పండు గాడికి ప్రేమతో... ఒక ప్రేమ లేఖ,
నా తెలుగు వ్రాత బాగోలేకపోయినా భావం తెలుగులోనే బాగా చెప్పగలనని నా అనుభవం, అందుకే... నా రాత కాస్త సద్దుకో.
ప్రేమకు ముందు 'నిన్ను ప్రేమిస్తున్నాను ' అని చెప్పటానికి ప్రేమలేఖ రాస్తాం (మనం రాసుకోలేదనుకో ). ఒక సారి ప్రేమలో పడ్డాకా ఓపిక లేకో, తీరిక లేకో, ప్రేమ లేకో (ఉంటుంది కాని ప్రాముఖ్యత తగ్గుతుంది, తినగా తినగా గారులు చేదెక్కిన చందాన) మళ్ళీ ప్రేమ లేఖల జోలికి పోము. అవసరమైతే అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్చీస్ కి వెళ్ళి ఒక గ్రీటింగ్ కార్డ్ కొంటాం కానీ, పక్కనే ఉన్న పెన్ను పేపెర్ తో ఒక ప్రేమ లేఖ రాయం.
పెళ్ళికి ఫోటోలు తీసుకుని ఆల్బం లో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకుంటాం. ఎప్పుడైనా అవి తెరిచి చూసుకుంటే జ్ఞాపకాల దొంతరలు మబ్బుల్లా కరిగి మనసునుపై కురిస్తే ప్రేమ కొత్త చిగురులు తొడగాలని.
ప్రేమలేఖలు కూడా అలాంటివే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా గొప్పవి. ఫొటొచూస్తే భౌతికంగా ఎలా ఉండేవాళ్ళమో గుర్తుకు వస్తుంది... 'అప్పట్లో నా జుట్టు చూడు ఎంత ఎక్కువో ' లాంటివి. ప్రేమలేఖ మానసిక స్తితిని గుర్తు చేస్తుంది.
నేను మాత్రం నిన్ను రోజూ మొదటి రోజులా కొత్తగానే ప్రేమిస్తా, గుండెకాగితమై ప్రేమలేఖలు రాస్తూనే ఉంటా. ఎప్పూడో ఒకప్పుడు అవన్ని మూటగట్టి ఒక ప్రేమలేఖగా నీకు అందిస్తా, రొజూ చెప్పేదే అయినా అదొక ఆనందం.
నువ్వు రాసిన ఉత్తరం ఇప్పటికి ఒక పదిసార్లు చదివా. నిజమే నీకు నాలా ఉత్తరం రాయడం రాదు!
అలంకార ప్రియుడిని మరీ !
నేను మన ప్రేమ దెగ్గర నుండి చందమామకి, సముద్రానికి, పువ్వులకి, వెన్నెలకి రాసుకుటూపోతాను, మధ్యలో ఎప్పుడైనా గుర్తుకువస్తే మళ్ళీ నేదెగ్గర నుండి మొదలు పెడతా.
నీ ఉత్తరం చదివాకా అనిపించింది, నువ్వు కేవలం 'ప్రియురాలిలా ' రాసావని. ఇప్పుడే చెట్టునుంచి కోసిన పండులా తాజాగా, లేడిపిల్లలా చలాకీగా, స్వచ్చంగా ఉంది (చూసావా?? అలవాటు అయ్యిపోయింది ఇలా చెప్పడం :-) ). మనసులో మాట సరిగ్గా అలానే పెట్టటం కష్టమే. ఉపమానాలు, ఉపమేయాలు వాడి నా ఉత్తరం లిప్స్తిచ్క్, పౌదెర్, ఫౌందతిఒన్ వేసుకున్న అమ్మాయిలా ఉంటే, నీ ఉత్తరం చక్కని పల్లెపడుచులా స్వచ్చంగా ఉంది.
Thank you and I love you.
నువ్విప్పుడు (9.55 PM) నాకు ఫోన్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. నువు లేని ఏ నాలుగు రోజుల్లో నా అలోచనలు సవివరంగా చెబుదాం అని ఉత్తరం రాస్తున్నా, ఫోన్ చెయ్యలేక. నువ్వు ఎదురు పడినప్పుడు చెప్తే ఇవే మాటలు మనం మర్చిపోవచ్చు. ఉత్తరం రాస్తున్నా, జేవితకాలం గుర్తుండాలని. నిన్ను ప్రేమిస్తున్నా. నిను వీడి నే మనలేకున్నా. నిన్నే స్వాసిస్తూ, నీకై జీవిస్తూ, నీ కోసం ఎదురుచూస్తున్నా !
మనం బీచ్ లో కూర్చున్నప్పుడు అనిపించింది, చంద్రుడు మనలను చూసి వెన్నెల మల్లెలు సముద్రంపై జల్లి, అలల పల్లకీపై నా చెంతకు పంపితే, ఆ మల్లెలు నా చెలి సొగసుని చూసి ఓర్వలేక, ఒడ్డున నురగై కరిగిపోతున్నాయని. ఇంతకన్నా ఏమికావాలి ఏ ప్రియుడికైనా? ప్రేమ అనేది ఒక కళ, అది ఎంత బాగా వస్తే, జీవితం అంత కళగా ఉంటుంది.
మరి అలాంటి ప్రయత్నం లో ఒక సాదా ప్రేమ లేఖ.
ఇక నిద్దుర పోవాలి, శెలవు మరి!
నీకీ ఉత్తరం ఇచే రోజు కోసం ఎదురు చూస్తూ....
No comments:
Post a Comment