Saturday, June 8, 2024

బిజెపి కి తక్కువ ఓట్లు పడాల్సిందే.

 తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. బిజెపి కి తక్కువ ఓట్లు పడాల్సిందే.

.

500 - 600 ఏళ్ళు మొఘలుల పరిపాలన, 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలన, మన డి.ఎన్.ఏ మార్చేసిందేమో!

సెకండ్-క్లాస్ సిటిజన్స్ లా బతకడం రుచించినంతగా,

అందరితో సమానంగా అందరూ ఫస్ట్-క్లాస్ సిటిజన్స్ గా బతకడం రుచించట్లా !

తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని పెద్దలు చెప్పినట్లు,

సెక్యులర్ అంటే నీతో సమానం గా పక్కోడిని చూడటం అనే కానీ,

నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్ గా బతుకుతూ పక్కోడికి పైన పెట్టమని కాదు !

.

ఇది అర్థంగాని 

హిందూ సెక్యులర్ అని చెప్పుకు తిరిగే కట్టప్పలు / నూతిలో కప్పలు

రూపాయికి అమ్ముడుపోయే కాంగి కమ్మీలు 

మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయ్యింది ,

రోజులు మారాయి అని గుర్తించలేకపోతున్నాయి !

అసలు , ఈ కట్టప్పల బతుక్కి ఎప్పుడూ ఎవడొకడు పైనుండాలి, అప్పుడే దానికి ఒక అర్థం పర్థం !

ఒక వాట్స్ అప్ వార్త చూస్తే అది నిజామా కాదా,

నిజం గా బీజీపీ అలా చేసిందా, అలా చేస్తుంది అని చెప్పిందా అని

నిర్ధారణ చేసుకునే ఓపికలేదు ! వారికి బానిసత్వం బహు రుచికరం !

.

బిజెపి కి తక్కువ ఓట్లు పడాల్సిందే,

70 ఏళ్ల కాశ్మీర్ సమస్య తీర్చేసారు, ఇప్పుడు టీవీల్లో ఏం గొడవలు చూడకపోతే మాకు పొద్దేలా గడుస్తుంది ?

జనాభా సంఖ్యలో మనం ఇంకా 2వ స్థానంలో ఉన్నాం, చక్కగా 10 మంది పిల్లల్ని కనే వాళ్ళని  NRC, CAA అని బయటే ఆపేస్తే ఎప్పటికి మనం మొదటి స్థానం సాధించగలం?

మన పాస్పోర్టుకు విలువ పెరిగింది అంట , ఉపయోగ మేముంది? తాకట్టుపెట్టలేము కదా?

ISROరాకెట్లు , DRDO మిస్సైళ్ళు తయారు చేస్తున్నాయి అంట, సోలార్ విండ్ గ్రీన్ ఎనేర్జి అంట... కొనుక్కుంటే పోయే దానికి ఉరికే ఎందుకీ ఊక దంపుడు పని ? ఉద్యోగుల్ని కష్టపెడుతున్నారు !

పెద్ద దేశాల మధ్య గౌరవం గా, గర్వంగా నిలబెట్టారు మన దేశాన్ని,మాకు కాస్త సిగ్గెక్కువ, అలా అందరి ముందు నిలబెట్టేస్తే ఎలా , అయినా మాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి !

శుభ్రత, విద్య, వైద్యం అభివృద్ధి చెందాయి, టాయిలెట్లు పెరిగిపోయాయి , చెంబెట్టుకు చల్లగాలికి అలా పోవాలంటే కుదరట్లా , మా స్వాతంత్య్రాన్ని హరించారు !

మైనారిటీలు గా మారిన జనాల పరిస్థితి...కాలం చెప్పిన సత్యం,

పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బాంగ్లాదేశ్, కాశ్మీర్,కేరళ, బెంగాల్ చరిత్రలో చూడండి,

మీరెవరు కాలాన్ని ఎదిరించడానికి, సెకండ్ -క్లాస్ సిటిజన్స్ గా ఆ పరిస్థితులు మాకు వస్తాయో లేదో చుడొద్దా ? చరిత్ర ఆవృతమవుతుందో లేదో తెలుసుకోవద్దా ?

ఇది వరకటికన్నా అవినీతి తగ్గింది, ఇప్పుడు ఎవర్నైనా తిట్టాలనిపిస్తే  ఎలా ? దీని వల్ల పక్కింటోళ్లతో గొడవలు ఎక్కువ అయ్యిపోతున్నాయి.

మిలటరీకి మరింత బలం చేకూర్చారు, సరిహద్దుల్లో సైనికుల్ని బలి చెయ్యకపోతే, అసలు పక్క దేశాలు భయపడి యుద్ధానికి రాకపోతే, కొత్త ఉద్యోగాలు రావట్లేదు, ఇదెక్కడి న్యాయం ?

మీకు అర్థమవుతోందా ?

.

.

241 సాధించి మోడీ బిజెపి ఘనవిజయం సాధించారు. చరిత్ర తిరగ రాసారు !

నెహ్రు 3 సార్లు PM అయ్యారు అంటారేమో, ఏ గట్టి ప్రతిపక్షం లేకుండా, ఒక్కడే పరిగెత్తేసి ఒక్కడే కప్పు సాధించేసి, డప్పు కొట్టేసుకోవడమేనా ? మొట్ట మొదటిసారి మెజారిటీ వచ్చే PM అయ్యారా ?

రాజీవ్ గాంధీ 414 సాధించారు అంటున్నారు ,

ఇందిరా గాంధీ శవం మీద సాధించిన చిల్లర, ఆ ఘనత. కాదా ? ఆ సాధించిన ఘనత కిరీటంలో మళ్ళీ భోపాలు, బోఫోర్స్, షాబానో, సిక్కు, కాశ్మీరు ఉచకోతలు కలికి తురాయిలు !

మోడీ ప్రభుత్వానికి ముందు,

రబ్బర్ స్టాంపు మన్మోహన్ - సోనియా ప్రభుత్వం 145 / 206 సీట్లతో 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది , అదికూడా రాజీవ్ గాంధీ శవం మీద సాధించినదే !

ఎలాంటి రాజకీయ/వ్యాపార నేపధ్యం లేని మోడీ బీజేపీ ప్రభుత్వం 282 / 303 /240 మెజారిటీ తో 3 సార్లు గెలిచారు, అదీ గెలుపంటే !

.

అయినా 

400 అనుకుని 240 మాత్రమే సాధించిన బాధలో మేము ఉన్నాం సరే

99 సీట్లు మాత్రమే సాధించి ,

14 చోట్ల డక్ అవుట్ అయిన కాంగ్రెస్ ఎందుకు ఆనంద పడుతోందో తెలియట్లా !

అసలు రాజీవ్ గాంధీ తరువాత కాంగ్రెస్ పతనం చూడండి 244 -> 145 -> 206 -> 99 -> ?

ఏడిస్తే, వచ్చే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కష్టం అని ఏడుపాపుకుంటున్నారేమో !!

డెమోగ్రఫీ మారిన ప్రతిచోటా,

వాట్సాప్ మెసేజులు నమ్మే అమాయకులు ఉన్న ప్రతిచోటా

ఓటేసే అందుకు బద్ధకం చూపించిన వాజమ్మలు ఉన్న ప్రతిచోటా బిజెపి ఓడింది, చూడండి. 




.

ఏదేమైనా మేమంతా మోడీ వెనుకే, బిజెపి సంఘీలమే మేము !

Friday, April 19, 2024

తక్కువ మార్కులు వస్తుంటే B /C/D అని కింది సెక్షన్లకు 'DEMOTE' చేస్తారుట

"నాన్నా ఫలానా స్కూల్లో, 15 రోజులకొక టెస్ట్ పెడతారుట, అందులో తక్కువ మార్కులు వస్తుంటే B /C/D అని కింది సెక్షన్లకు 'DEMOTE' చేస్తారుట. నిజంగా మొన్ననే ఒకబ్బాయిని అలా డిమోట్ చేసారుట" అన్నాడు విహారి.
C/D సెక్షన్ విద్యర్థి అయిన నాకు ఆ పద్ధతిలో అంత సమస్య/తక్కువతనం కనిపించక పోయినా, 'డిమోట్' అన్న పదం తప్పు అనిపించింది. అటువంటి ఆలోచన పిల్లల మనసులోకి వచ్చేలా చేసే పెద్దలు, టీచర్లు, స్కూలు, సంఘం తమ ధృక్పదం మార్చుకోవాలి అనిపించింది !
.
"అది స్టూడెంటుని డిమోట్ చెయ్యడం కాదు,
ఆ స్టూడెంటుకి అర్థం అయ్యేలా చెప్పడం ఆ సెక్షన్ టిచరుకి కుదరకపోవడమో,
అర్థం అయ్యేలా చెప్పేంత సమయం స్కూలు కేటాయించక పోవడమో వల్ల,
విడమరిచి చెప్పగలిగే వేరే సెక్షన్ టిచరుకి అప్పచెప్పుతారు" అని చెప్పా.
.
నిజానికి ఒక తరగతిలో ఒక్కొక్క విద్యార్థీ ఒక్కోరకం,
ఒక టీచర్ బోధనా పద్ధతి అందరికీ సరిపడుతుందని చెప్పలేము.
అదృష్టం కొద్ది కొంతమందికి తగిన గురువు ముందే తగులుతారు, కొంతమందికి ఎప్పటికో కుదురుతుంది. కాబట్టి ఈ 'లాటరీ' సమస్యని పిలల్ల చేతకాని తనం గా మనం మార్చకూడదు / మలచకూడదు.
పిల్లలకు చాలా జిజ్ఞాస, ఆశక్తి, తెలుసుకోవాలన్న తపన ఉంటుంది అయితే వారిని సరైన దారిలో నడిపే బాధ్యత మాత్రం సంఘానిదే.
.
పిల్లలకూ, బడి ఒక నమూనా ప్రపంచం !
వారు గౌరవంగా ధైర్యంగా ఆనందంగా బతకడం ఎలాగో నేర్చుకుంటూ జ్ఞాన సముపార్జన కూడా చేసుకోగలిగే ప్రదేశం అని నా ఉద్దేశం.
తమను తాము తెలుసుకోకుండా, అనుకరణతో, ఆత్మన్యూన్యతతో, బట్టీ కొడుతూ, స్వతంత్రం & సరదా లేకుండా బడిలో గడుపుతున్నారంటే, వారి బాల్యం పాడయినట్టే !
.
ముఖ్యంగా చదువు & మార్కుల విషయంలో 'డిమోట్ ' / 'తక్కువ' / 'వాడిని చూసి బుద్ధితెచ్చుకో ' లాంటివి అనవసరమైన సంభాషణలు.
మంచి మార్కులు , మంచి కాలేజీ అంటే ఎక్కువ విషయ జ్ఞానం & ఎక్కువ జీతం, అంతే తప్ప
మంచితనం, ఆనందం, సంతోషకరమైన జీవనం, క్రమశిక్షణలకు అవి గీటురాళ్ళు కాదు .
.
వచ్చే కాలమంతా కృత్రిమ మేధ ప్రధానంగా,
మనుషులే వనరులుగా ఉండే రోజులు,
బుర్రలో ఎంత GB జ్ఞానమున్నా ఉపయోగముండదు.
కాబట్టి , బట్టి పట్టమని కాకుండా
సృజనాత్మకత, కళాత్మకత, నిర్వహణ వంటివి,
చదువుతో పాటు, ఒక కళ , ఒక ఆట హాబీలు వంటివాటి పై
మక్కువ కలిగేలా చెయ్యడం మంచిది !