Monday, August 18, 2014

అశ్రునయనాలతో...











పిల్లలకి తండ్రి ధైర్యం, ఆయన లేనప్పుడు
మావయ్యలే వారి ధైర్యం,

కొండంత అండగా, వెన్నంటి ఉండగా
కొండనైనా డీకొనే సాహసం ఉండదా?

ఆదరణే తప్ప అన్యమెరుగనివాడు
ఆశిర్వాదమే తప్ప అక్కసు ఎరుగని వాడు

ఎన్ని కుర్ర పనులో.. అన్నింటినీ భరించి
ఏది మంచిదౌనో.. దాన్ని ఆపాదించి
చక్కదిద్దె మమ్ము, సహనం వహించి

నిజాయితీ, నిభద్దత,
సాహసం, సహనం,
ఒక్కటెమిటి మంచి..
అన్నీ గొప్ప గుణాలే
చేతులెత్తి మొక్కే పది ఊళ్ళ జనాలే

మా చిన్నప్పటి గోడలు
ఇప్పుడు చిన్నవయిపోయాయి
బీటలువారి శిధిలమవుతున్నాయి
డబ్బైయేళ్ళ చైతన్యం, ఆలోచనలూ
ఆదర్శాలు అన్ని ఒక్కసారిగా అంతమౌతాయని అనుకోలేదు

సూర్యుడికి గ్రహణముంటుందని తెలుసు
కాని
శూన్యంలో కలిసిపోతాడని తెలుసుకోలేదు

మమ్మల్ని నీ భుజాలపై మోసి పెంచినందుకు
నిన్ను మా భుజాలపై సాగనంపడం తప్ప 
ఏమి చెయ్యలేక.. అశ్రునయనాలతో !

వినువీధిలో మరో తార
నిత్యం మమ్మల్ని ఆశిర్వదిస్తూ
ఆ నమ్మకమే
కుంగిపోయిన మా భుజాలకు తిరిగి సత్తువిస్తూ !!

No comments:

Post a Comment