Monday, December 16, 2024

అల్లు అర్జున్ కి ఇచ్చిన జీతం 300కోట్లు

 ఇంటర్నెట్ ప్రకారం

పుష్ప 2 సినిమాకి అయ్యిన ఖర్చు 400 - 450 కోట్లు అంట.
అందులో అల్లు అర్జున్ కి ఇచ్చిన జీతం 300కోట్లు. సుకుమార్ & రష్మిక కి 40 కోట్లు
వెరసి ముగ్గురికి 340 కోట్లు.
సినిమాకి పనిచేసిన మిగిలిన టెక్నీషియన్స్ కి దక్కింది రమారమి 60 -110 కోట్లు.
సినిమా వసూళ్లు ఇవాళ్టికి 1000+ కోట్లు అంట.
అంటే పెద్ద సినిమాకి బాగుపడేది సినిమా పెద్దలే తప్ప, మిగతా వాళ్ళకి దక్కేది మాములే, హీరోకి రెమ్యునరేషన్ పెరిగింది అని , వసూళ్లు పెరిగాయని టెక్నీషియన్స్ కి పెరుగుతుందా ?
నా లెక్కల్లో తప్పుందా?
ప్రేక్షక దేవుళ్ళు కాస్త ఫ్యానిజం పక్కనపెట్టి , ఆలోచించి వరాలు ఇవ్వాలి.
హైప్ పట్టించుకోకుండా కధ ఉన్న సినిమాలను ఆదరించాలి !
May be an image of 1 person and text

అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్టు?

 అరస్టు చెయ్యాలంటే

తగిన ఏర్పాట్లు చెయ్యని సంధ్యా దియేటర్ ఓనర్నో,
చిన్న్ రాలీ చెయ్యాలంటే పోలిసులకు చెప్పాలి అంటారు
మరి అల్లు అర్జున్ వెళ్తున్నా బందోబస్తు సరిగ్గా చూసుకోని పోలీసుల్నో
పట్టుకోవాలి, అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్టు?
.
సినిమా రిలీజుకి తారలు సంధ్యా థియేటరుకి వెళ్ళడం షరా మామూలే !
అంత రచ్చ ఉంటుంది అని తెలిసి చిన్న పిల్లల్ని ఆడాళ్ళని తీసుకెళ్ళిన కుటుంబాలని కోర్టు మందలించాలి,
మొదటి రోజు సినిమాకి పోక పోతే %$#@ఆగదా? అని.
ఇలాంటి సినిమాలకు తొలిరోజు దియేటర్ వాళ్ళు మైనర్లను లోపలికి పంపకూడదు. పోలిసులు అలాంటి రూలు పెట్టాలి. చిన్నప్పటి నుండి 'ఈ ఫాన్ ' బానిసత్వం అవసరమా?
.
2 నిమిషాల్లో ఇంటెరిం బైల్ ఇచ్చేదానికి అరస్టు అని అన్ని న్యూస్ చానల్స్ హడావిడి ఎందుకు?
శుక్రవారం అరస్టు చేస్తే, చానళ్ళు ఫ్రీ ఆడ్ , శనాదివారాలు సినిమా ఇంకా బాగా ఆడుతుంది అంతకు మించి జరిగేదేముంది?
మీరేమనుకుంటున్నారు? Political / Promotional or ... ?