Friday, April 19, 2013

కొట్టి వేతల 'ప్రేమ లేఖ'

పొగడ్త లేని ప్రేమ లేఖ (ప్రత్యెకించి అబ్బాయి, అమ్మాయికి రాసే ప్రేమ లేఖ) పువ్వుల్లేని గులాబి మొక్కలాంటిది.
పొగడ్త ప్రేమలేఖకి అందం. నిజాయతీ ప్రేమకి ఆరంభం. మరి పరస్పర విరుధ్దమైన పొగడ్త/నిజాయతీ ఒకేసారి వ్యక్తికరించాలంటే?

ఆ ఆలోచనకు రూపమే ఈ ప్రేమ లేఖ !



ప్రియా, (ఇంకా స్నేహితురాలివేగా So ప్రియమైన స్నేహితురాలికి అంటా)
ప్రియమైన స్నేహితురాలికి XXX కి, (పరవాలేదు OK)
ప్రేమతో  (సినిమా టైటిల్ & పాత రకం... కానీ తప్పదు)
ఎలా ఉన్నావ్? (ఎలా ఉండటమేంటి?? నువ్వు బాగాలేకపోతే నేను బాగుండనుగా !)
అంతా క్షేమం అని తలుస్తాను. (ఇది ప్రేమ లేఖ, క్షేమ సమాచారాల ఉత్తరం కాదు)
Coming directly to the point (ఇంగ్లీష్ వద్దులే, మొత్తం ఇంగ్లీష్లో  రాయాలంటే కష్టం)

ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నేనైపోయా నువ్వు, (సినిమాలెక్కువ చూస్తున్నాలే ఈ మధ్య Lite తీసుకో :-) )
నిను చూసిన తొలిచూపులోనే నీపై .. (తొలి చూపులోనే ప్రేమించడానికి నాకు నీపై ఉన్నది ఆకర్షణ కాదు, గత కొన్నేళ్ళుగా నాకు నీపై కలిగిన గౌరవం ఆపై నమ్మకం ఆపై వలపు అటుపై నువ్వు మీ ఊరు వెళ్ళిపోయిన విరహంలో నీపై ప్రేమ కలిగిందేమో అన్నసందిగ్దత.)

ఆ రోజు ఆశ్రమంలో ముసలివారికి సేవ చేస్తున్న నీ మంచితనం చూసి నీపై మనసుపడ్డా ! ( అంతా అబద్దం నిన్ను నేను ఒక్క గుణమో చూసి ప్రేమించలా, నిన్ను నీలా, నిన్ను మొత్తంగా ఇష్టపడ్డా. షరతులు వర్తించని ప్రేమ, కారణాలు అక్కరలేని ప్రేమ !)

ఆపై మెరిసే నీ కళ్ళు, చంటిపిల్లల్లాంటి నీ నవ్వు నన్ను మురిపించాయి.(ఇది నిజం)
నీ ఒక్క తలపు చాలు నన్ను కలల దొంతరలో నన్ను దాచి కాలాన్ని నిలువరిస్తుంది(ఇది కూడా)
అన్ని పురుగులుండగా రాజమౌళీ ఈగే ఎందుకు తీసాడో తెలుసా??
ప్రేమలో ఉన్నవాడికి రెండు కళ్లు చాలవు ప్రియురాలిని చూసుకోడానికి

ఈగలాగ వెయ్యి కళ్ళన్నా కావాల్సిందే !! (ఇది నిజంగానే నిజం)

భువనైక సుందరీ, నటరాజ పదమంజరీ, ఉషోదయ ఉషా ఝరీ, నా హ్రుదయ లాహిరీ...  (హడవిడి యెక్కువ విషయం తక్కువ)

నువ్వు చీర కడితే మాధురీ దీక్షిత్, ఓణీలో త్రిష, జీన్స్ లో ఐష్..(తప్పు తప్పు, నీలో ప్రతీ అణువునీ నేను ప్రేమించినప్పుడు ఎవరితోనొ నిన్ను ఎందుకు పోల్చాలి?)
అమ్మాయిలకే తలమానికం, అందానికి తూకం, ఆదర్శానికి ప్రతిరూపం (అతి సర్వత్ర వర్జయేత్)
నువు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం ( అలా కాదు కాని,
నువ్వు సుఖంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా,
నువు నాతో ఉంటే జీవితమంతా పండగే ప్రతిపూటా !)
నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, ఎండ కన్నెరగకుండా , కాలు నేల తగలకుండా .. ( అతిగా లేదు ?? నిన్ను ప్రేమగా చూసుకుంటా అని చెప్తే చాలదా?)
నిన్ను నేను ప్రేమిస్తున్నా. ఉత్తరంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఏదోలా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నానని నీకు అర్థమయ్యాకా...
నీ కళ్ళు నిజం చెప్పక మానవు

పొగిడి నిన్ను ఒప్పించడం నాకు ఇష్టం లేదుఅది తాత్కాలికం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పా, ఆ పైన నా అదృష్టం !

** నువ్వు నాతో ఉంటె అన్నీ ఉన్నట్టే అని చెప్పను కానీ, నువ్వు  ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను నా  జీవిత కాలం నీకు తోడుంటా !

                                                                                                  ఇట్లు,
                                                                                                  - XXX


No comments:

Post a Comment