Intro:
800,000 people kill themselves every year and its the 15th leading cause of mortality accounting for 1.5% of all deaths. In India every 10 people out of 100,000 attempt suicide. Suicides>deaths by accidents + animals + killers We are far more at risk due to love affairs (32% of suicides) than due to sharks as per statistics. We have taken suicides as concepts for our debut short film as to reduce suicides our societies should develop more LOVE, SELF ACCEPTANCE, MEANING, HOPE, FORGIVENESS. This is our debut, though we don’t have experience we have given our sincere attempt.

Through this film we want to say that some problems are not real at all (friendship - in this movie), and some problems will be in that transition stage into good (love - in this movie) and only some are real problems (fathers health- in the movie).
We want to say patience is the key to solve problems, who knows? magics are those unexpected knocks on the door, magics defies any logics. you just need to wait when you cant do anything.
You are the only one that loves you unconditionally in this world, so even if the whole world is against you, just live for you.
Everyday can be a starting for new life, you just need to believe, and when you believe you will gain all the strength required to face any problems.
ప్రతి సంవత్సరం 8 లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇది మొత్తం మానవ మరణాలలో 1.5%.
మన భారత దేశం ళో ప్రతి లక్ష మందిలో 10 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
ఏక్సిడెంట్స్, జంతువులు మరియు హత్యల వల్ల చనిపోయె వారికన్నా ఆత్మహత్యల వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ.
ఆత్మహత్యల్లో 32% ప్రేమ వ్యవహారాలవల్ల జరిగేవి. అంటే జంతువుల దాడి వలన చనిపోయే వారికన్నా ప్రేమ వ్యవహారల వల్ల చనిపోయేవారు ఎక్కువ అన్నమాట.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవల్సింది ఏమిటి అంటే.. సాంఘీకం గా మనం ఇంకా ప్రేమ, ఓర్పు, సహనం, నమ్మకం, విశ్వాసం పెంపొందించుకోవాలి. అందుకే మా మొదటి సినిమా ప్రయత్నానికి ఆత్మ హత్య ను కధగా ఎంచుకున్నాం.
ఏ పని అయినా చేస్తే కాని తెలియదు అసలు ఎలా చెయ్యాలో. మేం చేసాం.. తెలుసుకుంటున్నాం, తెలుసుకుంటూనే ఉంటాం.
అనుభవం గొప్ప గురువు, ముందు పరిక్ష పెట్టి అప్పుడు పాఠం చెప్తుంది.
మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందిస్తారని అనుకుంటూ.. మీ కీర్తి !
------------------------------------------------------------------------*********************-----------------------------------------------------------
Intro in movie:
మందు కొడితే మనసులో బాధలన్నీ మత్తులో మర్చిపోవచ్చంటారు
మరి మత్తులో కూడా మరుగుపడని కష్టమొస్తే?
నాకొచ్చింది !
అందుకే
మందులోకి మంచింగ్ ఈ పాయిజన్,
పెగ్గు దిగితే చాలు,
బంధాలు, బాధలు బయటకి
బాడి పాడికి,
పాపాలు, ప్రాణాలు పైకి !
బతుకు బరువయితే చావు చెలిమితో తెలికవుతుంది
!
నిర్లిప్తత, నిస్తేజం బదులు నిశ్శబ్దం, నిర్వాణం నిండుకుంటుంది !
ఈ చావు గోలేంటి? ఇంతకీ ఎందుకు చద్దామనుకుంటున్నావో చెప్పి చావరా… అని కదా మీ విసుగు ??
చెప్తా... పెళ్ళికి ముహూర్తాలు కావాలి కానీ చావుకెందుకు, ఒక పావుగంట పట్టినా, చెప్పే చస్తా !
ఇవాళ నా మేల్కొలుపు లోనే చాలా చావులున్నాయి, అందుకేనేమో రోజు నా చావుతో ముగుస్తోంది...
-Coming soon as a short film, please watch
No comments:
Post a Comment