Sunday, October 28, 2018

పిల్లి-బుట్ట కధ

పిల్లి-బుట్ట కధ:
ఒక ఊరిలో ఓ పెద్దాయన ఉండేవాడు, ఆయన కాశి వెళ్తూ కొడూకులిద్దరికీ నాయన లారా నేను తిరిగి ఎప్పుడూ వస్తానో తెలిదు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు.
తరువాత రోజు పెద్ద కొడుకు పూజకు కూర్చుంటుంటే అతని భార్య వచ్చి చెప్పింది , మావయ్య గారు రోజు పూజకు ముందు వాళ్ళ పెంపుడు పిల్లిని బుట్టలో పెట్టే వారు మీరు అలా చెయ్యడమే ఆచారం అని చెప్పింది.

పెద్ద కొడుకు పిల్లిని బుట్టలో పెట్టి పూజ చేసాడు.

రెండో కొడుకు భార్య ఇది చూసి నొచ్చుకుంది. మావగారి లాగ పుజ చెయ్యాలి అంటే మనకు ఒక పిల్లి కావాలి అని భర్త తో చెప్పింది. చిన్న కోడుకు పూజ కోసం కొత్త పెంపుడు పిల్లి , కొత్త బుట్ట కొనుక్కున్నాడు. అతను కూడా రోజూ పూజకు ముందు పిల్లిని బుట్టలో పెట్టే ఆచారం పాటిస్తూ తండ్రి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.

తండ్రి ఒక 5 ఏళ్ళ తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. పూజకు ముందు పిల్లుల్ని బుట్టలో ఎందుకు పెడుతున్నారు అని కొడుకుల్ని అడిగాడు?
నాన్నగారు మీరు చేసినట్టు తుచా తప్పకుండా చెస్తున్నాం అని కొడుకులు సమాధానం చెప్పారు.
"నాయనలారా ఆ పిల్లికి నేను బాగా అలవాటు రోజు పూజ సమయంలో కూడా ఒళ్ళో కూర్చుని నన్ను ఇబ్బంది పెట్టేది, అందుకని బుట్టలో పెట్టే వాడిని, అది మన ఆచారం ఏమీ కాదు అని చెప్పాడు !!


కధలో తండ్రి తిరిగి వచ్చి ఉండకపోతే ఆ కుటుంబానికి, కులానికి(కుటుంబం వ్రుద్ధి లోకి వస్తే, వారిని చూసి అందరూ మొదలు పెడతారు కదా!) పిల్లి-బుట్ట ఆచారం అయ్యిపోయేది.

మన ఆచారాలు ఇంతే, అప్పటి పరిస్తితులకు అనుగుణంగా, వారి సౌలభ్యం కోసం తయారు చెసుకున్న ప్రత్నామ్నయాలు. ఆలోచించకుండా మూర్ఖంగా పాటించడం వల్ల అవి ఆచారాలయి కూర్చున్నాయి. మనం ఆలోచించాలి ఇంక.


No comments:

Post a Comment