Wednesday, October 17, 2018

బౌద్ధులను హిందువులు చంపేసారా ??!! (Hindus killed Buddhists??)

బౌద్ధుల మీద దాడులకు బౌద్ధ గ్రంథాలు glorify చేసిన దాంట్లో శాస్త్రీయత ఎంత ఉంది అనే దాని మీద నాకున్న పరిమితి నేను అర్థం చేసుకున్న పరిధిలో నా విశ్లేషణ ఇస్తున్నాను. ఇది నిజం లేదా ఇదే విధంగా జరిగి ఉంటుంది అని కాదు. ఇది కేవలం నా విశ్లేషణ గా చదవండి
మొదటగా 84000 స్థూపాలు కట్టడం అనేది శ్రీలంక బుద్దిస్ట్ లిటరేచర్ glorify చేసింది. అప్పట్లో అది అశోకుడు కాలంలో మనకున్న వసతులతో సాధ్యం అయ్యే పని కాదు. అశోకుడి స్థూపాలు ఒక 1000 ఉండి ఉంటాయి అనుకుందాం. రెండవది స్థూపాలలో monk ఉండరు. విహారాలు ఆరామాలు లో ఉంటారు. కాబట్టి ఈ సంఖ్య ఏ రకంగా చూసిన మేధస్సు కి అందని విషయం. దీనిని ఎందుకు glorify చేసుంటారో చూద్దాం.


అశోకుడు మొదటి గొప్ప చక్రవర్తి బుద్ధిజం తీసుకొని వ్యాప్తి చేసిన వాళ్ళలో. కాబట్టి ఆయన పేరు మీద ఈ glorification ప్రారంభం చేశారు. కాని నిజంగా అంత శాంతి పాటించాడు అంటే కాదు అంటున్నారు చరిత్ర కారులు. క్రిమినల్ ట్రైబ్స్ నీ నిర్ధాక్షిణ్యంగా ఉరిశిక్షలు వేయించారు ఎటువంటి సానుభూతి లేకుండా ఆయన.
ఇక టెక్నికల్ గా historians ఏమి చెప్పారో చూద్దాం. Etienne Lamotte అనే చరిత్రకారుడు బౌద్ధం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆయన linguistics తెలిసిన వ్యక్తి కూడా. పాళీ, సంస్కృతం లాంటి భాషలు కూడా వచ్చు. ఆయన చెప్పిన విషయాల ప్రకారం sunga dynasty నిజానికి బుద్దులని పట్టించుకోలేదు. ఇంకో మాట అంటారు సాంచి లో బుద్దిస్ట్ స్థూపం కట్టడానికి సాయం చేశారు అని . ఒక్క పుష్యమిత్ర మాత్రం ఏదన్నా చేసున్న కొన్ని నాశనం చేసి ఉండొచ్చు అని అనడం జరిగింది.

అంతే కాకుండా అదే సమయంలో శాతవాహనులు బ్రాహ్మణ మరియు బౌద్ధం ని సమానంగా చూసారు మరియు రెండు మతాలు కలిసి జీవనం సాగించాయి. కారణం అప్పటికే బౌద్ధం rituals మరియు బ్రాహ్మణ వాదానికి దగ్గరగా జరిగింది. గుప్తుల కాలం వచ్చే సరికి త్రిమూర్తులు వచ్చారు. దశావతారాలు వచ్చాయి మరియు ఆ దశావతారం లో బుద్ధుడు చేరాడు. అప్పటికే బుద్ధిజం తగ్గుముఖం పట్టింది ఒక్క eastren states లో తప్ప. హర్షుడు గుప్తుల తర్వాత నిలబెట్టడానికి చూసాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక్కడ ఎక్కడ బౌద్ధాన్ని తొక్కాల్సిన పని లేదు. ఇక 7 వ శతాబ్దం కూన పాండ్య వంశానిది దక్షిణాన. శైవం వ్యాప్తి ప్ర్రారంభం అయ్యింది. తర్వాత రాజా రాజా చోళుడు రావడంతో వైష్ణవం ప్రారంభం అయ్యింది. ఇక వాళ్ళ రచ్చలో వాళ్ళు ఉన్నారు.

ఇక 1902-1928 వరకు ఉన్న పురావస్తు నిపుణుడు అయినా john marshall అయితే ఖచ్చితంగా ఒక్క విషయం చెప్పారు. Sunga dynasty నాశనం చేశారు అనడానికి circumstantial evidence లేదు అనేసారు. ఇక పుష్యమిత్రుడు విషయానికి వస్తే రాజ్యకాంక్ష విపరీతంగా ఉండటంతో మౌర్యుల చక్రవర్తుల అవశేషాలు ఉండకూడదు అని అన్ని నాశనం చేసాడు వాటిల్లో ముఖ్యం అయినది అశోకుడి శాసనాలు. అవి తర్వాత బ్రిటిష్ తవ్వకాల్లో బయటపడ్డాయి.

ఇక నలంద విశ్వవిద్యాలయం నాశనం అయ్యింది తురుష్కుల దాడుల్లో. దీనికి ఈ రాజులకి సంబంధం లేదు.

ఇక శంకర విజయాలు కి వస్తే దాంట్లో ఉన్నందంతా బూటకం. ఆయన బుద్ధిజం ని నాశనం చేసాడు అనే మాట కన్నా ఆయన హిందూ మతాన్ని stabilize చేసాడు అనొచ్చు. ఒక రకంగా హిందూ మతంలో పుట్టిన mass leader. అప్పటివరకు బ్రాహ్మణుల కనుసన్నల్లో ఉన్న rituals జనం దగ్గరికి చేర్చాడు. కొత్త వ్రతాలు, పూజలు ఇలా. కొన్ని స్తోత్రాలు పరిచయం చేసి నేరుగా మోక్షం అన్నాడు. దాంతో ప్రజల్లో దేవుడు అయ్యి కూర్చున్నాడు. బౌద్ధాన్ని నాశనం చెయ్యడం కన్నా భౌతిక వాద ఆలోచనలను నాశనం చేసాడు. మందాన మిశ్రుడు హిందువు కానీ ఆయన మీద ఈయన వాదన జరిగింది అని రాసుకున్నారు. అవన్నీ నేను నమ్మను కానీ మనిషి ఆలోచన మాత్రం చంపేశాడు. దేశం మొత్తం తిరిగిన మొదటి చివరి సన్యాసి కాబట్టి జనంలో దూసుకుపోయాడు.

అంటే అసలు హింసే లేదు అంటే కూడా ఒప్పుకోను. చేశారు కానీ ఈ బౌద్ధ గ్రంధాలు glorify చేసినంత సీన్ అయితే లేదు ఖచ్చితంగా. రాజ్యకాంక్షలో, బౌద్ధం మీద అసూయతో కొన్ని నాశనం చేసి దశాబ్దాల కాలంలో అడ్డొచ్చిన కొన్ని వేలమందిని చంపి ఉండొచ్చు. ఇది హింసే తప్పే. కానీ విషయం చెప్పడానికి దాన్ని మనం ఎక్కువ చెయ్యాల్సిన పని లేదు. కేవలం విషయం చెబితే చాలు అని నా అభిప్రాయం

చివరిగా ambedkar గారు ఊరికినే ఉంటారా అని అనుకుంటున్నారా ఇలాంటి రచ్చ చేస్తే. చీల్చి చెండాడి ఉండేవారు. ఆయన హేతువు ఉన్నంతవరకు ఉన్న బుద్ధ ఫిలాసఫీ తీసుకున్నారు. హింస గురించి చెప్పారు కానీ ఇంత రచ్చ గురించి ఆయన కూడా చెప్పలేదు.
-Prasad Sivareddy

1 comment:

  1. ఇవ్వన్నీ చరిత్ర కారులు ఊహలే తప్ప చరిత్ర ఏమాత్రం కాదు ఇందులో నిజం లేదు

    ReplyDelete