీరుపోసి, మొక్కలు పెరిగేదాకా ఆగాలి. పంట పండాక అమ్మి వచ్చిన డబ్బులతో పొలం కొని మళ్ళీ వ్యవసాయం. అదొక లోకం. డబ్బులు పెట్టి కొని, మొక్కలు త్వరగా పెరిగేలా చెయ్యొచ్చు, పొలాలు కొనొచ్చు, వ్యవసాయ పరికరాలు కొనొచ్చు, ఇది ఒక వ్యసనంలా మారిపోయి డబ్బులు ఖర్చు చేసినవారు కూడా ఉన్నారు.
.
మాఫియా వార్స్ ఇంకొక రకం. గన్స్, బాంబ్స్, కార్స్, చంపడాలు, చావడాలు. ఒక భయంకర ప్రపంచం.
.
కేవలం లాప్టాప్ తెర మీద ఆడే ఒక ఆటే కాని మహా వ్యసనం.
.
నాకు ఒక 6 నెలల తరువాత కనీసం పేజీ తిప్పని పుస్తకాలు చూస్తే కానీ అర్థం కాలేదు నేను ఫేస్బుక్కుకి ఎంత బానిస నయ్యిపోయానో. మరు క్షణం నేను గేంస్ ఖాతాలు పూర్తిగా మూసివేసాను. అప్పుడు పరిస్థితులు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాయి. ఇప్పటికి నేను, ఆరు నెలలకోసారి కొన్ని రోజుల సామాజిక మాధ్యమాల సన్యాసం చేస్తుంటాను :-) .
.
మెటావర్స్ ఒక యూనివర్స్. అది లాప్టోప్ స్క్రీన్ కాదు. 3డి లోకం. బాహ్య ప్రపంచంలో మనం చెయ్యలేనిదంతా అక్కడ చెయ్యొచ్చు. స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు ఫ్రీ జంప్ చెయ్యొచ్చు, సముద్రపు అట్టడుగుల్లో ఈదులాడోచ్చు, జ్వాలాముఖి పేలినప్పుడు దాని లావాలో దుమికి మళ్ళీ బయటకు రావొచ్చు, ఈఫిల్ టవర్ ఎక్కి ఫొటో దిగొచ్చు.. ఇవన్నీ అతి తక్కువ ఖర్చుతో, గది బయట అడుగు పెట్ట కుండానే చెయ్యొచ్చు.
ఒకే చోట ఉండి ముద్దుపెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభవం అమెరికాలో ఉన్న ప్రియురాలు , ఇండియాలో ఉన్న ప్రియుడు మెటావర్స్లో పొందుతారు. ఆ టెక్నాలజి అలాంటిది.
అవకాశాలు అనంతం. ఎందుకంటే మన ప్రభుత్వాలు, మన కట్టుబాట్లు, మన సరిహద్దులు, సైన్సు సూత్రాలు ఇవన్ని వర్తించని ఒక ఎల్లలు లేని లోకం అది.
కొత్త లోకం కదా అక్కడ అందరూ సమానమే అనుకుంటారేమో, అక్కడ కూడా కొన్నుక్కున్న వారికి కొనుక్కున్నంత.
.
కంపెనీ వికలాంగులను అడ్డం పెట్టుకుని, నిజ జీవితంలో వారు చెయ్యలేనివి అక్కడ చెయ్యొచ్చు అన్ని చెప్తున్నారు.
ఇది కూడా ఫెయిర్ అండ్ లవ్లీ, నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వండనో , నిగ నిగలాడండనో జనాల్ని కించ పరచినట్టు వికలాంగులను ఫేస్బుక్ అవమానపరచి నట్టే, వారిని వాడుకున్నట్టే. మాయా లోకంలో వారిని తిప్పే కన్నా, వారి సాధికారతకు తోడ్పాటు పడే పనులు వేరే చాలా చెయ్యవచ్చు.
.
ఇదంతా నేను మెటావర్స్ గురించి భయపెట్టడానికి చెప్పట్లేదు. పిల్లలు పెద్దలు ఆ మాయా లోకంలో పడి నిజ జివితంలో సమయం వృధా చేసుకోకుండా, జాగ్రత్త పడాలి అంటున్నాను.
అతి సర్వత్ర వర్ఝయేత్ అని పెద్దలు చెప్పారు.
అతి కానంతవరకు, హద్దులు దాటనంత వరకు అన్ని మంచివే.
కొంచెం తాగితే ద్రాక్షరిష్ట మంచిదంటారు, ఎక్కువ తాగితే తాగుబోతు ఎదవని తన్నండంటారు.
.
ఇక మంచి ఏమిటంటే, చాలా కొత్త ఉద్యోగావకాశాలు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళకి మంచి ఉద్యోగాలు.
సినిమా వాళ్ళకు, కళాకారులకు కొత్తలోకాలు సృజించే అవకాశాలు.
మెటా వర్స్ కోసం ఆడిన్స్ తయారు చేసే కంపెనీలు.,
అక్కడా ఆడ్ ఏజన్సీలు.
మన కంపానీలు మెటా వర్స్ లో ఆఫీసులు తెరచినా ఆశ్చర్య పడక్కర్లేదు.
అక్కడ పర్యవేక్షించడం సులభం మరి.
పెళ్ళిళ్ళు , పేరంటాలు, దైవ దర్శనాలు అన్నీ మెటాలోనే.
దీనిని మనం ఆపలేం.
దీనికి ముందు ఇంటర్నేట్ లాంటి చాలా వాటిని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యాం.
మన గత అనుభవాలనుంచి నేర్చిన పాఠాలతో మనం ముందుకు వెళ్ళాలంతే.
కొత్త బంగారు లోకం :-)