Saturday, November 2, 2019

సమన్యాయం !

చదువు కోసం
లక్షలు కుమ్మరించి బడికి కారులో వెళ్ళేదొకరు
భోజనం పెడతారని కుక్కుకుని ఆటోలో వెళ్ళేదొకరు

సమన్యాయం !

నది, అడవి, కొండ
ప్రకృతే ప్రతివాడికి అండ దండ

ఆకాశం అందరిది, ఆనందం అందరిదీ
నడీచే నేల, పీల్చే గాలి, తాగే నీరు
పుట్టే ప్రతివాడికీ సమభాగం కావాలా వద్దా?

కొండలు పిండి చేసి భూమిని కోట్లకమ్మేసి
నదులను పీల్చేసి నీళ్ళను బాటిళ్ళ నింపేసి
స్వార్ధం నిండిన గాలితో ఊపిరి తీసేసి
సిగ్నళ్ళతో ఆకాశం కాజేసి
పొగలతో సూర్య చంద్రులను దాచేసి

ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన ఇళ్ళు
ఎక్కువై పారేసేంత తిండితో
మనం ఈ చిన్నారులకు అన్యాయం చేసే సంఘాన్ని నిర్మించుకున్నామా?



- చాలా రోజుల క్రితం కోళ్ళను ఈడ్చుకుంటూ వెళ్తున్న బండిని చూసి బాధ పడ్డా, మళ్ళీ ఈ రోజు...
కళ్ళు మూసుకుని అంతా బాగుందని మనం మంచోళ్ళమనుకుని ముందుకెళ్ళిపోవడమేనా
మనం చేస్తున్నది ? 

No comments:

Post a Comment