Tuesday, November 30, 2021

సిరివెన్నెల గారు ఇక లేరు | Sirivennela Sitarama sastry Songs

ఆయనను శ్లాఘించ ప్రయత్నించ
ఎన్నని చెప్పి సంతృప్తి పడగలం ?
ఆయనొక ఆకాశం
ఎన్ని నక్షత్రాలు అంటించి అది నింపగలం?
...
సిరివెన్నెల గారు మన వాళ్ళకు తెలుసు ఎదోక రోజు వెళ్ళి కలవాలి, అని అనుకుంటూనే చాలా సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చా.
ఇక ఆయన లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నా.
మాటల పాటల రేడు లేరంటే, మాట్లాడటానికి మాటలే రావట్లేదు !
కార్తీకపర్వ బహుళ ఏకాదశి - 30 Nov2021 🙏
...




"చుట్టుపక్కల చూడరా చిన్నవాడా
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే.."
-- అని నాకు సంఘం పట్ల ఉన్న బాధ్యత గుర్తుచేసినా
.
"నమ్మకు నమ్మకు ఈ రేయిని
వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు"
-- అంటూ అందరు కలిస్తేనే సంఘం, అందరినీనీ కలుపుకుపోవాలని ఉద్భోదించినా
.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
--అని వైరాగ్యం నింపినా
.
"జరుగుతున్నది జగన్నాటకం
అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగా నీ లోని అష్ట సిద్ధులూ నీకు తన్బట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరుని పై దృష్టి పరుపగా
తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే"
-- అని గొప్పగా బతికే దారి చూపినా
.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా"
-- అని నైరాస్యం నుండి పైకి లేపి, నిస్తేజానికి నిప్పంటించి, స్పూర్తి నింపి, పరుగులు పెట్టించినా, ఆయనకే చెల్లింది !!
ఆ పాట ఈ పాట అని లేదు, అన్నీ అద్భుతాలే !!
.
ఆయన ఒక సినీ రచయితగా కాదు,
రూపాయి తీసుకోని వ్యక్తిత్వ మార్గదర్శిగా ఆయన నాకు ఆరాధ్యులు. ఇక ఎం చెయ్యగలం? అశ్రునివాళి అర్పించడం తప్ప !






No comments:

Post a Comment