Saturday, May 24, 2014

RUMI - అమృతత్వం ...


మట్టిలా గిట్టి, మొక్కనై పుట్టి
మానులా మన్నై, జంతువుగా జన్మించి
ఆ ప్రాణీ అంతమైతే, మనిషిగా పుట్టా !
భయమెందుకు నాకు?
చావులేనిదెప్పుడు..ఈ సముద్రపు అలకు?

మళ్ళీ ఓ సారి పోతా, ఈ సారి మనిషిగా !
ఆకాశానికి ఎగసి ఆ దేవతలలో కలిసిపోతా !
అలా మాత్రం ఎంత కాలం?
మహా దేవుడు కాక మృత్యుంజయుడు ఎవ్వడు?

దేవతగా నా ఆత్మ పరిత్యజించాక
దేవతల కన్నా ఇంకా పైకి..
ఏ ఊహకి అందని ఊర్ధ్వానికి
ఓహ్! ఇలాగే ఎప్పుడూ ఉండిపోవాలని కోరుకోను,
ఎందుకంటే అమృతత్వం అంటే ఆది చేతనంలో కలవడమే !!
-అనువాదం, రూమీకి అభివాదం, కీర్తి

No comments:

Post a Comment